సంపాదకీయం

‘జెరూసలెం’పై జగడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలెం నగరాన్ని ఇజ్రాయిల్ రాజధానిగా అమెరికా ప్రభుత్వం గుర్తించడంపట్ల ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న దేశాలలో నిరసన ప్రదర్శనలు చెలరేగడం సహజం! ఎందుకంటే ఇరుగుపొరుగు దేశాలలో శరణార్థులుగా ఉన్న ‘‘పాలస్తీనా ముస్లింలు’ జెరూసలెం నగరంలోని తూర్పుభాగాన్ని ఏర్పడనున్న ‘స్వతంత్ర పాలస్తీనా’ దేశపు రాజధానిగా భావిస్తున్నారు! కానీ జెరూసలెం తమ రాజధాని అని ఇజ్రాయిల్ ప్రభుత్వం ముప్పయి ఏడేళ్ల క్రితం ప్రకటించింది! జెరూసలెంను ఇజ్రాయిల్ రాజధానిగా ఆధికారికంగా గుర్తించగలమని అమెరికా ప్రభుత్వం ఇరవై రెండేళ్లుగా ప్రకటిస్తోంది! అందువల్ల జెరూసలెం నగరానికి తమ రాయబారి కార్యాలయాన్ని తరలిస్తామని అమెరికా ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించడం కొత్త విషయం కాదు! ఐక్యరాజ్య సమితి ఎనబయి ఆరు దేశాలు ఇజ్రాయిల్ రాజధానిగా ‘టెల్ అవీవ్’ నగరాన్ని మాత్రమే గుర్తిస్తున్నాయి. అందువల్ల ఈ దేశాల రాయబారి కార్యాలయాలు - మన దేశపు దౌత్య కార్యాలయం సహా - టెల్ అవీవ్‌లోనే ఉన్నాయి. కానీ తమ దేశపు రాయబారి కార్యాలయాన్ని ‘టెల్ అవీవ్’ నుంచి ‘జెరూసలెం’కు తరలించాలని అమెరికా ‘కాంగ్రెస్’ - పార్లమెంట్ - ఉభయసభలు ‘చట్టం’ చేశాయి. ఈ చట్టాన్ని అమలు జరిపే ప్రక్రియను బిల్‌క్లింటన్, జార్జ్‌బుష్, బరాక్ హుస్సేన్ ఒబామా వంటి మాజీ అధ్యక్షులు ఎప్పటికప్పుడు వాయిదా వేశారు. ఎందుకంటే ‘జెరూసలెం’లోని తూర్పుభాగం ఎప్పటికైనా స్వతంత్ర ‘పాలస్తీనా’కు రాజధాని కావాలన్నది ఇజ్రాయిల్ పొరుగున ఉన్న అరబ్ దేశాల ఆశ.. అందువల్ల మొత్తం జెరూసలెం తమకే దక్కాలన్న ‘ఇజ్రాయిల్’ యూదు ప్రజల ఆకాంక్షకు అరబ్బుల ఆశకు మధ్య ఏడు దశాబ్దులుగా ఘర్షణ జరుగుతోంది. ఇజ్రాయిల్ ఏర్పడిన వెంటనే ఆ దేశాన్ని నిర్మూలించాలన్న జిహాదీ ప్రవృత్తిలో ఇరుగుపొరుగు దేశాలు ఆ దేశంపై దాడి చేసినప్పటి నుంచి ఈ సంఘర్షణ కొనసాగుతోంది. అరబ్ దేశాలతో సత్సంబంధాలను పెంపొందించుకొని, జిహాదీ బీభత్సకాండ నుంచి తమ దేశానికి శాశ్వత రక్షణ కల్పించుకోవాలన్నది క్లింటన్, బుష్, ఒబామా పాటించిన విధానం. కానీ ఈ విధానం ఫలితాలను ఇవ్వలేదు. ఈ ఇరవై రెండేళ్లలో జిహాదీ బీభత్సకాండ భయంకరంగా విస్తరించిపోయింది. ‘అల్‌ఖాయిదా’, తాలిబన్, ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం - ఐసిస్ - జిహాదీ ముఠాలు అమెరికా వ్యతిరేక బీభత్సకాండను ఉద్ధృతం చేశాయి...
