సంపాదకీయం

‘కల్తీ’రుచుల కమ్మదనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొగ్గు రసాయనం- కార్బాయిడ్-తో కలుషితమైన పండ్లను అమ్ముతున్న వ్యాపారులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు వివిధ చర్యలను ప్రారంభించడం ముదావహం. దేశవ్యాప్తంగా విష రసాయనాల పూతలతో మెరుగులు దిద్దుకున్న పండ్లు, కూరగాయలు వినియోగదారులను సమ్మోహితులను చేస్తున్నాయి. బంగారపు రంగుల అరటిపండ్లు, పసుపురంగు కమలాలు, అరుణ శోభతో ఆపిల్ పండ్లు.. ఈ రంగులన్నీ పైపైని మెరుగులు, విషం నిండిన రసాయనాల వనె్నలు! పండులోపల కూడ రసాయన విషాలతో మార్పులు చేస్తున్నారు. పచ్చి కరబూజ- తరబూజ- కళింగర- కాయ ఎర్రటి గుజ్జుగల పండువలే భ్రమింపజేస్తుంది! కాయలను పండ్లవలె భ్రమింపచేయడం, కూరగాయలను నిగనిగలాడించడం గొప్ప రసాయన విద్య. ఇది వ్యాపారులకు మాత్రమే కాదు రైతులకు సైతం తెలిసిన ‘సంకర’ విద్య. ఈ విద్య ప్రపంచీకరణ ఫలితంగా అనివార్యం అయిపోయింది. ఆస్ట్రేలియా నుంచి ఆస్ట్రియా నుంచి న్యూజిలాండ్ నుంచి నెదర్‌లాండ్స్ నుంచి వస్తున్న పండ్లకు మెరుగులు దిద్దడం సాంకర్య ప్రక్రియ. అందువల్ల ప్రభుత్వాలు, చివరికి న్యాయస్థానాలు సైతం ఒక వైపున విష రసాయనాలతో పండ్లను, కూరగాయలను సంకరం చేసే శోభింపచేసే ప్రక్రియకు అనుమతినిస్తున్నాయి. మరోవైపు ఈ కృత్రిమ పద్ధతులకు పాల్పడుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలు ఆదేశిస్తున్నాయి, ప్రభుత్వాలు నడుములు బిగిస్తున్నాయి. హైదరాబాద్‌లో బొగ్గు రసాయనం వాడి పండ్లను కలుషితం చేసిన దా దాపు తొంబయిమంది వ్యాపారుల లైసెన్సులు రద్దు కావడం ఒక ఉదాహరణ.
ఇది కలియుగమన్న వాస్తవం చాలామందికి తెలియక పోవచ్చు. కా నీ, ఇది కల్తీయుగమన్నది మాత్రం జనమెరిగిన రహస్యం. మనం చాలా జాగ్రత్తగా సర్వవిధ సాంకర్యాలను నిత్యం భోంచేస్తుండడం ‘స్వేచ్ఛా విపణి’- మార్కెట్ ఎకానమీ- సృష్టిస్తున్న మాయాజాలం. నగరాలలో, పట్టణాలలో మాత్రమే కాదు పల్లెలలో సైతం పుట్టలు పగిలిన ‘తక్షణాహార కేంద్రాలు’- ఫాస్ట్ఫుడ్ సెంటర్లు- వివిధ రుచుల సాంకర్య నిలయాలు. సంకరం చేయడం చట్టబద్ధమైపోయింది. మళ్లీ కల్తీకి వ్యతిరేకంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ చర్యలకు వ్యతిరేకంగా కల్తీ వ్యాపారులు ఉద్యమాలు చేస్తారు. మార్కెట్లను మూసి వేస్తారు. మంత్రులు ఇతరరేతర ప్రభుత్వ ప్రతినిధులు కూడా హడావుడిగా పరిగెత్తుకొని వెళ్లి వ్యాపారులను బుజ్జగిస్తారు. హైదరాబాద్‌లో నిన్న, మొన్న ఈ ప్రహసనమంతా పునరావృత్తం అయింది. దాదాపు తొంబయి మంది వ్యాపారుల లైసెన్స్‌లను రద్దు చేయగానే వారికి మద్దతుగా ‘పట్టుబడని’ వ్యాపారులు సమ్మె చేశారట. అందువల్ల ప్రభుత్వ ప్రతినిధులు బుజ్జగించడం అనివార్యమైంది. పట్టుబడిన వారిని న్యాయస్థానంలో నిలబెట్టి జైలుకు పంపాలి. పట్టుబడని వారు సమ్మె, మూసివేత వంటి చర్యలకు పూనుకొనడాన్ని నిరోధించాలి. ప్రభుత్వం ఈ చట్టం అమలు జరుపలేదు, బుజ్జగించింది. దేశమంతటా ఇదే తీరు. అక్రమాలు వ్యాపార సంప్రదాయాలుగా మారడమే ప్రపంచీకరణ, మార్కెట్ ఎకానమీ..
