ఉత్తరాయణం

హిందుత్వపై విష ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిని ‘కరడుగట్టిన హిందూత్వ వాది’ అని దృశ్య మాథ్యమంలోనూ, కొన్ని పత్రికల్లోనూ పేర్కొంటున్నారు. యోగి తన మతాన్ని తాను గౌరవించటం లేదా ఆచరించటం నేరమా? నిర్దాక్షిణ్యంగా అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్న ఉగ్రవాదులకు వాడవలసిన ‘కరడుగట్టిన’ అన్న విశేషణాన్ని హిందూత్వానికి ఎందుకు ముడిపెడతారు? ఇతర దేశాలను దోచుకోవటానికి గాని, ఆక్రమించుకోవటానికి గాని, వారి ప్రాణ, మాన, ధనాలకు ముప్పు తెచ్చేందుకు గాని హిందువులు యత్నించినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. ఇతర మతాల వారిని హిందువులుగా మార్చే ప్రయత్నం అసలే లేదు. ‘లోకాస్సమస్తః సుఖినోభవంతు’ అన్న విశాల దృక్పథం హిందువుల తత్త్వం. ఇంతటి ఉదారభావన మరే ఇతర మత నినాదాలలోనూ లేదు.
సహిష్ణుతను అసమర్ధతగా భావించి ఇతర మతాల వారు హిందువులను బాధించటం అందరికీ తెలిసిన సంగతే. గోసంరక్షణ వంటి విషయాల్లో ఆదిత్యనాథ్ తన అభిప్రాయాల్ని నిర్భయంగా వ్యక్తం చేస్తే ‘కరడుగట్టిన హిందూత్వవాది’ అని ఎలా అంటారు? అన్యమతంలోనికి మారిన హిందువులను మళ్లీ వెనక్కి రమ్మని ఆహ్వానిస్తే నేరమెలా అవుతుంది? పేదరికాన్ని ఆసరాగా చేసుకొని హిందువులను ప్రలోభపెట్టి మతం మార్పిడులు చేస్తున్నవారిని ఏమనాలి? ‘హిందువుల మీద చేసే దాష్టీకాలను అడ్డుకోవటం నా ధ్యేయం’ అని చెప్పిన ఆదిత్యనాథ్‌ను మతోన్మాదిగా ముద్ర వేయడం ఎంతవరకు సబబో ఆలోచించండి. తమ మతవ్యాప్తి కోసం అమాయకులైన హిందువులను హతమార్చే హంతకముఠాలకు ‘కరడుకట్టిన’ అన్న విశేషణం చక్కగా సరిపోతుంది. హిందుత్వానికి సంబంధించి ఈ పదాన్ని మీడియా ఉపయోగకించకుండా ఉంటే ఉత్తమం. ‘సర్వేజనా సుఖినోభవంతు’ అన్న మాటను నేటికీ పొల్లుపోకుండా ఆచరిస్తున్నది హిందూత్వమే. మతోన్మాదులు ఎన్ని కుట్రలు చేసినా ఇసుమంత కూడా చలించక నేటికీ నిలబడగలిగినది హిందూత్వమే. అదే హైందవంలోని గొప్పతనం.
- ఆయి కమలమ్మ, వనస్థలిపురం
పాటను కట్టడి చేస్తారా?
ఒక పాటకు ప్రాణప్రతిష్ఠ చేసేది వివిధ కళాకారుల సమన్వయం. రచయితలు, సంగీత దర్శకులు, గాయకులు.. ఇలా ఒక పాట సృష్టిలో వీరందరూ భాగస్వాములే. ఎవరి ప్రతిభ వారిదే. ఆ పాట ప్రాచుర్యం పొందితే- ప్రజల నాలుకలపై తరతరాలుగా కొనసాగుతూ కళాకారులను బ్రతికిస్తూనే ఉంటుంది. కొన్ని పాటలైతే ప్రజల సాంప్రదాయాలలో భాగంగా మారిపోయి శుభకార్యాలలో మ్రోగే సన్నాయి వాయిద్యాలలో ఊపిరిపోసుకుంటూ వుంటాయి. ఇది పాటకున్న గొప్పదనం. ఒక పాట ఒకసారి జనం మధ్యకు వచ్చిందంటే అది ఇక ప్రజల పాటే. ఎంతోమంది కళాకారుల నుంచి ఎనె్నన్నో సందర్భాలలో ప్రజల మనస్సులను రంజింపచేసేలా సినిమా పాటలను మళ్లీ మళ్లీ వింటూనే ఉంటాము.