సంపాదకీయం

నకిలీ ‘స్వచ్ఛందం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల- నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్-ను నియంత్రించడాని కి వీలుగా ప్రత్యేకమైన చట్టం ఇంతవరకు రూపొందకపోవడం సర్వోన్నత న్యాయస్థానం బుధవారం సంధించిన ప్రశ్నకు నేపథ్యం. ‘ప్రత్యేకమైన చ ట్టాన్ని రూపొందించాలని భావిస్తున్నారా? లేదా?’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్.ఖేహర్, న్యాయమూర్తి వై.వి.చంద్రచూడ్ ప్రశ్నించారు! ఈ చట్టాన్ని రూపొందించాలా? వద్దా? అన్న విషయమై నాలుగు వారాలలోగా నిర్ణయించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించిందట! ‘స్వచ్ఛంద సేవ’ పేరుతో చెలామణి అవుతున్న లక్షలాది ప్రభుత్వేతర సంస్థలలో అధిక శాతం ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి మాత్రమే అవతరించి ఉన్నట్టు నిగ్గు తేలిన తరువాత ఈ ప్రత్యేకమైన-స్టాండ్ అలోన్ లా-చట్టాన్ని రూపొందించడం అనివార్యం అయిపోయింది. గత మూడేళ్లుగా ‘స్వచ్ఛంద సంస్థల’ స్వరూప స్వభావాలపై ప్రభుత్వ నిఘా పెరిగింది. వాటి కార్యకలాపాలపై నియంత్రణ పెరిగింది. ఫలితంగా ‘స్వచ్ఛందం’ ముసుగు వెనుక దాగిన సంస్థల విముఖాలు, విద్రోహ రూపాలు బట్టబయలు అయిపోతున్నాయి. ‘సమాజసేవ’ చేయాలన్న స్వచ్ఛంద సంకల్పంతో పనిచేస్తున్న ‘ప్రభుత్వేతర సంస్థలు’ ఈ ‘నిఘా’ను నిరసించవలసిన పనిలేదు, నియంత్రణను వ్యతిరేకించవలసిన అవసరం లేదు! కానీ సేవా కార్యక్రమాలను, అభివృద్ధి పథకాలను అమలు జరుపుతున్నట్టు అభినయిస్తూ ప్రభుత్వం నుండి నిధులను, ప్రజల నుండి విరాళాలను దండుకొని తమ పొట్టలను, పెట్టెలను నింపుకుంటున్న ద ళారీ ముఠాలు మాత్రం గత మూడేళ్లుగా బెంబేలెత్తిపోతున్నాయి, గగ్గోలును సృష్టిస్తున్నాయి! ఇలా ‘్భన భోంతరాళాలను బద్దలు కొట్టడానికి’ యత్నిస్తున్న నకిలీ స్వచ్ఛంద ముఠాలలో అక్రమ వ్యాపార జీవనులైన దళారీలు ఉన్నారు. కానీ వీరికంటే ప్రమాదకరమైన వారు విదేశాలకు ఊడిగం చేస్తున్న దళారీలు, ఉగ్రవాద కలాపాలను ప్రచ్ఛన్నంగా కొనసాగిస్తున్న బీభత్సకారులు! ఇలాంటి సంస్థలు, విదేశీయులు మనదేశాన్ని బలహీనపరచడానికి, బద్దలు కొట్టడానికి సాగిస్తున్న షడ్యంత్రాలకు ‘స్వచ్ఛంద సేవాభినయ’ మాధ్యమాలు.. ఇదీ జనాన్ని, ప్రభుత్వాలను ఆందోళనకు గురి చేస్తున్న వాస్తవం. ఈ నకిలీ స్వచ్ఛంద సంస్థలు మన దేశపు అంతర్గత వ్యవహారాలలో విదేశీయ అక్రమ ప్రమేయానికి ఇలా ‘ప్రతీకలు’. సర్వోన్నత న్యాయస్థానం వారు ‘ఈ సమస్య చాలా ప్రమాదకరమైనది, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం మా అభిమతం కాదు. కానీ ప్రత్యేకమైన చట్టం చేయాలా? వద్దా? అన్నది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి...’ అని వ్యాఖ్యానించడం ఈ కఠోర వాస్తవానికి దర్పణం...
