సంపాదకీయం

పదునెక్కని పటిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయుధ సమర సంపత్తిని ఆధునీకరించుకోవాలన్న సైనిక దళాల ప్రధాన అధికారి విపిన్ రావత్ ఆకాంక్షలకు ‘అరిహంత’ జలాంతర్గామి గాయపడిందన్న ప్రచారం విచిత్రమైన నేపథ్యం. రక్షణ అవసరాల దిగుమతులను తగ్గించివేయడానికి వీలుగా స్వదేశీయ రక్షణ ఉత్పత్తులు జరగాలన్నది సోమవారం జరిగిన రక్షణ వ్యవహారాల సదస్సులో రావత్ చెప్పినమాట! ఇది ‘్భరత్‌లో నిర్మించండి’ - మేక్ ఇన్ ఇండియా - స్ఫూర్తికి అనుగుణం! కానీ గత మూడేళ్లుగా రక్షణ రంగంలో ప్రధానమైన ఆయుధాలు యుద్ధ వాహనాల నిర్మాణానికి రూపకల్పన జరగలేదు! భూతల సమర శకటాలు, గగనతల యుద్ధ విమానాలు, గగన శకటాలు - హెలికాప్టర్‌లు -, జలాంతర్గాములు, ప్రతిఘటనకు ఉపకరించగల యుద్ధ నౌకలు, నౌకాదళానికి అవసరమైన గగన శకటాలు, విమానాలు - ఇలా వివిధ రక్షణ ఉత్పత్తులను దేశంలోనే నిర్మించడానికి దాదాపు ఆరు ప్రధాన పథకాలు రూపొంది ఉన్నాయట! కానీ మూడున్నర లక్షల కోట్ల రూపాయల వ్యయం కాగల ఈ బృహత్ పథకాలు కార్యరూపందాల్చకపోవడం విచిత్రమైన విపరిణామం! రక్షణ ఉపకరణాలను సమగ్ర స్వదేశీయ పరిజ్ఞానంతో సంపూర్ణ స్వదేశీయ వాణిజ్య భాగస్వామ్యంతో నిర్మించడం అనే స్వప్నం సమీప భవిష్యత్తులో సాకారమయ్యే అవకాశాలు లేవు.. రక్షణ ఉత్పత్తుల రంగంలో సైతం ‘విదేశీయుల ప్రత్యక్ష భాగస్వామ్యం’ - ఫారిన్ డైరక్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్ - విధానాన్ని ఐదేళ్ల క్రితమే ప్రభుత్వం ఆమోదించింది! కీలకమైన భద్రతతో ముడివడి ఉన్న రక్షణ ఉత్పత్తుల రంగంలో విదేశీయులకు ‘పట్టు’ ఏర్పడడానికి ఈ విధానం ఉపకరించగలదు. మన్‌మోహన్‌సింగ్ ప్రధాన మంత్రిత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ విధానాన్ని నరేంద్రమోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొనసాగించడం అనివార్యం అయింది. ఇందుకు కారణం డెబ్బయి ఏళ్ల స్వతంత్ర దేశంలో స్వదేశీయ రక్షణ ఉపకరణ ఉత్పాదక శాస్త్ర పరిజ్ఞానం సంపూర్ణంగా వికసించకపోవడం! అందువల్ల పరిజ్ఞానం విషయంలో విదేశీయ సంస్థల భాగస్వామ్యం అనివార్యం అయింది. దీనితోపాటు విదేశీయ సంస్థల పెట్టుబడులు కూడ అనివార్యం అయిపోయాయి! ‘‘్భరత్‌లో నిర్మించండి’’ అన్న పారిశ్రామిక ఉద్యమంలో నిహితమై ఉన్న వైరుధ్యం ఇది! కానీ విదేశాల నుంచి తయారయిన ఆయుధాలను వాహనాలను ఇతర ఉపకరణాలను కొనుగోలు చేయడంకంటె విదేశీయుల భాగస్వామ్యంతో స్వదేశంలోనే రక్షణ సామాగ్రిని ఉత్పత్తి చేయడం మెరుగైన ప్రత్యామ్నాయమన్నది అనివార్య విధానం..
