సంపాదకీయం

‘కల్తీ’ కాలుష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంపం పొట్టు సపోటా విత్తనాల పిండి కలపి విష రసాయనాలను చేర్చి ‘కమ్మటి’ వాసనలను వెదజల్లే మసాలా దినుసులను తయారు చేస్తున్నారట! చక్కెర మరికొన్ని రసాయనాలు కలిసిన కల్తీ ద్రావకాన్ని స్వచ్ఛమైన పుట్టతేనెగా చెలామణి చేస్తున్నారట! తాజాగా తేనెపట్టును దులిపి ఈ ‘తేనె’ను సేకరించినట్టు జనాన్ని ఈ ‘కల్తీ’ కామందులు నమ్మించడం దశాబ్దులుగా కొనసాగుతున్న వంచన క్రమంలో భాగం! హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలలోను, శివారు ప్రాంతాలలోను ఇతర చోట్ల శుక్రవారం ‘కల్తీ’ నిరోధక అధికారులు జరిపిన దాడులకు ఇదీ నేపథ్యం. ఒకే ‘గిడ్డంగి’లో రెండు వందల పెట్టెల కల్తీ వేరుసెనగ నూనె పొట్లాలు అధికారులకు పట్టుబడ్డాయి. పట్టుబడని కల్తీ నూనెల, ఇతరేతర నకిలీ ఆహార పదార్థాల ‘పరిమాణం’ ఎంత ఉందోమరి. అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో మరి! తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కల్తీ ముఠాలపై పెద్దఎత్తున ‘సమరం’ ఆరంభించింది. ‘కల్తీ’ ‘ముఠాల’ను పసికట్టడానికి పట్టుకొనడానికి వలసిన సిబ్బంది కొరతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆయా సంబంధిత విభాగాలలో ‘ఖాళీ’గా ఉన్న ఉద్యోగాలను తక్షణం భర్తీ చేయాలని నిర్ణయించినట్టు గతనెల ఆరంభంలో ప్రచారమైంది. ఆహార ప్రమాణ పరిరక్షణ విభాగంలో అధికారుల సంఖ్యను మూడురెట్లకు పెంచాలని కూడ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందట! ఆహార నియంత్రణ విభాగంలోను, ఆహార స్వచ్ఛతను ప్రమాణాలను పరీక్షించే ప్రభుత్వం ప్రయోగశాలలలోను సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరగనున్నదట. శుక్రవారం ‘కల్తీ’ బట్టీలపై గిడ్డంగులపై జరిగిన దాడులు బహుశా ఈ నూతన సమరంలో భాగం కావచ్చు...
