సంపాదకీయం

ఉగ్ర మృగాలపై ‘పిడుగులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కశ్మీర్‌లోని ‘అధీన రేఖ’- లైన్ ఆఫ్ కం ట్రోల్- ఎల్‌ఓసి- సమీపంలోని పాకిస్తానీ స్థావరాలను మన సైనికులు ధ్వంసం చేయడం జిహాదీ ఉగ్రవాదులను దండించడంలో భాగం! మన సైనికులు మరోసారి మే తొమ్మిదవ తేదీన జరిపిన ‘సాయుధ చికిత్స’- సర్జికల్ స్ట్రయిక్- ప్రతీకార చర్య కాజాలదు. నేరస్థులను న్యాయస్థానం దండించడం నేర నిరోధక చర్య మాత్రమే, ప్రతీకారం కాజాలదు. నిరంతరం అధీనరేఖను దాటి చొరబడుతున్న జిహాదీ ఉగ్రవాదుల స్థావరాలను, వారిని ఉసిగొల్పుతున్న ప్రచ్ఛన్న బీభత్సకారులు- టెర్రరిస్ట్స్ ఇన్ డిస్‌గైజ్- పాకిస్తానీ సైనికుల స్థావరాలను మన సైనికులు ధ్వంసం చేయడం అందువల్ల ప్రతీకార చర్య కాజాలదు. ఇలా ధ్వంసం చేయడం ‘నేర నిరోధక సాయుధ ప్రక్రియ’- ప్యునిటివ్ ఫైర్ అస్సాల్ట్- మాత్రమే. ఆవుల మందలలోకి చొరబడి గొంతులను కొరికే తోడేళ్లను అంతం చేయడం ప్రతీకారం కాదు. దండన మాత్రమే. ‘సమరం’, ‘ప్రతీకారం’ వంటివి సమఉజ్జీల మధ్య సమాన సూత్రాలను పాటించేవారి మధ్య జరిగే ప్రక్రియలు. పాకిస్తాన్ మన దేశంపై యుద్ధం ప్రకటించి నియమబద్ధంగా దాడులు చేసినట్లయితే మనం జరిపే ఎదురుదాడులు ప్రతీకారానికి ప్రతీకలు కావచ్చు. కాని ‘అధీన రేఖ’ దాటి వచ్చి మన సైనికులను, ప్రజలను చాటుమాటుగా మట్టుపెట్టి పలాయనం చిత్తగిస్తున్న జిహాదీ ఉగ్రవాదులు పిశాచాల వంటివారు. తోడేళ్ల వంటివారు. వారిని కఠినంగా అణచి వేయడం వారికి మన ప్రభుత్వం విధించిన, విధిస్తున్న న్యాయమైన దండన మాత్రమే. అందువల్ల ఇటీవల మన సైనికులు ‘అధీన రేఖ’ వద్ద పాకిస్తానీ స్థావరాలను ధ్వం సం చేయడం ‘నేర నిరోధక సాయుధ ప్రక్రియ’ మాత్రమే. ప్రతీకారం కాదు. ఈ పాకిస్తానీ స్థా వరాలు జిహాదీ ఉగ్రవాదులవి, పాకిస్తాన్ సైనికుల రూపంలోని ప్ర చ్ఛన్న ఉగ్రవాదులవి. వాస్తవానికి పాకిస్తాన్‌లో సైనికులు లేరు. ఎందుకంటే సైనికులు మరణించిన శత్రుదేశ సైనికుల శరీరాలను ముక్కలు ముక్కలుగా నరకరు, తలలను ఖండించి పైశాచికంగా వాటిని ప్రదర్శించరు. కానీ పాకిస్తాన్ ‘సైనికులు’గా చెలామణి అవుతున్నవారు మన సైనికుల పార్థివదేహాలను నరుకుతున్నారు, తలలను తెగ వేస్తున్నారు. ఇలా చేయడం అమానవీయ, పైశాచిక ప్రవృత్తికి నిదర్శనం. పాకిస్తాన్‌లోని సైనికులు నిజానికి జిహాదీ ఉగ్రవాదులు. రెండురకాల ఉగ్రవాదులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఉసిగొల్పుతున్న ప్రత్యక్ష ఉగ్రవాదులు మొదటి రకం, లష్కర్ ఏ తయ్యబా, జమాత్ ఉద్‌దావా, జాయిష్ ఏ మొహమ్మద్, తాలిబన్ వంటి ముఠాలలో ఈ జిహాదీ హంతకులు సభ్యులు. రెండవ రకం ఉగ్రవాదులు పాకిస్తాన్ సైనికులు. వీరు ప్రచ్ఛన్న ఉగ్రవాదులు..
పాకిస్తాన్ సైనికులుగా చెలామణి అవుతున్న ప్రచ్ఛన్న ఉగ్రవాదులు 2013లో నవాజ్ షరీఫ్ మళ్లీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ‘మృతదేహాలను ముక్కలు చేసే’ పైశాచిక కృత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. 2013 జూన్‌లో ‘రేఖ’ను దాటి చొరబడిన పాకిస్తానీ ప్రచ్ఛన్న ఉగ్రవాదులు హేమరాజ్, సుధాకర్ సింగ్ అనే మన సైనికులను చాటుమాటుగా దాడి చేసి చంపారు. యుద్ధం జరగడం లేదు, అందువల్ల చాటుమాటుగా హత్య చేయడం బీభత్స కలాపం. అలా హత్య చేసిన సుధాకర్ సింగ్ మృతదేహాన్ని ముక్కలు చేశారు, హేమరాజ్ తల నరికి తీసుకొని వెళ్లి పాకిస్తాన్‌లో ఊరేగించారు. తమ పాశవిక ‘విజయాన్ని’ చాటుకున్నారు. అప్పుడు మన ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వానికి తీవ్ర నిరసన తెలిపింది. పాకిస్తాన్ వెక్కిరించింది. మన ప్రభుత్వం ‘నేర నిరోధక సాయుధ ప్రక్రియ’కు పూనుకోలేదు. ‘రేఖ’ వద్ద వెలసిన పాకిస్తానీ స్థావరాలను ధ్వంసం చేయలేదు. మన ‘మెతక’ విధానం పాకిస్తాన్‌కు మరింత దురహంకారాన్ని కలిగించింది.
