సంపాదకీయం

వ్యవసాయ ‘వైరుధ్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయదారుల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తుండడం, ‘అన్నదాతలు’ ఆత్మహత్యలకు పాలుపడుతుండడం గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న సమాంతర పరిణామాలు! వ్యవసాయ రంగంలో దేశమంతటా నెలకొని ఉన్న వైరుధ్యాలలో ఇది ఒక్కటి మాత్రమే! రైతులు చెల్లించవలసిన ఋణాలను చెల్లించనక్కరలేదని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ధారించాయి. ఋణాలు చెల్లించనవసరం లేనప్పటికీ వ్యవసాయదారులకు ప్రతి ఋతువు -సీజన్-లోను పంట పెట్టడానికి కొత్త ఋణాలు అవసరమవుతున్నాయి. ఈ కొత్త ఋణాలను మంజూరు చేయకుండా ‘బ్యాంకులు’ మొరాయిస్తున్నట్టు వార్తలు ప్రచారం అవుతున్నాయి! ఈ ఏడాది వర్షాకాలం-ఖరీఫ్-పంటలు పెట్టే తరుణం సమీపించింది, ఆర్ధ్ర పునర్వసు కార్తెల-జూన్ జూలై-లో విత్తుకోవలసిన వారికి కొత్త ఋణాలు ఇంకా అందడంలేదట! ఋణాలను రద్దు చేయడంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు మార్గదర్శకత్వం వహించడం ముదావహం, తెలుగు రాష్ట్రాలు చెల్లించవలసిన ఋణాలను రద్దు చేసిన తరువాత ఇటీవల ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడ రైతుల ఋణాలను రద్దు చేశాయట! రైతులు సహకార బ్యాంకులనుంచి తీసుకున్న యాబయి వేల రూపాయల ఋణాలను చెల్లించనక్కరలేదని కర్ణాటక ప్రభుత్వం బుధవారం నిర్ణయించిందట! ఋణాలు రద్దయిన రాష్ట్రాలలోను, రద్దుకాని రాష్ట్రాలలోనుకూడ రైతులు ఆత్మహత్యలు ఎందుకని చేసుకుంటున్నారు ? ఋణాల మాఫీ వల్ల రైతుల సమస్యలు తొలగినట్టయితే ఈ ఆత్మహత్యలు ఆగిపోవాలి, ఆగడంలేదు! ఆత్మహత్యలకు పాలుపడవద్దని తెలంగాణ ప్రభుత్వం ఎందుకని రైతులకు హితవు చెప్పవలసి వచ్చింది! ఋణాలను రద్దు చేయడంతోపాటుగా ఉచితంగా ఎఱువులను కూడ సరఫరా చేయనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి ఉంది. ఇందుకోసం ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున ప్రతి రైతుకు ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం చెప్పి ఉంది. ఈ పాటికి ఈ నగదు రైతుల బ్యాంకు ఖాతాలలోకి జమ అయి ఉంటుంది కూడ! పంటలను ‘బీమా’ చేయించడాన్ని కూడ తెలంగాణ ప్రభుత్వం ఆరంభించిందట! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ వ్యవసాయానికి గొప్పప్రాధాన్యం ఇస్తోంది. ‘ఏరువాక పౌర్ణమి’ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఈ ప్రాధాన్యంలో భాగం!
ఇంత జరుగుతున్నప్పటికీ నష్టాలలో ఉన్న రైతులు ఎందుకని గట్టెక్కడంలేదు? దేశవ్యాప్తంగా రైతులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఎందుకని నిర్వహిస్తున్నారు? మరోపక్క ఆత్మహత్యలు కొనసాతూనే ఉన్నాయి. ఉత్తరఖండ్‌లో ఒక రైతు ఆత్మహత్య చేసుకొనడం సరికొత్త విషాదం. పదకొండురోజులలో మధ్యప్రదేశ్‌లో పనె్నండుమంది రైతులు ఆత్మహత్యలకు పాలుపడినట్టు ప్రచారమైంది. ఆత్మహత్యకు కారణం తీర్చలేకపోయిన ఋణం కాకపోచ్చునని ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ వ్యాఖ్యానించాడట! ఉత్తరఖండ్‌లో రెండు శాతం వడ్డీకి లక్ష రూపాయల వరకు ఋణం రైతులకు బ్యాంకుల ద్వారా లభిస్తోందట! అధిక వర్షాలవల్ల, పిడుగులు పడడంవల్ల, అనావృష్టి వల్ల, నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోవడం సహజం! కానీ శ్రమించి అత్యధిక ఉత్పాదకతను సాధిస్తున్న రైతులు నష్టపోతున్నారు. ప్రతి ‘ఖరీఫ్’లోను ‘రబీ’లోను పంటలు కోతకు వచ్చినప్పటినుంచి రైతులు నష్టానికి తమ ఉత్పత్తులను తెగనమ్ముకునే వరకూ టోకు వ్యాపారులు ధరలను తగ్గించి రైతులను కొల్లగొడుతున్నారు. కందులు, మిరపకాయలు, పత్తి...ఇంకా ఇంకా అనేక పంటలు కోతకు రాగానే ధరలు భయంకరంగా దిగజారడం ఈ ఏడు కూడ జరిగిన ప్రహసనం! కానీ వినియోగదారులు పట్టణాలలో నగరాలలో కొంటున్న ఇదే ఉత్పత్తుల ధరలు తగ్గినట్టు తగ్గి వెంటనే పెరుగుతున్నాయి! ‘వ్యవసాయం’లో మాత్రమే కాదు, వ్యవస్థల మొత్తం ఆర్థిక వ్యవస్థలో నిహితమై ఉన్న వైరుధ్యాలు ఇవి!
