సంపాదకీయం

వౌలిక చికిత్స...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వతంత్రం - అని అంటే సొంత పద్ధతి. ‘స్వతంత్ర’ జీవన పద్ధతికి సంబంధించినది ‘స్వాతంత్య్రం’! మన దేశం అనేక శతాబ్దుల పాటు ‘స్వాతంత్య్రానికి’ దూరం కావడం చరిత్ర. విదేశీయ దురాక్రమణ ‘పాలన’గా వ్యవస్థీకృతమై ఉండిన సమయంలో మన సొంత పద్ధతులన్నీ అడుగంటాయి, అటకెక్కాయి. ఇది సహజం! ఎందుకంటే ఇంటిలో తిష్ఠ వేసిన దొంగలు ఇంటిలోని వారిని బందీలు చేసిన దోపిడి మూకలు ఇంటి పద్ధతులను భగ్నం చేయడం, తమ వికృత పద్ధతులను ప్రవేశపెట్టడం సహజం! కానీ దొంగలు ఇంటినుంచి నిష్క్రమించిన తరువాత ఇంటిలోని వారు ‘ఇంటితనాన్ని’ పునరుద్ధరించుకోవడం స్వాతంత్య్రం! ప్రపంచంలో విదేశీయ దురాక్రమణనుండి విముక్తమైన దాదాపు అన్ని దేశాల వారు తమ ఇంటితనాన్ని తమ జాతీయ జీవన వ్యవస్థను పునరుద్ధరించుకున్నారు. మన దేశంలో మాత్రం ఈ ‘పునరుద్ధరణ’ గురించి పాలకులకు, ప్రభుత్వ నిర్వాహకులకు, మేధావులకు, ప్రముఖులకు పెద్దగా ధ్యాస లేకపోవడం ఏడు దశాబ్దుల వైపరీత్యం! ధ్యాస ఉన్న వారి మాటకు విలువ లేకపోవడం, ప్రచారం లేకపోవడం ‘స్వతంత్రం’ పేరుతో కొనసాగుతున్న ‘పరతంత్రం’ వదలకపోవడానికి మరో కారణం! విదేశీయుల పాలన పద్ధతులు, విద్యా పద్ధతులు, వైద్య పద్ధతులు ‘నాగరిక’ పద్ధతులు మన నడినెత్తిమీద తిష్ఠవేసి ఉండడం కొనసాగుతున్న వికృత జీవన వైచిత్రి! యుగ యుగాల పాటు స్వజాతికి శారీరక మానసిక బౌద్ధిక స్వస్థత సమకూర్చిన ‘అయుర్వేద వైద్యం’ విదేశీయుల పెత్తనం కొనసాగిన కాలంలో అవమానానికి గురి అయింది. ఆదరణకు దూరమైంది. ఆయుర్వేద పద్ధతి చికిత్స మూఢ విశ్వాసమన్న భ్రాంతిని బ్రిటన్ విద్యావిధానం వ్యాపింపచేసింది! గ్రామ గ్రామాన, మారుమూలలలోసైతం తరాలపాటు వైద్య సేవలను అందించిన సంప్రదాయ వైద్యులు ఎగతాళికి, అపహాస్యానికి గురి అయ్యారు! ఆయుర్వేదం ప్రకృతి ప్రసాదించిన వరం, ప్రకృతిలో నిహితమైన సహజ స్వస్థత.. కానీ, విదేశాలనుంచి వచ్చి పడిన ‘ఇంగ్లీషు’ వైద్యం-అల్లోపతి- ధాటికి ‘ఆయుర్వేదం’ మూలపడింది. పథకం ప్రకారం కొనసాగిన బ్రిటన్ సామ్రాజ్యవాదుల కుట్ర కారణంగా ఆయుర్వేద గ్రంథాలను చదువగల భాషా పరిజ్ఞానం లేని ఉన్నత విద్యావంతులు తయారయ్యారు! ఇంగ్లీషు వైద్యం విస్తరించింది, సమాంతరంగా విచిత్రమైన కొత్త రోగాలు కూడ పుట్టుకొచ్చాయి. పుట్టుకొస్తూనే ఉన్నాయి!
అఖిల భారత ఆయుర్వేద సంస్థ ఆవిర్భవించడానికి ఇదంతా నేపథ్యం. సనాతన జాతీయ వైద్యవిధానం ఆయుర్వేదం. సనాతనం అని అంటే సృష్టిగతమైన శాశ్వతమైన తత్త్వం. ఈ ఆయుర్వేద చికిత్సకు కొత్త ఊపిరి పోయడానికి ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం నడుం బిగించడం స్వచ్ఛ భారత్ పునర్ నిర్మాణానికి దోహదం చేయగలదు. ప్రతి జిల్లాలోను కనీసం ఒక ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో ఆయుర్వేదం పట్ల ధ్యాస పెరిగే అవకాశం ఉంది. ధ్యాస పెరగడం ప్రధానమైన వౌలికమైన అనివార్యం! ఆయుర్వేద చికిత్స సృష్టితో సమాంతరంగా మానవ జీవన నిహితమై ఉంది. ‘ఉచ్ఛ్వాస నిశ్వాసాలు’ అశ్వనీ దేవతలకు ప్రతీక అయిన శ్వాస క్రియ. ఈ శ్వాస క్రియ లోపం లేకుండా కొనసాగినంత కాలం శరీరంలో రక్తప్రసరణం సజావుగా కొనసాగుతుంది. వౌలిక ఆరోగ్య సూత్రం ఇది! అశ్వనీ దేవతలు వౌలిక వైద్యులు. ఈ వౌలిక తత్త్వం పదిలంగా ఉండడానికి అసంఖ్యాక వన మూలికలు దోహదం చేయడం ఆయుర్వేదం! సృష్టి స్వచ్ఛత సమాజ స్వచ్ఛతతో, ప్రకృతి పరిశుభ్రత మానవ జీవన స్వస్థతతో అనుసంధానమై ఉందన్న వౌలిక వాస్తవం ఆయుర్వేదం! ప్రకృతి ప్రసాదిస్తున్న సహజ వైద్యం ఆయుర్వేదం. అందువల్ల మన దేశంలో పుట్టి పెరిగిన ఈ వైద్యం వౌలిక వైద్యం- ఒరిజినల్ మెడిసిన్! విదేశాలనుంచి వ్యాపించిన ‘అల్లోపతి’ వైద్యం ప్రత్యామ్నాయ వైద్యం-ఆల్టర్‌నేటివ్ మెడిసిన్-! ఇదీ న్యాయం, తర్కబద్ధమైన వాస్తవం!!
