సంపాదకీయం

విషపు‘రుచి’కి విరుగుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ‘ఐస్‌క్రీమ్’ తింటే మీరు మిలమిల మెరిసిపోతారు, ఈ ‘చాక్లెట్’ తింటే మీకు ఏనుగంత బలం వస్తుంది- ఇలాంటి సమ్మోహనకరమైన వాణిజ్య ప్రకటనలతో వినియోగదారులను వంచించడం ‘ప్రపంచీకరణ’ మారీచ మృగ మాయాజాలం. ఈ వంచన క్రీడను నిరోధించడానికి ‘్భరత ఆహార ప్రమాణ, సురక్షా మండలి’ వారు పూనుకుంటుండడం హర్షణీయ పరిణామం. ‘సం కర ఆహారం’-ప్రాసెస్డ్ ఫుడ్, మహా సంకర ఆహారం-హైలీ ప్రాసెస్డ్ ఫుడ్-కృత్రిమ మధుర పానీయాలు-స్వీటెన్డ్ బెవరేజెస్-వంటి వాటిపై అమ్మకం పన్నులు వసూలు చేయాలని ‘వైద్య, పోషకాహార నిపుణుల సంఘం’ వారు సిఫార్సు చేయడం ఈ హర్షణీయ పరిణామానికి ప్రాతిపదిక! భారత ఆహార ప్రమాణ సురక్షా మండలి- ఫుడ్ స్టాండర్డ్స్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా-ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ-కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు అనుబంధంగా పనిచేస్తోంది. ఈ పర్యవేక్షక నియంత్రణ మండలి నియమించిన నిపుణుల బృందం వారు చేసిన అధ్యయనంలో మహా సంకర ఆహార పదార్థాల వల్ల కృత్రిమ రసాయన మధుర పానీయాల వల్ల వినియోగదారుల ఆరోగ్యం పాడయిపోతోందన్న వాస్తవం ధ్రువపడడం ‘సిఫార్సుల’కు ప్రాతిపదిక! అందువల్ల ఈ ‘ప్రాసెస్డ్’ తినుబండారాలను, శీతల మధుర కృత్రిమ రసాయన పానీయాల-కోల్డ్ డ్రింక్స్-ను జనం ఎక్కువగా సేవించకుండా నియంత్రించాలన్నది ‘నిపుణుల బృందం’ చేసిన ప్రతిపాదన..ఈ ‘సంకర ఆహారం’ రుచుల గురించి, ‘వైశిష్ట్యం’ గురించి, తి నడం వల్ల జరిగే ‘మే లు’ గురించి వాణిజ్య ప్రకటనలు దృశ్య మా ధ్యమాలలో ‘ఘనం’ గా ప్రసారం కాకుం డా నిరోధించాలని కూ డ నిపుణుల బృందం ప్రతిపాదించిందట! చి న్న పిల్లల కోసం ప్రసారమయ్యే దృశ్య మా ధ్యమ కార్యక్రమాల్లో ‘కొవ్వు, ఉప్పు, చక్కెర’ -్ఫ్యట్, సాల్ట్, సుగర్-ఎఫ్‌ఎస్‌ఎస్-నిండిన కృత్రిమ తినుబండారాల ‘గొప్పదనం’ గురించి ప్రచారం చేసే వాణిజ్య ప్రకటనలను పూర్తిగా నిషేధించాలని కూడ నిపుణుల బృందం ప్రతిపాదించిందట! వివిధ రంగాలకు చెందిన ప్రతిష్ఠితులు-సెలబ్రిటీస్-, ప్రభావవంతులు-లెజండ్‌లు-ముక్కులు తిప్పుకుంటూ, మూతులు వంకర చేస్తూ రకరకాల కృత్రిమ ఆహార ‘మాధుర్యాల’ గురించి, పానీయాల ‘ప్రశస్తి’ గురించి జనాలకు బోధిస్తుండడం దృశ్య మాధ్యమాలలో కొనసాగుతున్న దశాబ్దుల ప్రహసనం! ఈ ‘సెలిబ్రిటీ’ ఘరానాలు ఇలా ప్రచారం చేయకుండా నిషేధించాలని కూడ ‘నిపుణుల బృందం’ సిఫార్సు చేసిందట! ‘మండలి’ వారు, ప్రభుత్వం వారు ఈ ప్రతిపాదనలను అంగీకరించినట్టయితే ప్రకటనల హోరు తగ్గుతుంది, అనవసరమైన ‘మిఠాయిల’, తీపి పానీయాల అమ్మకాల జోరు తగ్గుతుంది!
వీధి వెంట వెడుతున్న చిన్నపిల్లలు వీధిలో ఓ మూలగా పడుకుని ఉన్న కుక్కపైకి రాళ్లు, బెడ్డలు విసరడం సహజం.. దెబ్బతిన్న కుక్క గట్టిగా అరచుకుంటూ పిల్లలను తరుముతుంది, ఒక్కోసారి కొత్త పిల్లలను చూసి వీధి కుక్కలు మొరగడం సహజం. పిల్లలు భయపడి పరిగెత్తుతారు, కుక్క వెంటపడి తరుముతుంది. మొరిగిన కుక్కను చూసి భయపడి పారిపోరాదన్నది పాఠం. వివేకానంద స్వామికి చిన్నప్పుడు ఇలాంటి ఘటనలు ఎదురయ్యాయట. కానీ మనం పారిపోకుండా అలాగే నిలబడితే, వీధికుక్క కూడ మొరుగుతూ అలాగే నిలబడుతుంది, తరువాత నోరు మూసుకుని తోక ముడుచుకుని దూరంగా వెళ్లిపోతుంది. ఇదీ జాతికి వివేకానంద- భరతమాత వజ్రాల బిడ్డడు చేసిన ప్రబోధం. ఈమధ్య దృశ్య మాధ్యమాలలో ఒక ‘ప్రకటన’ ప్రసారవౌతోంది. ఈ వాణిజ్య ప్రకటనలో ఒక కుక్క ఒక బాలుడిని తరుముతూ ఉంటుంది. పిల్లవాడు ప్రాణభయంతో కుక్కకు దొరకకుండా పారిపోతుంటాడు. కానీ కుక్క వేగం ఎక్కువ, అందువల్ల ఆ అర్భకుడు ‘కాటు’ తప్పదని బెంబేలెత్తుతూ పరుగు తీస్తునే ఉన్నాడు. హఠాత్తుగా వాడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఫలానా ‘విదేశీయ వాణిజ్య సంస్థ‘ వారి ‘చాక్లెట్’ను జేబులోనుంచి తీసి నమిలి మింగేస్తాడు. వెంటనే ఆ బాలుడికి వెయ్యి సింహాల బలం వచ్చేసింది. వాడు గాలిలాగ దూకుకుని పోతాడు. పట్టుకోలేని కుక్క కూలబడిపోతుంది. కుక్కకు ‘చాక్లెట్’ లేదు మరి!
కుక్కకు ఎదురునిలవాలన్నది వివేకానందుడు బోధించిన భారతీయత, సమస్యను ఎదుర్కోవాలి! కానీ, పారిపోవాలన్న కొత్త పాఠాన్ని ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’ బోధించింది. ‘ప్రపంచీకరణ’ మన సంస్కృతిపై చేస్తున్న దాడులలో ఇది ఒకటి మాత్రమే! విదేశీయ బృందంతో జరిగిన ఆటల పోటీలో మనదేశం గెలిచినప్పుడు మనం ‘పండుగ‘ చేసుకోవచ్చు. మరో ‘వాణిజ్య ప్రకటన’లో ఇలా పండుగ చేసుకోవడానికి వీలుగా పిల్లలు, పెద్దలు ఒక గంపనిండా ‘్ఫలానా‘ సంస్థవారి చాక్లెట్లు తెచ్చుకున్నారు. కానీ చివరికి మన జట్టు ఆటలో ఓడిపోయింది. అం దువల్ల నిజానికి ‘వే డుక’ చేసుకోరాదు! కానీ, ‘అరే అంకుల్.. ఎవరో ఒకరు గెలిచారు కదా.. రండి! తీపి పండుగ చేసుకుందాము!’ అని ఒక కుర్రవాడు అనడం ప్రకటనలోని సారాంశం! మన దేశం గెలిచినప్పటికీ, ప్రత్యర్థి దేశం గెలిచినప్పటికీ ఒకటేనన్న మాట! చిన్నపిల్లల బుద్ధులకు ఇలాంటి ‘తీపి విద్రోహం’ ఎక్కించడం బహుళ జాతీయ సంస్థల వ్యూహం! స్వదేశీయ స్వాభిమాన స్వభావం భారతీయులలో క్రమంగా సన్నగిల్లిపోవాలన్నది లక్ష్యం, ‘సెలబ్రిటీ’లుగా చెలామణి అవుతున్న వారు ఇలాంటి విదేశాల దోపిడీ ముఠాలకు ‘ముద్రా రాయబారులు’-బ్రాండ్ అంబాసిడర్‌లు-గా దళారీతనం చేస్తుండడం మనదేశపు దౌర్భాగ్యం!
భారత ఆహార ప్రమాణ, సురక్షా పరిరక్షణ మండలి వారు ఇప్పటికైనా ఈ తీపి విషాల నియంత్రణకు పూనుకోవడం శుభ పరిణామం! ‘శుద్ధి చేసిన’ ఆహారం పేరుతో చెలామణి అవుతున్న ఈ ‘ప్రాసెస్డ్ ఫుడ్’ నిజానికి సంకర పదార్థం! ‘శుద్ధి’ పేరుతో ప్రతి తినుబండారంలోను విష రసాయనాలను కలుపుతున్నారు. చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్‌లు, చిప్పులు, వేఫర్‌లు, ఐస్‌క్రీమ్‌లు, సేమ్యాలు వంటివన్నీ రసాయన విషాలతో కల్తీ అవుతున్నాయి. సంకరమవుతున్నాయి. పరిమితమైన మోతాదులో ఇలా ఆహారంలో రసాయన విషాలను కలపడానికి ప్రభుత్వాలే అనుమతినిస్తున్నాయి. ఉత్పత్తిదారులు ప్రధానంగా ‘నెజల్’, ‘పెప్సీ’ లాంటి సంస్థలు మోతాదుకు మించి రసాయనాలను కలిపి ‘రుచి’ని పెంచుతున్నాయి! రసాయనాలను కలపడంపై సమగ్ర నిషేధం ఎందుకు విధించరు?