సంపాదకీయం

‘చతుర్ముఖ’ అభిశంసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చతురస్ర దేశాల కూటమి ప్రతినిధులు చైనా దురాక్రమణ వ్యూహాన్ని నిరసించడానికి ‘డోక్ లా’ - డోక్‌లామ్ - లో చైనీయుల ‘తిష్ఠ’ కొనసాగుతుండడం విచిత్రమైన నేపథ్యం. డోక్‌లా ప్రాంతం నుంచి గత ఆగస్టులో తోకముడిచిన చైనా తోడేలు మళ్లీ గోడ దూకిందన్న ‘ప్రచారం’ అంతుపట్టని ఈ విచిత్రం! ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ‘ఆస్ట్రేలియా, భారత్, అమెరికా, జపాన్’ దేశాల ఈ చతుర్‌పక్ష - క్వాడ్రిలేటరల్ - కూటమి సమావేశంలో చైనాను ‘విచ్ఛిన్నశక్తి’గా అభివర్ణిండం సహజమైన పరిణామం! ప్రశాంత - పసిఫిక్ - మహాసాగర, హిందూ మహాసముద్ర ప్రాంతాలలో చైనా కొనసాగిస్తున్న వ్యూహాత్మక, భౌతిక దురాక్రమణ క్రమంగా విస్తరిస్తుండడం ఈ చతుర్ముఖ అభిశంసనకు ప్రాతిపదిక. చైనా ప్రభుత్వ సముద్ర ప్రాంత విస్తరణ వాంఛలను మన ప్రభుత్వం నిరంతరం గమనిస్తోందని మన విదేశ వ్యవహారాల సహాయమంత్రి విజయకుమార్ సింగ్ ఇటీవల వెల్లడించడం గురువారం నాటి సమావేశానికి పూర్వరంగం. మాల్‌దీవులలో నాలుగేళ్ల క్రితం దౌత్య కార్యాలయాన్ని - చరిత్రలో మొదటిసారి - ఏర్పరచుకున్న చైనా ఆ దేశాన్ని తన సైనిక స్థావరంగా మార్చుకొంటుండడం విజయకుమార్‌సింగ్ వ్యాఖ్యకు ప్రాతిపదిక! మాల్‌దీవులతో చైనా స్వేచ్ఛా వాణిజ్యపు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వ్యూహాత్మక విస్తరణలో భాగం. చైనా కొనసాగిస్తున్న వ్యూహాత్మక భౌతిక దురాక్రమణపట్ల ‘అప్రమత్తత’ తగదని ‘టిబెట్’ ప్రవాస ప్రభుత్వ ప్రతినిధి లోవ్‌సంగ్ సంజా హెచ్చరించడం గురువారం నాటి ‘క్వాడ్రిలేటరల్’ సమావేశానికి సమాంతర పరిణా మం! యాబయి తొమ్మిదేళ్ల క్రితం టిబెట్‌ను దురాక్రమించిన చైనా లడక్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్‌లను కూడా కబళించడానికి పొంచి ఉన్న చారిత్రక వైపరీత్యాన్ని లోవ్‌సంగ్ సంజా పునరుద్ఘాటించాడు. టిబెట్ అధినేత, బౌద్ధమత గురువు దలైలామాను మట్టుపెట్టడానికి యాబయి తొమ్మిదేళ్ల క్రితం చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం యత్నించింది. దలైలామా హత్యకు గురికాకుండా తప్పించుకోగలిగాడు, వేలాది అనుచరులతో కలసి మన దేశానికి వచ్చేశాడు. ఈ యాబయి తొమ్మిదేళ్లుగా టిబెట్ చైనా దురాక్రమణలో కొనసాగుతోంది! హిమాచల్‌ప్రదేస్‌లోని ధర్మశాల కేంద్రంగా ఏర్పడిన టిబెట్ ‘ప్రవాస ప్రభుత్వం’ - గవర్నమెంట్ ఎగ్జయిల్ - అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇతర దేశాల గుర్తింపును పొందలేకపోవడం అంతర్జాతీయ వైపరీత్యం. మన ప్రభుత్వం గుర్తించినట్టయితే ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా ‘టిబెట్’ను ఆదుకొనడానికి ముందుకు రావచ్చు!
చైనా ప్రభుత్వం ‘ఆసియా-ప్రశాంత సాగర’ ప్రాంతంలోని దేశాలకు ప్రబల ప్రమాదకర శక్తిగా ఎదిగిన నేపథ్యంలో ‘‘టిబెట్ ప్రవాస ప్రభుత్వానికి జపాన్ ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలు ఇప్పుడైన ‘అధికారిక పరిగణన’ను ప్రదానం చేయడం వ్యూహాత్మక ప్రతిఘటనకు శ్రీకారం కాగలదు. ఇలా చేయించడానికి మన దేశం ఇప్పుడైనా ప్రయత్నించాలి! చైనా తన ‘విస్తరణ వ్యూహం’తో ఈ ‘క్షేత్రం’లోని దాదాపు అన్ని దేశాలలోను చొరబడిపోతోంది! అందువల్ల చైనాను ‘విచ్ఛిన్నశక్తి’ అని ‘చతురస్ర కూటమి దేశాల’ నౌకాదళాల అధిపతులు గురువారం అభిశంసించడం చైనావారి భౌగోళిక, వ్యూహాత్మక, వాణిజ్య దురాక్రమణకు ‘ప్రతిఘటన వ్యూహం’.. కానీ ఈ వ్యూహంలో భాగంగా ‘‘అగ్గికి ఎదురగ్గి’’ ‘‘వజ్రం వజ్రేణ భిద్యతే - వజ్రం వజ్రంతోనే పగులుతుంది’’ అన్న వాస్తవాన్ని ఆచరణలోకి తేగలిగారు! ‘‘టిబెట్ మాదేశం చేతికి అరచేయి, లడక్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్‌లు ఐదు వేళ్లు..’’ అని చైనా కమ్యూనిస్టుల ఏడు దశాబ్దులుగా వల్లెవేస్తుండటం ‘విచ్ఛిన్న’ వ్యూహం! ఈ ‘దురాక్రమణ హస్తం’ గురించి టిబెట్ ప్రతినిధి మరోసారి ఇప్పుడు ప్రస్తావించాడు! సిక్కింలోను భూటాన్‌లోను విస్తరించి ఉన్న ‘డోక్ లా’ పచ్చిక మైదానంలోకి చైనా చొరబడడం ఈ చైనా ‘దురాక్రమణ హస్తం’ ‘‘సాగుతోందన’’డానికి సరికొత్త సాక్ష్యం! అందువల్ల ప్రతిఘటన ఇప్పుడైనా మొదలుకావాలి!