ఉభయ తెలుగు రాష్ట్రాలలోను దేశవ్యాప్తంగాను సంఘ విద్రోహపు వాణిజ్య మూకలు హానికరమైన విష రసాయనాలతోను ఇతర వ్యర్థాలతోను ఆహార పదార్థాలను కల్తీ చేస్తుండడం గురించి వినియోగదారులు పట్టించుకోవడం లేదు. దాదాపు అన్ని ఆహార పదార్థాలు ఏదో రకంగా ‘కల్తీ’ అవుతున్నాయి కాబట్టి, కనిపెట్టడం సామాన్యులకు సాధ్యం కాదు కాబట్టి ఫలితాలను ‘ప్రారబ్దానికి’ వదిలేసి జనం ‘కల్తీ’ సంగతిని మరచిపోతున్నారు. మనకు రోగాలు రావాలని ‘‘వ్రాసి ఉంటే’’ ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ‘కల్తీ’ ఆహారాలు మన నోళ్లకు పొట్టలలోకి ప్రవేశించకమానవు. మనకు రోగాలు రాకూడదని ‘‘వ్రాసి ఉంటే’’ మనం ఎంత అజాగ్రత్తగా ఉన్నప్పటికీ ‘కల్తీ విషం’ నిండిన ఆహార పదార్థాలు మన ఇళ్లలోకి నోళ్లలోకి చేరవు-అన్నది వినియోగదారుల వేదాంతం! ఏ ‘కంపెనీ’ వారి ఏ ‘పాల ప్యాకెట్టు’లోని పాలు ‘కల్తీ’ అయ్యాయి, ఏ పాల ‘ప్యాకెట్టు’లోని పాలు స్వచ్ఛంగా ఉన్నాయి?? అన్నది ఎలా కనిపెట్టాలి?? వంద ‘‘స్వచ్ఛమైన పాలున్న ప్యాకెట్ల’’ సమూహంలోకి ‘‘మరో వంద కల్తీ పాల ప్యాకెట్లు’’ చేరిపోతున్నాయట! జనాదరణ పొందిన కంపెనీల లేబుళ్లను అంటించి మసాలా పొడులను, మిరప పొడులను ఇతర రకరకాల వంటింటి పదార్థాలను జనం మీదికి తోలుతున్న ‘ముఠాలు’ ప్రతిచోట ఏర్పడిపోతున్నాయి. బాటల పక్కన, రహదారుల పక్కన వెలసి ఉన్న ‘ఆహార శాలల’లో స్వచ్ఛమైన నూనెలు వాడుతున్నారా?? ఎముకలను ఉడకబెట్టి పిండిన నూనెలను వాడుతున్నారా?? వినియోగదారులు ఎలా తెలుసుకోవాలి?? తాము ఎముకల నూనెను వాడుతున్నామని అనేక భోజన కేంద్రాల - టిఫిన్ సెంటర్ల, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల - యజమానులకు తెలుసు. కాని తెలియని ‘్భజన కేంద్రాల’ యజమానులు కూడ ఎందరో ఉన్నారు. వారిని నూనె సరఫరాదారులు మోసం చేస్తున్నారు. నిజానికి అనేక సందర్భాలలో పాల సరఫరాదారులకు, నూనె సరఫరాదారులకు సైతం తాము ‘నకిలీ’లను అమ్ముతున్నట్లు తెలీదు. ‘ఉత్పత్తి’ చేస్తున్న ముఠాలు వారిని మోసగిస్తున్నాయి! పంపిణీ వ్యవస్థలో ఆహార పదార్థాలు చేతులు మారుతున్న చోటల్లా యంత్రాలు పెట్టి ఎవరు పరీక్షించగలరు?? రుచిని పెంచడం కోసం తేనీరులో కూడ నిషిద్ధ పదార్థాలు కలుపుతున్న భోజన శాలలు, పానీయశాలలు వెలసి ఉన్నాయట! ఇలా ‘సాంకర్యం’ - కల్తీ - ‘కాలుష్యం’ ఎడాపెడా జనజీవన రంగంపై దాడి చేస్తుండడం నడుస్తున్న చరిత్ర!