ఆహారం, ఉత్పత్తి దేశమంతటా పెరిగిన నేపథ్యంలో ‘అన్నపూర్ణ’ అయిన దక్షిణ దేశపు ధాన్యాగారమైన ఆంధ్రప్రదేశ్‌లో ఆహారం కొరత ఏర్పడిందట! పత్తి, పొగాకు వంటివి ఆహార ధాన్యాలు పండించిన క్షేత్రాలలో విపరీతంగా పండుతున్నాయి కాబోలు...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచినీరు దొరకడంలేదు మంచి ‘బీరు’ మాత్రం బాగా దొరుకుతోంది..’ అని పదిహేను సంత్సరాల క్రితం ఒక స్వాతంత్య్ర సమ రయోధుడు వ్యాఖ్యానించాడట! ప్రవర్ధమాన దేశాలలో తిండికొరతను సృష్టించడమన్నది ప్రపంచీకరణ వాస్తవం! ఇలా తిండి గింజల కొరత ఏర్పడిన మన దేశం వంటి ప్రవర్ధమాన దేశాలు సంపన్న దేశలనుంచి పుచ్చిన కందులను ముక్కిన బియ్యాన్ని దిగుమతి చేసుకోవాలి! ఇది కేవలం ‘ప్రచారమని’ ప్రచారం చేసినవారు ముక్కుమీద వేళ్లను వేసుకోవాల్సిన స్థితి ఏర్పడింద! ‘సిరిసిటీ’-శ్రీనగరంలో ‘పెప్సీ’వంటి విదేశీయ బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ అతి పెద్ద శీతల పానీయాల ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించడం ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం ఉత్పత్తి తగ్గిపోవడానికి నేపథ్యం. దాదాపు ఇరవై లక్షలు ఎకరాలలో వరి పండిన అవశేష ఆంధ్రప్రదేశ్ గత ఏడాది ఈ విస్తీర్ణం దాదాపు పదమూడు లక్షల ఎకరాలకు తగ్గిపోయిందట! అందువల్ల తెలంగాణలోను దేశంలోని ఇతర ప్రధాన ఉత్పాదక ప్రాంతాలలోను వరి ఉత్పత్తులు పెరిగినప్పటికీ నవ్యాంధ్రప్రదేశ్‌లో వరిపంట తగ్గిపోయింది! బియ్యాన్ని తెలంగాణ నుంచి సరఫరా చేసుకోవాలట..వర్షాభావం, నీటి సరఫరా తగ్గడం ఒక కారణం కావచ్చు! మరో కారణం ‘బిటి’ పత్తి వంటివి వరి భూములను ఆక్రమించడం.
ఇలాంటి అంతర్గత వైరుధ్యాలు విస్తరించడానికి ‘ప్రపంచీకరణ’ వౌలిక ప్రాతిపదిక! ఏ రాష్ట్ర ప్రభుత్వాన్నీ ప్రత్యేకించి తప్పు పట్టడానికి వీలులేదు., ఎందుకంటే ‘ప్రపంచీకరణ’ శక్తులు బంగారు జింకలవలె ప్రభుత్వాలను ప్రజలను సైసతం మాయాజాలంలో ముంచెత్తుతున్నాయి! ప్రతి అనర్థానికి పైకి కనిపిస్తున్న కారణం వేఱుకావచ్చు! కానీ ప్రపంచీకరణ ప్రభావం చాపకింది విషంలాగా వ్యవసాయ రంగాన్ని ముంచెత్తుతోంది, నకిలీ విత్తనాలు, కల్తీ ఎఱువులు, అంతరించిపోతున్న అడవులు, కుంచించుకొని పోతున్న పంట పొలాలు-ఇవీ ఇంకెన్నో విపరిణామాలు ‘ప్రపంచీకరణ’ వల్ల ఏర్పడిపోయిన వైపరీత్యాలు.