మెయన్ ఫీచర్

వాల్‌మార్ట్ ‘వల’లో గందోడి రంగప్ప..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికేంద్రీకరణ గురించి మాట్లాడేవారిని వెక్కిరిస్తున్న వారు విస్తరించిపోతున్నారు. ‘వికేంద్రీకృత ప్రగతి’ అంటే సమాజాన్ని వెనక్కి నడిపించడమేనన్నది ఈ ‘వెక్కిరిస్తున్నవారి’ సిద్ధాంతం. ఆధునికత పేరుతో భారతీయతను భంగపరుస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది, ‘కేంద్రీకృత ప్రగతి’ కాలుష్యాన్ని పెంచుతోంది.. ప్రధానమైనది మానసిక కాలుష్యం, బౌద్ధిక కాలుష్యం! భౌతికమైన కాలుష్యం కంటే బౌద్ధికమైన కాలుష్యం భారతీయతకు ప్రబల శత్రువుగా మారి ఉండడం నడుస్తున్న చరిత్ర.. నడుస్తున్న వారిలో అత్యధికులకు ఈ ధ్యాస లేదు. ‘్ధ్యస’ను వాణిజ్య ‘ప్రపంచీకరణ’ దిగమింగి, వికేంద్రీకరణ వ్యవస్థ విచ్ఛిన్నం కావడానికి బ్రిటన్ దొరలు రెండు శతాబ్దులకు పైగా కృషి చేసి వెళ్లారు. దొరల రూపంలోని దొంగలు వారు.. క్రీస్తుశకం పంతొమ్మిది వందల నలబయి ఏడవ సంవత్సరం తరువాత ఈ ‘విచ్ఛిత్తి’ వేగవంతమైంది. ‘ప్రపంచీకరణ’ వ్యవస్థీకృతమైన తరువాత రెండు దశాబ్దులుగా ‘కేంద్రీకరణ’ భూమి, ఆకాశం పట్టనంతగా కొలువు తీరుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అరవై అంతస్తులతోనో, ఆరువందల అంతస్థులతోనో నిర్మాణంలో ఉన్న ‘ఆకాశ హర్మ్యాలు’ కేంద్రీకరణకు ‘పతాక’లు కానున్నాయి! తెలంగాణలోను , దేశంలోను అమెరికా ‘ముఠా’ వాల్‌మార్ట్ ఏర్పాటు చేయనున్న ‘మెగా’ దగా బృహత్ వాణిజ్య కేంద్రాలు ప్రపంచీకరణ విస్తృతికి సరికొత్త ప్రతీకలు.. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు సగం జనాభా అమరావతిలోనే కేంద్రీకృతం అయ్యే విధంగా అంతర్జాతీయ స్థాయి నగర నిర్మాణం జరగనున్నదట! మొత్తం కాలుష్యంలో సగం రాజధానిలోనే కేంద్రీకృతం కావడం ఆవిష్కృతం కానున్న భవిష్యత్ దృశ్యం.. వికేంద్రీకృత సర్వ సమగ్ర సమృద్ధ గ్రామ వ్యవస్థ సుదూర గతం నాటి స్వప్నం.. ప్రపంచంలోని మొత్తం దేశాలు దిగుమతి చేసుకున్న వస్తువులలో నలబయి రెండు శాతంపైగా మనదేశంలో ఉత్పత్తి కావడం ఈ స్వప్నగత వాస్తవం.. ‘మేలుకున్న’ మన జాతి ‘ప్రపంచీకరణ’ బంధంలో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతోంది! చైనాలో తయారవుతున్న నాసిరకం వస్తువులలో అధిక శాతం మనదేశానికి తరలి వస్తున్నాయి...