స్వచ్ఛ్భారత పునర్‌నిర్మాణ ప్రక్రియను ఆహార సాంకర్యం, పరిసరాల కాలుష్యం అడుగడుగునా నిలదీస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాలు నిరంతరం ‘కల్తీ’ ముఠాలపై దాడులు చేస్తున్నప్పటికీ, ఈ ముఠాలు అంతరించడం లేదు. మరింతగా విస్తరించిపోతున్నాయి. గత జూలై ఐదవ తేదీన హైదరాబాద్ శివారు ప్రాంతాలలో పోలీసులు అధికారులు నిర్వహించిన దాడులలో గుట్టలు కొద్దీ ‘కల్తీ’ మిరపపొడి, కల్తీ ధనియాల పొడి బయటపడింది. దాదాపు ఐదువందల క్వింటాళ్ల నాసిరకం మిరపకాయలు, పనికిరాని మిరపకాయలు, పొలాల్లో రైతులు వదిలిపెట్టిన తెల్లబారిన మిరపకాయలు పట్టుబడినట్టు ప్రచారమైంది. ఈ తెల్ల మిరపకాయలను దంచి ‘ఎఱ్ఱటి’ రసాయనాలను కలిపి ఆవకాయ కోసం ఉపయోగించే శ్రేష్ఠమైన మిరపపొడిగా ప్రచారం చేయడం ‘కల్తీ’ సామ్రాజ్యం విస్తరించిన తీరునకు నిదర్శనం. దాదాపు మూడు వందల క్వింటాళ్ల ‘కల్తీ’ ధనియాల పొడి, ఆవాలపొడి, పసుపు కల్తీ ప్రక్రియలో ఉపయోగించే విష రసాయనాలు కూడ అప్పుడు పట్టుబడ్డాయి. ఆ తరువాత అంతకుముందు దాదాపు ప్రతివారం ఎక్కడో అక్కడ కల్తీ సామగ్రి ఆవిష్కృతవౌతూనే ఉంది! వందల మంది నేరస్థులు పట్టుబడుతున్నప్పటికీ వేలాది నేరస్థులు యథావిధిగా కల్తీ బట్టీలను నిర్వహిస్తూనే ఉన్నారు! బియ్యం సంచుల్లో ‘ప్లాస్టిక్’ బియ్యం చేరిపోయాయన్నది గత జూన్‌లో జరిగిన ప్రచారం! ప్లాస్టిక్ బియ్యం ఏవి? సహజమైన బియ్యం ఏవి? అన్నది తెలుసుకోలేక జనం అనేక రోజులపాటు విలవిలలాడారు. సోయా చిక్కుడు గింజలను, ‘యూరియా’ వంటి ఎఱువులను ఇతర రసాయనాలను ‘కల్తీ’ చేసి కృత్రిమమైన పాలను తయారు చేస్తున్న ముఠాలు దేశమంతటా వెలసి ఉన్నాయన్నది రెండేళ్ల క్రితం జరిగిన ప్రచారం. పేరుమోసిన పాల ఉత్పత్తి సంస్థలు కూడ ‘కల్తీ’ సరుకును జనం మీదికి తోలుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 2014 నవంబర్‌లో తెలంగాణ శాసనసభలో ఈ కల్తీపాల గురించి, కల్తీ సంస్థల గురించి పెద్ద రభస జరిగింది! బొగ్గు రసాయనాలలోను, చైనా పౌడర్ వంటి విషాలతోను పండ్లను కూరగాయలను మెరిపించే కల్తీ ప్రక్రియ ఇప్పటికీ ఆగడం లేదు! ఎప్పుడో అప్పుడు ‘కల్తీ’పై పెద్దఎత్తున దాడులు జరగడం, ప్రచారం కావడం, ఆ తరువాత సద్దుమణిగిపోవడం నిరంతరం పునరావృత్తం అవుతున్న ప్రహసనం. ‘కల్తీ’ కాలుష్యం పెరుగుతూనే ఉంది...
సేమ్యాలలోను, ‘బ్రెడ్’లోను, శీతల పానీయాలలోను ఇతరమైన నిలువ ఉండే డబ్బాల ఆహారంలోను కొన్ని రసాయనాలను ‘పరిమిత’ పరిమాణంలో కలపడానికి వీలు కల్పిస్తున్న ప్రభుత్వాల విధానం ‘కల్తీ’ని పరోక్షంగా చట్టబద్ధం చేస్తుండడం ప్రజలకు ధ్యాసలేని మహా వైపరీత్యం! ‘పరిమిత’ పాళ్లలో ఈ రసాయన విషాలను కలపడానికి అనుమతి పొందిన పారిశ్రామిక సంస్థలు, ప్రధానంగా విదేశాల నుంచి చొరబడి ఉన్న ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ పరిమితికంటె మించి అనేక ‘రెట్లు’గా ఈ రసాయనాలను కలుపుతున్నాయి.. ‘రుచి’ పెంచడం కోసం!!