సంపాదకీయం

అరభ్బీల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలకు అందని అతి భయంకర వాస్తవమిది. భావానికి పట్టుబడని లైంగిక బీభత్సకాండ ఇది! దశాబ్దులుగా దేశవ్యాప్తంగా వేలాది మంది బాలికలను ‘పెళ్లి’ పేరుతో అరబ్ దేశాలకు తరలించుకొనిపోయారు, పోతున్నారు. వారిని బలవంతంగా పడుపు వృత్తిలోకి దింపి వారి బతుకులును బుగ్గి చేశారు, చేస్తున్నారు! అరబ్ ‘షేక్’ల రూపంలోని తోడేళ్లు, ‘ఖాజీ’ల రూపంలోని గుంట నక్కలు, దళారీల రూపంలోని పిశాచాలు ఆడపిల్లల జీవితాలపై దాడులు చేస్తూనే ఉన్నారు! నీచులు, నికృష్టులు, మృగాలు, రాక్షసులు, ముష్కరులు, బీభత్సకారులు- వంటి పదాలు ఏవి కూడ ఈ లైంగిక బీభత్సకాండను సాగిస్తున్న మూకలను వర్ణించడానికి సరిపోవు! ఇలా నకిలీ పెళ్లిళ్లు చేసుకుని హైదరాబాద్ నుంచి బాలికలను తరలించుకొని పోతున్న అరబ్బీ లైంగిక బీభత్సకారులలో ఎనిమిది మందిని బుధవారం అరెస్టు చేసిన హైదరాబాదు పోలీసులు మానవత్వాన్ని ఎంతో కొంత పరిరక్షించగలిగారు. దానవత్వాన్ని అదుపు చేయగలిగారు. కానీ దేశమంతటా ఎంతమంది అరబ్బీ దుండగులు, లైంగిక బీభత్సకారులు ఆడపిల్లలను వేటాడుతున్నారన్నది అంతుపట్టని వ్యవహారం. హైదరాబాద్‌లో ఇలా అరబ్బీ ‘షేకు’లుగా పేరు మోసిన ఎనిమిది మంది లైంగిక బీభత్సకారులుతోపాటు భారీ సంఖ్యలో దళారీలు, లాడ్జిల, హోటళ్ల యజమానులు, నకిలీ పెళ్లిళ్లు జరిపించే ‘ఖాజీ’లు పట్టుబడ్డారు. పట్టుబడనివారు ఎంతమంది అన్నది ప్రశ్న! మన దేశంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన నిస్సహాయ బాలికలను ‘పెళ్లి’ పేరుతో అరబ్ దేశాలలోని కామాంధ లైంగిక ఉగ్రవాదులకు అమ్మివేయడం దశాబ్దులుగా జరుగుతున్న ఈ అత్యాచారం! ఇలా యుక్తవయస్సు వచ్చీరానివారిని, పసితనం తొలగని మిసిమి వయసువారిని, అరవైనుండి తొంబయి ఏళ్ల వరకు వయసొచ్చిన ముసలి పెళ్లికొడుకులకు కట్టబెట్టే ముఠాలు దేశమంతటా ఉన్నాయట! ఈ ముఠాలకు ప్రధాన అనుసంధానకర్తగా ముంబయిలో నివసిస్తున్న ఫరీద్ అహమ్మద్ ఖాన్ అనే నరరూప రాక్షసుడు వ్యవహరిస్తున్నాడట! ఇక్కడ, హైదరాబాద్ పోలీసులు ఈ నకిలీ పెళ్లిళ్ల ముఠాను ‘అరెస్టు’ చేసి పనె్నండు మంది బాలికలను ‘నరక కూపం’లో పడకుండా కాపాడిన సమయంలోనే, అక్కడ ముంబయిలో ఈ ఫరీద్ అహమ్మద్ ఖాన్‌ను అరెస్టు చేశారట! ప్రధాన ‘ఖాజీ’ వేషం వేసుకున్న ఈ ఫరీద్ అహమ్మద్ ఖాన్ అనే బీభత్సకారుడు ఇప్పటికే దేశమంతటా ఇలాంటి వేలాది నకిలీ పెళ్లిళ్లు చేయించాడట! సమాన సంఖ్యలోని బాలికలను ఇలా ‘మొగ్గ’ దశలోనే బుగ్గి చేశాడట...!
ఇప్పుడిలా కొంతమంది పైశాచిక స్వభావులను పట్టుకొని కటకటాల వెనక్కి నెట్టడం హైదరాబాద్ పోలీసుల నిఘా నైపుణ్యానికి నిదర్శనం... కానీ దశాబ్దుల తరబడి వేలాది బాలికలు ఇలా నకిలీ పెళ్లిళ్లకు బలి అయిపోవడాన్ని నిరోధించలేకపోవడం దేశవ్యాప్తంగా మన ప్రభుత్వాల వైఫల్యం... బాలికలు యువతులు లైంగిక అత్యాచారాలకు గురి అయినప్పుడల్లా ‘ఉలిక్కి’ పడి మేలుకొంటున్న ‘నిఘా’ ఈ నకిలీ పెళ్లిళ్ల విషయంలో మాత్రం ‘నిద్దుర’ పోయినట్లు దశాబ్దుల చరిత్ర సాక్ష్యం చెబుతోంది. మహిళా చైతన్య సాధనకు, మహిళా అధికార సిద్ధికి, స్ర్తి పురుష సమానత్వ ప్రాప్తికి, మహిళా వ్యతిరేక వివక్షను రూపుమాపడానికి ఉద్యమాలు చేస్తున్న వారికి సైతం ఇలా వేలాదిమంది బాలికలు మన దేశం నుండి ‘బానిసలు’గా అరబ్ దేశాలకు తరలిపోతున్న ధ్యాస లేదు! ఇదంతా మన సమాజ సమష్టి వైఫల్యానికి చిహ్నం, కొనసాగుతున్న విషాదానికి నిదర్శనం. ఇలా పనె్నండు పంతొమ్మిది మధ్య వయస్సుకల బాలికలను ‘‘పెళ్లి’ చేసుకుంటున్న అరబ్బీ వృద్ధ కామాంధులలో కొందరు మనదేశంలోనే కొన్ని నెలలు వారితో ‘‘కాపురం’’ చేశారట! ఆ తరువాత చెప్పకుండా తమ దేశాలకు జారుకుంటున్నారు! గర్భవతులైన ఈ బాలికలు పిల్లలను కని పెంచవలసి వస్తోంది. మరి కొందరు అరబ్బీ ముసలి ముష్కరులు ‘‘మా దేశానికి త్వరలో నిన్ను పిలిపించుకుంటాను’’ అని హామీ ఇచ్చి వెళ్లిపోతున్నారట! మళ్లీ ఈ ‘అరబ్బీ’ జాడ తెలియదు! కొందరు ‘అరబ్బీ’లు ‘్ఫన్లు’ చేసి ‘తలాఖ్’ చెప్పేస్తున్నారట!
ఇలా పెళ్లయిన తరువాత ఆరునెలలు, సంవత్సరం తిరగకుండానే వందలాది బాలికలు ‘అనాథ’లుగా మిగిలిపోతున్నారన్న భయంకర వాస్తవం మానవత్వానికి చెరగని కళంకం! వేలాది మంది- ఇలా నకిలీ పెళ్లికి బలైపోయిన -వధువులలో ఓమన్, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాలకు తరలిపోయారు, పెళ్లి చేసుకున్న ముసలి షేకులు వారిని తరలించుకుపోయారు. కానీ అక్కడికి వెళ్లిన తరువాత ఈ వధువులను బలవంతంగా వేశ్యావృత్తిలోకి దింపడం పరిపాటి అయిపోయింది! నిరాకరించిన బాలికలను సామూహిక లైంగిక అత్యాచారాలకు గురి చేస్తున్నారట! నిజానికి ఇలా మన దేశానికి వచ్చి పెళ్లి చేసుకొని బాలికలను తరలించుకొనిపోతున్న నకిలీ పెళ్లి కొడుకులు వేశ్యాగృహాల నిర్వాహకులు! అలా వేలమంది బాలికలు యువతలు ఇదివరకే అరబ్ దేశాలలోని అక్రమ లైంగిక కలాపాల నరక కూపాలలో బందీలయిపోయారు! బతికి బయటపడిన వారు తాము అనుభవించిన శారీరక మానసిక లైంగిక చిత్రవధలను గురించి వివరించారు. ఈ పైశాచిక కాండను అరబ్ దేశాల ప్రభుత్వాలు పరోక్షంగా ప్రోత్సహిస్తు ఉండడం ప్రచారం కాని వాస్తవం! దౌత్య నియమాల పేరుతో సౌదీ అరేబియా వంటి దేశాల ప్రభుత్వాలు దౌత్య బీభత్సకాండను కూడ కొనసాగిస్తున్నాయి!! ఈ బీభత్స కాండను ప్రతిఘటించలేకపోవడం మన ప్రభుత్వ వైఫల్యం. అందువల్లనే సౌదీ అరేబియా వంటి దేశాలకు ‘గృహ సహాయకులు’గా, ‘వంటకత్తెలు’గా వెళ్లిన మన దేశం వారు చిత్రహింసలపాలయ్యారు! ఘరానా సౌదీ మహిళలు మన దేశపు మహిళలకు తిండి పెట్టకుండా మాడ్చారు, రెండవ అంతస్థుల నుంచి కిందకి తోశారు!
ఢిల్లీలోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో పనిచేసిన మజీద్ హసన్ అషూర్ అనే లైంగిక బీభత్సకారుడు ఇద్దరు నేపాలీ మహిళలను దాదాపు ఐదునెలల పాటు గురుగావ్‌లోని తన నివాసంలో బందీలుగా ఉంచాడు! వాడి కుటుంబ సభ్యులు ఆ మహిళల చేత వెట్టి చాకిరీ చేయించారు, తిండి పెట్టకుండా మాడ్చారు. మజీద్, వాడి బంధుమిత్రులు ఈ మహిళలపై లైంగిక అత్యాచారాలు జరిపారు. నిర్భయ చట్టం ప్రకారం అతగాడికి ఆజీవన కారాగృహ నిర్బంధ శిక్షను విధించవచ్చు. కానీ అతగాడు దౌత్యవేత్త! అందువల్ల దర్జాగా 2015 సెప్టెంబర్‌లో స్వదేశానికి వెళ్లిపోయాడు! అభియోగం లేదు... శిక్షలేదు! మన ప్రభుత్వం సౌదీ అరేబియాకు మోకరిల్లింది.. అరబ్బీల బీభత్సం నుండి భారతీయ మహిళలకు విముక్తి ఎప్పుడు??