బ్రిటన్ సామ్రాజ్యవాదులు మన దేశాన్ని దోపిడీ చేసిన కాలంలో ఈ న్యాయాన్ని భంగపరిచారు, ఈ వాస్తవాన్ని వికృతపరిచారు! ‘అల్లోపతి’ని ‘వౌలిక వైద్యం’గాను, భారతీయమైన ‘ఆయుర్వేదాన్ని’ ‘ప్రత్యామ్నాయ వైద్యం’గాను ప్రచారం చేసారు, వాస్తవాన్ని వక్రీకరించారు, చరిత్రను చెఱచారు! ఇదే భ్రాంతికి ఇప్పటికీ మన వైద్య రంగం, విశ్వవిద్యాలయ విజ్ఞానం గురి అయి ఉండడం తొలగని భావదాస్య ప్రవృత్తికి నిదర్శనం! బ్రిటన్ వారు ‘పాలన’ పేరుతో ‘శోషణ’ సాగించిన కాలంలో భారతీయమైన ప్రతి పద్ధతి కూడ ‘తక్కువది..’ అన్న ప్రచారం జరిగింది, పాశ్చాత్యమైనది ప్రతీదీ ‘గొప్పది..’ అన్న భ్రాంతి బలిసింది. అందువల్లనే ‘నేటివ్ మెడిసిన్’-స్వజాతీయ ఔషధం-స్థానికమైన మందు- పట్ల క్రమంగా భారతీయులకే నిరాదరణ ఏర్పడింది. ‘నేటివ్’ -స్థానిక- అన్న పదం ‘నాటు’గా మారి ఆయుర్వేద ఔషధం ‘నాటుమందు’గా ప్రచారమైంది. ‘నాటుమందు’ తక్కువది అల్లోపతి ‘సూదిమందు’ గొప్పది- అన్నది బ్రిటన్ బీభత్స పాలననాటి వారసత్వం. హైదరాబాద్‌లోని ఒక అల్లోపతి ఆసుపత్రిలో మార్చి, 2015లో ఒక ‘నర్సు’ ఒకే సిరంజితో సూదితో యాబయి తొమ్మిది మంది పిల్లలకు మందు ఎక్కించడం ఈ గొప్పతనానికి పరాకాష్ఠ! సిరంజిని కాని సూదిని కాని కడగకుండానే ఇంతమందికి ‘ఇంజెక్షన్’ ఇవ్వడం ఇచ్చిన వారి మానసిక ‘స్వచ్ఛతకు’ గీటురాయి..
కేంద్ర ప్రభుత్వం అమలు జరుపతలపెట్టిన ఆయుర్వేద వైద్య విస్తరణ వల్ల ‘స్వచ్ఛత’ మళ్లీ ఏర్పడే అవకాశం ఉంది. ‘అల్లోపతి’ మందులు ఒక రోగాన్ని కుదిర్చి మరో రోగాన్ని సంక్రమింప చేస్తాయన్నది నిరాకరింపజాలని నిజం. దీన్ని ‘అనుబంధ ప్రభావం’-సైడ్ ఎఫెక్ట్-అని అంటున్నారు! ఈ ‘సైడ్ ఎఫెక్ట్’ శరీర స్వచ్ఛతకు విఘాతకరం... ‘అల్లోపతి’ మందుల వ్యర్థాలు నగరాలలో గుట్టలు గుట్టలుగా ఎక్కడపడితే అక్కడ పేరుకుని పోయి ప్రకృతి స్వచ్ఛతకు భంగం కలిగిస్తున్నాయి. ఈ రెండు వైపరీత్యాలనూ ‘ఆయుర్వేద వైద్యం’ వల్ల తొలగించుకోవచ్చు! పతంజలి, ధన్వంతరి, సుశ్రుతుడు మొదలైన భారతీయ చికిత్సకులు నడచిన ‘బాట’ నేడు వెలవెలపోతోంది! బ్రిటన్ విద్యావేత్తలు ‘సంస్కృత భాష’ను తొలగించినందువల్ల జరిగిన విపరిణామం ఇది! అనాదిగా ఈ దేశంలో ఉన్నత విద్యాబోధనకు మాధ్యమం సంస్కృత భాష! బ్రిటన్ పాలకులు ‘సంస్కృతాన్ని‘ ఆ స్థానం నుంచి తొలగించడం వల్ల ఆయుర్వేదంతోపాటు అన్ని భారతీయ విద్యలూ అడుగంటాయి. దేశానికి ‘సమీకృత చికిత్స’- ఇంటిగ్రేటెడ్ ట్రీట్‌మెంట్- జరగడం ప్రస్తుత అనివార్యం. ఈ సమీకృత చికిత్స పేరు సంస్కృత భాష...