సంపాదకీయం

రోహింగియాలలో ‘ఖాయిదా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మా నుంచి మనదేశంలోకి అక్రమంగా చొరబడిన, చొరబడుతున్న ‘రోహింగియా’ తెగ ప్రజలను ‘జిహాదీ’ బీభత్సకారులుగా తీర్చిదిద్దడానికి కుట్ర జరుగుతుండడం ధ్రువపడిన వాస్తవం! సామియున్ రహమాన్ అనే సోమవారం ఢిల్లీలో పట్టుబడిన, ‘అల్‌ఖాయిదా’ జిహాదీ హంతకుడు ఈ కుట్రకు సరికొత్త సాక్ష్యం! మనదేశానికి వ్యతిరేకంగాను బర్మాకు వ్యతిరేకంగాను బీభత్స కృత్యాలను కొనసాగించడానికై ‘రోహింగియా’లను ఈ హంతకుడు ‘జిహాదీ’లుగా తీర్చిదిద్దుతున్నాడన్నది మన భద్రతా దళాలు వెల్లడించిన వాస్తవం! ‘రోహింగియా’లు శరణార్థులు కాదని అక్రమ ప్రవేశకులని వారివల్ల మనదేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని మన ప్రభుత్వం పదేపదే స్పష్టం చేసింది! రోహింగియాలలో పాకిస్తానీ ‘ఐఎస్‌ఐ’ ప్రతినిధులు, ‘ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్యం’ - ఐసిస్- దళారీలు ఉన్నారని సోమవారం మన ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. ‘అల్‌ఖాయిదా’ దుండగుడు పట్టుపడడం మరో ధ్రువీకరణ.. మనదేశానికి ఇతర దేశాలకు వలస వచ్చిన ‘రోహింగియా’ ముస్లింలు తిరిగి స్వదేశానికి తిరిగి రావడానికి తాము అభ్యంతరం చెప్పబోమని బర్మా-మ్యాన్‌మార్- ప్రభుత్వ అధినేత ఆంగ్‌సాన్ సూచీ మంగళవారం ప్రకటించడం హర్షణీయం. బర్మా ప్రభుత్వాన్ని అనవసరంగా తప్పు పడుతున్న ‘ఐక్యరాజ్య సమితి మానవ అధికారుల సంఘం’ వారికి సూచీ స్పష్టీకరణ సకాలంలో లభించిన సమంజమైన సమాధానం! మన ఫ్రభుత్వాన్ని కూడ ‘ఐక్యరాజ్య సమితి’ గత వారం రోజులకు పైగా ‘రోహింగియా’ల సమస్యతో ముడిపెట్టి విమర్శించడం అనవసరమైన అక్రమ ప్రమేయానికి నిదర్శనం! ఆంగ్ సూచీ ప్రభుత్వం తమ దేశంలోని ‘రఖాయిన్’ ప్రాంతానికి తిరిగి వచ్చే రోహింగియా ప్రజలకు సకలవిధ భౌతిక రక్షణను జీవన భద్రతను కల్పించడానికి మంగళవారం హామీ కూడా ఇచ్చింది! ఐక్యరాజ్య సమితిలో మన ప్రభుత్వ ప్రతినిధి ఈ ‘హామీ’పట్ల హర్షామోదాలను ప్రకటించడం మన దేశ భద్రతకు అనుగుణమైన పరిణామం! సామాన్య రోహింగియాలతో చేరిపోయిన జిహాదీ బీభత్సకారులు మన ప్రజల భద్రతకు మన ప్రాదేశిక సమగ్రతకు ముప్పుగా పరిణమించిన వాస్తవాన్ని మన ప్రభుత్వం పదేపదే వెల్లడిస్తోంది! ‘రోహింగియా’లకు మన దేశంలో శాశ్వత నివాసం కల్పించాలని కొన్ని రాజకీయ పక్షాలు చేస్తున్న ఆందోళనలు భద్రతపట్ల ధ్యాస లేనివారి విధానాలకు నిదర్శనం! ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం చెప్పినట్టు ‘రోహింగియా’ల వ్యవహారం బర్మా దేశపు అంతర్గత సమస్య. దాన్ని అనవసరంగా పరిష్కరించే బాధ్యతను మన నెత్తికెత్తుకొనడం అర్థంలేని వ్యవహారం! రోహింగియాలలో పాకిస్తాన్ ప్రభుత్వ జిహాదీ బీభత్స విభాగమైన ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్’ -ఐఎస్‌ఐ- ముష్కరులు చేరిపోవడం ఆశ్చర్యం కాదు. ప్రపంచంలోని జిహాదీ ఉగ్రవాద ముఠాలన్నింటికీ అనుసంధాన వ్యవస్థ ‘ఐఎస్‌ఐ’ అన్నది జగమెరిగిన సత్యం!!
