సంపాదకీయం

అమెరికా ఆత్మీయత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండ, వాన కలసివచ్చినట్టయింది, ఎండ కా స్తుండగానే వాన కురవడం.. తిలకించే వారికి ఒక తీయని అనుభూతి! ఎవరు ఎండ? ఎవరు వాన? అన్నది ప్రధానం కాదు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఆ దేశపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలుసుకోవడం గ్రీష్మతాపం, హర్షవర్షం ఒకే చోట సంగమించిన విలక్షణ దృశ్యం! ఇదీ ప్రధానమైన పరిణామం.. ఈ దృ శ్యాన్ని ప్రపంచ సమాజం వేల వేల కన్నులతో తిలకించింది, చైనా ప్రభుత్వం మరింత పెద్ద కళ్లతో వీక్షించింది! ‘పారిస్ పర్యావరణం’ ఒప్పందం వల్ల ఏర్పడిన పరిరక్షణ వ్యవస్థ నుంచి అమెరికా వైదొలగిపోవడం నరేంద్ర మోదీ,ట్రంప్‌ల తొలి ఆధికారిక సమావేశానికి సమీప నేపథ్యం. భారతీయులకు అమెరికాలో శాశ్వత ప్రవేశ అనుమతి పత్రాలు- హెచ్-1బి వీసాలు- ఇవ్వడంలో అమెరికా పెడుతున్న ఇబ్బందు లు కొనసాగుతున్న నేపథ్యం.. చైనా నాయకత్వంలోని ‘షాంఘయి కూటమి’లో అక్కరలేని సభ్యత్వాన్ని మనం పుచ్చుకొనడం భారత-అమెరికా మైత్రికి విచిత్ర నేపథ్యం.. మన సిక్కింలోకి చైనా దళాలు చొరబడి మన స్థావరాలను ధ్వంసం చేశాయన్న సమాచారం సోమవారం ప్రచారం కావడం ‘మోదీ-ట్రంప్’ల సమావేశానికి సమాంతర పరిణామం! అందువల్లనే చైనా మరింత పెద్ద కళ్లతో ‘మోదీ-ట్రంప్’ల సమావేశాన్ని గురి చూసింది. కైలాస మానస సరోవర యాత్రకు వెడుతుండిన దాదాపు యాబయిమంది మన యాత్రికులను ‘నాధులా కనుమ’ వద్ద చైనా దళాలు ఆపివేసినట్టు కూడ ప్రచారమైంది. వియత్నాంకు తూర్పుగాను, తమ దే శానికి దక్షిణంగాను ఉన్న సముద్ర ప్రాం తాన్ని కల్లోలగ్రస్తం చే యవద్దని మన దేశా న్ని, అమెరికాను చైనా ప్రభుత్వం హెచ్చరించడం మోదీ వాషింగ్టన్ సందర్శనకు మరో సమాంతర పరిణా మం. ‘మోదీ-ట్రంప్’ చర్చల తరువాత జరిగిన ప్రధాన నిర్ణయం- అంతర్జాతీయ ‘ఇస్లామీ జిహాదీ బీభత్సకాండ’- ఇస్లామిక్ రాడికల్ టెర్రరిజమ్-ను ఉ మ్మడిగా అణచివేయడం. ఈ నిర్ణయం పాకిస్తాన్‌కు ప్రత్యక్ష అభిశంసన, చైనాకు పరోక్ష అభిశంసన! ‘సమావేశం’ జరగడానికి ముందే ‘హిజ్‌బుల్ ముజాహిదీన్’ అన్న జిహాదీ ముఠాలోని మొదటి హంతకుడు సయ్యద్ సలాహుద్దీన్‌ను అమెరికా ఆధికారికంగా ‘బీభత్సకారుడ’ని గుర్తించడం పాకిస్తాన్‌కు చెంపపెట్టు! కానీ సలాహుద్దీన్, సరుూద్ హఫీజ్, మఝార్ అసూద్ వంటి పాకిస్తాన్ ప్రేరిత బీభత్సకారులను చైనా అంతర్జాతీయ వేదికలపై వెనకేసుకొస్తోంది. అందువల్ల సయ్యద్ సలాహుద్దీన్‌ను ‘ప్రత్యేక తరగతికి చెందిన అంతర్జాతీయ ఉగ్రవాది’- స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్- ఎస్‌డిజిటి-గా అమెరికా ప్రభుత్వం గుర్తించడం చైనాకు కూడ చెంపపెట్టు! భారత్, జపాన్‌లతో కలసి తమ దేశం హిందూ మహాసముద్రంలో త్వరలో సమష్టి నౌకాదళ విన్యాసాలను నిర్వహించనున్నట్టు నరేంద్ర మోదీతో చర్చలు జరిపిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం చైనా వ్యూహాత్మక దురాక్రమణ పట్ల ఉమ్మడి అభిశంసన!
