సంపాదకీయం

జలరక్షణలో అలసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నదీజలాల స్వచ్ఛతను, పర్యావరణ పరిశుభ్రతను పరిరక్షించడానికి అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంలో విపరీతమైన విలంబనం జరుగుతుండడం ధ్రువపడిన వాస్తవం! అలసత్వం వహిస్తున్న ప్రభుత్వ నిర్వాహకులను న్యాయస్థానాలు పదే పదే అదలిస్తున్నాయి. ‘న్యాయ ప్ర మేయం’ లేకుండా ఏ కార్యక్రమమూ ఆరంభం కాని ‘మందకొడి తనం’ మన ప్రభుత్వాలను ఆవహించి ఉందనడానికి నిరంతరం కొత్త నిదర్శనాలు లభిస్తుండడం నడచిపోతున్న చరిత్ర. న్యాయ ప్రక్రియ కూడ నత్తనడక నడుస్తుండడం ‘స్వచ్ఛ భారత పునరవతరణ’ సుదూర స్వప్నంగా మిగిలి ఉండడానికి దోహదం చేస్తున్న వైపరీత్యం! సమాంతరంగా వెలువడిన రెండు న్యాయ నిర్ణయాలు ఈ ద్విముఖ విలంబనకు అద్దం పడుతున్నాయి. జల క్షేత్రాల- వెట్‌ల్యాండ్స్-ను పరిరక్షించడంలో దశాబ్దులుగా విఫలమైన కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా అభిశంసించడం పాలన పరమైన అలసత్వానికి అద్దం! గంగానదికి ఇరువైపులా వంద మీటర్ల దూరం విస్తరించిన ప్రాంతంలో ఎలాంటి కట్టడాల నిర్మాణం చేపట్టరాదని, ‘ప్రగతి’- డెవలప్‌మెంట్- పేరుతో కాలుష్యాన్ని పెంచరాదని ‘జాతీయ హరిత న్యాయమండలి’ గురువారం ఆదేశించింది. ఈ ఆదేశం వెలువడడానికి ముందు మూడు దశాబ్దులకు పైగా ‘న్యాయ ప్రక్రియ’ కొనసాగడం న్యాయ విలంబనకు దర్పణం! గంగానదీ జలాల కా లుష్యాన్ని నిరోధించడానికి తగిన ఆదేశాలను జారీ చేయాలని కోరుతూ 1985లో ఎమ్‌సి మెహతా అనే పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు సర్వోన్నత న్యాయస్థానంలో ‘న్యాయ యాచిక’ను నివేదించాడట. 2014లో ఇరవై తొమ్మిదేళ్ల తరువాత ఈ ‘పిటిషన్’ను సర్వోన్నత న్యాయస్థానం వారు ‘జాతీయ హరిత న్యాయ మండలి’కి బదిలీ చేశారట! జాతీయ హరిత న్యాయమండలి- నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్- వారు ఇప్పుడు తీర్పును చెప్పారు. ఈ ముప్పయి ఏళ్లలో గంగానదికి ఇరువైపులా ఎన్ని లక్షల కాలుష్య కట్టడాలను నిర్మించారన్నది ఎప్పటికీ తేలదు! ఉత్తరఖండ్‌లోని హరిద్వారం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ‘ఉన్నావో’ పట్టణం వరకూ గల పరీవాహక ప్రాంతంలో గంగానదికి ఇరువైపులా ఐదు వందల మీటర్ల మేర విస్తరించిన ప్రాంతంలో చెత్తను పోయరాదని కూడ హరిత న్యాయమండలి తీర్పు చెప్పింది. ఈ తీర్పును ధిక్కరించి చెత్తకుప్పలను ఈ ఐదువందల మీటర్ల పరిధిలో నిక్షిప్తం చేసేవారికి యాబయి వేల రూపాయల జరిమానా కూడ విధించాలని హరిత మండలి నిర్దేశించిందట! దశాబ్దుల పాటు ఆలస్యం జరిగినా ఇప్పుడైనా ఇలాంటి స్వచ్ఛ పర్యావరణ దోహదకరమైన న్యాయాదేశం వెలువడడం హర్షదాయకం.
