మెయన్ ఫీచర్

అవస్థల వ్యవస్థపై దృష్టి సారిద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ సరిహద్దుల్లో ప్రాణత్యాగాలు చేసిన సైనికుల విషయంలో మాత్రం ఈ ‘లౌకికవాదులు’ స్పందించరు. మానవ హక్కుల కార్యకర్తల తీరు మరీ దారుణం. వారి దృష్టిలో తీవ్రవాదులు,
ఉగ్రవాదులు, మావోయిస్టులకు మాత్రమే మానవ హక్కులనేవిఉంటాయి. అందుకే
రాజ్యాంగాన్ని సమీక్షించాలని ఎంఎం షక్దర్ సూచిస్తున్నారు.

భారత రాజకీయాల్లో ఇప్పటి నేతల గురించి ఆలోచించే ముందు- ప్రస్తుత రాజకీయ పార్టీలపైన, పాలనపైన మనం తప్పక దృష్టి సారించాల్సిందే. మన రాజకీయ వర్గంపై సగటు పౌరుల్లో ఊహకందనంత విరక్త్భివం ఉందన్నది కాదనలేని కఠోర వాస్తవం. నేతల ప్రవర్తనలో అనేకానేక దుర్లక్షణాలు ఉండడమే ఇందుకు కా రణం. ఎన్నికల సమయంలో ఓటర్లను లోబరచుకునేందుకు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేయడం పరిపాటిగా మారింది. ఆ మధ్య తమిళనాడులో ఎన్నికలు జరిగినపుడు చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు ప్రబల తార్కాణం. ఒక్క తమిళనాడునే తప్పు పట్టలేం. మిగతా రాష్ట్రాలన్నీ న్యాయానికీ, నీతికి ప్రతీకలని భావించనక్కర్లేదు. ఎన్నికల్లో ఓటర్ల అభిమానాన్ని పొందలేని నాయకులు ఇవిఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లను నిందించడం తప్ప తమ ఓటమిని ఏ మాత్రం అంగీకరించరు. ఈ పరిస్థితి మన ఆధునిక రాజకీయ వ్యవస్థలో తాజా ‘తెగులు’కు నిదర్శనం.
దీనికితోడు అవినీతిపరులైన, అత్యాశపరులైన అధికారులు నడిపే పాలనా వ్యవస్థలో అడుగడుగునా బాధ్యతారాహిత్యం, స్పందించని తనం కనిపిస్తూనే ఉంటుంది. ఇక, నేరాలతో సంబంధం ఉన్న రాజకీయ నేతల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఆర్‌జెడి పార్టీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి వ్యవహారాలు బహిర్గతం కావడం రాజకీయ వ్యవస్థ పతనానికి పరాకాష్ఠ. జైలులో ఉన్న నేరస్థులు రాజకీయాలను శాసించడం కూడా ఇప్పుడు చూస్తున్నాం. ఓటు బ్యాంకును కైవసం చేసుకునేందుకు యోగ్యత లేని నేతలు చేస్తున్న వికృత విన్యాసాలూ చూస్తున్నాం. జనాదరణ పొందేందుకు అవలంబిస్తున్న చౌకబారు పద్ధతులు వీటన్నింటినీ మించి జనానికి జుగుప్సను కలిగిస్తాయి. ఇదీ నేటి రాజకీయ వ్యవస్థ ముఖచిత్రం. దీని నమూనాను మనం ఎలా మార్చగలం?
పాలనావ్యవస్థలో తమ అవసరాలు తీరాలని పౌరులు ప్రభుత్వం వైపు అదేపనిగా ఆశగా చూస్తున్నారు. కూడు, గూడు, గుడ్డ, ఉపాధి లాంటి కనీస అవసరాలే కాదు, మిగతా అవసరాలన్నీ ప్రభుత్వమే సమకూర్చాలని జనం తెగ ఆశిస్తున్నారు. కొంతమంది స్ర్తివాదులు ప్రభుత్వమే మహిళలందరికీ ‘శానిటరీ నా ప్కిన్’లను ఉచితంగా అందజేయాలంటారు. ‘ఉచిత వస్తువుల’ కోసం జనంలో ఎంతగా ఆరాటం పెరిగిందంటే- ‘కండోమ్’లను ఉచితంగా అందించే యంత్రాలను అందుబాటులో ఉంచాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వమే ఉద్యోగాలివ్వాలి. రైతులకు రుణాలన్నింటినీ మాఫీ చేయాలి. ‘ఊయల’ దశ నుంచి ‘సమాధి’ అయ్యే వరకూ అన్ని సందర్భాల్లో అందరి అవసరాలను ప్రభుత్వమే తీర్చాలి!
ఉచిత పథకాలు, జనం గొం తెమ్మ కోర్కెల గురించి తెలిశాక- ‘సంక్షేమ రాజ్యం’ గురించి కొం తమంది నిపుణులకు సందేహాలు వస్తుంటాయి. స్వయం ఉపాధి పరిధిని పెంచడంలో ప్రభుత్వం పాత్ర, బాధ్యత ఉం డొచ్చు. అయితే, ఏ వ్యక్తి కూడా ప్రభుత్వంపై కాని, అధికార వ్యవస్థపై కానీ ఆధారపడరాదు. ప్రభుత్వంపై ప్రజలు ఆధారపడినంత కాలం సుపరిపాలన అనేది అసాధ్యం. ‘ఏ వ్యక్తికీ చేపలు ఇవ్వొద్దు.. చేపలు పట్టడం నేర్పాలి’- అన్న చైనా సామెతను ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. క్షేత్రస్థాయి వాస్తవాలపై అవగాహన లేకుండా రాజకీయ పార్టీలు జనాకర్షక విధానాలను ప్రకటిస్తాయి. ఈ పార్టీలు పాలనాపగ్గాలు చేపడితే ఏం చేయాలో తోచక మరోసారి ఆ పథకాలను ఆశ్రయించే పరిస్థితి ఉండదు.
