సంపాదకీయం

గుర్తుకువచ్చిన గోద్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్‌లోని గోద్రా రైలుస్టేషన్ సమీపంలో యాబయి తొమ్మిదిమంది హిందువులను సజీవ దహనం చేసి చంపిన జిహాదీ బీభత్సకారులకు గుజరాత్ హైకోర్టు సోమవారం శిక్షలను ఖరారు చేయడంతో ఈ విషాదం మరోసారి స్ఫురణకు వచ్చింది! పాకిస్తాన్ ప్రేరిత ‘జిహాదీ’ హంతకులు 1947 నుంచి కొనసాగిస్తున్న బీభత్సకాండలో గోద్రా దగ్ధకాండ భాగం. ఉత్తరప్రదేశ్‌లోని ఫయిజాబాద్ నుంచి గుజరాత్‌లో అహమ్మదాబాద్‌కు వెడుతుండిన సబర్మతీ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఒక ‘పెట్టె’ను 2002 ఫిబ్రవరి 22వ తేదీన దుండగులు పూర్వ నిర్ధారిత పథకం ప్రకారం నిప్పుపెట్టారు. అయోధ్యలో శ్రీరామజన్మభూమి మందిర ప్రాంగణంలో కరసేవకు వెళ్లి తిరిగి వస్తుండిన యాబయి తొమ్మిది మంది ‘రామ సేవకులు’ మంటలకు ఆహుతైపోయారు. ‘బోగీ’లో చెలరేగిన మంటల ఫలితంగా మరో నలబయి ఒక్కమంది ‘కరసేవకులు’ క్షతగాత్రులయ్యారు! దాదాపు పనె్నండు వందలమంది కరసేవకులు ప్రయాణిస్తుండిన ఈ రైలు గోద్రా స్టేషన్‌లో ఆగినపుడు బీభత్సకారులు రాళ్ల వర్షం కురిపించారు. రైలు మళ్లీ బయలుదేరిన తరువాత కొద్దిసేపటికి ఆగిపోయింది. పెట్టెలలోకి చొరబడిన దుండగులు గొలుసు లాగి రైలును నిలిపివేసినట్టు ఆ తరువాత వెల్లడైంది. ఒక బోగీపైకి పెట్రోలు, కిరోసిన్ చల్లి దుండగులు నిప్పంటించారు! ఇదే రైలులో కొద్దిరోజుల క్రితం అయోధ్యకు వెళ్లిన ‘రామభక్తుల’కు దుండుగులకు మధ్య గోద్రాలో వాగ్వాదం జరిగినట్లు కూడ వెల్లడైంది! అందువల్ల దాడి చేయాలని, హత్యాకాండ కొనసాగించాలని దుండగులు ముందుగానే కుట్ర చేశారన్నది న్యాయస్థానాలలో ధ్రువపడిన వాస్తవం! గోద్రాలో ఇలా రైలును ఆపి అనేకమందిని సజీవ దహనం చేయడం 1947లో దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌లో అల్పసంఖ్యాకులైన హిందువులపై జరిగిన దాడులను తలపింప చేసింది. 1947లో ‘జిహాదీ’లు పంజాబ్‌లోని ఝీలం జిల్లాలోని ‘కామాక్షి’ రైలు స్టేషన్ సమీపంలో హిందువులను ఊచకోత కోయడం చారిత్రక విషాదం. ఒక రైలులోని దాదాపు అందరినీ 1947లో జిహాదీలు హత్య చేశారు! ‘జిహాదీ’లు జరుపుతున్న జరిపిన ఈ భయంకర బీభత్సం స్వభావాతక్మమైనది! ప్రపంచంలోని అన్ని ఇతర మతాలను నిర్మూలించి ‘ఇస్లాం’ను ఏకైక మతంగా నిలబెట్టే వరకూ ఈ హత్యాకాండను కొనసాగించడం ఈ జిహాదీల స్వభావం! అందువల్ల శతాబ్దుల తరబడి ‘జిహాదీ’లు మన దేశంలోను ఇతర దేశాలలోను ఇస్లామేతర మతస్థులను నిష్కారణంగా నిష్కరుణగా హత్య చేస్తున్నారు. ఇస్లామేతర మతాల వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చుతున్నారు, మహిళలను దారుణ లైంగిక అత్యాచారాలకు గురి చేస్తున్నారు. ఇస్లామేతరులను తరిమివేస్తున్నారు...
