సంపాదకీయం

చైనా ‘్ధ్యస’ కొరవడి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు పట్టణాల పేర్లను చైనా మార్చడం ఆ దేశపు నియంతల దౌత్య దౌష్ట్యానికి సరికొత్త నిదర్శనం! ఈ దుశ్చర్య ద్వారా చైనా అక్కసును వెళ్లబోసుకోవడం మినహా మనకు సంభవించే నష్టం లేదు. మన దేశంపై దురాక్రమణ జరిపే శక్తి చైనాకు లేదు. క్రీస్తు శకం 1962లో వలె ఇప్పుడు హద్దు మీరితే మాడు పగిలిపోతుందని చైనాకు తెలుసు! పరిస్థితి మారింది. 2014 మే 26వ తేదీ తరువాత మన రక్షణ పటిమ చైనా నియంతలకు తెలిసి వచ్చింది. 2014-2015 వరకు లడక్‌లో సగటున వారానికి రెండుసార్లు చైనీయ నియంతృత్వ ప్రభుత్వపు మూకలు వాస్తవ అధీన రేఖ-లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్-ఎల్‌ఏసి-ను దాటి మనవైపునకు చొరబడేవి. మన ‘్భరత-టిబెట్ సరిహద్దు సంరక్షక దళాల’-ఐటిబిపి-వారు ఈ చొరబాటును తిప్పి కొట్టేవారు కాదు. అందువల్ల చైనా ప్రభుత్వ దళాలవారు మన వైపున గుడారాలు వేసి వంటలు చేసి తిని, కక్కి, వారాల తరబడి మన వైపున తిష్టవేసి ఉండేవారు. కానీ 2015లో మన దళాల వారు చొరబడిన చైనా సైనికులను మెడలు పట్టుకుని, నెట్టుకొంటూ తోసుకుంటూ వెళ్లి ‘వాస్తవ అధీన రేఖ’కు ఆవైపున ఎత్తి కుదేసి వచ్చారు. ఇలా మూడు నాలుగు సార్లు నెట్టివేతకు గురైన తరువాత చైనీయ ముష్కరులు ‘రేఖ’ను దాటడం మానుకున్నారు. ఆరు నెలలకోసారి మాత్రమే ‘చొరబడి’ మళ్లీ నిష్క్రమిస్తున్నారు. ఈశాన్య ప్రాంతం లోని బర్మా వైపునుండి చొరబడుతుండిన చైనా ప్రేరిత బీభత్సకారులు దశాబ్దుల తరబడి హత్యాకాండ సా గించారు. మన సైనికులకు, అనుబంధ సా యుధ బలాలకు చిక్కకుండా పారిపోయి సరిహద్దుల సమీపంలోని తమ స్థావరాలలో బలిసిన తోడేళ్ల వలె నక్కి ఉండేవారు. కానీ మన సైనికులు 2015లో బ ర్మాలోకి చొచ్చుకునిపో యి ఈ చైనా తొత్తుల బీభత్సపు బట్టీలను పగులగొట్టి వచ్చారు! అప్పటి నుంచి ఈ ‘సాయుధ చికిత్స’-సర్జికల్ ఆపరేషన్-జరిగినప్పటి నుంచి చైనా నియంతలకు మన పటిమ పట్ల వాస్తవ జ్ఞానం సిద్ధించింది. చైనా మన దేశాన్ని మరోమారు ఓడించలేదన్నది ఈ వాస్తవ జ్ఞానం. ఈ జ్ఞానం ధ్రువపడుతున్న కొద్దీ చైనా నియంతల దురాగ్రహం పెరుగుతోంది. భారత సైనిక పటిమ-ద్వైపాక్షిక సంబంధాల వరకు-చైనా సైనిక పటిమ సమానమన్న వాస్తవాన్ని చైనా నియంతలు దిగమింగుకోలేకపోతున్నారు...