రాజకీయ పార్టీలపైన, పా లనపైన మనం దృష్టి సారించాలంటే మన రాజ్యాంగాన్ని కూడా ఓ సారి అవగతం చేసుకోవాలి. ఈ మాటలు కొంతమందికి ‘దైవ దూషణ’లా ధ్వనించవచ్చు. ఈ దేశంలో పురాణాలను, ఇతిహాసాలను తిరగరాయవచ్చు. కానీ, రాజ్యాంగాన్ని మాత్రం ముట్టుకోలేరు!
వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో- ‘సమగ్రతను ప్ర శ్నించలేని’ జస్టిస్ వెంకటాచలయ్య నేతృత్వంలో రాజ్యాంగాన్ని మరోసారి సమీక్షించేందుకు ఓ కమిటీని నియమించారు. అయితే, అ ప్పడు కొంతమంది అరచి గగ్గోలు పెడుతూ ‘రాజ్యాంగాన్ని కాషారుూకరణ’ చేస్తున్నారని నిందారోపణలు చేశారు. రాజ్యాంగాన్ని సవరించడానికి మనకు ఎలాంటి సంకోచాలు ఉండనక్కర్లేదు. కాలానుగుణంగా, క్షే త్రస్థాయిలో వాస్తవాల మేరకు రాజ్యాంగాన్ని ఎన్నిసార్లయినా సవరించుకోవచ్చు.
రాజ్యాంగం అంటే ఆర్టికల్స్, క్లాజులు, సబ్ క్లాజులు, న్యాయసూత్రాల సమాహారం కాదు. కాలానుగుణంగా, అవసరాల ప్రాతిపదికగా రా జ్యాంగంలో మార్పులు చేసే వీలుంది. ఏవైనా అవరోధాలుంటే వాటిని అధిగమించేందుకు, జాతి ప్రతిష్ఠను పెంచుకునేందుకు రాజ్యాంగాన్ని మార్చుకోవడంలో తప్పులేదని దిల్లీ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం మాజీ ప్రొఫెసర్ ఎంఎం షక్దర్ రాసిన ‘డొమస్టిక్ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్’ పుస్తకంలో పేర్కొన్నారు. సుపరిపాలనకు ‘స్వదేశీ రాజ్యాంగం’ అవసరమని కూడా ఆయన ప్రతిపాదించారు. ఇలాంటి రాజ్యాంగం- స్వార్థ రాజకీయాలకు, పక్షపాత ధోరణులను దూరంగా ఉండాలి, దేశభక్తికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. విధానాల రూపకల్పన, సుపరిపాలన విషయాల్లో రాణించాలంటే రాజకీయ యంత్రాంగంలో పరిశుద్ధత అవసరం.
కానీ, నేడు ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. దేశభక్తి అన్నది ఇపుడు ఓ ‘మురికి’ పదం. జాతీయత గురించి మాట్లాడితే- మనకు వెక్కిరింతలే ఎదురవుతాయి. ‘లౌకికవాదులు’ ఎంతగా తెగిస్తున్నారంటే- వారు మనదేశ ప్రయోజనాలను కాదంటూ పాకిస్తాన్‌ను సమర్థిస్తుంటారు. కశ్మీర్ వివాదంపై ఇటీవల జరిగిన సమావేశంలో వేర్పాటువాదులు, జిహాదీ మద్దతుదారుల మాటలే ఇందుకు నిదర్శనం. వేర్పాటువాదుల ఎజెండా తెలిశాక- ఆ సమావేశంలో సాధారణ ఎజెండాను చర్చించే అవకాశం ఎక్కడ? ఇలాంటి వేర్పాటువాదులే దిల్లీలోని జెఎన్‌యులో దర్శనిమిస్తూ కన్నయ్యకుమార్ లాంటి దేశద్రోహులను సమర్థిస్తుంటారు. దేశ సరిహద్దుల్లో ప్రాణత్యాగాలు చేసిన సైనికుల విషయంలో మాత్రం ఈ ‘లౌకికవాదులు’ స్పందించరు. మానవ హక్కుల కార్యకర్తల తీరు మరీ దారుణం. వారి దృష్టిలో తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మావోయిస్టులకు మాత్రమే మానవ హక్కులుంటాయి. అందుకే రాజ్యాంగాన్ని పునః సమీక్షించాలని ఎంఎం షక్దర్ సూచిస్తున్నారు. కేవలం రాజకీయ నాయకులు, లాయర్లు, న్యాయమూర్తులు మాత్రమే రాజ్యాంగం గొప్పదనం గురించి మనకు చెబుతుంటారు. సాధారణ జనం మాత్రం రాజ్యాంగంలోకి తొంగి చూడరు, దాని నుంచి స్ఫూర్తిపొంది ఏమీ మాట్లాడరు. శక్తిశీలమైన రాజ్యాంగం లేనంతకాలం మేలైన రాజకీయ వ్యవస్థ, సుపరిపాలన అనేవి సాధారణ జనానికి సుదూర స్వప్నాలే!
*

సెల్ : 80083 22206