‘హోమ్ డెలివరీ’-ఇంటికి సరఫరా-అన్నది నవనాగరిక వాణిజ్య వ్యవస్థలో భాగమన్నది జరుగుతున్న ప్రచారం! ‘మహా దుకాణం’ వారికి ‘్ఫన్’ చేయడంతో ‘హోమ్ డెలివరీ’ ప్రక్రియ ఆరంభం అవుతుంది. ‘ఇంటికి తీసుకువచ్చి ఇస్తారా?’ అని ప్రశ్నించరాదు, ‘హోమ్ డెలివరీ చేస్తారా?’ అని ‘స్టయిల్’గా అడగడం మధ్యతరగతి వారి ‘స్టేటస్’ చిహ్నం! ఇలా ఉప్పులు, పప్పులు ఇంటికి చేర్చినందుకు ‘మెగా’ దుకాణం దారుడు,‘జెయింట్’ వాణిజ్య వేత్త అసలు ధర కంటే అధికంగా వసూలు చేస్తున్నాడు. ‘్ధర ఎంత?’ అని అడగడం కూడా అనాగరికమైన చర్యగా అనుభూతిని పొందుతున్న వారు ఈ హోమ్ డెలివరీ వ్యవస్థను విస్తరింపచేసారు. ‘అంతర్జాలం’-ఇంటర్‌నెట్-విస్తరించిన తరువాత ‘ఈ- బుకింగ్’లు ఎక్కువయ్యాయి. ‘్భజనం’ కావాలని కూడా ‘ఈ’ వ్యవస్థ ద్వారా ‘బుక్’ చేయవచ్చు. నాలుగు వందల తొంబయి తొమ్మిది లేదా తొమ్మిది వందల తొంబయి తొమ్మిది రూపాయల ఖర్చుతో ఒకరు ఇంటికి ‘లంచ్’ తెప్పించుకోవచ్చునట! నలుగురున్న ఇంటిలో పూట భోజనం ఖరీదు నాలుగు వేల రూపాయలు! ఇదంతా హోమ్ డెలివరీ పేరుతో విస్తరీకరిస్తున్న ప్రపంచీకరణ జాలం.. ఈ ‘హోమ్ డెలివరీ’ సదుపాయం నగరాలకు, పట్టణాలకు మాత్రమే సర్వసమగ్రం. పల్లెలకు ఇంకా విస్తరించలేదు! బుట్టలోను తట్టలోను పచ్చడి, ఇడ్లీలు, గారెలు, బూరెలు, మరమరాలు పెట్టుకుని ఇంటింటికీ సరఫరా చేస్తున్న సంచార వర్తకునికి ‘హోమ్ డెలివరీ’ హోదా లభించలేదు. అనాదిగా మన దేశంలో ‘గందోడి రంగప్ప’ ‘టంగుటూరి రామయ్య’ ‘తమలపాకుల లక్ష్మీనరసప్ప’, ‘గాజుల మలారం పెద్దన్న’, ‘వైద్యం చేసే నరసింహులు’-పల్లెపల్లెకూ నియతంగా తిరిగి నాణ్యమైన వస్తువులను, సరుకులను, సేవలను అందించారు! ఈ ‘సంచార వాణిజ్యం’ గురించి ధ్యాస నశించిపోవడం ప్రపంచీకరణ.. భారతీయతను ప్రపంచీకరణ దిగమింగింది!
ఆధునికత పేరుతో భారతీయ పదజాలాన్ని పరిమార్చి పాశ్చాత్య భాషల పదాలను వల్లె వేస్తున్నారు. ‘సంచార వాణిజ్యం’ నశించింది, ‘హోమ్ డెలివరీ’ నెత్తికెక్కింది! ‘పేరంటం’ అని చెప్పడం నామోషీ, ‘్ఫంక్షన్’ అనడం గొప్ప. ‘రాత్రికి ఫంక్షనుంది’ అన్నది తెలుగు.. ‘హోమ్ డెలివరీ’లో మెగా దుకాణం దారుని ‘ఘనత’ కొలువుతీరి ఉంది, వినియోగదారుని ‘అతిశయం’ ఆవురావురమంటోంది, ఆర్భాటం చేస్తోంది. యుగాలు సాగిన భారతీయ ‘సంచార వర్తకం’లో వాణిజ్యవేత్త వినయం ధ్వనించింది, వినియోగదారుని అవసరం ప్రస్ఫుటించింది. ‘హోమ్ డెలివరీ’లో పరస్పరం ‘అవిశ్వాసం’ నిండి ఉంది, సంచార వర్తకంలో