సంపాదకీయం

ప్లాస్టిక్ ‘ప్రగతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహారం విష రసాయనాలతో సంకరం అయిపోతోందన్నది ప్రజలు పట్టించుకుంటున్న వ్యవహారం. పర్యావరణం, ప్రకృతి ‘ప్లాస్టిక్’తో సంకరమైపోతోందన్నది ప్రజలు పెద్దగా పట్టించుకోని వ్యవహారం! కూరగాయలను ఉప్పునీటితో కడిగి శుభ్రం చేసుకుంటే తప్ప వాటిని వండరాదన్నది పెరిగిన ధ్యాస. ఆ కూరగాయలను తీసుకుని వచ్చిన ‘ప్లాస్టిక్’ సంచులను మాత్రం చెత్తకుండీలో పారేస్తున్నాము! ‘చెత్తను నింపిన ప్లాస్టిక్ సంచులను మాత్రమే లేదా ప్లాస్టిక్ సంచులలో నిండిన చెత్తను మాత్రమే బయట ఉంచిన బుట్టలలో వేయండి’ అని పారిశుద్ధ్య నిర్వాహకులు సలహాలను ఇస్తున్నారు కూడ! ‘ప్లాస్టిక్’ సంచిలో నిక్షిప్తం చేయకుండా చెత్తను నేరుగా తెచ్చి ‘బుట్ట’లో వేసినట్టయితే తాము దాన్ని తీసుకొనిపోమని నగరాలలో అక్కడక్కడ కొందరు ‘ని ర్వాహకులు’ గృహస్థులను బెదిరించారట కూడ! ‘అదేమయ్యా? అదేమమ్మా.. ‘ప్లాస్టిక్’ సంచులు వాడరాదని బృహత్ మహానగర పాలిక సంస్థ వారు ఐదేళ్ల క్రితమే నిషేధించారు కదా!మళ్లీ ప్లాస్టిక్ సంచులలో చెత్తను నింపమంటారా?’ అని హైదరాబాద్‌లో కొందరు విజ్ఞురాండ్రు ప్రశ్నించారట కూడ! ఇలా ప్రశ్నించిన మహిళలను ‘మీరెంత అజ్ఞానులు..?’ అన్న భావంతో పారిశుద్ధ్య నిర్వాహకులు నిరసించిన సందర్భాలు కూడ లేకపోలేదు! హైదరాబాద్‌లో మాత్రమే కాదు దేశంలోని దాదాపు అన్ని నగరాలలోను ఎప్పుడో అప్పుడు ‘ప్లాస్టిక్’ సంచులను స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించి ఉండడం చరిత్ర! ముంబయిలో 2001లో ఇలా నిషేధించినప్పుడు అధికారులు అనేక రోజులపాటు దుకాణాలపై నిఘా వేసి ‘ప్లాస్టిక్’ సంచులను వాడిన దుకాణాల వారిని జరిమానాలతో శి క్షించి నట్టు చరిత్ర! హైదరాబాద్‌లో కూడ ప్లాస్టిక్ నిషేధం హడావుడిని సృ ష్టించింది! కానీ తరువాత జరిగింది ఏమిటి? ‘ప్లాస్టిక్ సంచులు మేము వాడరాదు.. గోరుమెంటోళ్లు పట్టుకుని పోతారట’ అని కూరగాయలు, ఆకుకూరలు అమ్మే మహిళలు స్పష్టీకరించారు! అందువల్ల వినియోగదారులు కొన్న వస్తువులను ఇళ్లకు తీసుకునిపోవడానికి ఎవరి సంచులు వారే తెచ్చుకోవాలి. తెచ్చుకోని వారు, తేవడం మరిచిపోయినరవారు ఏం చేయాలి?? రెండు, ఐదు రూపాయలుపెట్టి ‘ప్లాస్టిక్’ సంచులను ఆ దుకాణాలలోనే కొనాలి! ‘ప్లాస్టిక్’ నిషేధం వల్ల జరుగుతున్న తక్షణ పరిణామం అదీ! సంచులను కొనడం వినియోగదారులకు జరిగిన లాభం! అదేమిట ప్లాస్టిక్‌ను నిషేధంచారు కదా! డబ్బుపెట్టి కొంటే మాత్రం ఈ ‘సంచుల’కు నిషేధం వర్తించదా? ఈ ప్రశ్నకు సమాధానం ‘మైక్రాన్’ల విజ్ఞానం! పది ‘మైక్రాన్’ మందం ఉన్న, ఇరవై మైక్రాన్‌ల మందం ఉన్న ప్లాస్టిక్ సంచులను వాడడం మాత్రమే పాలకులు నిషేధించారట. అంతకు మించిన ‘మైక్రాన్ల’ మందం ఉన్న పెద్ద పెద్ద సంచులను యథాపూర్వంగా వాడుకోవచ్చునన్నది వినియోగదారులకు తెలియవచ్చిన విజ్ఞానం!
