సంపాదకీయం

తుపాకుల కొరత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత టిబెట్ సరిహద్దు రక్షక దళం - ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ - ఐటిబిపి - లో ‘గగననిఘా’ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం భద్రతాపటిమను పెంచగల పరిణామం! కానీ దశాబ్దుల తరబడి ‘ఐటిబిపి’లో ఈ ‘వైమానిక విభాగం’ ఏర్పడలేదన్నది విస్మయకరమైన వాస్తవం.. దాదాపు లక్ష అరవైవేల ‘రైఫిళ్ల’ను ‘కార్బయిన్ల’ను కొనుగోలు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పుడు నిర్ణయించిదట! కానీ ఈ అత్యాధునిక తుపాకులను కొనుగోలు చేయాలని పదమూడు ఏళ్ల క్రితం సైనిక దళాల అధికారులు రక్షణ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారట! పదమూడేళ్ల తరువాత మాత్రమే ప్రభుత్వం నడుం బిగించడం విచిత్రమైన వ్యవహారం. మూడున్నర వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం ఇప్పుడీ ‘రైఫిళ్ల’ - తుపాకుల-ను, కార్బయిన్స్ - తేలికపాటి తుపాకుల - ను సమకూర్చుకోనుందట! కానీ మన రక్షణ దళాలకు కొత్తగా ఎనిమిది లక్షల ఇరవై వేల అత్యాధునిక తుపాకులు అవసరం ఉందట! యుద్ధప్రాతిపదికన ఇప్పుడు కొంటున్న తుపాకుల సంఖ్య కేవలం డెబ్బయి రెండువేలు. నాలుగు లక్షల పద్దెనిమిది వేల తేలికపాటి తుపాకులు - కార్బయిన్లు - అవసరమట, కొంటున్నది కేవలం తొంబయి నాలుగువేలు! కొనాలని నిర్ణయించినప్పుడు అవసరమైనన్ని తుపాకులు సమకూర్చుకొనడానికి అభ్యంతరం ఏమిటి?? నిధులు చాలవా?? ఈ పనె్నండు లక్షల తుపాకులు కొన్నట్టయితే దాదాపు ఇరవై ఐదువేల కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చు. రెండున్నర లక్షల రూపాయలకు పైగా రక్షణ వార్షిక వ్యయం జరుగుతోంది. అలాంటప్పుడు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన మరో పాతికవేల కోట్ల రూపాయలను కేటాయించలేదా?? అందువల్ల పదమూడు ఏళ్లు ‘‘నానబెట్టిన’’ తరువాత కూడా కనీసం తుపాకుల సమస్యను కూడ పరిష్కరించుకోలేకపోవడం అంతుపట్టని ‘‘రహస్యం..’’! మనది ప్రపంచంలో మూడవ పెద్ద రక్షణ దళం. భూతల సైన్యం - ఆర్మీ-లోనే దాదాపు పనె్నండు లక్షల మంది ‘సమర’వీరులున్నారు! వీరుకాక లక్షలాది ‘సహాయ’ సైనికులున్నారు.. సరిహద్దు భద్రతామండలి - బిఎస్‌ఎఫ్ - బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ -, ఐటిబిపి, ‘అస్సాం రైఫిల్స్’ వంటి అనుబంధ సాయుధ బలగాలు - పారా మిలటరీ ఫోర్స్ - పనిచేస్తున్నాయి! ఇంత ప్రతిష్ఠ ఉన్న, ఇంత పరిమాణం ఉన్న రక్షణ బలగాలకు తగినన్ని తుపాకులు లేవన్న ప్రచారం అంతర్జాతీయ సమాజంలో మనకు తలవంపులు తెచ్చే వ్యవహారం! ఉత్తర సరిహద్దులలో నిరంతరం పొంచి ఉన్న చైనా దురాక్రమణ ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి వీలుగా మన సైనికుల చేతులలో అత్యాధునికమైన ఆయుధాలు తగినన్ని ఉండడం అనివార్యం! మన సైనికుల చేతులకు తగినన్ని తుపాకులు, వారి కాళ్లకు తగినన్ని ‘బూట్లు’ లేకపోవడం కారణంగానే యాబయి ఐదేళ్ల క్రితం చైనా మన దేశాన్ని దురాక్రమించగలిగింది! ఈ దురాక్రమణ తరువాత మన సమరపాటవం పదునెక్కిందన్నది ప్రజల విశ్వాసం! కానీ ఇంతవరకు ‘్భరత టిబెట్ రక్షణ దళం’లో వైమానిక నిఘా విభాగం ఏర్పడలేదన్న వాస్తవం ఈ విశ్వాసానికి విఘాతకరం..
యాబయి ఐదేళ్ల క్రితం మనదేశంలోకి చొరబడిన చైనా యుద్ధం విరమించిన తరువాత ఏకపక్షంగా ‘వాస్తవ అధీన రేఖ’ను నిర్ధారించింది! ఈ వాస్తవ అధీన రేఖ - లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ -ను చైనా అప్పటి నుంచి ఇప్పటివరకు ఉల్లంఘిస్తూనే ఉంది. ప్రతి ఏటా వందలసార్లు లడక్‌లో చైనా ‘రేఖ’ను దాటి చొరబడడం దశాబ్దులుగా కొనసాగుతున్న మన భద్రతావైఫల్యానికి నిదర్శనం! ‘వాస్తవ అధీన రేఖ’ - ఎల్‌ఏసీ - వాస్తవంగా ఎక్కడ ఉన్నదన్న విషయమై ఉభయ దేశాల మధ్యకల అవగాహనలో అంతరం ఉందని 2014వరకు పదేళ్లు కొనసాగిన ప్రచారం! అవగాహనలో ‘అంతరం’ ఉన్నట్టయితే మన భద్రతాదళాలు సైతం కనీసం కొన్నిసార్లయినా ‘రేఖ’ను దాటి చైనా వైపునకు చొరబడి ఉండవచ్చు.. అది జరగలేదు! పైగా ఏకపక్షంగా ‘ఎల్‌ఏసీ’ని నిర్ధారించిన చైనా దురాక్రమణ బుద్ధికి ‘అవగాహన’ లేకపోవడం ఏమిటి?? చైనా వాదాన్ని మన ప్రభుత్వం కూడ అంగీకరించడం 2014 వరకు జరిగిన కథ! గత మూడేళ్లుగా మన భద్రతా దళాల ప్రతిఘటన ముమ్మరం కావడంతో చైనా చొరబాట్లు కొంతమేరకు తగ్గాయి! కానీ చైనా సరిహద్దులో గస్తీ తిరుగుతున్న ‘ఐటిబిపి’లో ‘వైమానిక నిఘా విభాగం’ దశాబ్దుల క్రితమే ఏర్పడి ఉండినట్టయితే చైనా చొరబాట్లు ఎప్పటికప్పుడు పసికట్టి ప్రతిఘటించడానికి వీలుండేది. ‘ఐటిబిపి’లో ఈ గగన నిఘా విభాగం ఇప్పుడు ఏర్పడడం ఇన్ని దశాబ్దుల ప్రమత్తతకు నిదర్శనం..
ఈ ‘తుపాకుల’ కొనుగోలుకు అంతర్జాతీయ విపణిని ఆశ్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయం ‘స్వదేశీయ స్ఫూర్తి’కి మరో అపవాదం. మన దేశంలోనే మన రక్షణ బలగాలకు కావలసినన్ని తుపాకులు ఉత్పత్తి కావడం లేదన్నదానికి ఈ నిర్ణయం నిదర్శనం. డెబ్బయి ఏళ్లుగా మనం మన రక్షణకు అవసరమైన తుపాకులు, ట్రక్కులు, జీపులు, బస్సులు తయారు చేసుకొనలేకపోవడం అంతుపట్టని వ్యవహారం. అణుశక్తి చోదిత ‘అరిహంత’ జలాంతర్గామిని మనం స్వదేశీయ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నాము. ముప్పయి రెండేళ్ల నిర్విరామ కృషి తరువాత ‘హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ - హాల్ - ‘తేజస్’ యుద్ధ విమానాలను స్వదేశీయ పరిజ్ఞానంతో నిర్మించగలిగింది. 2015లో ఈ తేలికపాటి విమానాలు రూపొందాయి. తగినన్ని స్వదేశీయ విమానాలు ఉత్పత్తికావడానికి మరిన్ని ఏళ్లు పట్టవచ్చుగాక. ‘ఆకాశ్’, ‘పృథివి’ ‘అగ్ని’ వంటి క్షిపణులను మనం నిర్మించడం పెరిగిన మన సమరపాటవానికి నిదర్శనం. సుదూర లక్ష్యచ్ఛేదక ఐదవ శ్రేణి అగ్ని క్షిపణిని కూడ మనం రూపొందించగలిగాము. ఇజ్రాయిల్ వంటి మిత్రదేశాలు ఈ ‘క్షిపణుల’ నిర్మాణ రంగంలో పరస్పర సహకారం కోరుతుండడం మన స్వదేశీయ పరిజ్ఞానానికి నిదర్శనం. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో ఏడు ‘నిఘా’ నౌకలను, ఆరు జలాంతర్గాములను స్వదేశీయ పరిజ్ఞానంతో నిర్మించాలని 2015లో ప్రభుత్వం నిర్ణయించడం రక్షణోత్పత్తుల రంగంలో పెరిగిన జాతీయ విశ్వాసానికి నిదర్శనం! కానీ వౌలికమైన తుపాకుల వంటి ఆయుధాలను, ట్రక్కుల వంటి వాహనాలను దేశంలోనే తగినన్ని ఉత్పత్తి చేయలేకపోవడం సామాన్యులకు అర్థంకాని విచిత్రం.. విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్న రక్షణోత్పత్తులు మొత్తం ఏదోవిధమైన అవినీతిజాలంలో చిక్కుకొనిపోవడం మన ‘రక్షణ’ను నిలదీస్తున్న దశాబ్దుల వైపరీత్యం! 1950వ దశకంలోనే ‘రక్షణ’కోసం కొన్న ‘జీపులు’ అవినీతిగ్రస్తం కావడం మొదలు..
బోఫోర్స్ హావిట్జర్ శతఘు్నలు, తాత్రా ట్రక్కులు, ‘అగస్టా’ గగన శకటాలు అవినీతికి ప్రతీకలుగా మారడం నడుస్తున్న చరిత్ర. ‘బోఫోర్స్’ వ్యవహారం మరుగునపడి చాలా ఏళ్లయింది. హావిట్జర్ శతఘు్నలు కొనుగోలు ఆరంభమవుతోందని 2016లో ప్రచారమైంది. కానీ ‘బోఫోర్స్’ అవినీతిని మళ్లీ దర్యాప్తు చేయించాలని కోరుతూ ఇటీవల సర్వోన్నత న్యాయస్థానంలో మరో న్యాయయాచిక దాఖలైంది. ఫిబ్రవరిలో తదుపరి న్యాయ విచారణ జరుగుతుందట...