ఈ మెతక విధానం వల్ల లాభం లేదన్నది ఇప్పుడు మన ప్రభుత్వం మే తొమ్మిదవ తేదీ నాటి ‘ప్యునిటివ్ ఫైర్ అస్సాల్ట్’ల ద్వారా మరోసారి నిరూపించింది. తోడేళ్లకు నిరసన తెలపడం వల్ల అవి ఆవుల మందలలోకి దూరడం మానలేదు. తోడేళ్ల స్థావరాలను ధ్వంసం చేయడం వల్ల మాత్రమే అవి తోకముడిచి పారిపోతాయి. ఈ కరకు విధానాన్ని మన ప్రభుత్వం ఇప్పుడు పాటిస్తోంది. ‘పాకిస్తాన్ బార్డర్ యాక్షన్ టీమ్’కు చెందిన ప్రచ్ఛన్న బీభత్సకారులు మే ఒకటవ తేదీన ‘రేఖ’ దాటి వచ్చి పరమ్‌జిత్ సింగ్, ప్రేమసాగర్ అనే మన సైనికులను హత్యచేశారు, వారి భౌతికకాయాలను ముక్కలు చేసి పారిపోయారు. ఈ పైశాచిక నేరస్థులను దండించడంలో భాగంగానే మే తొమ్మిదవ తేదీన మన సైనికులు పాకిస్తానీ స్థావరాలను ధ్వంసం చేశారు. పాకిస్తానీలు మన జవానులను ఎదుర్కొనలేక తోకలను ముడుచుకొన్న తోడేళ్ల వలె పారిపోయారు. మన కరకు విధానం విజయవంతవౌతోంది. 2013 నుంచి ఇప్పటివరకూ పాకిస్తానీ ప్రచ్ఛన్న బీభత్సకారులు అనేకసార్లు ఇలా మన సైనికుల మృతదేహాలను ముక్కలుగా నరికారు. ఈ పాశవిక చర్యలకు సంతోషించే వారు పాకిస్తాన్ జనాభాలో ఎక్కువ శాతం ఉండడం ఈ దుశ్చర్యలకు మూలకారణం. రాజకీయ వేత్తలు, సైనికదళాల వారు పరస్పరం పోటీపడి జిహాదీ బీభత్సకాండను పెంపు చే స్తున్నారు. ప్రపంచం లో మరో మతం లేని విధంగా ఇస్లాంను ఏకైక మతంగా స్థాపించడం ‘జిహాద్’ లక్ష్యం! ఈ లక్ష్యసాధనకు జిహాదీలు అవలంబిస్తున్న మార్గాలు- అన్య మతస్థులను హత్య చే యడం, అన్య మతస్ధులను ఇస్లాంలోకి మార్పిడి చే యడం, ఇతర మతాల మహిళలను లైంగిక అత్యాచారాలకు గురి చేయడం, ఇతర మతస్థుల ధార్మిక సాంస్కృతిక కేంద్రాలను ధ్వంసం చేయడం, ఆస్తులను దోచుకొని వారిని తరిమి వేయడం... ఇలా జిహాదీ బీభత్సకాండ శతాబ్దులుగా స్వభావాత్మకమైనది, పాకిస్తాన్ మనుగడ దీనికి కొనసాగింపు..
మన సైనిక దళాలు ఇలా తమ దేశంలోని బీభత్స స్థావరాలను ధ్వంసం చేశాయన్న వాస్తవాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించడం లేదు. అంగీకరించినట్టయితే తమ దేశం ప్రజల దృష్టిలో తాము చులకన అయిపోతామని పాకిస్తానీ నియంతల భయం! ఈ నియంతలు ప్రధానంగా సైనిక అధికారులు. సైనిక అధికారుల అదుపాజ్ఞల్లో పనిచేస్తున్న ‘నాగరిక’ ప్రభుత్వం ‘అనాగరిక’ పద్ధతుల్లో ఈ మన ‘సాయుధ చికిత్స’- సర్జికల్ స్ట్రయిక్- లు జరగలేదని బుకాయిస్తోంది. 2016 సెప్టెంబర్‌లో మన దళాలు ‘రేఖ’దాటి వెళ్లి ఉగ్రవాదుల అడ్డాలను ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్ ఈ వాస్తవాన్ని అంగీకరించలేదు. మే తొమ్మిదవ తేదీన మన ప్రభుత్వం మూడోసారి జరిపిన ‘చికిత్స’ను పాకిస్తాన్ నిరాకరింప జాలదు. ఎందుకంటే ఈ దాడులను మన ప్రభుత్వం వీడియో తీసి విడుదల చేసింది. తాము కూడ భారత సైనిక స్థావరాలపై దాడులు చేసినట్టు పాకిస్తాన్ నకిలీ వీడియోను విడుదల చేసిందట!