జలక్షేత్రాల- వెట్‌లాండ్స్- పరిరక్షణకు వారం రోజులలోగా నియమావళిని రూపొందించి తీరాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మదన్ బి.లోకుర్, దీపక్ గుప్తా కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించడం పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయగల సమాంతర పరిణామం. అలా నియమావళిని వారం రోజులలోగా రూపొందించనట్టయితే కేంద్ర ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ విభాగం కార్యదర్శిని న్యాయ ధిక్కార నేరానికి కారాగృహ నిర్బంధానికి పంపించగలమని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించడం అలసత్వానికి అభిశంసన వంటిది. జలక్షేత్రాల పరిరక్షణకు, నిర్వహణకు అవసరమైన నియమావళిని జూన్ నాటికి రూపొందించాలని గత ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు నిర్దేశించింది. ఈ నియమావళి ఇంతవరకూ రూపొందలేదన్నది సర్వోన్నత న్యాయస్థానం వారి ఆగ్రహానికి కారణం! మరో ఆరునెలలు గడువు కావాలని గురువారం ప్రభుత్వం అభ్యర్థించడంతో ‘నియమావళి’ నిర్ణీత కాలవ్యవధిలో రూపొందనందుకు న్యాయమూర్తులు కలత చెందారట! జలక్షేత్రాల పరిరక్షణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దీనివల్ల పర్యావరణ కాలుష్యం తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. పరిపాలనను ఆవహించిన అలసత్వానికి ఇది తీవ్రమైన అభిశంసన..
శాశ్వతంగా కాని తాత్కాలికంగా కాని నీరు ని లచే స్థలాలు జలక్షేత్రాలు. ఈ జలక్షేత్రాలు సహజంగా ఏర్పడిన ప్రాకృతిక వ్యవస్థలో భాగం. దేశవ్యాప్తంగా రెండు లక్షల జలక్షేత్రాలు ఉన్నట్టు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో- వారు ఉపగ్రహ చిత్రాల ఆధారంగా నిర్ధారించి ఉన్నారట! 1971లో కుదిరిన ‘జలక్షేత్ర అంతర్జాతీయ అవగాహన’ వ్యవస్థలో భాగస్వామి అయిన మనదేశం ఇప్పటివరకూ అంతర్గతంగా పరిరక్షణ నియమావళి రూపొందించక పోవడం సిగ్గుచేటైన వ్యవహారం. ఈ వైపరీత్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం ధ్రువపరిచింది, మాటతప్పిన కేంద్ర ప్రభుత్వానికి యాబయి వే ల రూపాయల జరిమానా విధించింది. సర్వోన్నత న్యాయస్థానంలో జరుగుతు న్న ‘విచారణ ప్రక్రియను అపహాస్యం పాలుచేస్తున్నారు, సమస్య ప ట్ల మీకు ఎలాంటి ఆం దోళన లేదు..’ అన్నది ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయమూర్తులు మందలించిన తీరు.
దేశంలోని వేలాది సహజ జలక్షేత్రాలు, శతాబ్దుల పాటు మన పూర్వులు నిర్మించిన జలవాటికలు ఇప్పటికే ‘అక్రమ నిర్మాణ’ కృత్యాల వల్ల అంతరించిపోయాయి. నగరాలలో, పట్టణాలలో ఒకప్పుడు స్వచ్ఛమైన జలాలతో కళకళలాడిన జలక్షేత్రాలు నామరూపాలు లేకుండా నశించిపోయాయి. కొండలలో కోనలలో అడవులలో పల్లెలలో ఏర్పడి ఉండిన సహజ జలక్షేత్రాలు అంతరించిపోయాయి. జలక్షేత్రాలను కబ్జా చేసి ఎండగట్టి ఆ ప్రదేశాలలో ఇళ్లను పరిశ్రమలను ఇతర కాలుష్య కేంద్రాలను నిర్మించడం దశాబ్దుల తరబడి సాగుతున్న ‘ప్రకృతి వ్యతిరేక కలాపం.’ ప్రపంచీకరణ పేరుతో ఏర్పడిన కృత్రిమ వ్యవస్థ నీటికీ, పచ్చదనానికి గొడ్డలిపెట్టుగా మారడం వర్తమాన జీవనం. నదులకు ఇరువైపులా మాలిన్యాలను వెదజల్లరాదని, నదులలో స్నానం చేసినపుడు ఉమ్మి వేయరాదని తాగునీటి సరస్సులలో బట్టలు ఉతకడం వంటి చర్యలకు పాల్పడరాదని, చెఱువును, బావిని, నదిని, సముద్రాన్ని పూజించాలని మన పూర్వులు నిర్దేశించారు. సహస్రాబ్దులు అమలు జరిగిన ఈ స్వచ్ఛ జీవన సూత్రాలు విదేశీయ దురాక్రమణ సమయంలో తెగిపోయాయి. చెఱువులు తెగిపోయాయి, నదులు మురికి కాలువలయ్యాయి. బావులు, చెలమలు, నీటి పడియలు ఎండిపోయాయి!