మెయన్ ఫీచర్

‘ఆధార్’పై నిరాధార ఫిర్యాదులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయులకు ఏకైక గుర్తింపు సాధనమైన ‘ఆధార్’ తమ ఆలోచన కాకపోవడంతో కేంద్రంలో ప్ర స్తుత పాలకులు- యుపిఎ హయాంలో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తి భి న్నంగా మారింది. కాంగ్రెస్ వారు తమ ‘మానస పుత్రిక’ అయిన ‘ఆధార్’పై ఇపుడు నిరాధార ఫిర్యాదులు చేస్తూ నిరసన గళం విప్పడం విడ్డూరం. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తున్న ఆదాయపు పన్ను చట్టంలోని 139ఎఎ సెక్షన్‌పై కొందరు ‘ఉద్యమకారులు’ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో రచ్చ మొదలైంది. ‘ఆధార్-పాన్ కార్డ్ అనుసంధానం’ తప్ప మరే ఇతర మార్పులకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించలేదు. అయినప్పటికీ ఈ వ్యవహారమంతా ప్రజల ‘వ్యక్తిగత గోప్యత’కు భంగకరంగా మారినట్లు ‘ఉద్యమకారులు’ వ్యతిరేకిస్తున్నారు. వీరు చెబుతున్న కారణాలు సంతృప్తపరచే విధంగా లేవు. పన్ను ఎగవేతను, నల్లధనాన్ని నిరోధించేందుకు మాత్రమే ‘ఆధార్’తో పాన్‌కార్డ్‌ను అనుసంధానం చేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. పది లక్షల పాన్‌కార్డులను రద్దు చేసిన నేపథ్యంలో ‘ఆధార్’తో అనుసంధానిస్తే బోగస్ పాన్‌కార్డులుండవంటున్నారు.
‘ఉద్యమకారులు’గా చెప్పుకుంటున్న వారు- సుప్రీం కోర్టును ఆశ్రయించాక కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ‘స్వార్థ ఆసక్తి’కి ప్రతినిధులైన వీరు సర్వోన్నత న్యాయస్థానంలో ‘పిటిషనర్ల’ అవతారం ఎత్తి న్యాయవ్యవస్థ ముందు కొన్ని విషయాలు దాస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ ఉద్యకారులు, కార్యకర్తలు అభివృద్ధిని అడ్డుకోవడాన్ని మనం గతంలోనూ చూశాం. కూడంకుళం అణువిద్యుత్, నర్మదా ప్రాజెక్టు, కొంకణ్ రిఫైనరీ, హైడ్రో కార్బన్ ప్రాజెక్టు సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు వీరు ఆటంకం కలిగించారు. వామపక్ష ఉదారవాదం, మావోయిజంల పట్ల మొగ్గు చూపే వీరు నిరంతరం ప్రభుత్వ వ్యితిరేకంగానే ప్రవర్తిస్తుంటారు. రెండేళ్ల క్రితం ‘అసహనం’ పేరిట అనవసర చర్చకు తెరతీసింది వీరే. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలంటే వీరిలో స్వాభావిక ద్వేషం ఇంతాఅంతా కాదు. ఇపుడు దిల్లీలో ‘పనిచేసే ప్రభుత్వం’ కొనసాగడం ఈ ఉద్యకారులకు ఎంతమా త్రం ఇష్టం లేదు. ‘ఆధార్’లో మార్పులు చేస్తున్నారని వీరు ఇంతలా గొంతు చించుకోవడం దేనికి? ప్రతి విషయానికీ రభస చేసే ఇలాంటి ఉద్యమకారులకు వంత పాడడం ఇపుడు దేశంలో ఓ ‘్ఫ్యషన్’ అయిపోయింది. వీరికి మద్దతు ఇచ్చేవారే నిజమైన అభివృద్ధికాముకులన్న వాదన బయలుదేరింది. ఇలాంటి శక్తులకు ప్రచారం చేసేందుకు మీడియా ఎపుడూ తహతహలాడుతోంది. విస్మయకరంగా కాంగ్రెస్ పార్టీ - అసలు ‘పాపి’ని తానే అన్న విషయాన్ని మరచిపోయి.. వీరిని భుజానకెత్తుకుంటోంది!
ఇదే ఉద్యమకారులు, కార్యకర్తలు గత ప్రభుత్వాల కాలంలో కొన్ని విషయాలపై ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం, కొన్ని సందర్భాల్లో మెచ్చుకోవడాన్ని మనం మరచిపోలేం. అయితే, ఇప్పుడు వారిని రెచ్చగొడుతున్న అంశం ఏమిటి? ‘ఆదాయపు పన్ను చట్టంలో సవరణ’ అనేది వారికి ఆగ్రహం తెప్పిస్తోంది. వారి ఉద్దేశం మొత్తానికి బహిర్గమైంది. పన్నులను ఉల్లంఘించిన వారికి ఎలా వత్తాసు పలుకుతారు? ‘గోప్యత హక్కు’ కోసం ఇవి సరైన మార్గాలా? ‘ఆధార్’ అన్నది వ్యక్తి శరీరంపై దాడి లాంటిదని, ఇందుకు ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదన్నది ‘ఉద్యమకారుల’ వాదన. మనం కూడా ఇలా ఆలోచిస్తే- దేశంలో ఫొటో స్టూడియోలన్నింటినీ మూసి వేయాల్సిందే. ఎందుకంటే ప్రతి గుర్తింపు కార్డుపైనా ఫొటో ఉంటుంది గనుక- సంబంధిత వ్యక్తి గోప్యత బహిర్గతమైనట్లే భావించాలి. గుర్తింపు కార్డుపై ఫొటో ఆ వ్యక్తికి ప్రతిరూపం గనుక ఎవరికీ ఎలాంటి ‘ఐడి’లు ఉంచుకోరాదని భావించాలా?
ఎవరైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసినా ‘ఆధార్’కు ఇచ్చే సమాచారానే్న పూర్తిగా వెల్లడించాల్సి ఉంటుంది. అయితే- పాస్‌పోర్ట్‌కు లేదా బ్యాంకు అకౌంట్ కోసం వ్యక్తిగత సమాచారం ఇవ్వడంలో కొం త మినహాయింపు ఉం టుందని, కానీ ‘ఆధార్’ విషయం లో మాత్రం ‘పీకమీద కత్తిపెట్టి’ వ్యక్తిగత సమాచారాన్నంతా ప్రభుత్వం రాబడుతోందన్నది విమర్శకుల వా దన. పాస్‌పోర్టు కానీ, బ్యాంకు అకౌంట్ కానీ, ఆధార్ కానీ.. ఏదైనా మన సమాచారం ప్రభుత్వం వద్ద ఉన్నట్లే కదా! రేషన్ కార్డుకైతే వేలిముద్రలు, ఐరిస్ వంటివి తీసుకుంటున్నా- ‘ఆధార్’లో ఉన్నంత భద్రత మాత్రం ఉండదు.
ఉద్యమకారులకు, కార్యకర్తలకు జాతిపిత గాంధీజీ తాము ‘ఎంపిక చేసుకున్న’ కొన్ని విషయాల్లో గుర్తుకొస్తుంటాడు. ‘ఏ వ్యక్తి కూడా మరో వ్యక్తికి ఏది మంచో చెప్పడం, ఇతరులు ఏది చేయాలో, చేయకూడదో చెప్పడం’ సరికాదన్న గాంధీ సూక్తి పౌర సమాజం, వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించినది మాత్రమే. జాతి, పౌరుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం చట్టాలు చేసే విషయంలో మాత్రం తన సూక్తి వర్తించదని కూడా గాంధీ చెప్పడాన్ని మనం విస్మరించరాదు.
