సంపాదకీయం

బిహార్ ‘ప్రహసనం’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిహార్‌లో కొనసాగుతున్న రాజకీయ ప్రహసనంలో ప్రధాన ‘ఇతివృత్తం’ అవకాశవాదం! దాదాపు అన్ని రాజకీయ పక్షాలవారు ఎంతోకొంత ‘అవకాశవాదం’ ప్రాతిపదిక మాత్రమే అభినయిస్తున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రదర్శితమవుతున్న బహిరంగ నాటకంలోని ఆకర్షణీయమైన అద్భుతం! బుధవారం, గురువారం వడివడిగా సంభవించిన పరిణామాలు ‘ఉత్కంఠ’కు జనాన్ని గురి చేయలేదు.. బిహార్ ముఖ్యమంత్రి పదవికి ‘ఐక్య జనతాదళ్’ అధినేత నితీశ్‌కుమార్ బుధవారం రాజీనామా చేశాడు, గురువారం బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్ మళ్లీ ప్రమాణం చేశాడు, పదవీ బాధ్యతలను స్వీకరించాడు. బుధవారం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీశ్‌కుమార్ రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, ఐక్య జనతాదళ్, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి సారథి. గురువారం మళ్లీ ముఖ్యమంత్రి అయిన నితీశ్‌కుమార్ భారతీయ జనతాపార్టీ, ఐక్య జనతాదళ్ కూటమి ప్రభుత్వానికి నాయకుడు! ఈ పరిణామ క్రమం జనానికి ముందే తెలిసిపోయింది కనుక నితీశ్ రాజీనామా కాని, మళ్లీ మర్నాడే పదవీ స్వీకారం కాని ఎవ్వరికీ ఆశ్చర్యం కలిగించలేదు! బిహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ అవినీతికి సజీవ విగ్రహమన్నది ధ్రువపడిన వాస్తవం! ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు వ్యతిరేకంగా ‘కేంద్ర నేర పరిశోధక మండలి’-సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్-సిబిఐ- జూలై ఏడవ తేదీన అవినీతి ఆరోపణలు దాఖలు చేయడంతో బుధవారం, గురువారం సంభవించిన వేగవంతమైన పరిణామాలకు దో హదం చేసిన ఘటనాక్రమం మొదలైంది! లాలూప్రసాద్ భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్డీదేవి, వారి కు మార్తె, రాజ్యసభ సభ్యురాలు మిశా భారతి, ఆమె భర్త శైలేశ్ కుమార్ తదితర కు టుంబ సభ్యులపై కూడ అవినీతి ఆరోపణలు నమోదై ఉన్నాయి. వివిధ దర్యాప్తు విభాగాల వారు పరిశోధనలు, విచారణలు సాగిస్తున్నారు. అవినీతి ఆరోపణలకు గురి అయిన తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నది నితీశ్ మాట! తేజస్వీ యాదవ్ రాజీనామా చేయకపోవడం వల్లనే, తన కుమారుడు రాజీనామా చేయడం లేదని లాలూ ప్రసాద్ యాదవ్ పదే పదే స్పష్టం చేయడం వల్లనే నితీశ్‌కుమార్ రాజీనామా చేశాడు, బుధవారం వరకు కొనసాగిన కూటమి ప్రభుత్వం రద్దయిపోవడానికి దోహదం చేశాడు. ఈ పరిమాణంతో నితీశ్‌కుమార్ అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అయిపోయాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా నితీశ్‌కుమార్‌ను ‘అవినీతి వ్యతిరేక సమర వీరుడి’గా అభివర్ణించడం ఈ కీర్తికి నిదర్శనం...
లాలూప్రసాద్ యాదవ్ రాజకీయ చరిత్ర పేరు మోసిపోయింది. ఈ చరిత్ర అవినీతికి అద్దం. పశుగ్రాసం అవినీతి దశాబ్దుల తరబడి జనానికి తెలుసు! ఈ అభియోగం, ఇతర అవినీతి అభియోగాల న్యాయ విచారణ కొనసాగుతున్న కారణంగా ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసి వచ్చింది, నిర్బంధానికి గురి కావలసి వచ్చింది. ఆయన ఎన్నికలలో పోటీ చేయడానికి సైతం ప్రస్తుతం అనర్హుడు, తుది తీర్పు ఇంకా వెలువడవలసి ఉంది. ఇంత జరిగినప్పటికీ లాలూప్రసాద్ నిర్లజ్జగా నిర్భయంగా రాజకీయాన్ని నడిపిస్తున్నాడు, తన కుటుంబ సభ్యులకు వివిధ రాజకీయ, అధికార పదవులను కట్టబెడుతూనే ఉన్నాడు! ఈ విషయంలో 2015 నాటి బిహార్ శాసనసభ ఎన్నికల నాటికి, నేటికీ కొత్తగా ఏర్పడిన తేడా లేదు! లాలూప్రసాద్ అవినీతి, ఆయన ‘కుటుంబ పాలన’ 2015 నాటికి స్పష్టం.. అయినప్పటికీ నితీశ్‌కుమార్ నాయకత్వంలోని ఐక్య జనతాదళ్ లాలూ పార్టీతో పొత్తుపెట్టుకుంది! లాలూ కుటుంబ అవినీతిని అప్పుడు ఇప్పుడు కూడా సమర్ధిస్తున్న రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంది! ఆ పొత్తు ఎందుకు? ఎలాగైనా భారతీయ జనతాపార్టీకి అధికారం దక్కకుండా నిరోధించడానికి.. నితీశ్‌కుమార్ అవకాశవాదానికి ఆ పొత్తు నిదర్శనం! లాలూ అవినీతి పేరు మోసింది, మారు మోగుతోంది. నితీశ్‌కుమార్ అవకాశం వాదం ‘పేరు మోయడం లేదు’, ‘మారుమోగడం లేదు’.. ఇదీ రాజకీయ వైచిత్రి!