‘చైనా పౌడర్’ అన్న రసాయనాన్ని పండ్లమీద చల్లడానికి న్యాయస్థానాలు అనుమతి ఇచ్చి ఉన్నాయట! ‘చైనా పౌడర్’ అన్నది ప్రతీక మాత్రమే. వందలాది రకాల రసాయనాలను మోతాదు మించని రీతిలో ఉపయోగించి ఆహార పదార్థాలను సంకరం చేయడానికి, పానీయాలను కల్తీ చేయడానికి దశాబ్దుల తరబడి దేశంలో చట్టబద్ధమైన వ్యవస్థలు ఏర్పడి ఉన్నాయి. అందువల్ల కాయలను వేగవంతంగా మాగపెట్టడానికి జనాన్ని సమ్మోహన పరిచే వనె్నలను కల్పించడానికి కృత్రిమమైన రుచిని పుట్టించడానికి మాత్రమే కాదు, కూరగాయలను నిగనిగలాడించడానికి మాత్రమే కాదు, వందలాది రకాల ఆహార పదార్థాలను నిలువ చేయడానికి శుద్ధి చేసి డబ్బాలలో భద్రపరచడానికి వీలుగా లెక్కలేనన్ని చిత్ర విచిత్రమైన రసాయనాలను వాడడానికి ప్రభుత్వాలు అనుమతించి ఉన్నాయి. ప్రభుత్వాల దృష్టిలో అక్రమం అంటేనే ఈ అనుమతించిన విష రసాయన ద్రవ్యాలను మోతాదును మించి వాడడం మాత్రమే. కానీ సేమ్యాలలో, అప్పడాలలో, చాక్లెట్లలో, శీతల పానీయాలలో, ఐస్‌క్రీములలో, కూరగాయలలో, పండ్లలో చివరికి పాలలో, నెయ్యిలో రసాయనాలను అనుమతించిన ‘మోతాదు’లో మాత్రమే కలిపారా? మితిమీరి కలిపారా? అన్నది బ్రహ్మదేవుడు కూడ కనిపెట్టలేడు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తన ‘దమయంతీ స్వయం వరం’ అనే సాంఘిక నవలలో చమత్కరించినట్టు- ‘ఆ బ్రహ్మదేవునికి ఫిజిక్స్- భౌతికశాస్త్రం- తెలీదు, కెమిస్ట్రీ- రసాయన శాస్త్రం తెలీదు’. తెలిసిన ప్రభుత్వ యంత్రాంగం వారికి లంచాలు తీసుకొని కల్తీని అనుమతించడం కూడ తెలుసు. అందువల్ల గొంగటిలో భోంచేస్తున్న వ్యవస్థలో వెంట్రుకలను ఏరుతున్నట్టుగా ప్రభుత్వాలు కల్తీ నిరోధక చర్యలకు పూ నుకొంటున్నాయి. ‘చె నా పౌడర్’ను ‘మోనో సోడియం గ్లటనేట్’ను ఇంకా వందల రకాల ‘ఖాద్య రసాయనాల’ ను తయారు చేయరాదని, దిగుమతి చే యరాదని, ఉపయోగించరాదని కేంద్ర ప్ర భుత్వం సర్వ సమగ్రమైన చట్టం ఎందుకని చేయరాదు? ప్రపంచీకరణ కబంధ బంధంలో విలవిలలాడుతున్న వ్యవస్థలో అలాంటి చట్టం అసంభవం. ఈ కబంధ బంధంలో చిక్కుకొని ఉన్న- ధ్యాసలేని మనం కల్తీ ఊబిలో హాయిగా కూరుకొనిపోతున్నాము. స్వచ్ఛంగా శుభ్రంగా వండి తింటున్నామని భావిస్తున్న కుటుంబాలలో సైతం విష ప్రభావ పూరితమైన రుచికరమైన రసాయనాలను విరివిగా వాడుతున్నాము. పాయసంలో, పులిహోరలో, భక్ష్యాలలో, ఇప్పుడిప్పుడు ఆవకాయలలో కూడ రసాయనాలను కల్తీ చేస్తున్నారు- కుటుంబాల వంట ఇళ్లలో!
ప్రాచీన భారత దేశంలో కూరగాయలు, పండ్లు దేశమంతటా నగరాలలో, పల్లెలలో ఉత్పత్తి అయ్యేవి. నగరాల ప్రజలకు కావలసిన కూరలు, పండ్లు నగరాల్లోనే ఉత్పత్తి అయ్యేవి. నగరాల, పట్టణాల నిర్మాణంలో వ్యవసాయ క్షేత్రాలు, పాల ఉత్పత్తి ప్రాంగణాలు భాగంగా ఉండేవి. పల్లెలు ఆహార ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధంగా ఉండేవి. అందువల్ల పండ్లు, కూరగాయలను సుదూర ప్రాంతాల నుంచి తరలించుకొని రావలసిన అవసరం ఉండేది కాదు. ఈ వికేంద్రీకృత వ్యవస్థను బ్రిటన్ సామ్రాజ్యవాదులు ధ్వంసం చేశారు. కేంద్రీకరణ మొదలైంది. దూర దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న కూరలను, పండ్లను విష రసాయనాలతో నిలువ చేయవలసిన అనివార్యత ఏర్పడింది. కల్తీకి ఇది ప్రధాన కారణం...