ఈ నేపథ్యంలో ‘రోహింగియా’ల తరఫున సర్వోన్నత న్యాయస్థానంలో ‘న్యాయయాచిక’లు దాఖలు కావడం విచిత్రమైన విపరిణామం! సర్వోన్నత న్యాయస్థానం ఈ వివాదం విచారణను అక్టోబర్ మూడవ తేదీకి వాయిదా వేయడంతో రోహింగియాలను తరలించే కార్యక్రమానికి తాత్కాలికంగా అవరోథం ఏర్పడినట్టే. ఇతర దేశాల నుంచి మనదేశంలోకి చొరబడిన ‘అక్రమ ప్రవేశకుల’ తరలింపు గురించి నిర్ణయించే అధికారం కార్యనిర్వాహక రాజ్యాంగ విభాగం -ఎగ్జిక్యూటివ్ -పరిథిలోనిది. ఈ విభాగం కేంద్రప్రభుత్వం. ఇదే విషయాన్ని సోమవారం సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన ‘ప్రమాణ పత్రం’లో స్పష్టం చేసింది. అందువల్ల ఈ అక్రమ ప్రవేశకుల వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోరాదన్నది ప్రభుత్వం చేసిన నివేదన! పార్లమెంటు - శాసన నిర్మాణ విభాగం - కేంద్రప్రభుత్వం - కార్యనిర్వాహక విభాగం - న్యాయ విభాగం - న్యాయస్థానాలు - మన ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలో స్వతంత్ర విభాగాలు! ఒక విభాగం పరిథిలోకి మరో విభాగం చొరబడరాదన్నది ‘సమతుల్య’ సిద్ధాంతం! ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడినప్పుడు, రాజ్యాంగ బద్ధమైన విధులను నిర్వహించకపోయినప్పుడు ఉన్నత సర్వోన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకొనడం ‘నియంత్రణ’ సూత్రం! కానీ ‘రోహింగియా’లను బర్మాకు తిప్పిపంపడం ఈ నియంత్రణ సూత్రం పరిథిలోకి రాదు...
ఈ విషయమై జోక్యం కల్పించుకునే అధికారం తమకు ఉందా? లేదా? అన్న సందేహం సర్వోన్నత న్యాయస్థానం వారికి కూడ కలగడం మరింత ఆశ్చర్యకరం. ‘‘జోక్యం కల్పించుకునే అధికారం ఈ న్యాయ స్థానానికి ఉందా? ఈ అధికార పరిథి స్వభావం ఏమిటి?? అన్న విషయం మొదట నిర్ధారణ కావాలి...’’ అని సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా స్వయంగా వ్యాఖ్యానించాడు! అందువల్ల అక్టోబర్ మూడవ తేదీన సముగ్రమైన విచారణను నిర్వహించనున్నారట! సర్వోన్నత న్యాయస్థానానికి స్ఫురించిన సందేహానికి సమాధానం చెప్పవలసినవారు కూడ సర్వోన్నత న్యాయస్తానంవారే! ఏమయిప్పటికీ సామాన్య రోహింగియా ప్రజల కడగండ్లకు ఏకైక కారణం స్వయంకృతాపరాధం.. బర్మాలోని ‘రఖాయిన్’ ప్రాంతంలో అధిక సంఖ్యాకులు పదమూడు లక్షల మంధి ‘రోహింగియా’ ముస్లిం లు! ఈ ‘రఖాయిన్’ - అరకాన్ - ప్రాంతం మన ఈశాన్య ప్రాంతాలకు, బంగ్లాదేశ్‌కు సరిహద్దులలో నెలకొని ఉంది! బర్మాలోని ఇతర ప్రాంతాలలోను ఇరుగుపొరుగు తూర్పు ఆసియా దేశాలలోను మరో పదిహేను లక్షలమంది ‘రోహింగియా’లు నివసిస్తున్నారట! ఈ ‘రోహింగియా’ ముస్లింల పూర్వులు పశ్చిమ ఆసియా ప్రాంతాల నుండి వాణిజ్య నౌకలలో విడతలు విడతలుగా వచ్చి బర్మాలో స్థిరపడినారన్నది వారి విశ్వాసం! బర్మాను బ్రిటన్ సామ్రాజ్యవాదులు అఖండ్ భారత్ నుంచి విడగొట్టి పోయారు! బర్మాను విడగొట్టిన తరువాత పదేళ్లకు మరోసారి భారతదేశాన్ని ముక్కలు చేసి పాకిస్తాన్‌ను ఏర్పాటు చేశారు. ఇస్లాం మత ప్రాతిపదికపై పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి బర్మాలోని ఈ ‘అరకాన్’ ప్రాంతంలోని ‘రోహింగియా’లను ప్రత్యేక దేశం ‘పగటికల’ ఆవహించింది. సువిశాలమైన బర్మాలో బౌద్ధులు అధిక సంఖ్యాకులు. ఈ చిన్న రఖాయిన్ ప్రాంతంలో ‘రోహింగియా’లు అధిక సంఖ్యాకులు!! అందువల్ల భారత్ నుంచి పాకిస్తాన్ విడివడిన ‘‘స్ఫూర్తి’’ రోహింగియాలకు దాపురించింది!! ఫలితంగా బర్మాను విడగొట్టి ‘రఖాయిన్’ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడానికై ‘రోహింగియా’ జిహాదీలు బౌద్ధులకు వ్యతిరేకంగా హత్యాకాండ మొదలుపెట్టారు!!
ఈ హత్యాకాండ అసలు సమస్య.. జిహాదీల బర్మా దేశ విద్రోహాన్ని సామాన్య ‘రోహింగియా’ ప్రజలు సమర్థిస్తున్నారా? లేదా? అన్నది వౌలికమైన ప్రశ్న! దశాబ్దుల ఈ ప్రశ్నకు రోహింగియాలు ఇప్పుడైన సమాధానం చెప్పాలి! ‘జిహాదీ’లను దేశ ద్రోహులను వ్యతిరేకించే ‘రోహింగియా’లకు భయం లేదన్నది సూచీ ఇచ్చిన హామీ...