సంపాదకీయం

ఛిల్లరకొట్టుకు మరో ‘చిల్లు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిల్లర వ్యాపారంలో విస్తరించిపోతున్న ‘విదేశీ ప్రత్యక్ష ఆర్థిక భాగస్వామ్యం’ గురించి కేంద్రప్రభుత్వం సర్వసమగ్రమైన ‘వివరణ పత్రం’ - వైట్‌పేపర్ - ఇప్పుడైనా విడుదల చేయాలి! ఎందుకంటె ‘‘చిల్లర వ్యాపారంలోకి విదేశీయులు చొరబడిపోవడానికి వీలుగా ‘‘మన్‌మోహన్‌సింగ్ ప్రధాన మంత్రిత్వంలోని ‘కాంగ్రెస్’ ప్రభుత్వం రూపొందించి అమలు జరిపిన విధానం ఇప్పటికీ కొనసాగుతోంది... 2014 మే 26 నుంచి పరిపాలన సాగిస్తున్న నరేంద్రమోదీ ప్రధానమంత్రిత్వంలోని ‘్భరతీయ జనతా పార్టీ’ ప్రభుత్వం మరింత ‘్ధ్యయనిష్ఠ’తో కొనసాగిస్తోంది! ఇలా కొనసాగిస్తున్న సంగతి సామాన్య ప్రజలకు తెలీదు, మధ్య తరగతి మహాజనానికి ధ్యాస లేదు, విద్యాధిక మేధావులకు పట్టడం లేదు, ‘స్వదేశీయత’ను బతికించి ఉంచడానికి కృషి చేస్తున్న ఉద్యమ సంస్థలకు అంతుపట్టడం లేదు! అధికారపక్షంలోని అధికాధికులకు సైతం మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం వారి ‘‘చిల్లర వ్యాపారంలో విదేశీయుల చొరబాటు’’ విధానాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తున్నదన్నది అర్థం కావడం లేదు! దేశ భౌతిక రక్షణ, జాతీయ సాంస్కృతిక భద్రత వంటి రంగాలలో మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం నాటి ‘‘చతికిలపడి ఉండిన’’ విధానాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం విడనాడింది... పాకిస్తాన్ చైనాల ఉమ్మడి దురాక్రమణ వ్యూహాన్ని ప్రతిఘటిస్తోంది, చాపకింద విషంవలె వ్యాపించి భద్రతకు విఘాతం కలిగిస్తున్న నకిలీ ‘స్వచ్ఛంద సంస్థల’ - ‘నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్’-ను నియంత్రిస్తోంది.. ‘యోగం’ ద్వారా అంతర్జాతీయ సమాజంలో భారత జాతీయ అస్తిత్వం గరిమను పెంచగలిగింది.. ఆర్థిక రంగంలో సైతం ‘పెద్దనోట్ల రద్దు’ వంటి సంస్కరణల ద్వారా నల్లడబ్బు వెల్లువకు కొంతమేర అడ్డుకట్ట వేయగలిగింది, 2016 నుండి మూడువేల ఐదు వందల కోట్ల రూపాయల అక్రమ నిధులను, ‘బినామీ’ ఆస్తులను జప్తు చేయగలిగిందట! ఇలా ఆయా రంగాలలో మన్‌మోహన్ సింగ్ నాటి విధానాలకు భిన్నమైన పటిష్టమైన, నిర్దిష్టమైన, నిర్దుష్టమైన ప్రత్యామ్నాయాల - ఆల్టర్‌నేటివ్స్ - ను రూపొందించగలిగిన నరేంద్రమోదీ ప్రభుత్వం ‘విదేశీయ ప్రత్యక్ష ఆర్థిక భాగస్వామ్యం’ - ఫారిన్ డైరక్ట్ ఇనె్వస్టిమెంట్ - ఎఫ్‌డిఐ - విషయంలో మాత్రం మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వానికి యథాతథ ‘పర్యాయ’ - సబ్‌స్టిట్యూట్ - పీఠంగా అవతరించింది! ‘సింగిల్‌బ్రాండ్’ చిల్లర వ్యాపారంలోకి విదేశీయుల చొరబాటునకు మార్గాన్ని మరింత సుగమం చేయడం ఇందుకు సరికొత్త ప్రమాణం..
‘ఏకసంస్థ’ - ‘సింగిల్‌బ్రాండ్’ - చిల్లర వ్యాపారంలో విదేశీయులు విదేశీయ సంస్థలు వంద శాతం పెట్టుబడులను పెట్టడానికి మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం 2011లో అనుమతించింది. విదేశాలకు చెందిన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ - మల్టీ నేషనల్ కంపెనీస్ - మన చిల్లర వ్యాపార రంగాన్ని కొల్లగొట్టడానికి ‘తలుపులు’ బార్లా తెరిచింది! ఇప్పుడు నరేంద్రమోదీ ప్రభుత్వం ‘కిటికీ’లవంటి అవరోధాలను సైతం వాణిజ్యపు సరిహద్దుల గోడనుండి పెకలించి పారేసింది! బహుళ సంస్థాగత ముద్రల - మల్టీబ్రాండ్ - వస్తువుల పంపిణీకి సంబంధించిన చిల్లర వ్యాపారంలోకి ‘వాల్‌మార్ట్’ వంటి అమెరికా సంస్థలకు ప్రవేశం కల్పించడానికి మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం 2011లో విఫలయత్నం చేసింది. ‘్భజపా’ వంటి ప్రతిపక్షాలు మాత్రమేకాక ‘తృణమూల్ కాంగ్రెస్’ వంటి ప్రభుత్వపక్షం కూడా ఆ చర్యలను ప్రతిఘటించాయి. కానీ అదే సమయంలో ‘సింగిల్‌బ్రాండ్’ చిల్లర వ్యాపారంలో మాత్రం విదేశీయులు వందశాతం పెట్టుబడులు పెట్టడానికి మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం వీలు కల్పించగలిగింది! కానీ ఇలా ‘సింగిల్‌బ్రాండ్’లో పెట్టుబడులు పెట్టే విదేశీయులు ముందుగా మన ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి! ప్రస్తుత ప్రభుత్వం బుధవారం ఈ నిబంధనను తొలగించింది. ప్రభుత్వం అనుమతితో అవసరం లేకుండానే విదేశీయ సంస్థలు ఇక ‘సింగిల్‌బ్రాండ్’ చిల్లర దుకాణాలు తెరుచుకోవచ్చు! ఇలా మనదేశంలో ‘సింగిల్‌బ్రాండ్’ చిల్లర దుకాణం తెరిచే విదేశీయులు కనీసం ముప్పయిశాతం మనదేశంలో తయారయిన వస్తువులను విక్రయించాలన్నది మరో నిబంధన.. దీన్నికూడ ప్రభుత్వం ఇప్పుడు తొలగించింది. విదేశీయ ‘చిల్లర వ్యాపారులు’ వంద శాతం విదేశీయ వస్తువులను మనదేశంలో అమ్ముకోవచ్చు... ‘గోడ’కున్న ‘కిటికీ’లను సైతం పెరికిపారేయడమంటే ఇదీ...
ఈ రెండవ నిబంధనను ఐదేళ్లపాటు మాత్రమే సడలించినట్లు ప్రచారమైంది. ఆ తరువాత చిల్లర వ్యాపారం చేసే విదేశీయ సంస్థలు ముప్పయి శాతం స్వదేశీయ వస్తువులను అమ్మాలన్న నిబంధన అమలు జరుగుతుందట! దీనికి తార్కికమైన సమంజసమైన ప్రాతిపదిక ఏమిటి?? ఐదేళ్ల వరకూ ‘గిరాకీ’ లేని ఆయా స్వదేశీయ వస్తువుల ఉత్పత్తి అగిపోవచ్చు! లేదా ప్రభుత్వం మరోసారి ఈ నిబంధనను సడలించవచ్చు! ఇది ‘సింగిల్‌బ్రాండ్’ చిల్లర వ్యాపారం వ్యవహారం! ‘మల్టీ బ్రాండ్’ -బహుళ వస్తు- రంగంలోని చిల్లర వ్యాపారంలో విదేశీయులు చొరబడడానికి 2012లో మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం - విసుగుచెందని వీరునివలె పోరాడి - అనుమతినివ్వగలిగింది! 2011లో ‘వ్యతిరేకుల’ ఒత్తిడికి తలఒగ్గిన ప్రభుత్వం 2012లో ‘ఒత్తిడి’ని లెక్కచేయలేదు! ఇలా ‘మల్టీబ్రాండ్’ చిల్లర వ్యాపారంలోకి విదేశీయులను చేర్చినందుకు నిరసనగా ‘తృణమూల్ కాంగ్రెస్’ ప్రభుత్వ కూటమినుంచి వైదొలగింది.. అయినప్పటికీ భారత జాతీయ ఆర్థిక అస్తిత్వాన్ని అంతర్జాతీయ అనుసంధానం చేయడానికి నడుంబిగించి ఉండిన మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం లెక్కచేయలేదు..
అమెరికా సంస్థ ‘వాల్‌మార్ట్’కు లాభం చేకూర్చడానికి మాత్రమే బహుళ వస్తు చిల్లర వ్యాపారంలోకి విదేశీయుల చొరబాటును ప్రభుత్వం అనుమతించినట్టు 2012లో ప్రచారమైంది! అమెరికా ప్రభుత్వం ఒత్తిడికి మన ప్రభుత్వం తల ఒగ్గిందట! అప్పటి ప్రభుత్వ చర్యను - స్వదేశీయ వ్యాపారుల పొట్టకొట్టడానికి దోహదం చేసిన చర్యను - ప్రతిపక్షంలో ఉండిన ‘భాజపా’ తీవ్రంగా వ్యతిరేకించింది! తాము అధికారంలోకి వస్తే ‘వాల్‌మార్ట్’ వంటి విదేశీయుల చిల్లర దుకాణాలను మూయించివేస్తామని అప్పటి ‘్భజపా’ లోక్‌సభా నాయకురాలు సుషమాస్వరాజ్ భీషణ ప్రతిజ్ఞ చేసిందనడానికి చరిత్ర సాక్ష్యం... ఇప్పుడేం జరుగుతోంది. ‘వాల్‌మార్ట్’ తెలుగు రాష్ట్రాలలోను ఇతర రాష్ట్రాలలోను కొత్త దుకాణాలను తెరుస్తూనే ఉంది!!