సంక్షేమ కార్యక్రమాలను లోపాలు లేకుండా అమలు చేయడానికి ‘ఆధార్’ అవసరమని ప్రభుత్వం చెబుతోంది. ‘ఆధార్’ వల్ల పేదల సంక్షేమ పథకాల్లో, పెన్షన్ స్కీముల్లో 50వేల కోట్ల రూపాయలను పక్కదారి పట్టకుండా చేయగలిగామని భారత అటార్నీ జనరల్ సుప్రీం కోర్టుకు తెలిపారు. పదిలక్షల బోగస్ పాన్ కార్డులను రద్దు చేశామని కూడా ఆయన స్పష్టం చేశారు. గోసంరక్ష, బలవంతపు మత మార్పిడుల గురించి కూడా గాంధీజీ చాలా విషయాలు చెప్పారు. ప్రతి వ్యక్తి జీవితం తెరచిన పుస్తకంలా ఉండాలని ఆయన కోరుకునేవారు. అయితే, మనం వ్యక్తిగత గోప్యత పేరిట అన్ని విషయాలను దాచేసుకోవాలని భావిస్తుంటాం. ‘హక్కు’ను ఎక్కడా ఆటంకపరచ కూడదు. ‘నేనేం తినాలి? ఏం ధరించాలి? ఏం చూడాలి? ఎవరితో మాట్లాడాలి?.. ఇవన్నీ ప్రభుత్వం నిర్ణయించాలి’ అని కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇలాంటి ‘హక్కు’ను చట్టాలు లేని సమాజంలోనే చూస్తాం. గోవధను చాలా రాష్ట్రాల్లో నిషేధించారు. అయినా చట్టాన్ని ఉల్లంఘించి ఎద్దు మాంసం తినాలా? ఈ హక్కును అవసరమైతే అమెరికా వెళ్లి వాడుకోవచ్చు. అయితే, అక్కడ కొన్ని సాంస్కృతిక కారణాల రీత్యా గుర్రం మాంసం తినడాన్ని నిషేధించారు. ఇతర దేశాల్లో జరిగే వాటితో మనకేంటి సంబంధం? అని ఉద్యమకారులు ప్రశ్నించవచ్చు. పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లోనూ హక్కులకు కొన్ని పరిమితులు ఉంటాయని మనం గ్రహించాలి. హుందాగా ఉండాలి కాబట్టి మనం ఎలా పడితే అలా వస్తధ్రారణ చేసుకోలేం. నగ్నంగా ఉంటానంటే సభ్య సమాజం అంగీకరించదు. అశ్లీల చిత్రాలు పడక గదిలో చూసుకోవచ్చేమో గానీ బహిరంగంగా చూస్తామనడం ‘హక్కు’ కాదు.
దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ‘ఆధార్’ వివరాలు బయటకు పొక్కినట్లు మీడియాలో కథనాలు వచ్చినట్లు ‘ఉద్యమకారులు’ ప్రచారం చేస్తున్నారు. ఈ కథనాలు అర్థరహితమని ఆధార్ కార్డులను జారీచేసే ‘ఉడాయ్’ సంస్థ స్పష్టం చేసింది. తమ వద్ద ఉన్న ‘డేటాబేస్’ ఏ విధంగానూ ‘లీక్’ అయ్యే అవకాశం లేదని ఆ సంస్థ ప్రకటించింది. కాగా, సుప్రీం కోర్టులో కేసు విచారణకు వచ్చిన సమయంలోనే ‘లీకేజీ’ పేరిట కల్పిత కథనాలు రావడం అనుమాస్పద వ్యవహారంలా మారింది.
హక్కులు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన వాదనలెలా ఉన్నా, భారతీయ సంస్కృతి, సంప్రదాయలు మాత్రం ఎల్లప్పుడూ- ‘ పరోపకారార్థం ఇదం శరీరం’ అన్న సూక్తికి అద్దం పడతాయి. వ్యక్తి తన శరీరానికి సంబంధించి హక్కులు కోరుకోవడం స్వార్థం కాదు. అది మన సంస్కృతి కూడా. కానీ, బ్రిటిష్ పాలనను మెచ్చుకునేవారు మాత్రం మన సంస్కృతి విచ్ఛిన్నం కావాలని కోరుకుంటారు. వారి దృష్టిలో భారతీయ సంస్కృతి అంటే- ‘తిరోగమనం’!
*

సెల్ : 80083 22206