సంపాదకీయం

పద్మావతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పద్మావతి’ చలనచిత్రాన్ని డిసెంబరు ఒకటవ తేదీన విడుదల చేయడం లేదని నిర్మాతలు ప్రకటించడం ఆశ్చర్యకరం కాదు. మేవాడ్ రాజ్యానికి చెందిన మహారాణి పద్మినీదేవి చరిత్రను వక్రీకరించడానికి ఈ చలనచిత్ర రూపకర్తలు యత్నించారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతుండడం నిర్మాతల నిర్ణయానికి నేపథ్యం! ఆరోపణలలో వాస్తవం ఉన్నట్టయితే ‘పద్మావతి’ ‘నిర్మాతలు’ దేశచరిత్రకు జాతీయతకు విద్రోహం తలపెట్టడానికి ఒడిగట్టిన విద్రోహులు.. ‘చరిత్ర’ పేరుతో విచిత్ర విద్రోహ కల్పనలను వివిధ రకాల మాధ్యమాల- అక్షర మాధ్యమం, కళామాధ్యమం - లో ప్రచారం చేస్తున్న విబుధదైత్యులు సమాజబుద్ధికి ‘తీయటి’ విషాన్ని మప్పుతుండడం నడుస్తున్న ‘చరిత్ర’... ఈ ‘పద్మావతి’ సినిమాకు సాహిత్య సంగీతాలను దర్శకత్వాన్ని సమకూర్చిన వారు ‘విబుధ దైత్యులా? బౌద్ధిక బీభత్సకారులా? అన్నది నిర్ధారణ కాని నిజం! ఎందుకంటే ‘సినిమా’ విడుదల కాలేదు. ఎంపిక చేసుకున్న కొంతమందికి ఈ ‘పద్మావతి’ చిత్రాన్ని నిర్మాతలు చూపించారట! చూసిన వారిలో కొందరు బహిర్గతం చేసిన విషయాలు గత కొన్ని రోజులుగా ఈ ‘సినిమా’కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి కారణం! చారిత్రక వీరపత్ని, వీరమాత, భరతమాత వజ్రాల పుత్రిక మహారాణి పద్మిని రాజస్థాన్ ప్రాంతానికి చెందినది కాబట్టి ఆ రాష్ట్రంలో ఈ వ్యతిరేక ఉద్యమం ఉద్ధృతం కావడం సహజం. ఈ ‘సినిమా’ కథనంలో చోటుచేసుకున్న వక్రీకరణలను అవాస్తవాలను తొలగించిన తరువాత మాత్రమే చిత్రాన్ని విడుదల చేయడానికి అంగీకరించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం ఈ ఉద్ధృతిలో భాగం! ఈ చిత్రంలో పద్మినీదేవి - పద్మావతి -ని ఆమె సౌశీల్యాన్ని కించపరిచే విధంగా చిత్రీకరించారన్నది చిత్రాన్ని వ్యతిరేకిస్తున్న ‘శ్రీ రాజపుత్ర కరణీసేన’ - ఎస్‌ఆర్‌కెఎస్- చెబుతున్నమాట! ఇలా ‘‘కించపరచలేదు’’ అని సినిమాను నిర్మించిన ‘వయాకమ్ మోషన్ పిక్చర్స్’ వారు నిర్ద్వందంగా కొంతవరకు ప్రకటించలేదు. ఈ ‘సినిమా’ గొప్ప ‘‘కళాఖండమని’’ మాత్రమే చిత్ర నిర్మాతలు ప్రచారం చేస్తుండడం ‘‘కరణీ సేన’’ ఆరోపణలకు బలం ఇస్తోంది! నిజానిజాలు నిగ్గు తేలేవరకు చిత్రం విడుదల కాకుండా నిరోధించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లి చిత్రాన్ని నిషేధించింది. ‘‘తేలుకుట్టిన దొంగల’’వలె చిత్ర నిర్మాతలు చిత్రం విడుదలను వాయిదా వేయడానికి ఇదంతా పూర్వరంగం!
చరిత్రకు సంబంధించిన వాస్తవాల గురించి వక్రీకరణకు సంబంధించి చర్చ జరుగుతోంది. ఇందుకోసం చరిత్రకారులు, సాహిత్యవేత్తలు, కళాకారులు, ఇతర మేధావులు సభ్యులుగా ‘అధ్యయన సంఘం’ ఏర్పాటు కావాలన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి మాట సముచితం.. కానీ ఈ చిత్ర నిర్మాతలు కేంద్రీయ చలనచిత్ర అనుమతి ప్రదాన మండలి - సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్ట్ఫికేషన్ - సిబిఎఫ్‌సి-నిబంధనలను ఉల్లంఘించారన్నది మాత్రం ఇప్పుడు స్పష్టమైపోయింది. ఇలా ఉల్లంఘించిన నేరానికి ‘అనుమతి ప్రదాన మండలి’ అధ్యక్షుడు ప్రసూన జోషి చిత్ర నిర్మాతలను బహిరంగంగానే అభిశంసించాడు, సంజాయిషీ కోరాడు! ‘సినిమా’ను నిర్మించినవారు మొదట దాన్ని ‘మండలి’ సభ్యులకు చూపించాలి! ‘మండలి’ సూచనల మేరకు తగిన మార్పులు కూడ చేయాలి! ‘మండలి’ అనుమతి పొందిన తరువాతనే ప్రచార మాధ్యమాలవారికి ఇతరులకు ‘సినిమా’ను చూపించాలి! కానీ ఈ ‘వయాకమ్ మోషన్ పిక్చర్స్’ యజమానులు ఈ చిత్రాన్ని మాధ్యమాలలోని ఎంపిక చేసిన కొందరికి, తమకు ఇష్టమైన ఇతరులకు ముందుగానే చూపించారు! ‘సిబిఎఫ్‌సి’ నిబంధనలను ఇలా ఉల్లంఘించడం శాసనబద్ధ సంస్థల పట్ల రాజ్యాంగ వ్యవస్థపట్ల ఈ నిర్మాతలకున్న తేలిక భావానికి నిదర్శనం. ఇలా మాధ్యమాలకు ‘సినిమా’ను - అనుమతి పొందని సినిమాను - చూపించిన వారు ‘కరణీసేన’ ప్రతినిధులకు కూడ చూపించి ఉండవచ్చు! అభ్యంతరకరమైన విషయాలు, చారిత్రక అసత్యాలు లేవని నిరూపించి ఉండవచ్చు!