గృహస్థులకూ, సంచార వర్తకులకూ మధ్య ఆత్మీయత విస్తరించి ఉండేది. అవిశ్వాసం పేరు కృత్రిమ వాణిజ్య ప్రపంచీకరణ, ఆత్మీయత సనాతన భారతీయత.. ‘గందోడి రంగడు ఇంకా రానేలేదు, పండగింక నాలుగు దినాలే ఉంది’’ అని తాతయ్యనుద్దేశించి నాయనమ్మ పలకడం అరుణపురి కథ! ‘అనంత పద్మనాభ వ్రతం వచ్చేస్తోంది.. గందోడి రంగన్న నోముదారాలు తేనేలేదు!’ అని వానవోలులో అత్తగారు కోడలితో చర్చించడం సంచార వర్తకం కథ! ‘లవంగాలు లేవు, ఏలక్కాయలు లేవు.. గందోడి రంగప్ప వచ్చేవరకు ఆకులు వక్కలు మాత్రమే నీకు గతి!’ అని ఏడాదిక్రితం కాపురానికి వచ్చిన యువతి భర్తను గదమాయించడం గౌరాపురంలోని చారిత్రక ఘట్టం.. ‘గందోడి రంగయ్య తాత వస్తున్నాడు, కొత్త మొలతాడు కొనిపెట్టవే అమ్మా!’ అని అంటూ ఐదారేండ్ల అన్నదమ్ములు హర్షం ప్రకటించడం ‘ముత్యాల చెరువు’ గ్రామంలోని ముచ్చట! పెళ్లిళ్లకు, పేరంటాలకు, పండుగలకు, గర్భవతుల, బాలింతల, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణకు పనికి వచ్చే సమస్త సామగ్రిని నియతంగా సరఫరా చేసిన సంచార వర్తకుడు గందోడి రంగప్ప! ప్రచారానికి నోచుకోని ఈ చారిత్రక పురుషుడు గోరంట్ల, ఓబులదేవర చెఱువు తదితర ప్రాంతాలలోని పల్లెటూళ్ల వారికి దాదాపు ఐదు శతాబ్దులు సుపరిచితుడు. ఈ ‘సంచార వాణిజ్యం’ కథ ముగిసిన తరువాత దాదాపు నాలుగు దశాబ్దులు గడిచిపోయాయి. ఇలాంటి రంగప్పలు తరతరాలుగా దేశమంతటా సంచరించడం చరిత్ర.. హిందూపురంలో ఇందుకూరుపేట ప్రాంగణంలో, ఇచ్చోడ పరిసరాలలో, శృంగవరపుకోట సీమలలో గందోడి రంగప్పల వంటి అసంఖ్యాక సంచార వర్తకులు సరుకులను సరఫరా చేసారు.. దోచుకోలేదు! పసుపు కుంకుమలను, సుగంధ ద్రవ్యాలను పంచిపెట్టిన గందోడి రంగప్ప ‘కల్తీ’ చేయలేదు. పల్లెపల్లెలోని ప్రతి ఇంటా గడప గడప మీద పచ్చని తోరణాలపై, ‘లలాట ఫలకాల’పై కస్తూరి నిండిన గంధం, పసుపు, కుంకుమ పరిమళాలను సభ తీర్చాయి. కోట్లాది గందోడి రంగప్పలు- యజమానులు, దోపిడీ చేయని సంచార వర్తకులు, కూలీలు కాదు, స్వతంత్ర జీవనులు! ‘ప్రపంచీకరణ’ ప్రతిష్ఠించిన ‘హోమ్ డెలివరీ’ వ్యవస్థలో ఇళ్లకు వస్తువులను చేర్చుతున్న వారు యజమానులు కాదు, బృహత్ వాణిజ్య సామ్రాజ్యాలను నిర్మించి దోచుకుంటున్న ‘బహుళ జాతీయ సంస్థల’ యజమానులకు కట్టుబానిసలు! కోట్లాది మంది చిట్టి యజమానులు సంచార వర్తకం చేయడం భారతీయత.. ఈ చిట్టి యజమానులు వ్యాపారం మానుకుని ఘరానా యజమానుల వద్ద కూలి పనికి కుదరడం ‘హోమ్ డెలివరీ’ చేస్తున్న ప్రపంచీకరణ..
ఆధునిక కథా రచయితలలో అగ్రగణ్యుడైన స్వర్గీయ మధురాంతంకం రాజారామ్ దశాబ్దులకు పూర్వం ‘ఎడారి కోయిల’ అన్న కథను వ్రాశాడు. తమ తండ్రి తాతలు పుట్టిపెరిగిన ‘రాగులపాడు’ గ్రామాన్ని వెతుక్కుంటూ అమెరికాలో పుట్టి పెరిగిన పదహారు ఏళ్ల విద్యార్థి రవిబాబు సాహస యాత్ర చేయడం ఈ కథనం.. రాగులపాడులో పుట్టిన రైతుబిడ్డ నరసింహ బాగా చదివి ‘ఇంజనీరై’పోయి ఘరానా ఇంటి అమ్మాయిని పెళ్లాడి అమెరికాకు వెళ్లి స్థిరపడిపోయాడు. ఇరవై ఏళ్లలో అతగాడు భార్యతో, పిల్లలతో కలిసి అనేకసార్లు మన దేశానికి వచ్చాడు, అత్తగారింట ఆర్భాటపు ఆతిథ్యం పొందాడు. కానీ ‘రాగులపాడు’ వైపు కనె్నత్తి చూడలేదు, ‘రాగులపాడు’లోని తల్లిదండ్రుల, ఇతర కుటుంబ సభ్యుల ‘్ధ్యస’ అతనికి లేదు. తన చదువుకోసం తండ్రి చేసిన అప్పుల సంగతి కూడా ఈ అమెరికా వాసి మరచిపోయాడు. ‘తెలుగు నేర్చుకుంటే పిల్లలు చెడిపోతారన్న’ భయం కొద్దీ అమెరికాలో పుట్టి పెరిగిన తన పిల్లలకు ఆయనగారు మాతృభాషను మప్పలేదు. కానీ, బాల్యంలోనే రవిబాబు హృదయంలో భారతీయత అంకురించడం దైవఘటన.. అందుకే రవిబాబు వారాంతపు సెలవులలో ఇతర తెలుగు పిల్లలతో కలిసి తెలుగు అక్షరాలు నేర్చుకోగలిగాడు. ‘కూడి కూడి’ తెలుగు చదవగలడు. తెలుగులో మాట్లాడగలడు, కొంచెం కష్టంగా.. తమది ‘రాగులపాడని’ అమ్మమ్మగారి ‘ఘరానా ఇంటి’కి వచ్చిన సందర్భంలో రవిబాబు పసిగట్టాడు. తన పితామహుడు, నాయనమ్మ ఆ ‘మూలపడిన’ రాగులపాడులోనే ఉన్నారని గ్రహించాడు! తన సొంత ఊరును చూడాలని సొంత ఇంటికి వెళ్లి నాయనమ్మను, తాతను పలుకరించాలని రవిబాబు మూడునాలుగేళ్లుగా తపించాడు. చివరికి ఆ ఏడు తిరుమల వేంకటేశ్వరుని దర్శించే నెపంతో తల్లిదండ్రులను మభ్యపెట్టి రైలెక్కి తిరుపతికి చేరుకున్నాడు రవిబాబు. తన తాత సుబ్బరాయుడని, రాగులపాడుకు వెళ్లడానికి తిరుపతిలో బస్సెక్కాలని మాత్రమే రవిబాబుకు తెలిసిన వివరాలు. తిరుపతి బస్‌స్టేషన్‌లోని ఓ కౌంటర్ వద్దకు వెళ్లి ‘రాగులపాడు’కు టిక్కెట్ ఇమ్మని అడిగాడు రవిబాబు! రాగులపాడు ఎక్కడుందో, ఆ ఊరికి బస్సు వెడుతుందో లేదో కూడా ఆ కౌంటర్ ఉద్యోగికి తెలీదు! ఇతరులను విచారించడానికి ప్రయత్నించి విఫలమైన రవిబాబు ‘ప్లాట్‌ఫారమ్’ మీది బెంచిపై విచారిస్తూ కూలబడినాడు. కళ్లవెంట ఉబికి వస్తుండిన నీటిని నిరోధించడానికి యత్నించాడు.. ‘ఏం నాయనా! ఏ ఊరికి పోవాల?’ అని పక్కనే కూర్చుని ఉండిన వయోవృద్ధుడు ఆప్యాయంగా ప్రశ్నించాడు. రవిబాబు చెప్పాడు! ‘అట్లా చెప్పు!’ తిరుపతి బస్ స్టేషన్‌లో హైదరాబాద్‌కు విజయవాడకు టిక్కెట్ ఇవ్వమంటే ఇస్తారు గానీ, రాగులపాడుకు, రంగంపేటకు ఇవ్వమంటే గందరగోళమే.. ఎవరికి తెలుసు? గాజుల వ్యాపారంపై పడమటి గడ్డ అంతా తిరిగినోణ్ణి కాబట్టి నాకంటే రాగులపాడు తెలుసు. ఆ ఊళ్ల సంచారం నాకు కొట్టినపిండి.. ‘గాజుల తాత’ సహాయంతో రవిబాబు తన తాతగారి ఇంటికి చేరడం తరువాతి కథ! గాజుల వ్యాపారులు, టంగుటూరి రామయ్య వంటి కిరాణా వ్యాపారులు పల్లెపల్లెకూ సంచరించి ఇంటింటికీ వస్తువులను చేరవేయడం వికేంద్రీకృత భారతీయ ఆర్థిక వ్యవస్థ కథ.. ఇప్పుడు గాజులు లేవు.. ‘సౌండ్’ వస్తుందని కానె్వంటు పాఠశాలలో ఆడపిల్లల చేతుల నుండి గాజులను తీసేశారు! ఇప్పటి ధ్వని- ప్రపంచీకరణ పదఘట్టనది..

* -హెబ్బార్ నాగేశ్వరరావు 2013hebbar@gmail.com