సంపాదకీయం

ఛక్మాలకు ఉపశమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్మా హజోంగ్ తెగలకు చెందిన బంగ్లాదేశీయ హిందూ శరణార్థులకు మన దేశపు పౌరసత్వం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించడం ‘అఖండ భారత’ విభజన నాటి గాయాలకు కొంత ఉపశమనం. క్రీస్తుశకం 1947 ఆగస్టులో మత ప్రాతిపదికన జరిగిన దేశ విభజన కారణంగా బెంగాల్ అస్సాం ప్రాంతాలలోని ‘ఇస్లాం బాహుళ్య’ ప్రాంతాలు తూర్పు పాకిస్తాన్‌గా ఏర్పడినాయి. తూర్పు పాకిస్తాన్ 1971లో బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. కానీ తొంబయి శాతం హిందూ వనవాసీ చక్మా హజోంగ్ తదితర వనవాసీ జన సముదాయాలు నివసించిన చిట్టగాంగ్ జిల్లాను తూర్పు పాకిస్తాన్‌లో కలపడం దశాబ్దుల పాటు ఈ గిరిజన తెగల ప్రజలు కడగండ్లపాలు కావడానికి కారణం! చిట్టగాంగ్ జిల్లాను అవశేష భారత్‌లో కలిపి ఉండాలి. ఎందుకంటె ఆ జిల్లాలోని ప్రజలలో ఇస్లాం మతస్థుల జనాభా కేవలం తొమ్మిది శాతం. ‘ఇస్లాం మెజారిటి’ ప్రాంతాలను మాత్రమే పాకిస్తాన్‌గా ఏర్పాటు చేయాలన్న బ్రిటన్ సామ్రాజ్యవాదుల పథకానికి వ్యతిరేకంగా చిట్టగాంగ్ జిల్లాను పాకిస్తాన్‌లో కలపడం పెద్ద కుట్ర. పాకిస్తాన్‌ను కోరిన ముస్లింలీగ్, బ్రిటన్ ప్రభుత్వం కలసికట్టుగా కుట్రను చేశాయి. చిట్టగాంగ్ ఓడరేవును పాకిస్తాన్‌కు కట్టబెట్టడం ఈ కుట్రకు లక్ష్యం! అందువల్ల హిందూ వనవాసీ తెగలు అధికంగా ఉండిన జిల్లాను మొత్తం తూర్పు పాకిస్తాన్‌లో కలిపారు! ఈ అక్రమ విలీనాన్ని 1947నాటి అవశేష భారత్ నాయకులు, ప్రభుత్వం నిరోధించలేకపోవడం చారిత్రక వైఫల్యం. ఫలితంగా పాకిస్తాన్ ఏర్పడిన వెంటనే చిట్టగాంగ్‌లోని హిందువులపై జిహాదీ ఉగ్రవాదుల దాడులు మొదలయ్యాయి. మొత్తం తూర్పు పాకిస్తాన్‌లోని జనాభాలో 1947లో దాదాపు మూడవ వంతు హిందువులు, చిట్టగాంగ్ జిల్లాలో మాత్రం తొంబయిశాతం హిందువులు. కానీ దశాబ్దుల పాటు బంగ్లాదేశ్‌లో ‘జిహాదీలు’ అల్పసంఖ్యాక హిందువులను హత్య చేశారు, బలవంతంగా మతం మార్చారు, హిందూ మహిళలపై లైంగిక అత్యాచారాలు జరిపారు. హిందువుల ఆస్తులను స్వాధీనం చేసుకొని వారిని తరిమివేశారు! ఫలితంగా నిర్మూలనకు గురి అవుతున్న హిందువుల సంఖ్య ప్రస్తుతం బంగ్లాదేశ్ జనాభాలో ఎనిమిది శాతంకంటె తక్కువకు దిగిజారిపోయింది!! చిట్టగాంగ్ జిల్లాలోసైతం హిందువుల జనాభా తొంబయిశాతం నుంచి యాబయి శాతానికంటె తక్కువకు దిగజారిపోవడం అఖండ భారత్ విభజన వల్ల సంభవించిన విపరిణామక్రమం! చక్మాల భూములను, ఆస్తులను అక్రమంగా జిహాదీలు స్వాధీనం చేసుకోవడం 1947 నుండీ ఆరంభమైంది. వేల చక్మాలను ‘జిహాదీలు’ హత్య చేశారు. లక్షల చక్మాలు ప్రాణభయంతో పారిపోయి వచ్చి మన ఈశాన్య ప్రాంతంలో స్థిరపడినారు..
ఇలా శరణార్థులుగా వచ్చిపడిన వారికి మన ప్రభుత్వాలు డెబ్బయి ఏళ్లుగా న్యాయం చేయలేకపోవడం అమానవీయ వైపరీత్యం. ఇప్పుడైన, సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించబట్టి మన ప్రభుత్వం చక్మాలకు భారత పౌరసత్వాన్ని ప్రసాదించాలని నిర్ణయించింది. 2015లో ఈ శరణార్థులకు భారతీయ పౌరసత్వం ప్రసాదించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తరువాత కూడ రెండేళ్లు గడచిపోయాయి. ఇప్పటికైన ఈశాన్య రాష్ట్రాలలో ‘శరణార్థులు’గా జీవిస్తున్న దాదాపు లక్షమంది బంగ్లాదేశీయ చక్మాలకు భారతీయ పౌరసత్వం లభించడం ముదావహం. ఆఫ్ఘానిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాలలో మతోన్మాద బీభత్సకాండకు గురి అయి మన దేశానికి శరణార్థులుగా వచ్చి చేరిన వారిని మన దేశపు పౌరసత్వం కల్పించాలని 2015 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వపు చట్టాన్ని సవరించాలని కూడ ప్రభుత్వం నిర్ణయించింది! ఈ నిర్ణయానికి ‘ఆచరణ’ రూపం బుధవారం నాటి దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ సమావేశంలో జరిగిన నిర్ణయం. అయితే ఈశాన్య ప్రాంతంలోని వనవాసీ ప్రజలకు లభిస్తున్న ‘అనుసూచిత జన సముదాయాల’ - షెడ్యూల్డ్ ట్రయిబ్స్ - హోదాను చక్మాలకు ప్రసాదించడంపై కేంద్రం ఇంకా నిర్ణయించకపోవడం విచిత్రం! ఈ విషయమై స్పష్టమైన వివరాలను దేశ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజీజు వెల్లడించలేదు.!!
దేశ విభజన సమయంలో న్యాయంగా మనదేశంలో కలవవలసిన చిట్టగాంగ్ బంగ్లాదేశ్‌లో కలపడం చక్మాలకు జరిగిపోతున్న దారుణమైన అన్యాయానికి కారణం!! చిట్టగాంగ్ మనదేశంలోనే ఉండినట్టయితే చక్మాలు సహజంగానే మనదేశపు పౌరులుగా కొనసాగి ఉండేవారు. ఈశాన్య ప్రాంతంలోని వనవాసీలకు లభిస్తున్న ‘షెడ్యూల్డ్ ట్రయిబ్స్’ హోదా వారికి న్యాయంగా దక్కి ఉండేది! చక్మాల కడగండ్లు ఇలా దేశ విభజనతో ముడిపడిన వ్యవహారం! పాకిస్తాన్‌లోని జిహాదీల బీభత్స కాండ ఫలితంగా 1950 వరకూ మనదేశంలోకి వచ్చేసిన అల్పసంఖ్యాక పాకిస్తానీ హిందువులకు సహజంగానే మనదేశపు పౌరసత్వం లభించింది! కానీ పాకిస్తాన్‌లోనే, తరతరాలుగా తాము జీవించిన చోట్ల కొనసాగాలని భావించిన హిందువులు అప్పటినుంచి ద్వితీయ తృతీయ శ్రేణి పౌరులుగా జీవించవలసి వస్తోంది!! జాతీయతను మతోన్మాదం దిగమింగిన ఫలితం ఇదంతా! అనాదిగా మన దేశంతో అనేక మతాలు ఉన్నప్పటికీ ‘సర్వమత సమభావం’ మన జాతీయ జీవన స్వభావమైంది! 1947లో అఖండ భారత విభజన జరిగిన తరువాత కూడ ‘అవశేష భారత్’లోను ఈ సర్వమత సమభావ వ్యవస్థ సర్వసమగ్రంగా కొనసాగుతోంది! అందువల్లనే అల్పసంఖ్యాక మతాలవారు మన దేశంలో హాయిగా జీవిస్తున్నారు. కానీ ‘సర్వమత సమభావం’ హత్యకు గురి అయిన పాకిస్తాన్‌లో జిహాదీ మతోన్మాదం అస్పసంఖ్యాక హిందువులపై మంటలు కక్కుతోంది! మన దేశం నుండి ఇతర దేశాలకు ఎవ్వరూ శరణార్థులై వెళ్లిపోవడం లేదు. సర్వమత సమభావం ప్రజస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ ఇందుకు కారణం! పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి అల్పసంఖ్యాకులు, నిర్మూలనకు గురి అయి, మనదేశంలోకి పారిపోయి వస్తున్నారు. జిహాదీ మతోన్మాదాన్ని పెంచిన ‘మత రాజ్యాలు’గా ఆ దేశాలు అవతరించాయి కనుక!! ‘చక్మాల’ పలాయనానికి ఇదీ ప్రాతిపదిక...
చిట్టగాంగ్ జిల్లా నుంచి 1964 - 1969 సంవత్సరాల మధ్య నిర్మూలనకు గురి అయిన చక్మాలు దాదాపు లక్షమంది ప్రస్తుతం ఈశాన్య ప్రాంతంలో నివసిస్తున్నారు. దాదాపు లక్షమంది చక్మాలను గతంలో మన ప్రభుత్వాలు నిర్దయగా తిరిగి బంగ్లాదేశ్‌కు తరలించాయి!! అక్రమ ప్రవేశకులను తిప్పి పంపలేని ప్రభుత్వాలు నిస్సహాయులైన చక్మాలను తిప్పి పంపాయి. 2003 తరువాత ఆఫ్ఘానిస్తాన్‌లోని అల్‌ఖాయిదా, తాలిబన్ తండాలు చిట్టగాంగ్ ప్రాంతానికి చేరడం చక్మాలపై ఇటీవల దాడులు పెరగడానికి కారణం! చిట్టగాంగ్‌లోని చక్మాలకు హిందువులకు రక్షణ కల్పించడం మన ప్రభు త్వం నైతిక బాధ్యత! ‘సర్వమత సమభావం’ జిహాదీల మత విద్వేషానికి సమాధానం.. పరిష్కారం!