ఇప్పుడున్న చట్టాలలోని నిబంధనల ప్రకారం కూడ అక్రమ కలాపాలకు పాల్పడుతున్న నకిలీ స్వచ్ఛంద సంస్థలను నియంత్రించవచ్చు.. ఈ సంగతిని కూడ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది! అయినా ప్రత్యేకంగా ‘స్వచ్ఛంద సంస్థల’ నిర్వహణకు చట్టాన్ని చేయడం వల్ల అక్రమాలను మరింత వేగంగా పసికట్టడానికి, నిరోధించడానికి వీలు కలుగ వచ్చు. ఈ ప్రభుత్వేతర సంస్థలు తమ నిధులను ఖర్చుపెడుతున్న తీరును గురించి పర్యవేక్షించడానికి వీలుగా కొత్త చట్టాన్ని రూపొందించడానికి చర్యలు తీసుకోవాలని గత ఏప్రిల్ నెలలో కూడ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. నకిలీ స్వచ్ఛంద సంస్థలను నియంత్రించడానికి, అక్రమ కలాపాలను నిరోధించడానికి వివిధ చర్యలను చేపట్టిన ప్రభుత్వం సమగ్రమైన చట్టాన్ని రూపొందించడానికి ఇంతకాలం ఎందుకని ప్రయత్నించలేదన్నది ఆశ్చర్యకరం. గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ రెండు నెలలకు పైగా కొత్త చట్టం గురించి ప్రభుత్వం ఆలోచించిన దాఖలా లేదు. అత్యున్నత స్థాయిలో ఈ విషయం గురించి నిర్ధారణ జరగాలిట. అందువల్ల నాలుగు వారాల గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది తుషార్ మెహతా ఇప్పుడు న్యాయస్థానాన్ని అభ్యర్థించడం ఏమిటి? ఈ అభ్యర్థనను గత ఏప్రిల్‌లోనే చేసి ఉండవచ్చు! గత మూడేళ్లుగా ‘నకిలీ’లను నియంత్రించడానికి ఇప్పటికే అమలులో ఉన్న చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. సమగ్రచట్టాన్ని రూపొందించాలన్న ధ్యాస ప్రభుత్వానికి కలుగకపోవడం మందకొడితనానికి నిదర్శనం. న్యాయస్థానం ఆదేశించే వరకూ ప్రభుత్వంలో కదలిక రాకపోవడం ఇది మొదటి సారి కాదు.
దేశంలో ముప్పయి ఐదు లక్షలకు పైగా ఎన్‌జిఓలు నమోదై ఉన్నాయన్నది ఆధికారికంగా ధ్రువపడిన వ్యవహారం! ఈ సంస్థలు 2009 వరకు ఏడేళ్లలో ఆరువేల ఆరువందల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి దండుకున్నాయి. అయితే కేవలం పదిశాతం కంటే తక్కువ సంఖ్యలోని సంస్థలు మాత్రమే తాము ఖర్చు పెడుతున్న నిధులకు లెక్కలు చూపించాయి! మిగిలిన తొంబయి శాతం సంస్థలు నిధులు భోంచేసి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి! ఈ సంస్థలలో కొన్ని విదేశాల నుంచి నిధులను స్వీకరిస్తున్నాయి! అయితే విదేశీయ నిధుల స్వీకరణకు సంబంధించిన నియమావళిని అనేక సంస్థలు పాటించడం లేదు! ఇలా విదేశీయ నిధులను స్వీకరించిన సం స్థలు, ఆ నిధులను దేశంలోని ఇతర సంస్థలకు విరాళాలుగా కూడ ఇస్తున్నాయి! ఇలా విదేశీయ నిధులను ప్రత్యక్షంగా కాక దొడ్డిదారిన స్వీకరించడానికి అనేక సంస్థలకు వీలు కలుగడానికి కారణం నిబంధనలలోని లొసుగులు! మతం మార్పిడులను సాగిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి వచ్చి పడుతున్న నిధులు ఇలా ‘పంపిణీ’ జరిగిపోయింది! ఒక పెద్ద సంస్థ మాత్రమే ‘విదేశీయ నిధుల స్వీకరణ నియమావళి’ కింద నమోదు కావడం, స్వీకరించిన నిధులను- విదేశీయ విరాళాలను స్వీకరించడానికి అర్హతలేని సంస్థలకు పంపిణీ చేయడం.. ఈ ప్రక్రియ దశాబ్దులుగా సాగినప్పటికీ మూడేళ్లుగా మాత్రమే ప్రభుత్వం ఈ అక్రమాన్ని పసికట్టి నియంత్రిస్తోంది! ముప్పయి లక్షల ‘స్వచ్ఛంద సంస్థల’-ఆదాయ వ్యయాలను సమీక్ష- ఆడిట్-చే యాలని గత జనవరిలో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడానికి ఇదంతా పూర్వరంగం. ఇన్ని లక్షల సంస్థలు ఇలా ఏళ్ల తరబడి నియమ నిబంధనలను ఉల్లంఘించగలగడం ‘నిఘా’ నిద్రపోయిందనడానికి నిదర్శనం. మూడేళ్ల క్రితం మాత్రమే ‘మెలకువ’ వచ్చింది.
మేలుకున్న ప్రభుత్వం నకిలీ ‘ఎన్‌జిఓ’లను రద్దు చేసే ప్రక్రియకు పూనుకుంది. వేలాది ‘నకిలీ’ సంస్థలు ఇప్పటికే రద్దయ్యాయి! ప్రతి స్వచ్ఛంద సంస్థ ‘నీతి ఆయోగ్’ వద్ద కొత్తగా నమోదు కావాలన్న ప్రభుత్వ ఆదేశం ‘నకిలీ’ల ఏరివేతకు దోహదం చేయగలదు! ప్రతి స్వచ్ఛంద సంస్థ వాణిజ్య బ్యాంకులలో ఖాతాను తెరవాలని, నిధులను ఖర్చు పెట్టకపోయినా దుర్వినియోగం చేసినా సమానమైన మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని కూడ ప్రభుత్వం నిర్దేశించింది. జాకిర్ నాయక్ వంటి ప్రచ్ఛన్న బీభత్సకారులు నిర్వహిస్తున్న నకిలీ స్వచ్ఛంద సంస్థలు ఇంకా ఎన్నిఉన్నాయన్నది బయటపడవలసిన నిజం...
*