సంపాదకీయం

‘తమిళ’ సయోధ్య..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వ మ్ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం అధకార ‘అఖిల భారత అన్నా ద్రవిడ మునే్నత్ర కజగం’-అభాఅద్రముక-లో కొనసాగుతున్న సయోధ్య ప్రక్రియకు పరాకాష్ఠ. గత ఫిబ్రవరిలో రెండు వర్గాలుగా విడిపోయిన ‘అన్నాకజగం’లో ఈ సయోధ్య ప్రక్రియ గత ఏప్రిల్ నుంచి కొనసాగుతోంది. పన్నీర్ సెల్వమ్ నాయకత్వంలోని వర్గం, ముఖ్యమంత్రి ఇ.కె.పళనిస్వామి నాయత్వంలోని వర్గం ఇలా సోమవారం లాంఛనంగా కలిసిపోవడం తమిళనాట రాజకీయ చారిత్రక పునరావృత్తి. ఎందుకంటే ‘అన్నా ద్రవిడ మునే్నత్ర కజగం’లో చీలికలు ఏర్పడడం, మళ్లీ ఉభయ వర్గాలు కలిసిపోవడం ఇది మొదటిసారి కాదు. సోమవారం నాటి ఘటనా క్రమంతో ఈ పార్టీలో నెలకొన్న సంక్షోభం తాత్కాలికంగా శమించినట్టయింది. అయితే, చిన్నమ్మగా ఆ తరువాత ‘దుష్టశక్తి’గా ‘అన్నా కజగం’ కార్యకర్తల అభివర్ణనకు గురైన శశకళ ‘పట్టు’ పార్టీపై పూర్తిగా సడలిందా? అన్నది వేచి చూడదగిన పరిణామం! ఆమె బంధువు, అవినీతి ఆరోపణలకు గురి అవుతున్న టిటివి దినకరన్ దాదాపు పదహారు మంది శాసనసభ్యులను కూడగట్టుకుని ఉన్నాడన్నది జరుగుతున్న ప్రచారం. బెంగళూరులో ‘జైలు’ జీవితం గడుపుతున్న శశికళా నటరాజన్ ఇప్పటికీ తన కుటిల రాజకీయ పన్నాగాన్ని అమలు జరుపుతునే ఉందన్నది దినకరన్ ముఠా చేష్టలతో ధ్రువపడింది! దాదాపు ఎనిమిది నెలలకు పైగా ‘అన్నా ద్రవిడ కజగం’లో నెలకొన్న సంక్షోభానికి కేంద్ర బిందువు శశికళ విష వ్యూహం! ఈ సంక్షోభం డిసెంబర్ ఐదవ తేదీన అప్పటి ముఖ్యమంత్రి, పా ర్టీ అధినేత్రి జె.జయలలిత మరణంతో మొదలైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కైవసం చేసుకున్న శశికళ తనను ‘చిన్నమ్మ’గా ప్రచారం చేసుకోవడం కొ నసాగిన నాటకంలో ప్ర ధాన అంశం!
జయలలిత మరణించిన వెంటనే పన్నీరు సెల్వమ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం సహజ పరిణామం. ఎందుకంటే గతంలో అవినీతి ఆరోపణగ్రస్తమైన జయలలిత రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయినప్పుడు పన్నీరు సెల్వమ్ ఆ పదవిని నిర్వహించాడు. ఆయన జయలలిత ‘నమ్మిన బంటు’.. అందువల్లనే జయలలిత ఆయనకు రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది. జయలలిత తరువాత ఆయన ముఖ్యమంత్రి కావడం అందువల్ల ఆమె మనోభీష్టమన్నది అలా ధ్రువపడిన వాస్తవం! కానీ ఈ వాస్తవాన్ని వమ్ము చేయడానికి శశికళ నడమును బిగించడం పార్టీ విభజనకు దారి తీసిన విపరిణామం! డిసెంబర్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ‘కబ్జా’ చేసిన శశికళ ఫిబ్రవరిలో పన్నీర్ సెల్వమ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించింది. తానే ముఖ్యమంత్రి కావడానికి వీలుగా ముస్తాబయింది! సర్వోన్నత న్యాయస్థానం ఆమెను నేరస్థురాలిగా నిర్ధారించకపోయి ఉండినట్టయితే, నాలుగేళ్ల జైలు శిక్షను విధించి ఉండకపోయినట్టయితే ఆమె ముఖ్యమంత్రి అయిపోయి ఉండేది. ఆదాయానికి మించిన ఆస్తులను కుప్పేసుకున్న శశికళను సర్వోన్నత న్యాయస్థానం వారు కారాగృహానికి పంపడంతో ఆ ప్రమాదం తృటిలో తప్పిపోయింది! ముఖ్యమంత్రి పదవి తనకు ఎప్పటికీ దక్కదని నిర్ధారించుకున్న తనువాత కూడ శశికళ తన దుర్బుద్ధిని మార్చుకోలేదు, పన్నీర్ సెల్వమ్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయలేదు. అప్పుడు తనకు విధేయుడనుకున్న ఇ.పళని స్వామిని ముఖ్యమంత్రి గద్దెపై కూర్చుండబెట్టింది. పార్టీకి ఉపప్రధాన కార్యదర్శి పదవిని ఏర్పాటు చేసింది. దాన్ని తన బంధువైన టిటివి దినకరన్‌కు అప్పగించింది. జైలునుండి పార్టీని, ప్రభుత్వాన్ని నియంత్రించాలన్న శశికళ దుర్బుద్ధి ఫలితంగా అన్నాద్రవిడ మునే్నత్ర కజగం ఫిబ్రవరిలో చీలిపోయింది. ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన సెల్వమ్, ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన స్వామి చెరో వర్గాన్ని నడిపించడం సోమవారం వరకు నడిచిన కథ.
అన్నా ద్రవిడ మునే్నత్ర కజగంలో చీలిక ఏర్పడడం మళ్లీ ఐక్య పక్షం అవతరించడం ఇది మొదటిసారి కాదు. 1970వ దశకంలో‘ద్రవిడ మునే్నత్ర కజగం’ నుండి బయటికి వచ్చిన అప్పటి ప్రముఖ చలనచిత్ర నటుడు ఎమ్‌జి రామచంద్రన్ ‘అన్నా ద్రవిడ మునే్నత్ర కజగం’ ప్రారంభించాడు, 1988లో మరణించే వరకు పార్టీకి ఆయనే తిరుగులేని నాయకుడు. 1977లో ముఖ్యమంత్రి అయిన రామచంద్రన్ ఆమరణం ఆ పదవిలో కొనసాగాడు. ఆయన మరణించిన వెంటనే పార్టీ చీలిపోయింది. ఎమ్‌జి రామచంద్రన్ భార్య జానకీ అమ్మాళ్ ముఖ్యమంత్రిగా రావడంతో జయలలిత నాయకత్వంలోని వర్గం పార్టీ నుంచి చీలిపోయింది. ఈ చీలిక కారణంగానే జానకీ రామచంద్రన్ మంత్రివర్గం పతనమైంది, రాష్టప్రతి పాలన ఏర్పడింది. 1989 ప్రారంభంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్.కరుణానిధి నాయకత్వంలోని ‘ద్రవిడ మునే్నత్ర కజగం’ విజయం సాధించడానికి ప్రధాన కారణం ‘అన్నా ద్రవిడ మునే్నత్ర కజగం’ చీలిపోవడం. చీలిక కారణంగా విడివిడిగా పోటీ చేసిన జయలలిత వర్గం, జానకి వర్గం ఘోర పరాజయం పాలయ్యాయి! ఎమ్. జి. రామచంద్రన్ బతికి ఉండినన్నాళ్లు అధికారచ్యుతికి గురి అయిన ఎమ్.కరుణానిధి 1989లో మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగాడు! ఈ పరాజయం తరువాత రెం డు అన్నా ద్రవిడ మునే్నత్ర కజగం వర్గాలు మళ్లీ కలిసిపోయి, జయలలిత నాయకత్వంలో సమైక్య పార్టీ మళ్లీ అవతరించింది! అన్నా కజగం వర్గాలకు ఇది చారిత్రక గుణపాఠం! ఈ గుణపాఠాన్ని బహుశా ఇప్పుడు పార్టీకి చెందిన ఇరువర్గాలకు గుర్తు ఉంది. అందువల్లనే శశికళ జైలుకు వెళ్లగానే ఉభయ వర్గాలవారు ఆమె అభీష్టానికి విరుద్ధంగా కలిసిపోయారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉండిన పన్నీర్ సెల్వమ్ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి అంగీకరించడం సయోధ్యకు సాకారం..
తమిళనాడు రాజకీయాలలో సమస్యల కంటే ‘వ్యక్తిగత ఆకర్షణ’ ప్రాబల్యాన్ని సంతరించుకుని ఉంది. ఫలితంగా అధిక శాతం వోటర్లు తమ నాయకుల పట్ల మక్కువను ప్రదర్శించినట్టుగా అవినీతి నిర్మూలన వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ‘అన్నాద్రముక’, ‘ద్రముక’ రెండూ నిజానికి అవినీతిగ్రస్తమై ఉండడం చరిత్ర. అందువల్ల ‘అన్నా ద్రవిడ మునే్నత్ర కజగం’ చీలిపోతే తమకు మళ్లీ అధికారం లభిస్తుందని ‘ద్రవిడ మునే్నత్ర కజగం’ వారు ప్రధానంగా ఎమ్ కరుణానిధి కుటుంబ సభ్యులు ఎదురు చూసారు. పార్టీ చీలింది. కాని మళ్లీ రెండు వర్గలవారు కలిసిపోయారు. అందువల్ల 1989 ఎన్నికల నాటి కథ పునరావృత్తం కావడం లేదు. మంత్రివర్గం కూలిపోవడం లేదు. మధ్యంతరంగా ఎన్నికలు జరగడం లేదు. అందువల్ల ‘అన్నా కజగం’ వర్గాల ఏకీకరణ కరుణానిధి కుటుంబం వారికి గొప్ప నిరాశను కలిగిస్తూ ఉండవచ్చు.