టిబెట్ స్వాతంత్య్రాన్ని మనం గుర్తించి ‘చతురస్ర కూటమి’లోని మిగిలిన మూడు దేశాలలోను గుర్తింప చేయాలి! చతురస్ర కూటమిలో చేరడానికి ఇండోనేసియా కూడ సిద్ధంగా ఉంది! దేశ విదేశాలలోని లక్షలాది ‘త్రివిష్టప జాతీయులు’ - టిబెట్ ప్రజల - కు ఈ గుర్తింపు కొండంత బలం చేకూర్చగలదు! వివిధ దేశాలలోని టిబెట్ ప్రవాసులు ‘అహింసాయుతంగా’ చైనాకు వ్యతిరేకంగా ఈ ఆరు దశాబ్దులుగా స్వాతంత్య్ర ఉద్యమం సాగిస్తూనే ఉన్నారు. అఝార్ మసూద్ వంటి బీభత్సకారులను, పాకిస్తాన్ వంటి బీభత్స దేశాలను నిర్లజ్జగా మనదేశంపైకి ఉసిగొల్పుతున్న చైనా, మరోవైపు మావోయిస్టు ఉగ్రవాదులకు అండగా నిలబడి ఉంది! అందువల్ల టిబెట్ ప్రజల న్యాయమైన స్వాతంత్ర సాధన కోసం మనం ప్రపంచ దేశాలను కూడగట్టడం మానవత్వపు విలువల పరిరక్షణకు మార్గం కాగలదు. ఈ ప్రతిఘటన వ్యూహం వల్ల మనదేశపు ఉత్తరపు సరిహద్దులు కూడ భద్రవౌతాయి. టిబెట్ స్వతంత్ర దేశంగా కొనసాగి ఉండిన్టయితే ఈ యాబయి తొమ్మిదేళ్లుగా చైనా చొరబాట్ల బెడద మనకు ఉండేది కాదు, ‘డోక్ లా’ ఎక్కడ ఉందో కూడా చైనాకు పట్టని భౌగోళిక స్థితి కొనసాగి ఉండేది. చైనాకు మనకూ మధ్య స్వతంత్ర టిబెట్ దేశం నెలకొని ఉండడం ఈ భౌగోళిక, చారిత్రక వాస్తవం! దీన్ని పునరుద్ధరించడానికి మన ప్రభుత్వం ‘చతురస్ర కూటమి’ని సంసిద్ధం చేయగలగాలి!
చైనా మన బ్రహ్మపుత్ర జలాలను కాజేస్తోంది. ‘మాతృగంగ’ - థాయ్ భాషలో మెవాంగ్ - ఆగ్నేయ ఆసియాలో అతిపెద్ద నది. ఈ నదీజలాలను కూడా చైనా కొల్లగొడుతుండడం థాయ్‌లాండ్‌కు, పొరుగు దేశాలకు ఆగ్రహం కలిగిస్తోంది. వియత్నాం, ఫిలిప్పీన్స్, జపాన్ తదితర ఎనిమిది పూర్వ ఆసియా దేశాలకు చెందిన సముద్ర జలాలను, భూభాగాలను కాజేయడం కోసం చైనా చిత్ర విచిత్ర వ్యూహాలను విరచిస్తోంది! జపాన్‌కూ తమ దేశానికి మధ్య ఉన్న సముద్ర ప్రాంతాన్ని ఏకపక్షంగా తమ ‘రక్షణ మండలం’గా ప్రకటించడంతో ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్నాయి! ఈ ‘రక్షణ గగనం’లోకి తమ అనుమతి లేకుండా విదేశీయ విమానాలు ప్రవేశించరాదన్న చైనా ఆధిపత్య విధానాన్ని అమెరికా జపాన్ ఆస్ట్రేలియా వ్యతిరేకిస్తున్నాయి, చైనా ‘‘అనుమతి’’ లేకుండానే ఈ దేశాల నౌకలు, విమానాలు యథావిధిగా ఈ తథాకథిత - సోకాల్డ్ - రక్షణ మండలం గుండా ప్రయాణం చేస్తున్నాయి. చతురస్ర కూటమి ప్రారంభానికి చైనావారి ఈ ‘ఆధిపత్యం’, ‘విచ్ఛిన్న వ్యూహం’ ప్రధాన కారణం...