గోద్రా దహనకాండకు ముందూ తరువాత కూడా జిహాదీ బీభత్సకాండ ప్రమాదం మన దేశానికి నిరంతరం పొంచి ఉంది! మనదేశంలో మాత్రమేకాదు, దాదాపు అన్ని ఖండాలలోను ‘జిహాదీ’ హంతకులు ‘‘అన్యమత’’ నిర్మూలనను కొనసాగిస్తూనే ఉన్నారు! క్రీస్తుశకం 712లో అరేబియా నుంచి జిహాదీలు మన దేశంలోకి చొరబడిన నాటి నుంచి మనకు ఈ బీభత్సకాండ ప్రమాదం తప్పడం లేదు. 712 నాటికే ‘జిహాదీ’లు పర్షియా దేశంలో భయానక రక్తపాతం సృష్టించారు. పారశీక జాతి మొత్తం నిర్మూలనకు గురికావడానికి, పర్షియా ‘ఇరాన్’గా మారడానికి జిహాదీల బీభత్సకాండ కారణం. నేటి అఫ్ఘానిస్తాన్‌లో ఒకప్పుడు గాంధార, యోన వంటి అనేక రాజ్యాలుండేవి. వేద, బౌద్ధమతాలను జిహాదీలు నిర్మూలించారు. గాంధారం ఆఫ్ఘానిస్తాన్‌గా మారింది! గోద్రా బీభత్స కాండకు ఇలాంటి చారిత్రక దుర్ఘటనలు విషాద నేపథ్యాలు! అయోధ్యకు వెళ్లి తిరిగి వస్తుండిన కరసేవకులను చంపాలన్న జిహాదీల కుట్ర ఇలా ‘జిహాదీ’ల స్వభావానికి అనుగుణం. జిహాదీ బీభత్సకాండ ఏ ఇతర పరిణామానికి కాని ఘటనకు కాని ప్రతిక్రియ కాదు, ప్రతిఘటన కాదు. జిహాదీ బీభత్సకాండ స్వభావాత్మకం, ఆవుపై పాడి పశువులపై దాడి చేయడం తోడేళ్ల స్వభావం. ఇతర మతాలవారిపై దాడి చేయడం జిహాదీ తోడేళ్ల సహజ స్వభావం! ఈ స్వభావం వల్లెనే క్రీస్తుశకం 1526లో విదేశాల నుంచి వచ్చి చొరబడిన బాబర్ అనే మొఘలాయి బర్బరుడు 1528లో అయోధ్య రామజన్మభూమి మందిరాన్ని ధ్వంసం చేశాడు.. ఈ జిహాదీ బీభత్సకాండ ఫలితంగానే 1947 ఆగస్టులో తరతరాలుగా ‘అఖండం’గా ఉండిన భరతభూమి బద్దలైంది, పాకిస్తాన్ ఏర్పడింది!! ఈ ఏర్పాటుతో జిహాదీల బీభత్సకాండ ఆగిపోయిందన్నది 1947నకు పూర్వం జరిగిన ప్రచారం...
కానీ పాకిస్తాన్ ఏర్పాటుతో ‘జిహాదీ’లు మరింత వికృతంగా మరింత భయంకరంగా విరుచుకొని పడడం ఆరంభమైంది! ‘గోద్రా’ దహనకాండ ఈ దశాబ్దుల పాకిస్తానీ బీభత్సకాండకు ‘ప్రతీక’ మాత్రమే. 1947 అక్టోబర్‌లోనే పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స ప్రేరిత ‘జిహాదీ’లు, ప్రచ్ఛన్న బీభత్సకారులైన పాకిస్తాన్ సైనికులు జమ్మూకశ్మీర్‌లోకి చొరబడ్డారు. అల్పసంఖ్యాక హిందువులను ఊచకోత కోశారు. 1947లో కశ్మీర్ లోయ ప్రాంతపు జనాభాలో ఇరవై ఏడు శాతం ఉండిన హిందువుల సంఖ్య, 1991 నాటికి సున్న శాతం కావడానికి కారణం ‘జిహాదీ’లు సాగించిన బీభత్సకాండ! ఇలా కశ్మీర్‌లోయ నుంచి హిందువుల నిర్మూలన జరిగిన తరువాత కూడ ‘జిహాదీ’లు బీభత్సకాండను విడనాడలేదు, జమ్మూకశ్మీర్‌లోని సైనిక దళాలపై, సైనిక స్థావరాలపై దాడులు మొదలుపెట్టారు! గోద్రా దహనకాండకు ముందు, తరువాత దేశమంతటా ‘జిహాదీ’లు నిరంతరం బీభత్సకాండ జరుపుతూనే ఉన్నారు. ఈ బీభత్సకాండకు సూత్రధారి పాకిస్తాన్ ప్రభుత్వం! అందువల్ల పాకిస్తాన్ ప్రభుత్వ జిహాదీ స్వభావంలో మార్పు వచ్చే వరకు, ఆ ప్రభుత్వం మన దేశంలోకి జిహాదీ తోడేళ్లను ఉసిగొల్పడం మానుకోదు! ‘గోద్రా’ ఘటన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బీభత్స వ్యవస్థగా అంతర్జాతీయ సమాజంలో ప్రకటింప చేయడానికి మన ప్రభుత్వం యత్నించింది. ఆ ప్రయత్నాన్ని ఆ తరువాత మానుకోవడం తరువాతి పరిణామక్రమం! పాకిస్తాన్ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసుకొని ఆ ప్రభుత్వాన్ని బీభత్స వ్యవస్థ - టెర్రరిస్ట్ రిజీమ్-గా మన ప్రభుత్వం ఇప్పుడైన ప్రకటించాలి! ఇలా ముందు మనం ప్రకటించిన తరువాతనే ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్‌ను అభిశంసించి, బీభత్స వ్యవస్థగా ప్రకటింప చేయడానికి మన ప్రభుత్వం కృషి చేయాలి! ఆఫ్రికాలో, పశ్చిమ ఆసియాలో, అమెరికాలో, ఐరోపాలో, బర్మాలో తూర్పు ఆసియాలో విస్తరిస్తున్న బీభత్సకాండకు కేంద్రం పాకిస్తాన్! మన ప్రభుత్వం పూనుకుంటే, అందువల్ల ఇతర దేశాలు సహకరించగలవు...
గోద్రా హంతకులలో పదకొండు మందికి ప్రత్యేక న్యాయస్థానం 2011లో మరణ శిక్షను విధించింది. మరో ఇరవై మందికి యావజ్జీవ కారాగృహ నిర్బంధ శిక్షను విధించింది. గుజరాత్ హైకోర్టు సోమవారం మరణ శిక్షలను రద్దు చేసి ఆ పదకొండు మందికి కూడ యావజ్జీవ నిర్బంధాన్ని ఖరారు చేసింది!! న్యాయ ప్రక్రియలో జరిగిన విపరీత విలంబనాన్ని న్యాయస్థానమే నిరసించింది! మృతుల కుటుంబాలకు ఇంతవరకు సరైన పరిహారం లభించకపోవడం ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనం..