సంపాదకీయం

రాజిల్లిన రామ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్టప్రతి పదవికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బిహార్ ‘రాజ్యపాల్’-గవర్నర్-రామనాథ్ కోవిద్ ఎంపిక కావడం అద్భుతమైన పరిణామం! భాజపా అభ్యర్థి ఆధికారికంగా ‘జాతీయ ప్రజాస్వామ్య సంఘటన’- నేషనల్ డెమోక్రాటిక్ పార్టీ-ఎన్‌డిఏ-అభ్యర్థి. అందువల్ల రామ్‌నాథ్ కోవిద్ మన దేశానికి పదునాలుగవ రాష్టప్రతిగా ఎంపిక కావడం కేవలం లాంఛనం. ఎన్‌డిఏకు రాష్టప్రతిని ఎన్నుకునే ‘వరణ సమితి’లో ఆధిక్యం ఉంది, పార్లమెంటు ఉభయసభల సభ్యులు, రాష్ట్రాల శాసనసభ్యులు ఈ ‘వరణ సమతి‘ -ఎలక్టోరల్ కాలేజ్-లో సభ్యులు. ఎన్‌డిఏలో లేని ‘తెలంగాణ రాష్ట్ర సమితి’-తెరాస, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వంటి రాజకీయ పక్షాలు సైతం రామ్‌నాథ్ కోవిద్‌కు మద్దతు ప్రకటించడం ‘అధికస్య అధికం బలమ్’ అన్న నానుడికి అనురూపం. 1950 జనవరి 26న నూతన స్వతంత్ర భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. మొదటి రాష్టప్రతి రాజేంద్రప్రసాద్ బిహార్‌కు చెందినవాడు. ఇప్పుడు రాష్టప్రతి కానున్న రామ్‌నాథ్ కోవిద్ బిహార్ ‘రాజ్యపాల్’గా పనిచేస్తున్నాడు. మహనీయుల మధ్య సామ్యం కుదరడం చారిత్రక పునరావృత్తికి చిహ్నం! రాజేంద్రప్రసాద్ నిరాడంబరుడు, రైతుబిడ్డ! రామ్‌నాథ్ కోవిద్ ఆడంబరం లేని రాజకీయ జీవనుడు, వ్యవసాయ కుటుంబంలో పుట్టినవాడు, తరతరాలుగా ‘ఉపేక్ష’కు గురైన సామాజిక సముదాయానికి చెందినవాడు! రాజేంద్రప్రసాద్ రాజ్యాంగ కోవిదుడు, రాజ్యాంగ రచన కోసం ఏర్పడిన ‘సభ’కు అధ్యక్షుడు. 1992లో రాష్టప్రతి పదవికి ఎన్నికైన డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ రాజ్యాం గ కోవిదుడు. ఇప్పుడు మళ్లీ మరో రాజ్యాంగ కోవిదుడు రాష్టప్రతి కా నున్నాడు! ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన రామ్‌నాథ్ కోవిద్ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేయడం ఆ యన రాజ్యాంగ పటిమకు నేపథ్యం! ప్రధానమంత్రి మోదీ చెప్పినట్టు రాజ్యాంగ కోవిదుడైన రామ్‌నాథ్ రాష్టప్రతి కావడం ఆయన విజ్ఞాన పటిమ ప్రభుత్వానికి, దేశానికి ఉపకరిస్తుంది. దళిత, వెనుకబడిన సామాజిక జన సముదాయాల సంక్షేమం అభ్యుదయం మరింతగా వికసించడానికి దోహదం చేస్తుంది! రెండుసార్లు రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికైనప్పటికీ, ‘్భజపా’ దళిత విభాగం అధ్యక్షుడిగా, ‘్భజపా’ అధికార ప్రతినిధిగా పని చేసినప్పటికీ రామ్‌నాథ్ కోవిద్ జాతీయ స్థాయిలో ప్రసిద్ధుడు కాలేదు, ఆర్భాటం, ఆడంబరం నిండిన ప్రచారానికి దూరంగా ఉండాలన్న జాతీయతా నిష్ఠ ఆయన ప్రవృత్తి కావడం ఇందుకు కారణం. ఈ నిష్ఠ ఆయనలో చిన్నప్పటి నుంచి వికసించింది. ప్రసిద్ధిని కోరని విశుద్ధుడు ఈ రాజ్యాంగ కోవిదుడు. ఇదీ సోమవారం నాటి అద్భుత పరిణామానికి నేపథ్యం...
రాష్టప్రతి పదవికి అభ్యర్థిగా ఎంపిక అయ్యే వరకు క్రియాశీల రాజకీయవేత్తలుగా చెలామణి కావడం మన రాజ్యాంగ చరిత్రలో కొనసాగుతున్న సంప్రదాయం. క్రియాశీల రాజకీయవేత్తలు కాని వారు, అసలు రాజకీయ వేత్తలు కాని వారు రాష్టప్రతి పదవికి ఎన్నిక కావడం నాటినుండి నేటి వరకు కొనసాగుతున్న మరో ప్రథాన సమాంతర సంప్రదాయం! రామ్‌నాథ్ కోవిద్ ఈ రెండవ సమాంతర సంప్రదాయానికి మరో ప్రతినిధి! రాష్టప్రతి పదవికి ఎన్నికయ్యే వరకు క్రియాశీల రాజకీయాలలో ఉన్నవారు నిష్పక్షపాతంగాను, సర్వ స్వతంత్రంగాను ఈ సర్వోన్నత రాజ్యాం పదవిని నిర్వహించరని కాని, నిర్వహించలేరని కాని చెప్పడం సరికాదు! కాని క్రియాశీల రాజకీయవేత్తలు కాని మేధావులు, శాస్తవ్రేత్తలు రాజ్యాంగ కోవిదులు రాష్టప్రతి పదవికి మరింత వనె్న తెస్తారన్నది సర్వ సాధారణ జనాభిప్రాయం! 1945లో జన్మించిన రామ్‌నాథ్ కోవిద్ 1994 వరకు అంటే నలబయి తొమ్మిదేళ్ల వయసు వచ్చే వరకు ప్రధానంగా న్యాయవాది! ఆ తరువాత కూడ ఆయన ‘ఎన్నికల’ రాజకీయాల-ఎలక్టోరల్ పాలిటిక్స్-లో ప్రసిద్ధుడు కాలేదు. 2015లో గవర్నర్ పదవిని చేపట్టిన తరువాత ఆయన రాజకీయాలకు దూరం అయ్యాడు, వివాదాలకు గురి కాలేదు, వివాదాస్పదమైన అనవసరమైన ప్రచారానికి లోను కాలేదు. ఇదీ సోమవారం నాటి అద్భుత పరిణామానికి నేపథ్యం.
మొదటి రాష్టప్రతి రాజేంద్రప్రసాద్ స్వాతంత్య్ర ఉద్యమ వీరుడు, రాజకీయాలకు అతీతుడైన ‘జాతీయ మహాపురుషుడు’-స్టేట్స్‌మన్-! రెండవ రాష్టప్రతిగా 1962లో ఎన్నికయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యావేత్త, దౌత్యవేత్త. 1967లో రాష్టప్రతి అయిన డాక్టర్ జాకీర్ హుస్సేన్ కూడ క్రియాశీల రాజకీయవేత్త కాదు. 1969లో గద్దెనెక్కిన వరాహగిరి వేంకటగిరి అనేక ఏళ్ల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న తరువాతనే రాష్టప్రతిగా ఎన్నికయ్యాడు. ఆయన రాజకీయ పక్షాల అభ్యర్థిగా కాక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం ఈ చరిత్రలో మరో అద్భుతం. కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తుండిన కాంగ్రెస్ అభ్యర్థిని-నీలం సంజీవరెడ్డిని-ఆయన పరాజయం పాలు చేశాడు! అధికారపక్షం అభ్యర్థి ఓడిపోవడం అరవై ఏడేళ్ల రాజ్యాంగ చరిత్రలో అద్వితీయ పరిణామం! క్రియాశీల రాజకీయవేత్తలు రాష్టప్రతి కావడానికి 1974 నాటి ఫకృద్దీన్ అలీ అహ్మద్ ఎ న్నిక శ్రీకారం. సంజీవరెడ్డి-1977-, జ్ఞానీ జైల్‌సింగ్-1982, ఆర్ వెంకట రామన్-1987, ప్రతిభాదేవీ సింగ్ పాటి ల్-2007-, ప్రణవ్‌ముఖర్జీ-2012- వంటి వా రు రాష్టప్రతి పదవికి ఎన్నికైన క్రియాశీల రాజకీయ వేత్తలు. డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ-1992-అనేక ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న తరువాత రాష్టప్రతి అయ్యారు. కె.ఆర్.నారాయణన్-1997-దౌత్యవేత్త! భారత అణువిజ్ఞాన పాటవానికి అంతర్జాతీయ ప్రతిష్ఠను సముపార్జించగలిగిన అబ్దుల్ కలాం-2002- రాజకీయ స్పర్శ లేని విలక్షణ రాష్టప్రతి! రాష్టప్రతి పదవిని అధిష్ఠించిన క్రియాశీల రాజకీయ వేత్తలలో అత్యధికులు ప్రధాన మంత్రికి ‘రబ్బర్ స్టాంప్’లగానో, వివాదాలను సృష్టించిన అధినేతలుగానో ఆరోపణలకు గురి కావడం చరిత్ర! ఇలాంటి చరిత్రకు అపవాదం డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ లాంటివారు! అందువల్ల రామ్‌నాథ్ కోవిద్ కూడ డాక్టర్ శర్మ వలె సర్వ స్వతంత్ర రాష్టప్రతిగా నిష్పాక్షికంగా రాష్టప్రతి పదవిని నిర్వహించగలడని ఆశించడం అతార్కికం కాదు.
గతంలో అధికారంలో ఉన్నప్పుడు ‘్భజపా’ అబ్దుల్ కలాంను రాష్టప్రతిని చేసింది! పార్టీకి చెందిన ప్రముఖులకు పదవిని భాజపా కట్టబెట్టలేదు. ఇప్పుడు మళ్లీ అదే విలక్షణ రీతిలో రాజకీయ వేత్తగా కాక జాతీయ నిష్ఠ కల రాజ్యాంగ కోవిదుడుగా పేరుకన్న కోవిద్‌ను అత్యున్నత పదవికి ఎంపిక చేసింది! ప్రతిపక్షాలు సైతం అంగీకరించదగిన ఎంపిక ఇది. కానీ ప్రతిపక్షాలు ప్రధానంగా మార్క్సిస్టులు, కాంగ్రెస్ వారు అంగీకరించే సూచనలు లేవు. అబ్దుల్ కలాంనే 2002లో వ్యతిరేకించిన వారు కోవిద్‌ను కాదనడం ఆశ్చర్యం కాబోదు! కానీ ‘వ్యతిరేకత’ నిష్ప్రయోజనం, కోవిద్ ఎన్నిక ఖాయం.