Others

విద్యతోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్య ఒక ఆయుధం. ప్రజలు దానిని ఉపయోగించుకుని ఎదగాలి. బ్రిటిష్‌వారి ఆంగ్లవిద్యావిధానం, స్వాతంత్య్రం అనంతరం మనదేశంలో అమలు చేసిన విద్యావిధానం, స్వదేశీ విద్యావిధానాలలో రూపొందిన పాఠ్యాంశాలలో విలక్షణత కనిపిస్తుంది. ఈ విధానాలు ఎన్ని ఉన్నా అవి ప్రజల సామర్థ్యాన్ని పెంచే విధంగా ఉండాలి. అందుకు మన నేతలు ఎన్నో ఉత్తమ సూచనలు చేశారు. శక్తివంతమైన భారతజాతి అవసరాలను దృష్టిలో పెట్టుకుని మారిన పరిస్థితుల దృష్ట్యా ఆధునిక విద్యలను అందించాలని లాలా లజపతిరాయ్ సూచించారు. జాతి ప్రయోజనాల దృష్ట్యా సాధారణ విద్య మాత్రమే కాక వాణిజ్య, వృత్తి, సాంకేతిక విద్యపై దృష్టిపెట్టాలన్నది ఆయన అభిప్రాయం. దేశ తొలి విద్యామంత్రి వౌలానా అబుల్ కలాం ఆజాద్ సాంకేతిక విద్య ప్రాధాన్యతను గుర్తించి ఐఐటిలను స్థాపించి ఆచరణలోకి తీసుకువచ్చారు. భారతీయులు తమ శక్తియుక్తులను తమ కులం, వర్గ ప్రయోజనాలకు ఉపయోగిస్తూ జాతీయ సమైక్యతకు అడ్డంకులు ఏర్పరుస్తున్నారని, తాము గొప్పగా ప్రకటించుకునే మత సహనభావం, కులాల సమానత్వాన్ని అంగీకరించడంలో కనబరచకపోవడం శోచనీయంగా ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యాలయాల ఏర్పాటుకు ఆనాటి నాయకులు కొన్ని సూచనలు చేశారు. నిర్మాణుష్య ప్రదేశాలలో సమాజానికి దూరంగా విద్యాలయాలు ఏర్పరచడం వలన ప్రయోజనాలకంటే నష్టాలే అధికమన్నది లజపతిరాయ్ భావన. ఈకాలంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు దూరవిద్య ద్వారా విద్య అభ్యసిస్తున్నారు. బ్రిటిష్‌వారి కాలంలో జైలును అధ్యయన మందిరంగా మార్చుకున్న నాయకులలో బాలగంగాధర తిలక్ ప్రముఖులు. జైలులో ఆయన ఉన్న ఆరునెలల్లో దాదాపు 400 పుస్తకాలు సేకరించి చదివారు. ‘గీతారహస్యం’ రచన చేసిందీ అప్పుడే. విద్య నేర్చుకోవడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవన్నది ఆయన అనుభవం. ప్రాంతీయ భాషలలో విద్యాబోధన జరగాలన్నది బంకించంద్ర చఠర్జీ ఆలోచన. అప్పుడే జాతీయభావం, దేశభక్తి భావాలను బలంగా ప్రజల మనస్సుల్లోకి చొప్పించవచ్చన్నది ఆయన భావన. ఆయన రాసిన నవలలన్నీ బెంగాలీ భాషలోనే రాశారు. వాటిలో ఆనందమఠ్ ప్రసిద్ధమైనది. సార్వత్రిక విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఆయన నవలలు పాఠ్యగ్రంథాలుగా ఉపయోగపడ్డాయి. ఆధునిక స్ర్తివాద ఉద్యమ నాయకులలో తొలితరం ప్రతినిధులు జ్యోతిబా పూలే స్థాపించిన విద్యాలయాల్లో విద్య అభ్యసించినవారు కావడం ఒక విశేషం. జ్యోతిబా సతీమణి సావిత్రిబాయ్ పూలే, తారాబాయ్ షిండే, ముక్తాబాయ్ వంటివారు ఈ విద్యాలయాలలో చదివి స్ర్తిజనోద్ధరణకు ఉద్యమాలు నడిపారు. విద్య వివేకాన్ని ఇస్తుంది. అది లేకపోతే నైతిక విలువలు లోపిస్తాయి. దానివలన ప్రగతి కుంటుపడుతుంది. విద్యలేకపోతే అణచివేతకు గురవుతారు. విద్యలేకపోవడం వల్ల కలిగే అనర్థాలను అప్పటితరం నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికీ సంపూర్ణ విద్య సాకారం కాలేదు. ప్రజల్లో చైతన్యం వచ్చి విద్యావంతులైతే వారితోపాటు దేశం అభివృద్ధి చెందుతుంది.

-బి.శంకరరాజు