ఈ అనివార్య విధానంలో భాగంగా దక్షిణ కొరియాతో కుదుర్చుకున్న ఒక బృహత్ రక్షణోత్పత్తుల ఒప్పందం ఇప్పుడు రద్దయిపోవడం విచిత్రమైన పరిణామం. సముద్రగర్భంలో నిక్షిప్తమైన విస్ఫోటక పదార్థాలను పసికట్టి మన తీరానికి దూరంగా తోసివేయడానికి ఉపకరించే యుద్ధనౌక - మైన్ కౌంటర్ మెజర్ వెజల్ - ఎమ్‌సిఎమ్‌వి - ల ఉత్పత్తికి సంబంధించిన ఈ ఒప్పందం ఏళ్ల తరబడి మూలబడి ఉండడానికి కారణం దక్షిణ కొరియావారి ‘కాంగ్‌నామ్ ఓడరేవు సంస్థ’ గొంతెమ్మ కోర్కెలు. ‘ప్రపంచీకరణ’ - గ్లోబలైజేషన్ - వ్యవస్థీకృతమైన తరువాత సంపన్న దేశాల ప్రభుత్వాలు, సంపన్న దేశాల వాణిజ్య సంస్థలు ప్రవర్థమాన దేశాలలో కొనసాగిస్తున్న ఆర్థిక దురాక్రమణలో ఈ గొంతెమ్మ కోర్కెలు భాగం! ‘ప్రపంచీకరణ నియమావళి’ సహజంగానే సంపన్న దేశాలకు, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు అనుకూలంగా రూపొంది ఉంది! కానీ ఆనుకూల్యత బహుళ జాతీయ సంస్థల రాకాసి ఆకలిని సంతృప్తి పరచలేకపోవడం నడుస్తున్న వైపరీత్యం! అందువల్లనే దక్షిణ కొరియా సంస్థ తొలుత కుదుర్చుకున్న ఒప్పందంలోని నిబంధనలను మార్చాలని పదేపదే కోరుతోంది! రాఫెల్ యుద్ధ విమానాలను సరఫరా చేస్తున్న ఫ్రాన్స్ పదేపదే వాటి ధరలను పెంచింది. విక్రమాదిత్య యుద్ధనౌకను మనకు అమ్మిన రష్యా కూడా పదేళ్లపాటు ఆ నౌకను మనకు అప్పగించలేదు. మరమ్మతుల పేరుతో మాటిమాటికి ధరను పెంచి చివరికి నిర్ధారిత ధరకంటె రెండున్నర రెట్లు అధికంగా వసూలు చేయడం చరిత్ర! ఇప్పుడు ముప్పయి రెండు వేల కోట్ల రూపాయల వ్యయంకాగల ‘ఎమ్‌సిఎమ్‌వి’ల ఉత్పత్తి పథకం దక్షిణ కొరియా మాటమార్చిన కారణంగా రద్దయిపోయింది!!
సముద్రగర్భంలో మన తీరానికి సమీపంలో పేలుడు పదార్థాలను నిక్షిప్తం చేయడానికి చైనా పాకిస్తాన్ ప్రభుత్వాలు ఉమ్మడియత్నం చేయగల ప్రమాదం పొంచి ఉంది. చైనావారి అణుశక్తి చోదిత జలాంతర్గాములు, ఇంధనతైల చోదిత జలాంతర్గాములు పదేపదే సముద్రగర్భంలో మన తీరానికి సమీపంలో పచార్లు చేస్తున్నాయి. ఓడదొంగలను అణచివేసే నెపంతో అరేబియా సముద్రంలో గస్తీ మొదలుపెట్టిన చైనా ఆ తరువాత పెద్దఎత్తున నౌకలను జలాంతర్గాములను ‘గస్తీ’కి దింపింది. ఓడదొంగలను అరికట్టడానికి ఇంత పెద్ద ఆర్భాటం అక్కరలేదు! చైనా లక్ష్యం మనదేశాన్ని మూడు సముద్రాల వైపునుంచి దిగ్బంధం చేయడం. శ్రీలంకలోని హంబన్‌తోట ఓడరేవులో చైనా నౌకాదళానికి ఇటీవల స్థావరం ఏర్పడింది! మాల్‌దీవులు చైనా స్థావరంగా మారిపోతోంది! పాకిస్తాన్‌లోని గ్వాడార్ రేవు స్థావరంగా చైనా పాకిస్తాన్‌ల ఉమ్మడి నౌకాదళ విన్యాసాలు మొదలయ్యాయి. ఇరాన్‌లోని చౌబహార్ ఓడరేవును మన ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నప్పటికీ ఇరాన్ రాజకీయ పరిణామాలపై ఆ దేశంతో మన మైత్రి ఆధారపడి ఉంది! ఇరాన్ జనబాహుళ్యంలో పాకిస్తాన్ పట్ల మైత్రి మనదేశంపట్ల వ్యతిరేకత నిహితమై ఉండడం నిరాకరింపజాలని వాస్తవం! ఈ నేపథ్యంలో ఆఫ్రికా ఖండపు జిబౌటీలో చైనా భారీ నౌకాదళ స్థావరాన్ని, సైనిక స్థావరాన్ని నెలకొల్పడం మన సమగ్ర భద్రతకు మరింత భంగకరంగా మారింది!
చైనా జలాంతర్గాములు జిబౌటీ నుంచి, గ్వాడార్ నుంచి బయలుదేరి మన పశ్చిమ సముద్రగర్భంలో పేలుడు పదార్థాలను నిక్షిప్తం చేయవచ్చు! ఈ పేలుడు పదార్థాలను పసిగట్టి దూరంగా నెట్టివేయడానికి వీలుగా మనకు ఇరవై నాలుగు ‘ఎమ్‌సిఎమ్‌వి’ అవసరం ఉంది. కాని నాలుగు మాత్రమే ప్రస్తుతం మన నౌకాదళంలో ఉండడం దశాబ్దుల ‘ప్రమత్తత’కు చిహ్నం! పనె్నండు ఈ ప్రతిఘటనాత్మక నౌకలను తయారు చేయడం కోసం కొరియాతో కుదిరిన ఒప్పందం రద్దు కావడంతో ‘కథ’ మొదటికి వచ్చింది! స్వదేశీయ పరిజ్ఞానంతో నిర్మితమై 2009లో జలప్రవేశం చేసిన అణుశక్తి చోదిత ‘అరిహంత’ పదినెలల క్రితం జరిగిన ప్రమాదం కారణంగా దెబ్బతినిందట! ఈ జలాంతర్గామికి అప్పటి నుంచి మరమ్మతులు జరుగుతున్నాయట! ఈ సంగతి ఇప్పుడు బయటపడడమే కొనసాగుతున్న ప్రమత్తత.