సంపాదకీయం

‘్భగవత’ వైపరీత్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దీపం పెట్టిన తరువాత దిగనేయడమంటే’ బహుశా ఇదే.. గోరక్షణ పట్ల దేశప్రజల సడలని నిష్ఠ ప్రస్ఫుటిస్తున్న సమయంలోనే గోరక్షకులను అప్రతిష్ఠ పాలు చేయడానికి ‘షడ్యంత్రం’ నడిచిపోతోంది. ఈ షడ్యంత్రపు వలలో ప్రఖర జాతీయతావాదులు సైతం చిక్కుకొని పోతుండడమే సామాన్య ప్రజలకు అంతుపట్టని విచిత్రమైన ప్రహేళిక.. గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘గోరక్షకుల’ను బహిరంగంగా దుయ్యబట్టిన తరువాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాలలో గోరక్షణకు ప్రయత్నించే వారి చేతులు విరిగిపోయినట్టయ్యాయి! ఇప్పుడు మళ్లీ గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో గోరక్షణ కోసం ప్రయత్నిస్తున్న వారిపై మరో ‘పిడుగుపాటు’ సంభవించింది. ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం’ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ ‘గోరక్షకుల’ను దుయ్యబట్టడం ఈ పిడుగుపాటు! గోరక్షకులను దౌర్జన్యకారులుగా, సంఘ విద్రోహులుగా చిత్రీకరించడానికి గోహంతకులు, వారి వాణిజ్యపు దళారీలు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. గోరక్షకులు మాత్రమే కాదు, రాజ్యాంగబద్ధులైన పౌరులెవ్వరు కూడ ‘చట్ట’ వ్యతరేక కలాపాలకు పాల్పడరాదన్నది సహజ న్యాయసూత్రం.. కానీ గోరక్షకులు మాత్రమే దౌర్జన్యకాండకు దిగుతున్నారన్న ప్రచారం గత ఏడాది పెద్ద ఎత్తున జరిగింది, ఇప్పుడు మళ్లీ గోరక్షకుల తథాకథిత దౌర్జన్య కాండ గురించి భూన భోంతరాళాలు దద్దరిల్లిపోతున్నాయి. జరిగింది మాత్రం ఒకే ఘటన. రాజస్థాన్‌లో ఆవులను అక్రమంగా తరలిస్తుండిన లారీలను ‘గోరక్షకులు’ అడ్డుకున్నారు. లారీ డ్రైవర్లను కిందికి దించి చితకబాదారు! చితకబాదడం అంద రూ గర్హింపదగిన నే రం. కానీ ఇలాంటి నే రాలు దేశమంతటా ప్రతిరోజూ జరిగిపోతు న్న భ్రాంతి కలిగే విధంగా గోరక్షణ వ్యతిరేక ప్రచారం మళ్లీ మొదలైంది! ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం అధినేత గోరక్షకులను వ్యతిరేకిస్తూ జారీ చేసిన ప్రకటన ‘పుండు మీద కారం..’! ఈ ‘పుండు’ శతాబ్దులుగా భారత జాతీయ స్వరూపాన్ని బాధిస్తోంది, భారతీయ సాంస్కృతిక స్వభావాన్ని వేధిస్తోంది. విచక్షణ రహితమైన మానవ క్రౌర్యానికి వందల కోట్ల పాడి ఆవులు, దూడలు, కోడెలు, పెయ్యలు బలైపోవడం, హతం కావడం శతాబ్దులుగా మానని ఈ ‘పుండు’. రెండు వందల జాతుల స్వదేశీయ ధేనువులలో కేవలం ఇరవై తొమ్మిది జాతులు మిగిలి ఉండడం ఈ ‘పుండు’! ఈ ‘పుండు’కు చికిత్స చేయడానికి, ఈ గాయాన్ని మాన్పడానికి గుజరాత్ ప్రభుత్వం నడుం బిగించింది, ఇతర రాష్ట్రాలు నడుములను బిగిస్తున్నాయి. కానీ ఇదే సమయంలో ‘సంఘ’ సర్ సంఘచాలక్ చేసిన అనవసరమైన ఆక్షేపణ ‘గాయం’ నయం కావడానికి బదులు తీవ్రం కావడానికి మాత్రమే దోహదం చేయగలదు.. గోరక్షకులు నేరస్థులన్నది ఆయన మాటల సారమన్న ప్రచారం మొదలైంది!!