ఇలా, జెరూసలెం నగరాన్ని ఇజ్రాయిల్ రాజధానిగా ఆధికారికంగా గుర్తించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ నిర్ణయానికి విస్తరిస్తున్న జిహాదీ బీభత్సకాండ ప్రతిక్రియాత్మక నేపథ్యం! జెరూసలెం పశ్చిమ ఆసియాలో మధ్యధరాతీరం వెంబడి విస్తరించి ఉన్న పాలస్తీనాలో నెలకొని ఉన్న అతి పురాతన చారిత్రక నగరం. క్రీస్తునకు పూర్వం దాదాపు పదకొండు వందల ఏళ్లపాటు పాలస్తీనా ‘యూదుల’ మాతృభూమిక! ‘హిబ్రూ’ భాష యూదుల మాతృభాష... క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో ‘గ్రీసు నాగరికులు’ పాలస్తీనాపై దాడులు ఆరంభించడం చరిత్ర. ఆ తరువాత క్రీ.శ. ఒకటవ శతాబ్దిలో ‘రోము నాగరికులు’ పాలస్తీనాలోని యూదులను ఆ ప్రాంతం నుండి తరిమివేశారు, జెరూసలెంలోని యూదుల దేవాలయాన్ని ధ్వంసం చేశారు. అలా మాతృభూమి నుండి నిర్మూలనకు గురి అయిన యూదులు - జ్యూస్, హీబ్రూస్, లేదా ఇజ్రాయిలీలు - ప్రపంచంలోని వివిధ దేశాలకు చెల్లాచెదురైపోయారు. మన దేశంలో తప్ప మరే దేశంలో కూడ ఈ ప్రాచీన జన సముదాయానికి మానవీయ ఆదరణ లభించకపోవడం యూదులు స్వయంగా నిర్ధారించిన చారిత్రక వాస్తవం! ఇలా చెల్లాచెదురైన యూదులు ఈ రెండువేల సంవత్సరాలలోను తమ జాతీయ, సాంస్కృతిక, భౌగోళిక, రాజకీయ స్మృతులను మరచిపోలేదు! మళ్లీ తాము తమ మాతృభూమికి చేరగలమని స్వతంత్ర దేశంగా ఏర్పడగలమని యూదులు ఈ సుదీర్ఘకాలంపాటు, శతాబ్దుల పాటు విశ్వసించడం చారిత్రక అద్భుతం.. ప్రతి సంవత్సరం ఆరంభం రోజున ఉత్సవం జరుపుకున్న యూదులు ‘‘వచ్చే సంవత్సరాది పండుగను పాలస్తీనాలో జరుపుకుందాం, జెరూసలెంలో జరుపుకుందాం..’’ అని ఆకాక్షించడం అలా శతాబ్దుల సంప్రదాయమైంది. కానీ క్రీస్తుశకం ఇరవయ్య శతాబ్ది ఆరంభం నాటికి కానీ యూదులు స్వదేశ పునర్‌గమన స్వప్నం సాకారం కాలేదు! ఈలోగా ప్రాచీన పాలస్తీనాను రోము సామ్రాజ్యవాదులు, బైజాంటైన్, ఒట్టమన్ సామ్రాజ్యవాదులు ఆక్రమించారు.
క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్ది నుంచి పాలస్తీనా క్రైస్తవ, ఇస్లాం మతవర్గాల ఆధిపత్య సమరానికి రంగభూమిగా మారింది. ఇరవై శతాబ్దినాటికి ఈ ‘పాలస్తీనా’ బ్రిటన్ పాలనాగ్రస్తమైంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయం నుంచీ విదేశాలలోని యూదులు - ఇజ్రాయిలీలు - తమ ప్రాచీన మాతృభూమికి తిరిగి రావడం మొదలైంది. జర్మనీ నియంత హిట్లర్, సోవియట్ రష్యా నియంత స్టాలిన్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూదులకు వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండ సాగించారు. ఫలితంగా ఐరోపాలోని యూదులు పెద్ద సంఖ్యలో పాలస్తీనాకు తిరిగివచ్చి స్థిరపడినారు. పాలస్తీనాకు పొరుగున ఉన్న జోర్డాన్ సిరియా వంటి దేశాల నుంచి ఇస్లాం మతస్థులు కూడ పాలస్తీనాలో స్థిరపడడం సమాంతర పరిణామం. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ‘ఐక్యరాజ్య సమితి’ 1948లో పాలస్తీనాను విభజించింది. యూదులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాన్ని ‘స్వతంత్ర ఇజ్రాయిల్’గాను, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ‘స్వతంత్ర పాలస్తీనా’గాను ఏర్పాటు చేసింది. ఈ ‘విభజన’లో భాగంగా ‘ఐరాస’ జెరూసలెంను కూడ విభజించింది. పశ్చిమ ప్రాంతం ఇజ్రాయిల్‌కు, తూర్పు ప్రాంతం అవశేష పాలస్తీనాకు దక్కాయి. ఇలా ప్రాచీన పాలస్తీనాలో రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడినాయి. కథ సుఖాంతమైందని యూదులు భావించారు! రెండువేల ఏళ్లపాటు విదేశాలలో గడిపిన తమకు మళ్లీ ‘మాతృభూమి’లో కొంత భాగమైనా దక్కినందుకు సంతోషించారు.
కానీ అరబ్ దేశాల ప్రభుత్వాలు కథను సుఖాంతం కానివ్వలేదు. మొత్తం పాలస్తీనా ఇస్లాం మతస్థులకే దక్కాలన్నది ఈ ప్రభుత్వాల దురాశ, దుర్బుద్ధి.. ఇందుకు కారణం మతసహనం లేని ‘జిహాదీ’ మనస్తత్వం... అందువల్ల ‘ఇజ్రాయిల్’ను తుడిచిపెట్టాలన్న లక్ష్యంతో ఈ దేశాలవారు, కొత్త దేశాలు ఏర్పడిన వెంటనే, ఇజ్రాయిల్‌పై దాడి చేశాయి. కానీ చిన్న ఇజ్రాయిల్ పెద్ద అరబ్ దేశాల దురాక్రమణను 1956లోను, 1967లోను, 1973లోను కూడ తిప్పికొట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా మొత్తం ‘జెరూసలెం’ను ఇజ్రాయిల్ ఆక్రమించింది... రెండు స్వతంత్ర దేశాలు శాంతియుతంగా సహజీవనం చేయాలన్న ‘సహిష్ణు’తను ఈజిప్టు మినహా ఇతర అరబ్ దేశాలు ఇప్పటికీ అలవర్చుకోలేదు.. ఇదీ అసలు సమస్య...!