అందువల్ల నిషేధానికి ముందు తేలికపాటి ప్టాస్టిక్ సంచులను మాత్రమే మోసుకుని వచ్చిన వినియోగదారులు నిషేధం తరువాత పెద్ద పెద్ద భారీ సంచులను మోసుకుని రావడం ఆరంభమైంది. చెత్తను నింపడానికి కూడ ఈ భారీ సంచులు అనుకూలంగా ఉన్నాయి! ఆ తరువాత నిషేధం సంగతి అందరూ మరచిపోయారు! ‘అందరూ..’ అని అంటే ‘నిషేధించిన పాలకులు కూడ’ అని అర్థం! నిషేధం ఇప్పుడు ఎవ్వరికీ గుర్తులేదు! నిషేధం అమలులోనే ఉందా? లేక చప్పుడు కాకుండా తొలగించేశారా? అన్నది కూడ ప్రచారం కాని మహా రహస్యం. తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించడానికి వెడుతున్న భక్తాదులకు మాత్రమే అధికారులు ‘ప్లాస్టిక్’ వినియోగం నిషిద్ధమన్న సంగతిని గుర్తు చేస్తున్నారు. మిగిలిన చోట్ల యథావిధిగా ‘ప్లాస్టిక్’ వినియోగం జరిగిపోతోంది. ‘ప్లాస్టిక్’ లేకపోతే ‘కిరాయి’ భోజన శాలల నుంచి ఉల్లిగడ్డలు, కూరలు, మసాలా దోశెలు, ఇడ్లీలు, వడలు అశేష జనావళి ఇళ్లకు రవాణా జరిగేదెట్లా? గతంలో అరిటాకులు, మోదుగ ఆకులు వాడేవారు.. ఇప్పుడు కిరాయి భోజన శాలలలో మాత్రమే కాదు స్వగృహాల ‘డయినింగు టేబుళ్ల’ మీద కూడ ఆకర్షణీయమైన ప్లాస్టిక్ విస్తళ్లను విరివిగా వాడుతున్నారు! చెత్తబుట్టలలోని ‘ఎంగిలి’ని తింటున్న వీధి కుక్కలు తిండితోపాటు ప్లాస్టిక్‌ను నమిలి వివిధ రోగాలకు గురి అవుతున్నాయి! పళ్లలో ‘ప్లాస్టిక్’ ముక్కలు ఇరుక్కుని ‘కుయ్యో కుయ్యో’ మని అవి రోదిస్తున్నాయి! వాటి ఏడుపు ఎవరికి పట్టింది? ‘ప్లాస్టిక్’ను మేసి అకాల మృత్యువుపాలవుతున్న ఆవుల సంగతి వేరే కథ..