వాషింగ్టన్‌లోని ‘్ధవళ గృహం’- వైట్ హౌస్- ప్రాంగణంలో మోదీ, ట్రంప్ మొదట కరచాలనం చేశారు. ఆ తర్వాత పరస్పరం ఆలింగనం చేసుకున్నా రు. ఇలా రెండు దేశాల ప్రభుత్వాధినేతలు పరస్పరం కౌగిలించుకోవడం అరుదైన సంప్రదాయం, అమెరికా అధ్యక్షుని విషయంలో మరీ అరుదు.. ఈ ఆలింగనం వల్ల ఉభయ దేశాల మధ్య ఆత్మీయ భావం మరింతగా వికసించగలదన్నది జరుగుతున్న ప్రచారం. వికసిస్తుందా? విస్తరిస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఉభయ దేశాల విధానాలలో ప్రస్ఫుటించవలసి ఉంది. మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అమెరికా జనాభా ప్రాతిపదికగా రెండవ పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ఉభయ దేశాలు మిత్రదేశాలుగా ఉండడం ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు కావడానికి దోహదకరం. ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థ- వరల్డ్ డెమొక్రాటిక్ ఆర్డర్- సమగ్రంగా వికసించే కొద్దీ జిహాదీ ఉగ్రవాదం వంటి వైవిధ్య విధ్వంసక ప్రమాదాలు అంతరించి పోగలవు. ప్రజాస్వామ్య వ్యవస్థ వౌలిక లక్షణం వైవిధ్యాల పరిరక్షణ. మత విద్వేష జిహాదీ ఉగ్రవాదం చీకటి, ప్రజాస్వామ్యం వెలుగు!
రెండు ప్రజాస్వామ్య దేశాల ప్రభుత్వాధినేతల మధ్య జరిగిన చారిత్రక సమావేశానికి ప్రజాస్వామ్యం ప్రధాన ప్రాతిపదిక కావడం సహజం. ప్రజాస్వామ్యానికి, ప్రపంచ ప్రజలకు ప్రబల శత్రువైన ‘ఇస్లామీ జి హాదీ బీభత్సకాండ’- రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజమ్ -పై ఉభయ దేశాలు ఉమ్మడిగా పోరాడాలన్న కృత ని శ్చయాన్ని ట్రంప్ వ్యక్తం చేయడం మోదీ యాత్రకు ఫలశ్రుతి! పాకిస్తాన్ ఇతర దేశాలకు వ్యతిరేకంగా ‘ఉగ్రమృగాలను ఉసిగొల్పరాద’ని మోదీ, ట్రంప్ ప్రకటించడం మన దౌత్యానికి విజయం. ముంబయిలోను, పఠాన్‌కోట్‌లోను, మన దేశంలోని ఇతర చోట్ల మారణకాండ జరిపిన బీభత్సకారులను పట్టి శిక్షించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరడం మోదీ, ట్రంప్‌ల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం. ఏకాభిప్రా యం ఉన్న అంశాలను మాత్రమే శిఖర చర్చలలో ప్రస్తావించాలన్న ది బహుశా ఉభయ దేశాలకు ముందుగానే కుదిరిన అవగాహన! ఏ కాభిప్రాయం ఉన్న అం శం- బీభత్సకాండను నిర్మూలించడం. అందువల్ల శిఖర చర్చలకు ఇదొక్కటే ప్రాతిపదిక అయింది. ఇలా కావడం నిజానికి బీభత్సకాండ నిర్మూలనకు ఉభయ దేశాలు ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం. ప్రత్యక్ష బీభత్స రూపం పాకిస్తాన్, ప్రచ్ఛన్న బీభత్స రూపం చైనా! చైనా-పాకిస్తాన్‌ల కూటమి ఆసియాలో వ్యూహాత్మక దురాక్రమణకు ప్రతీక. ‘్భరత, అమెరికా, జపాన్’ కూ టమి ఏర్పడడం ఒక్కటే ఈ దురాక్రమణకు ప్రతిఘటన కాగలదు. ఈ విశ్వాసం భారత, అమెరికాల మ ధ్య మరింత బలపడడం మోదీ పర్యటన ఇతివృత్తం. మోదీకి స్వాగతం చెప్పడమే కాదు, ఆయనను ‘వైట్ హౌస్’లోని పాలనా విభాగంలోకి మాత్రమే గాక తన వ్యక్తిగత నివాస భవనంలోకి తీసుకొని వెళ్లి ట్రంప్ చూపించడం పరస్పర విశ్వాసానికి సాక్ష్యం!
పాకిస్తాన్‌కు ఇప్పటికీ దీర్ఘకాల ప్రణాళిక కింద అమెరికా ప్రభుత్వం ‘ఆయుధ ఆర్థిక సహాయం’ అందజేస్తోంది. అమెరికా బీభత్స వ్యతిరేక విధానంలోని ప్రధాన వైరుధ్యం ఇది. ఈ ‘సహాయాన్ని’ పూర్తిగా నిలిపివేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం త్వరలోనే ప్రకటించవచ్చునన్నది మన ప్రభుత్వ విశ్వాసం. అమెరికాలోని భారతీయ సంతతి ప్రజల సమావేశంలో మోదీ చేసిన ప్రసంగంలో ఈ విశ్వాసం ధ్వనించింది. బీభత్సకాండను నిర్మూలించడానికి మన దేశం సాగించే సమరాన్ని ప్రపంచ దేశాలు ఆపజాలవని మోదీ స్పష్టం చేయడం మన విజయ విశ్వాసం. ‘్భరత్‌లో నిర్మించండి’ అన్న స్వయం సమృద్ధ ఆర్థిక విధానానికి మరింత విస్తృతి ఈ స్వాభిమాన రక్షణ విధానం.. అమెరికా తోడై నిలవడం మరింత బలం!