సంపాదకీయం

ప్రగతి ‘ప్రహేళిక’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అక్రమ లాభార్జన నిరోధక జాతీయ అధికార సంస్థ’ ఏర్పడడం వినియోగదారులకు ఆనందకరం. అక్రమ వ్యాపారులు వినియోగదారులను కొల్లగొట్టకుండా నిరోధించడానికి, అక్రమ వ్యాపారులను విచారించి న్యాయస్థానాల ద్వారా వారిని శిక్షింపచేయడానికి ఈ నూతన సంస్థ- అక్రమ లాభార్జన నిరోధక జాతీయ అధికార సంస్థ - నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ - ఏర్పాటు దోహదం చేస్తుందట! ‘వస్తు సేవల పన్ను’ - గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ - జిఎస్‌టి-ల వ్యవస్థలో భాగంగా ‘వినియోగ ప్రయోజన పరిరక్షణ’ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నూతన సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ‘జిఎస్‌టి’ వల్ల దాదాపు డెబ్బయి శాతం దుకాణాల వారు, వ్యాపారులు బుద్ధిగా, న్యాయంగా వ్యవహరించడం మొదలైందని జరుగుతున్న ప్రచారం. అంటే ముప్పయి శాతం వాణిజ్య వర్గాల వారు రకరకాల పద్ధతులను దుర్వినియోగం చేసుకొని కొల్లగొడుతూనే ఉన్నారన్నమాట! ఈ కొల్లగొట్టడం వల్ల వినియోగదారులు మోసపోతున్నారు. నిర్ణీత స్థాయికంటె అధిక ధరలను చెల్లించవలసి వస్తోంది. ఇది మొదటిరకం వాణిజ్య బీభత్సం. ప్రభుత్వానికి నిజంగా లభించవలసిన పన్నుకంటె తక్కువ లభించడం రెండవ వైపరీత్యం! ఈ కొత్త సంస్థ ఏర్పాటువల్ల ఈ రెండు రకాల నేరాలను నిరోధించవచ్చునన్నది ఆధికారిక ఆకాంక్ష వినియోగదారుల విశ్వాసం. ‘జిఎస్‌టి’ వల్ల ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, ఎగుమతులు తగ్గిపోతున్నాయని జరుగుతున్న ప్రచారానికి తార్కిక ప్రాతిపదిక లేదు. ‘జిఎస్‌టి’ వల్ల కొన్ని పదార్థాల ధరలు పెరిగి ఉండవచ్చు, మరికొన్నింటి ధరలు తగ్గి ఉండవచ్చు - పన్ను ప్రాతిపదికగా ఈ పెరుగుదల తగ్గుదల కన్పించవచ్చు! అందువల్ల మూడు నెలల పాటు ‘జిఎస్‌టి’ అమలు జరిగిన తరువాత అక్టోబర్‌లో ఎగుమతులు తగ్గిపోయాయి, కాని సెప్టెంబర్‌లో ఎగుమతులు పెరిగాయి. అందువల్ల ఎగుమతులు పెరగడానికి, తగ్గడానికి.. విదేశీయ వాణిజ్యం లోటు తగ్గడానికి, పెరగడానికి ‘జిఎస్‌టి’తో ప్రత్యక్ష సంబంధం లేదన్నది సామాన్య పరిజ్ఞానం, కానీ కొంతమంది ఆర్థిక విశే్లషకులు, వాణిజ్యవేత్తలు ‘జిఎస్‌టి’ వల్లనే ఎగుమతులు తగ్గిపోయాయని ప్రచారం చేయడం విచిత్రమైన వ్యవహారం. ‘జిఎస్‌టి’ అమలులోకి వచ్చిన తరువాత, పెద్ద పాత కరెన్సీ నోట్లు గత ఏడాది నవంబర్‌లో రద్దయిన తరువాత ‘వౌలిక పారిశ్రామిక రంగం’లో ఉత్పత్తులు - కొద్దికొద్దిగా కావచ్చు - పెరుగుతున్నాయి! నోట్ల రద్దువల్ల ‘చెలామణి’కి ఆటంకం ఏర్పడి పెట్టుబడులు, ఉత్పత్తులు తగ్గినట్లు విశే్లషించి ఈ విశే్లషణలకు ప్రచారవ్యాప్తి కల్పిస్తున్న వారు ఈ ‘వౌలిక’ ఉత్పత్తుల పెరుగుదల గురించి వౌనం వహిస్తున్నారు...
ఇది అంతర్గత వైపరీత్యం, మన ఎగుమతులు తగ్గడానికి కారణం ‘అంతర్జాతీయ వాణిజ్యం అనుసంధానం’ పేరుతో ‘ప్రపంచీకరణ’ శక్తులు సృష్టించిన మాయాజాలం. ‘బంగారు జింక’ వాణిజ్య వంచనల వల్లనే మన ఆర్థిక వ్యవస్థలో అధికార నిర్ణయాలకు, వాస్తవ జీవన వ్యవహారానికి మధ్య పొంతన కుదరడం లేదు. అందువల్లనే వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినా, తగ్గినా కూడ అటు వినియోగదారులు, ఇటు వ్యవసాయదారులు దళారీలు దోపిడీకి గురి అవుతున్నారు! కృత్రిమంగా కొరతలను సృష్టించడం, ధరలు తగ్గినట్లు భ్రమింపచేయించడం, ధరలు తగ్గినట్లు భ్రమింప చేయడానికై ‘తగ్గింపు’ - డిస్కౌంట్-లను ఆర్భాటంగా ప్రచారం చేయడం ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ మాయాజాలం. ఈ ‘మాయాజాలం’ దృశ్యమాధ్యమాలలోను అక్షర మాధ్యమాలలోను నిరంతరం ఆవిష్కృతవౌతోంది. అంతర్జాతీయ అనుసంధాన వ్యవస్థను నియంత్రిస్తున్న ‘బహుళ జాతీయ సంస్థలు’ మన ఉత్పత్తులను, పంపిణీని, ఎగుమతులను కూడ నియంత్రిస్తున్నాయి. ఈ ‘నియంత్రణ’ను ప్రభుత్వాలు నిరోధించలేకపోవడం ప్రవర్థమాన దేశాలను క్రమంగా దివాలా తీయించడానికై విస్తరించిపోతున్న ‘మార్కెట్ ఎకానమీ’- స్వేచ్ఛావాణిజ్య వ్యవస్థ... ఈ వ్యవస్థ ‘ప్రపంచీకరణ’లో భాగం! ‘జిఎస్‌టి’, ‘నోట్ల రద్దు’ వంటి చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచిన ప్రభుత్వం ‘ప్రపంచీకరణ’ గుదిబండను కూడ దించుకోవాలి!!
అలా జరగని పక్షంలో ‘జిఎస్‌టి’ ‘నోట్ల రద్దు’వంటి సముచిత చర్య ప్రభావాన్ని ‘ప్రపంచీకరణ’ శక్తులు దిగమింగివేయగలవు! సంపన్న దేశాలకు చెందిన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ అక్రమ విస్తరణను నిరోధించడం ‘గుదిబండ’ను దించుకునే ప్రయత్నంలో మొదటి అడుగు కాగలదు. సిమెంటు, ఉక్కు, బొగ్గు, విద్యుచ్ఛక్తి, ఇంధన తైలం, ఇంధన వాయువు - వంటి వౌలిక పారిశ్రామిక రంగాలకు మాత్రమే విదేశీయ సంస్థల పెట్టుబడులను, బహుళ జాతీయ సంస్థల భాగస్వామ్యాన్ని పరిమితం చేయాలి. మిగిలిన రంగాల నుంచి విదేశీయ సంస్థలను దశలవారీగా వెళ్లగొట్టాలి. విదేశీయ సంస్థలు వౌలిక పారిశ్రామిక రంగాలలో పెట్టుబడులను పెట్టడం లేదు. గత పదేళ్లలో ఒక్క ‘మెగావాట్’ విద్యుత్తును కూడ విదేశీయ సంస్థలు ఉత్పత్తి చేయలేదు. విష రసాయనాలు నిండిన చాక్లెట్లు, ఐస్‌క్రీమ్, శీతల పానీయాలు, సేమ్యాలు, అప్పడాలు, ఆవకాయలు, మసాలా దినుసులను మాత్రమే భారీగా ఈ ‘బహుళ’ సంస్థలు తయారు చేస్తున్నాయి. పంపిణీ రంగంలో చొరబడి భారీ ధరలకు ‘విత్తనాల’ను, ఎఱువులను, పురుగు మందులను అమ్మి లాభాలను తరలించుకొని పోతున్నాయి! విలాస భోజనశాలలు - రెస్టారెంట్స్ స్టార్ హోటల్స్ -లో తిండి పదార్థాలపై కాఫీ టీ వంటి పానీయాలపై కేంద్రప్రభుత్వం ‘జిఎస్‌టి’ని భారీగా తగ్గించింది, కానీ ఈ ‘ఘరానా’ భోజనశాలలవారు తిండి పదార్థాల ధరలను పెంచారు. ఇలా పెంచడానికి కారణం ఏమిటి? అందువల్ల ‘జిఎస్‌టి’ భారీగా తగ్గినప్పటికీ ‘ఘరానా రెస్టారెంటులలో తిండి ధరలు తగ్గలేదు. కొన్నిచోట్ల అతి కొద్దిగా తగ్గినప్పటికీ అనేక భోజనశాలలలో తిండి ధరలు భారీగా పెరిగాయట- సేవాశుల్కం తగ్గిన తరువాత!! ఇప్పుడు ఏర్పడిన ‘‘అక్రమ లాభార్జన నిరోధక జాతీయ అధికార సంస్థ’’ వారు చేయవలసిన మొదటిపని ఇలాంటి రెస్టారెంటులను, హోటళ్లను మూసివేయించడం...
‘జిఎస్‌టి’ వల్ల ‘నోట్ల రద్దు’ వల్ల ప్రగతి పుంజుకొంటోందన్నది వాస్తవం. కానీ ఇందుకు ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ దళారీల ప్రసంశాపత్రాలు మనకు అక్కరలేదు. అంతర్జాతీయ ఆర్థిక స్వచ్ఛంద పరిశోధక సంస్థలుగా చెలామణి అవుతున్న ‘మూడీస్’, ‘స్టాండర్డ్ అండ్ పూర్స్’ వంటివి నిజానికి బహుళ జాతీయ వాణిజ్య సంస్థల అక్రమ ప్రయోజనాలను పెంపొందించడానికి ఏర్పడిన ‘దళారీ సంస్థలు’! అందువల్ల మన పరపతి స్థాయి - సావరిన్ రేటింగ్ - పెరిగినట్లు శుక్రవారం ‘మూడీస్’ సంస్థ చేసిన నిర్థారణకు మనం మురిసిపోనక్కర లేదు. ఇలా ‘‘మురిసిపోవడం’’ ఈ ‘మూడీస్’ వంటి సంస్థలకు మనం కల్పిస్తున్న అనవసర ప్రాధాన్యం! మన ప్రగతిని, పరపతిని మన ప్రభుత్వం నిర్థారించాలి, నిర్థారిస్తోంది కూడ... ‘‘మూడీస్’’ ప్రమేయం అక్కరలేదు...