‘ప్లాస్టిక్’తో పర్యావరణం గాయపడింది, ప్రకృతి క్షతగాత్ర అయింది! తిన్న తిండిని జీర్ణించుకోవడం ఆరోగ్యవంతుల లక్షణం! జీర్ణం కాని తిండి రోగాలకు హేతువు! అన్నం జీర్ణం అవుతుంది కాని మానవుల పొట్టలోకి చేరిన రాళ్లు, రప్పలు, మేకు గాజుపెంకులు జీర్ణం కావు! సర్వం ప్రకృతి నుంచి సముద్భవిస్తోంది, భూమాత అందువల్ల మానవాళికి తల్లి. సకల జీవజాలాన్ని సృష్టించి పోషిస్తున్న జనని.. భూమిలోనుంచి వచ్చినవన్నీ ప్రకృతిలో పరిపూర్ణంగా విలీనం అవుతున్నాయి. ‘విలీనం’ కానిది ‘ప్లాస్టిక్’ పదార్థం మాత్రమే! అందువల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకొనిపోతున్నాయి, ప్రకృతి జీర్ణించుకోలేకపోతోంది, ఫలితంగా పుడమితల్లి గాయపడింది, ఈ గాయాల నుండి కాలుష్యం కాలువ లు వెల్లువెత్తుతున్నాయి! దుర్గంధపు జ్వాలలు విస్తరిస్తున్నాయి! క్రీస్తుశకం 1950 నుంచి ఇంతవరకు దాదాపు తొమ్మిది వందల పదకొండు కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయిందట! ఇందులో తొమ్మిది శాతం ప్లాస్టిక్ మాత్రమే శుద్ధి ప్రక్రియ ద్వారా మళ్లీ ఉపయోగంలోకి వస్తోందట! దాదాపు ఏడువందల కోట్ల టన్నుల ‘ప్లాస్టిక్’ పదార్థాలు పనికిరాకుండా కేవలం చెత్త రూపంలో అవనీతలంపై కుప్పలు కుప్పలుగా, గుట్టలు గుట్టలుగా పేరుకుని ఉన్నాయట! ఈ ప్లాస్టిక్ కుప్పల వల్లనే హిమాలయాలలో వేడిమి పెరిగి పదమూడు శాతం హిమ శకలాలు ఇప్పటికే కరిగిపోయి ‘రాళ్లగుట్టలు’ బయటపడినాయట! ఇది 2001వ సంవత్సరం నాటి సంగతి. ప్రపంచంలో అతి పెద్ద పరిణామంలో ‘ప్లాస్టిక్’ను ఉత్పత్తి చేస్తున్న చైనా ప్లాస్టిక్ వ్యర్థాలతో సువిశాల టిబెట్‌ను హిమాలయ పర్వతాలను నింపుతోంది. ప్రపంచంలోని సముద్రాలలో ఐదు లక్షల కోట్ల ప్లాస్టిక్ ముక్కలు చెక్కలు తేలియాడుతున్నట్టు 2014లో అంచనా వేశారు.
మొదట క్రీస్తుశకం 1862లో సేంద్రియ-ప్రకృతి సహజంగా ప్రసాదించే-పదార్థాలతో ప్లాస్టిక్ తయారైంది. కానీ ఆ తరువాత కృత్రిమ రసాయన విషాల ద్వారా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ధరాతలాన్ని ముంచెత్తుతోంది! ప్రకృతి జీర్ణించుకోలేని ఈ ప్లాస్టిక్ రాకపూర్వం వెదురు, జనుపనార, నూలు, కాగితం గుజ్జు తదితర ప్రాకృతిక పదార్థాలతో తయారయిన తట్టలు బుట్టలు సంచులు డబ్బాలు మాత్రమే మన పూర్వులు ఉపయోగించారు! ఆరోగ్యవంతులయ్యారు.. ఇప్పుడు కూడ ఈ ప్రత్యామ్నాయాలను మనం ఎందుకు మళ్లీ ఉపయోగించరాదు?? కాగితం సంచులు జనుపనార సంచులు తయారు చేయలేమా?