అందువల్లనే ఉన్మాదుల వలె ‘అరుణాచల్ ప్రదేశ్ మాది మాది...’ అని చైనా నియంతలు ఎలుగెత్తి ఏడుస్తున్నారు. అరుణాచల్‌లోని ఆరు పట్టణాలకు భారతీయమైన పేర్లకు బదులు చైనా ప్రభుత్వం కొత్తపేర్లను పెట్టడం ఈ ‘ఏడుపు’లో భాగం! కప్పలు గొంతు చించుకున్నంత మాత్రాన ఆవులు నీరు తాగడం మానవు- పిబన్తి ఉదకం గావః మండూకాని రుదన్త్వపి- అందువల్ల చైనా వారి నికృష్ట నీతి కారణంగా అరుణాచల్ ప్రదేశ్ అనాదిగా మన దేశపు అంతర్భాగమన్న వాస్తవానికి కలుగుతున్న విఘాతం లేదు. కానీ కుక్కకాటుకు చెప్పు దెబ్బ లాగ మన ప్రభుత్వం కూడ ‘దౌత్యపరమైన చొరబాటు’ను ప్రదర్శించవలసిన సమయం ఆసన్నమైంది. మనం చైనా దుందుడుకు తనాన్ని సహించడం వల్ల చైనా నియంతల దుర్జన స్వభావం మారదు. ప్రతిగా మనం కూడ చైనాలోని కొన్ని పట్టణాలకు కొత్తపేర్లు పెట్టినట్టయితే చైనా నియంతలకు గుణపాఠం చెప్పినట్టు కాగలదు. ‘శామ్యేత్ ప్రత్యపకారేణ నోపకారేణ దుర్జనః’- అన్నది మహాకవి కాళిదాసు రెండువేల వందల సంవత్సరాలకు పూర్వం చెప్పిన మాట! నవ్వుతూ నవ్వుతూ నయవంచనతో టిబెట్‌ను దిగమింగిన చైనా భూతానికి దురాక్రమణ దాహం తీరలేదు, అరుణాచల్‌ప్రదేశ్‌ను జుర్రుకోవాలన్న విషవాంఛను పదే పదే వెళ్లగక్కుతోంది! టిబెట్ మాజీ అధినేత, బౌద్ధ ధర్మాచార్యుడు దలైలామా అరుణాచల్‌లో పర్యటించడం తమ విషవాంఛకు విఘాతకరమని చైనా నియంతలు చిందులు తొక్కుతున్నారు.
చైనా దురాక్రమణ ధ్యాస లేకపోవడం మన దేశాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య! ముక్కులు కారుతున్న సంగతిని కూడ పట్టించుకోకుండా ‘చైనీయ సిద్ధ భోజనశాల’-చైనీస్ ఫాస్ట్ఫుడ్ సెంటర్-లకు ఎగబడి నోరు పట్టని ‘పేద్ద’ చెంచాలతో తింటున్న వారికి ఈ ‘్ధ్యస’ అసలు లేదు! చైనీయ భౌతిక దురాక్రమణ ఇక సాగదు. కానీ చైనీయ వ్యామోహం మన నాగరికులలో అత్యధికులకు ఆవహించి ఉండడం అంతర్గత రోగం! ఇలా ‘చైనీస్ ఫుడ్’ అన్న నాసిరకం తిండిని అమ్మడం, తినడం రోగలక్షణం మాత్రమే! ఎందుకంటే తథాకథిత చైనీయ భోజనాలు చైనానుండి దిగుమతి కావడం లేదు. ఇక్కడనే మన దేశంలోనే పరమ అసహ్యకరమైన కేంద్రాలలో జుగుస్సాకరమైన పద్ధతిలో ఈ చైనీస్ ఫాస్ట్ఫుడ్ తయారవుతోంది. ‘చైనీస్’ అన్న ముద్ర మాత్రమే పడుతోంది. శత్రుదేశమైన ‘చైనా’ పేరు పట్ల వ్యామోహపడడం, ఈ పేరును బహిష్కరించకపోవడం మానసిక వికృతికి ప్రతీక! అసలు వికృతి చైనానుంచి అ క్రమంగాను, సక్రమంగాను దిగుమతి అవుతున్న వస్తువులను ప దార్ధాలను కొనుగోలు చేయడం! చైనా మన మాతృభూమికి చెం దిన అనేక అంగాలను గాయపరిచింది, దిగమింగి ఉంది. ఈ ధ్యా స ఉన్నట్టయితే మనం చైనా వస్తువులను కొనుగోలు చేయం! ఇలా మనం చైనా వస్తువులను కొనడం వల్లనే ప్రతి సంవత్సరం సగటున దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల విదేశీ వినిమయ ద్రవ్యం మన దేశం నుండి చైనాకు తరలిపోతోంది! మన ‘ఇంటి’ గోడలను తవ్వడమే లక్ష్యమైన ‘దొంగల’కు మనమే గునపాలను అందిస్తున్నాము! మనం ఆయుధాలను ధరించి చైనాతో పోరాడనక్కరలేదు, కానీ చైనా వస్తువులను అమ్మడం మన వ్యాపారులు మానుకోవచ్చు, వాటిని కొనడం వినియోగదారులు మానుకోవచ్చు!
చైనానుండి అక్రమంగా దిగుమతి అవుతున్న విష రసాయనాలను ఉపయోగించి మన వ్యాపారులు కాయలను మగ్గబెట్టి కృత్రిమమైన పండ్లను తయారు చేస్తున్నారట! విజయవాడలో జరిపిన దాడులలో అధికారులకు ఈ చైనా రసాయన విషం గురించి తెలియవచ్చిందట! అక్రమ వ్యాపారాలను, దొంగ రవాణాను చైనా ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఔషధాల తయారీ కోసం పులుల శరీర భాగాలను చైనా వైద్య సంస్థలు ఉపయోగిస్తున్నాయి. ఫలితంగా మన దేశంలోని వందల వేల పులులు హననమైపోయాయి. ఎఱ్ఱ చందనం దొంగరవాణా చేస్తున్న ముఠాలలో అత్యధికులు చైనావారు.. మన ప్రభుత్వం చైనాతో వాణిజ్యాన్ని ఎందుకని నిలిపివేయరాదు??