సంపాదకీయం

దురాక్రమణకు ‘బాట’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా ప్రభుత్వం తమ రాజధాని బీజింగ్‌లో ఏ ర్పాటు చేసిన ‘ఒకే క్షేత్రం, ఒకే మార్గం’ వాణిజ్య సదస్సును బహిష్కరించడం ద్వారా మన ప్రభుత్వం ‘ప్రచ్ఛన్న బీభత్సకాండ’ను మరోసారి నిరసించింది. వివిధ దేశాల మధ్య, ఖండాల మధ్య భూతల, సముద్ర మార్గాలను నిర్మించడం ఈ ‘ఒకే క్షేత్రం, ఒకే మార్గం’ బృహత్ పథకం లక్ష్యమని చైనా ఆర్భాటంగా ప్రచారం చేస్తోంది. నిజానికి ఇది చైనా సాగిస్తున్న బహుముఖ దురాక్రమణలో భాగం! అందువల్ల మన ప్రభుత్వం ఈ పథకాన్ని సామ్రాజ్యవాద విస్తరణగా అభివర్ణించింది, బీజింగ్ సదస్సును బహిష్కరించింది. చైనా ప్రభుత్వం పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూ కశ్మీర్‌లో నిర్మించతలపెట్టిన ‘ఆర్థిక వాణిజ్య వాటిక’- ఈ రాజకీయ, వాణిజ్య, వ్యూహాత్మక దురాక్రమణలో భాగం.. చైనా దుస్సాహసం! ఈ రాజకీయ వాణిజ్య వ్యూహాత్మక సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటించడానికి మన ప్రభుత్వం నడుం బిగించడం అనివార్యమైన పరిణామం! ప్రాచీన కాలం నాటి ‘పట్టుదారి’-సిల్క్‌రోడ్-ని పునరుద్ధరించడం పేరుతో నాలుగేళ్లుగా చైనా ప్రభుత్వం కొనసాగిస్తున్న కుట్ర అసలు లక్ష్యం వివిధ దేశాలపై పెత్తనం చెలాయించడం. ఈ పెత్తనం దౌత్య దౌర్జన్యం, ఈ పెత్తనం వాణిజ్య బీభత్సం, వ్యూహాత్మక ఉగ్రవాదం! ‘ఒకే క్షేత్రం, ఒకే బాట’-వన్ బెల్ట్, వన్ రోడ్’-ఒబిఓఆర్- అన్న ‘పథకం’ పేరుతో చైనా అమలు జరుపుతున్న వ్యూహం కేవలం ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాల మధ్య ‘రాకపోకల’ను సుగమం చేయడానికి ఉద్దేశించినది కాదు. వివిధ దేశాలలో భారీగా పెట్టుబడులను పెట్టి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను నియంత్రించడం చైనా వ్యూ హం! చైనా అతిపెద్ద పెట్టుబడిదారీ వ్యవస్థగా అవతరించడం ఈ బీజింగ్ సదస్సుకు నేపథ్యం! ‘ప్ర పంచీకరణ’ పట్ల అ మెరికా ప్రభుత్వం, ఐ రోపా దేశాలు వై ముఖ్యం ప్రదర్శిస్తున్న సమయంలో ‘ప్రపంచీకరణ’కు ప్రధానమైన దళారీ శక్తిగా చైనా అవతరించింది! ఈ దళారీతనం వివిధ ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు తరలి వెళ్లడానికి ‘కొత్తబాట’ కావాలి! ప్రాచీన మహా వాణిజ్య పథాన్ని ‘పునరుద్ధరించడం’ కేవలం సాకు మాత్రమే!
పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌లోని గ్వాడార్ ఓడరేవునుంచి సింకియాంగ్ వ రకు పారిశ్రామిక వాటికను చైనా నెలకొల్పుతోంది. సింకియాంగ్ క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్ది చివరి వరకు ప్రత్యేక దేశం, ప్రస్తుతం చైనాలో భాగం! చైనా ‘పాకిస్తాన్ వాణిజ్య వాటిక’ పట్ల బలూచిస్థాన్ ప్రజలు వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. బలూచిస్థాన్ 1947నకు పూర్వం అఖండ భారత్‌లో భాగం, పాకిస్తాన్‌లో చేరడానికి అంగీకరించలేదు. 1948లో బలూచిస్థాన్ పాకిస్తాన్‌లో కలిసిపోవడం పాకిస్తాన్ ప్రభుత్వంతో బ్రిటన్ ‘లాలూచీ’ పడిన ఫలితం! ఇటీవలి కాలంలో బలూచిస్థాన్‌లో స్వాతంత్య్ర జ్వాలలు చెలరేగుతున్నాయి. చైనా గ్వాడార్ ఓడరేవులో తిష్ఠ వేయడం, ఇప్పుడు ఈ ‘వాటిక’ను నిర్మించడం తమను అణచివేయడానికేనన్నది బలూచిస్థాన్ స్వాతంత్ర ఉద్యమకారులు గ్రహించిన వాస్తవం! ఈ ‘ఒన్ బెల్ట్ ఒన్ రోడ్’ పథకంలో భాగంగా చైనా కల్పిస్తున్న ‘పట్టుబాట’ సముద్రాల గుండా సమాంతరంగా సాగుతుంది. ఈ సముద్ర పథంలో గ్వాడార్ కూడ ఉంది!
ఉత్తర కశ్మీర్‌లోని ‘గిల్గిత్ బాల్తిస్థాన్’ పాకిస్తాన్ దురాక్రమణలో ఉంది. ఈ దురాక్రమిత ప్రాంతంలో ఆరువేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్తాన్ 1963లో చైనాకు కట్టబెట్టింది. ఫలితంగా ‘కారాకోరమ్’ పర్వత శ్రేణికి ఉత్తరంగా ఉండిన ‘సింకియాంగ్’ సరిహద్దు ఈ శ్రేణికి దక్షిణంగా విస్తరించిపోయింది! దురాక్రమిత కశ్మీర్ పాకిస్తాన్ నుండి విముక్తమై మళ్లీ మన అధీనంలోకి వచ్చినప్పుడు ఈ ‘కారాకోరమ్’ దక్షిణ ప్రాంతమైన ఆరువేల చదరపు కిలోమీటర్లను కూడ చైనా మనకు వదలిపెట్టాలి! కానీ అలా వదలడానికి చైనా సిద్ధంగా లేదు. అందువల్ల ఇదివరకే ఈ ప్రాంతంలో నిర్మించిన రహదారిని ‘పట్టుబాట’-సిల్క్‌రోడ్-తో అనుసంధానం చేయాలన్నది చైనా వ్యూహం! దీన్ని ‘గిల్గిత్ బాల్తిస్థాన్’ ప్రాంతంలో అనాదిగా నివసిస్తున్న వారు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలోకి పాకిస్తాన్ నుంచి వేలాది మంది చొరబడ్డారు, స్థిరపడ్డారు. చైనా పథకం అమలు జరిగితే స్థానికులు అల్పసంఖ్యాకులైపోయి పాకిస్తానీలు గిల్గిత్ బాల్తిస్థాన్‌లో అధిక సంఖ్యాకులైపోతారు. మన ప్రభుత్వం అందువల్ల ఈ బీజింగ్ సద స్సును బహిష్కరించడం అనివార్యమైపోయింది! పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో ‘వాణిజ్య వాటిక’ను ఏర్పాటు చేయరాదని మన ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను చైనా ప్రభుత్వం లెక్క చేయకపోవడం బీజింగ్ సదస్సును మనం బహిష్కరించడానికి సమీప నేపథ్యం. ప్రాచీన కాలంలో ‘పట్టుబాట’ చైనా పాలకులు ఏర్పాటు చేసినట్టు జరుగుతున్న ప్రచారం చారిత్రక వక్రీకరణ! ‘పట్టుబాట’ సింకియాంగ్ గుండా సాగుతోంది, టిబెట్ గుండా సాగుతోంది, గాంధార, యోన దేశాల గుండా సాగుతోంది. ‘పట్టుబాట’ గుండా మన జమ్మూ కశ్మీర్, సింకియాంగ్ సరిహద్దు గుండా వా ణిజ్యం జరిగిన కా లంలో ‘సింకియాం గ్’ చైనాలో లేదు. టిబెట్ చైనాలో లే దు, ‘గాంధార’, ‘యోన’ వంటి దా దాపు ఇరవై చిన్న రాజ్యాలన్నీ భా రత్‌లో ఉండేవి! ఈ గాంధార మొదలైన దేశాలు క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్దిలో ఇస్లాం జిహాదీల దురాక్రమణకు గురై ఆఫ్ఘానిస్థాన్‌గా మారాయి. మధ్య ఆసియాలోని ‘సింకియాంగ్’ హూణ దేశం! హూణులకు, ‘హాణ్’- చైనా-దేశానికీ మధ్య శతాబ్దుల పాటు పోరాటాలు జరిగాయి. ఈ సమయంలోనే జిహాదీలు సింకియాంగ్‌ను దురాక్రమించి తుర్కిస్తాన్-తూర్పు-గా మార్చారు. అంతవరకు ‘హూణ’ దేశంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. ఇలా తుర్కిస్తాన్‌గా మారిన ‘హూణ’ దేశాన్ని క్రీస్తుశకం 1880వ దశకంలో ‘హాణ’ చైనా ఆక్రమించడం చరిత్ర! ‘హూణ’ లేదా తుర్కిస్థాన్ లేదా సింకియాంగ్ స్వతంత్ర దేశంగా ఉండినట్టయితే ‘పట్టుబాట’ ఘనత చైనాకు దక్కి ఉండేది కాదు! టిబెట్టు, సింకియాంగ్ అనాది తమ దేశంలోనే ఉన్నట్టు ‘హాణ’ చైనా చెప్పుకోవడం అబద్ధాలకు ‘అందలం‘!
ఇలా టిబెట్‌ను, సింకియాంగ్‌ను, మంచూరియాను మంగోలియాలో సగాన్ని చైనా వివిధ సమయాలలో దిగమింగింది. టిబెట్, సింకియాంగ్ ఎప్పటికైనా మళ్లీ విడిపోగలవన్న భయం చైనా పాలకులకు ఇప్పటికీ తొలగిపోలేదు. పట్టుబాట పునరుద్ధరణ పేరుతో టిబెట్‌ను సింకియాంగ్‌ను ‘హాణ’ చైనా జాతీయులతో ముంచెత్తడం కూడ దీర్ఘకాల లక్ష్యాలలో ఒకటి.. ‘పట్టుబాట’ను ప్రధానంగా ఉపయోగించిన వారు ప్రాచీన కాలంలో ప్రధానంగా భారతీయులు..