పౌరులు నేరాలకు పాల్పడరాదు. కానీ నేరాలను నిరోధించడానికి శాసనబద్ధంగా పౌరులు యత్నించవచ్చు! ఈ నేర నిరోధక కార్యక్రమంలో పోలీసులకు, ప్రభుత్వ యంత్రాంగానికి ఉన్న హక్కులన్నీ పౌలులకూ ఉన్నాయి. భారతీయ శిక్షాస్మృతి, నేర విచారణ విధాన స్మృతి వంటి చట్టాలలో ఇందుకు సంబంధించిన నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. నేరస్థుడు పారిపోకుండా నిరోధించి నిర్బంధించి పోలీసులకు అప్పగించే అధికారం ప్రజలకుంది. కేరళ, పశ్చిమ బెంగాల్, కొన్ని ఈశాన్య ప్రాంతాలలో తప్ప దేశంలోని ప్రతి రాష్ట్రంలోను గోవధ నిషేధపు చట్టాలున్నాయి. అయితే వివిధ రాష్ట్రాలలోని చట్టాలలోని నియమ నిబంధనలు భిన్నంగా ఉన్నాయి. హర్యానా, జమ్మూ కశ్మీర్ వంటి చోట్ల గోహంతకులకు పదేళ్ల వరకు నిర్బంధ నివాస శిక్షను విధించే అవకాశం ఉంది. కానీ బిహార్‌లో గోహత్య నేరానికి కేవలం ఆరు నెలల ‘కారాగృహ నివాసం’ శిక్షను విధిస్తున్నారు. గోహంతకులకు పదునాలుగేళ్ల జైలు శిక్షను విధించాలని నిర్దేశిస్తూ గుజరాత్ ప్రభుత్వం ఇప్పుడు చట్టాన్ని సవరించింది. అందువల్ల ఇలాంటి విపరీత అంతరాలు తొలగిపోయే విధంగా దేశమంతటికీ వర్తించే సమానమైన చట్టాన్ని పార్లమెంటు ఆమోదించాలని మోహన్ భాగవత్ కోరడం హర్షణీయం.. కానీ ఈలోగా దేశంలోని వివిధ రాష్ట్రాలలోని చట్టాలు అమలు జరపడానికి గోరక్షకులు సహకరిస్తే తప్పేమిటి? అక్రమంగా దళారీలు వ్యాపారులు, విదేశాల వాణిజ్య ప్రతినిధులు తరలించుకొని పోతున్న ఆవులకు ప్రజలు రక్షణ కల్పిస్తే అది నేరం ఎలా అవుతుంది? దౌర్జన్యం ఎందుకవుతుంది??
గోవధ నిషేధం కోసం సమగ్రమైన జాతీయస్థాయి చట్టం చేయాలన్నది రాజ్యాంగంలోని నలబయి ఎనిమిదవ అధికరణం స్ఫూర్తి. పాడి పశువుల జాతుల-బ్రీడ్స్-ను పరిరక్షించాలని, పెంపొందించాలని ఆవులను, దూడలను ఇతర పాడి పశువులను వధించకుండా నిరోధించాలని ఈ అ ధికరణం నిర్దేశిస్తోంది. ఈ ‘అధికరణం’ ప్ర కారం ఏడు దశాబ్దుల ప్రభుత్వాలు చర్యలు తీసుకొనకపోవడం అ సలు సమస్య. చర్య లు తీసుకుని ఉంటే 1947 తరువాత వందకు పైగా దేశవాలీ ఆవుల జాతులు అంతరించి వుండేవి కావు! ఇదీ వౌలికమైన ప్రమాదం, కొనసాగుతున్న ప్రమాదం! కానీ ప్రాధాన్యం ప్రమాదానికి కాక ప్రమాదాన్ని నిరోధిస్తున్న వారిని నిరసించడానికి ఏర్పడి ఉండడం జాతీయ వైపరీత్యం.. దీనివల్ల సమగ్రమైన జాతీయస్థాయి చట్టాన్ని రూపొందించే కార్యక్రమం మూలపడింది. గత ఏడాది గోరక్షణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దీనికి వ్యతిరేకంగా అతిగా స్పందించాడు. ‘పగలు గోరక్షకులు, రాత్రిపూట సంఘ విద్రోహులు..’ అని ఉద్యమకారులను దుయ్యబట్టారు! ‘దళితులను హత్య చేయకండి నన్ను హత్య చేయండి..’ అని ఆయన హైదరాబాద్‌లో అసందర్భంగా అక్రోశం వెళ్లగక్కాడు...
నిజానికి గోవధ చేస్తున్నది దళితులు కాదు. ఆవులను అక్రమంగా తరలిస్తున్నది దళితులు కాదు! అందువల్ల గోరక్షకులకూ, దళితులకూ మధ్య వైరుధ్యం లేదు. దేశంలోని మొత్తం ప్రజలలో నియతంగా గోమాంసం తింటున్న వారి సంఖ్య కేవలం ఒకటిన్నర శాతం! గోమాంసం డబ్బాలలో, పెట్టెలలో ఓడలలో విదేశాలకు భారీగా తరలిపోతోంది. అందువల్ల గోహంతకులు విదేశాల దళారీలు మాత్రమే! నకిలీలు ప్రతి ఉద్యమంలోను, ప్రతి రంగంలోను ఉన్నారు. నకిలీలను పసికట్టండి.. అంతేకానీ చిత్తశుద్ధిగల గోరక్షకులను అప్రతిష్ఠపాలు చేయకండి!