ఈ సినిమాను తమకు చూపించగలమని వాగ్దానం చేసిన నిర్మాతలు మాట తప్పినట్టు ‘కరణీసేన’ సంస్థాపకుడు లోకేంద్రసింగ్ కల్వీ, అధ్యక్షుడు మహీపాల్‌సింగ్ మక్రానా ఆరోపించారు. నిర్మాతలు ఈ ఆరోపణకు సమాధానం చెప్పడం లేదు, ‘అనుమతి ప్రదాన మండలి’ ఆరోపణలకు సమాధానం ఇవ్వడం లేదు. పద్మినీదేవి క్రీస్తుశకం పదునాలుగవ శతాబ్ది ఆరంభం నాటి మేవాడ్ మహారాణి, భీమసేన రతన్‌సింగ్ - భీమ్‌సింగ్ - అర్థాంగి. ఆమె సనాతన హైందవ జాతీయ స్వభావానికి మాతృరూపం, తరతరాలుగా చరిత్రను వెలిగిస్తున్న సౌశీల్య దీపం. క్రీస్తుశకం 712వ సంవత్సరంలో అరేబియా నుంచి మహమ్మద్ బిన్ కాసిమ్ అనే జిహాదీ బీభత్సకారుడు మన దేశంలో చొరబడి భయంకర పైశాచికకాండను ప్రారంభించాడు. 1947లో పాకిస్తాన్‌ను ఏర్పాటు చేసిన మహమ్మదాలీ జిన్నా వరకు ఈ స్వజాతీయ వ్యతిరేక విదేశీయ జిహాదీ బీభత్సకాండ కొనసాగింది. స్వజాతీయుల ను చంపడం, లైంగిక అత్యాచారాలకు గురి చేయడం, మతం మార్చడం, స్వస్థలం నుంచి తరిమివేయడం -ఈ నాలుగు దుస్తంత్రాలూ జిహాదీ బీభత్సకాండలో భాగం. పదునాలగవ శతాబ్దినాటి అల్లాఉద్దీన్ ఖిల్జీ ఈ జిహాదీ పరంపరలోని భయంకర బీభత్సకారుడు, మానవరూపంలోని తోడేలు వంటివాడు. కాకతీయ సామ్రాజ్యంపైకి అనేకసార్లు దూకి తోక ముడిచిన జిహాదీలను ఉసిగొల్పిన నికృష్ట జీవనుడు అల్లాఉద్దీన్ ఖిల్జీ. ఆ తరువాత వంచనలో ఓరుగల్లు కోటను ధ్వంసం చేయడం చరిత్ర! ఇలా నీచమైన వంచన ద్వారానే ఈ ‘ఖిల్జీ’ చిత్తోడ్ కోటలోకి చొరబడినాడు! సౌశీల్యమూర్తి అయిన మహారాణి పద్మినిని, పరుని ఇల్లాలిని, కామించిన మరో కీచకుడు అల్లాఉద్దీన్ ఖిల్జీ, అభినవ సైంధవుడు! పద్మినీదేవి ఈ రాక్షసుని బారి నుండి తప్పించుకొనడానికై అగ్నికుండంలో దూకి ‘జోహారు’ చేసింది. ఆమెతోపాటు రాజపుత్ర హైందవ మహిళలు కూడ ‘జోహారు’ చేసి అగ్నిజ్వాలలకు ఆహుతి అయ్యారు, భరతజాతికి ఆరాధ్యులయ్యారు!
‘‘ప్రాణంవాపి పరిత్యజ్య మానమేవాభిరక్షయేత్, అనిత్యోభవతి ప్రాణః మానం ఆచంద్ర తారకమ్’’ - ప్రాణాన్ని వదలిపెట్టి అయినా సరే సౌశీల్యాన్ని సంరక్షించుకోవడం, ప్రాణం తాత్కాలికం, సౌశీల్యం చంద్రుడు తారలు ఉన్నంతవరకూ నిలిచి ఉంటుంది - అన్నది భారత జాతి సనాతన స్వభావం. అందువల్ల మహారాణి పద్మావతి ప్రాణాన్ని పరిత్యజించి తన సౌశీల్యాన్ని తన అనుయాయుల సౌశీల్యాన్ని రక్షించుకొంది! ఇలాంటి మాతృమూర్తికీ, ఆమెను కామించి భంగపడిన జిహాదీ ముష్కరుడైన ఖిల్జీకి మధ్య ‘‘శృంగార భావోద్వేగం’’ ఏర్పడిందన్న స్ఫురణ కలిగే విధంగా ఈ ‘సినిమా’లో చిత్రీకరించారట.. ఈ ఆరోపణకు నిర్మాతలు ఎందుకని స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు??