సంపాదకీయం

నరరాక్షసులకు శిక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరు బీభత్సకారులకు ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్షను విధించడం తో, 1993లో ఈ మహానగరంలో పాకిస్తాన్ తొత్తులు జరిపిన భయంకర హత్యాకాండ మరోసారి జనానికి గుర్తుకువచ్చింది. 1947 నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశంలోని ఉగ్రవాద మృగాలను ఉసిగొల్పుతోంది. మన దేశంలో పుట్టి పెరిగినవారిని సైతం జిహాదీ బీభత్సకారులుగా తీర్చిదిద్దుతోంది. 1993 నుంచి ఈ పాకిస్తానీ ప్రభుత్వ బీభత్సకాండ తీవ్రతరం కావడం చరిత్ర. 1993 మార్చిలో జరిగిన భయంకరమైన పేలుళ్లకు పాకిస్తాన్ ప్రభుత్వ విభాగమైన ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజన్స్’-ఐఎస్‌ఐ- కలాపాలు మనదేశమంతటా విస్తరించడం పూర్వ రంగం. పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య విభాగంగా చెలామణి అవుతున్న ‘ఐఎస్‌ఐ’ నిజానికి మన దేశంలో జిహాదీ ఉగ్రవాదాన్ని సాగిస్తున్న బీభత్స ముఠా! ‘ఐఎస్‌ఐ’ కలాపాలు మన దే శంలో విస్తరించిపోతున్నట్టు 1990వ దశకం ఆరంభం నుంచీ ప్రచారమైంది. అయినప్పటికీ 1993 మార్చి 12వ తేదీన ‘ఐఎస్‌ఐ’ ప్రేరిత బీభత్సకారులు ముంబయిలో పనె్నండు చోట్ల కేవలం రెండు గంటల వ్యవధిలో భయంకరమైన పేలుళ్లు జరపగలగడం మన నిఘా విభాగాల వైఫల్యం. ఈ వైఫల్యానికి ప్రాతిపదిక కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు పాకిస్తాన్ పట్ల అనుసరిస్తున్న విధాన వైపరీత్యం. జిహాదీ ఉగ్రవాదం తీవ్రతను గుర్తించని, గుర్తించినప్పటికీ గు ర్తించనట్టు దశాబ్దుల పాటు అభినయించిన రాజకీయ నిర్వాహకుల నిర్లక్ష్యం.. 257 మంది హత్య కు, 713 మంది క్షతగాత్రులు కావడానికి దోహదం చేసిన 19 93 నాటి ముంబయి బీభత్సకాండ జరిగిన వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ‘ఉగ్రవాద వ్యవస్థ’గా మన ప్రభుత్వం ప్రకటించి ఉండాలి. పాకిస్తాన్‌లో సురక్షితంగా ఉన్న దావూద్ ఇబ్రహీం ఈ పేలుళ్లను నిర్వహించాడు. వాడిని పట్టుకొని మన దేశానికి అప్పగించాలని మన ప్రభుత్వం ‘ఇంటర్‌పోల్’- అంతర్జాతీయ పోలీ సు సంస్థ-ను అభ్యర్థించి ఉండాలి. లేదా దావూద్‌ను మన దేశానికి తరలించాలని పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఉండాలి. అలా జరగలేదు. దావూద్‌ను అప్పగించేవరకూ పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలను కొనసాగించరాదని మన ప్రభుత్వం దృఢ నిశ్చయాన్ని ప్రకటించి ఉండాలి. అలా జరిగి ఉంటే పాకిస్తాన్ దారికి వచ్చి ఉండేది.కానీ మన ప్రభుత్వం ఈ తెగతెంపుల విధానాన్ని కాక చర్చలు జరిపే విధానాన్ని అప్పటి నుంచి దశాబ్దులపాటు కొనసాగించింది..
మన ప్రభుత్వం ‘చర్చల బాట’ను విడనాడలేదు, పాకిస్తాన్ ప్రభుత్వం బీభత్స చర్యలను విడనాడలేదు. 1996లోను, 2003లోను, 2006 లోను, 2008లోను పాకిస్తాన్ ప్రభుత్వం ముంబయిలో భయంకర బీభత్సకాండను జరిపించింది. 2008లో నూట అరవై ఆరుమందిని పాకిస్తానీ ఉగ్రవాద మృగాలు పొట్టనపెట్టుకున్న తర్వాత కూడ మన ప్రభుత్వం పాకిస్తాన్‌ను బీభత్స రాజ్యాంగ వ్యవస్థగా ప్రకటించకపోవడం మన విధానంలోని ప్రధాన లోపం. 2003 నాటి ముంబయి పేలుళ్ల తర్వాత పాకిస్తాన్‌ను ‘బీభత్స వ్యవస్థ’గా ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రకటింపచేయడానికి యత్నిస్తామని మన ప్రభుత్వం ప్రకటించింది. బీభత్సకాండను విడనాడాలని మన ప్రభుత్వం గట్టిగా కోరినందువల్లనే 2001లో ఆగ్రాలో అప్పటి మన ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి, పాకిస్తాన్ సైనిక నియంత పర్‌వేజ్ ముషారఫ్‌కు మధ్య జరిగిన చర్చలు భగ్నమయ్యాయి. ఆ తరువాత మన ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్సకాండ సంగతిని మరచిపోయింది. పాకిస్తాన్‌లోని ప్రభుత్వేతర జిహాదీ ముఠాలు మన దేశంలో బీభత్సకాండ జరుపుతున్నాయని, ఈ ముఠాలను పాకిస్తాన్ ప్రభుత్వం మనకు అప్పగించాలని కొన్నాళ్లు, పాక్ ప్రభుత్వమే ఈ ముఠాలను శిక్షించాలని మరికొన్నాళ్లు మన ప్రభుత్వం కోరింది, కోరుతోంది. నిన్న మొన్న చైనాలో జరిగిన ‘బ్రిక్స్’- బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా- దేశాల అధినాయక సమావేశంలో సైతం పాకిస్తాన్‌లోని ‘జాయిష్ ఏ మహమ్మదీ’, ‘లష్కర్ ఏ తయ్యబా’లను ఉగ్రసంస్థలుగా ప్రకటించారు. అంతేగాని పాక్ ప్రభుత్వాన్ని ‘ఉగ్రవాద రాజ్యాంగ వ్యవస్థ’గా ప్రకటించలేదు..
ముంబయిలో 2008లో బీభత్సకాండ జరిపించిన హఫీజ్ సరుూద్, అఝార్ మసూద్ వంటి ముష్కరులు పాకిస్తాన్‌లో సురక్షితంగా ఉన్నారు. ఇలా మన దేశంలో 1993 నుంచి అంతకుపూర్వం నుంచి జరుగుతున్న బీభత్స ఘటనలను నడిపించిన వందలాది ఉగ్రవాదులను రూపొందించినదీ, ఉసిగొల్పినదీ పాకిస్తాన్ ప్రభుత్వమే. ఇప్పు డు ముంబయిలోని ప్రత్యేక న్యా యస్థానం మరణశిక్ష విధించిన ఫి రోజ్ ఖాన్, మహమ్మద్ తహీర్ మ ర్చెంట్ అనేవారు 1993 నాటి బీభత్సకాండను జరిపించిన వారిలో అ త్యంత దుర్జనులు. ఈ దుర్జనులిద్దరూ 2010 వరకూ పట్టుబడలేదు, పాకిస్తాన్‌లోను ఇతర దేశాలలోను పదిహేను సంవత్సరాల పాటు వీరిద్దరూ యథేచ్ఛగా తిరిగారు. గురువారం ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ కారాగృహ శిక్షను విధించిన అబూ సలేం అన్సారీ అనేవాడు 2005 వరకూ దొరకలేదు. జీవితఖైదుకు గురైన కరీముల్లా ఖాన్ అనేవాడు 2008 వరకూ, మరో నేరస్థుడు రియాజ్ అహ్మద్ సిధికీ 2005 వరకూ పట్టుబడలేదు. వీరు దీర్ఘకాలం పట్టుబడకపోవడం వల్లనే పట్టుబడిన దాదాపు వందమంది నేరస్థుల విచారణను 2006 వరకు ప్రత్యేక కోర్టు చేయలేకపోయింది. చివరికి వీరిని మిగిలిన నిందితుల జాబితా నుంచి విడివిడిగా అభియోగాలను విచారించవలసి వచ్చింది.
ఈ బీభత్సకాండ ప్రాతిపదికగానే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. ఇతగాడికి బీభత్సంతో సంబంధం లేకపోయినప్పటికీ అక్రమంగా ఆయుధాలను నిలువ చేసినట్టు న్యాయ ధ్రువీకరణ జరిగింది. సంజయ్ దత్‌ను శిక్షాకాలం పూర్తికాక ముందే విడుదల చేయడం మరో వివాదం. ఈ వివాదం ఇప్పుడు ముంబయి హైకోర్టు పరిశీలనలో ఉంది. ఏమైనప్పటికీ 1993 నాటి రక్తపాతానికి కుట్ర చేసిన దావూద్ ఇబ్రహీం తదితరులు పాకిస్తాన్‌లో సురక్షితంగా ఉన్నారు. ‘ఇంటర్ పోల్’ సహకారం ద్వారా ఇతగాడిని ఇప్పటికైనా తరలించుకొని రావడానికి మన ప్రభుత్వం యత్నించాలి. దావూద్‌ను శిక్షించినపుడు మాత్రమే 1993 నాటి మృతుల ఆత్మలకు శాంతి.. వారి కుటుంబాలకు ఉపశమనం..