భారతీయ జనతాపార్టీని మతతత్వ శక్తిగా నితీశ్‌కుమార్ చిత్రీకరించడం 2014 నాటి లోక్‌సభ ఎన్నికల నాటి కథ. నరేంద్ర మోదీని ప్రధానమంత్రి పదవికి ‘్భజపా’ అభ్యర్థిగా ప్రకటించరాదన్నది 2014 నాటి లోక్‌సభ ఎన్నికలకు పూర్వం నితీశ్‌కుమార్ చేసిన ఆర్భాటం! భాజపా నాయకత్వంలోని ‘జాతీయ ప్రజాస్వామ్య సంఘటన’-నేషనల్ డెమొక్రాటిక్ అలియన్స్-ఎన్‌డిఏ-ప్రధానమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటిస్తే బాగుండునన్న మహదాకాంక్షకు కూడ అప్పుడు నితీశ్‌కుమార్ గురయ్యాడు. ‘ఉట్టికి ఎగరలేని వాడు స్వర్గానికి నిచ్చెనలను వేయడం’ అంటే ఇదే మరి! ‘నరేంద్ర మోదీ మతతత్త్వ వాది’ అన్న దుష్ప్రచారానికి నాయకత్వం వహించినవాడు నితీశ్‌కుమార్! ఈయనగారి వ్యతిరేకతను పట్టించుకోకుండా భాజపా అభిష్ఠానం మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం ‘ఐక్య జనతాదళ్’ 2014 నాటి రోక్‌సభ ఎన్నికల ముందు ‘జాతీయ ప్రజాస్వామ్య సంఘటన’ నుంచి వైదొలగడానికి ఏకైక కారణం! భాజపా నాయకత్వంలోని కూటమిలో చేరిన తరువాత మాత్రమే నితీశ్‌కుమార్ బిహార్ ముఖ్యమంత్రి కాగలిగాడు. 2013 వరకు ఎన్‌డిఏలో ఉన్నంత కాలం నితీశ్‌కుమార్, తన పార్టీ వారితో లాలూప్రసాద్ వంటి నేతల అవినీతిని ఆర్భాటంగా వ్యతిరేకించాడు! ఈ అవినీతి పరులతో జత కట్టిన కాంగ్రెస్‌ను వ్యతిరేకించాడు. కానీ, న రేంద్ర మోదీ ప్రధాని అభ్యర్థిత్వం కారణంగా తాము ఎన్‌డిఏ నుంచి వైదొలగిన తరువాత నితీశ్ బృందానికి ‘అవినీతి’ సమస్య కాలేదు.. భా జపా వారి ‘మతతత్వం’ ప్రధాన ప్రమాదం అయిపోయింది! భాజపాకు, కాంగ్రెస్‌కు విరుద్ధంగా ఏర్పడే ‘మూడవ కూటమి’ వారు తనను ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా నిర్ధారిస్తారన్నది నితీశ్‌కుమార్‌ను 2013వ, 2014వ సంవత్సరాలలో ఆవహించిన అత్యాశ! ఈ ‘మూడవ కూటమి’, ‘నాలుగవ కూటమి’ ఏర్పడనే లేదు! లోక్‌సభ ఎన్నికలలో బిహార్‌లో పరాజయం పాలైన పార్టీలన్నీ కలిసి భాజపా వ్యతిరేక కూటమిగా ఏర్పడడం గత శాసనసభ ఎన్నికల నాటి ముచ్చట!
ఈ భాజపా వ్యతిరేక ‘మహాఘట బంధన్’ సిద్ధాంత సామ్యం లేని అవకాశ వాదుల కూటమి అన్నది ఇప్పటికి స్పష్టమైంది! భాజపా మతతత్వ పక్షం కాదన్న జాతీయ నిష్ఠకల రాజకీయపక్షమన్న వాస్తవాన్ని నితీశ్‌కుమార్ మళ్లీ గుర్తించాడు! ఆయన తన తప్పును దిద్దుకున్నాడా? పొరపాటును గ్రహించాడా?? లేక అవకాశ వాదానికి ‘అవినీతి వ్యతిరేకత’ అన్న ముసుగును తొడిగాడా? ఇప్పుడు సంభవించిన మహా పరివర్తన వల్ల ఐక్య జనతాదళ్‌కు జరుగనున్న తక్షణ లాభం శరద్ యాదవ్ వంటి ఈ పార్టీ ప్రముఖులకు కేంద్ర మంత్రివర్గంలో స్థానాలు లభించడం అని ప్రచారం జరుగుతోంది! మరోవైపు భాజపాతో పొత్తును కొందరు ఐక్య జనతాదళ్ శాసనసభ్యులు వ్యతిరేకిస్తున్నారట.. ఏది నిజం...?