సంపాదకీయం

‘వాల్‌మార్ట్’ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొరబడిన ‘వాల్‌మార్ట్’ సంస్థ చొచ్చుకొని వస్తోంది. ‘చొరబాటు’కు మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. చొచ్చుకొని రావడానికి వీలుగా నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ‘రాజ పథాన్ని’ నిర్మిస్తోంది! 2012వ సంవత్సరానికి పూర్వం దొడ్డిదారుల గుండా మన ‘చిల్లర వ్యాపార’ రంగంలోకి చొరబడిన ఈ అమెరికా వారి ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’- మల్టీ నేషనల్ కంపెనీ- ఆ తరువాత చట్టబద్ధమైన ‘ప్రధాన ద్వారం’ గుండానే దేశంలోకి చొరబడింది. చిల్లర వ్యాపార రంగంలో విదేశీయులు పెట్టుబడులను పెట్టడానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇందుకు కారణం. అంతకుపూర్వం ‘వాల్‌మార్ట్’, ఫ్రాన్స్ వారి ‘క్యారీఫోర్’ వంటి సంస్థలు మన దేశంలోని సంస్థలతో సక్రమంగాను, అక్రమంగాను అనుసంధానం ఏర్పరచుకొని చిల్లర వ్యాపారాన్ని కొల్లగొట్టాయి. 2012 తరువాత ‘వాల్‌మార్ట్’ స్వయంగా దేశమంతటా పెద్ద పెద్ద చిల్లర దుకాణాలను తెరుస్తోంది. ఇప్పుడు భారతీయ ‘పంపిణీ’ సంస్థల్లో భారీగా పెట్టుబడులను పెట్టడం ద్వారా, భారతీయ సంస్థలనే కొనుగోలు చేయడం ద్వారా చిల్లర వ్యాపారాన్ని అదుపు చేయాలన్న వ్యూహాన్ని వాల్‌మార్ట్ అమలు జరుపుతోందట! ‘్ఫ్లప్ కార్ట్’ అనే భారతీయ ‘పంపిణీ’ సంస్థను స్వాధీనం చేసుకొనడానికి ‘వాల్‌మార్ట్’ పద్దెనిమిది నెలలుగా చేస్తున్న ప్రయత్నాల గురించి ప్రస్తుతం ప్రచారవౌతోంది. ‘్ఫ్లప్ కార్ట్’ సంస్థలో ఇదివరకూ పెట్టుబడులను పెట్టిన సంస్థల ‘వాటా’లన్నింటినీ అధిక మూల్యం చెల్లించి కొనుగోలు చేయడానికి ‘వాల్ మార్ట్’ యత్నిస్తోందట! ఈ కొనుగోలు ప్రక్రియ కారణంగా గత ఏడాది అరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన ‘్ఫ్లప్ కార్ట్’ వాటాలు, ఆస్తుల విలువ ఈ ఏడాది లక్షా ముప్పయి వేల కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందట! ఇలాంటి ‘కృత్రిమ’ అభివృద్ధి దేశంలో ధరలను, ద్రవ్యోల్బణాన్ని పెంచడానికి దోహదం చేస్తుంది. ‘వాల్‌మార్ట్’ విస్తరణ కేవలం ప్రతీక మాత్రమే. వివిధ సంపన్న దేశాల బహుళ జాతీయ సంస్థలు మన దేశంలోకి చొరబడిపోతున్నాయి, స్వదేశీయ సంస్థలు మూతపడుతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థపై విదేశీయుల పట్టు బిగిసిపోతుండడం ‘ప్రపంచీకరణ’ ఫలితంగా ఏర్పడిన ‘స్వేచ్ఛా వాణిజ్యం’- మార్కెట్ ఎకానమీ. భారతీయ జనతా పార్టీ 1990వ దశకంలో ప్రతిపక్షంలో ఉండిన సమయంలో ‘ప్రపంచీకరణ’ను వ్యతిరేకించింది. 1998 తరువాత 2004 వరకూ అధికారం చెలాయించిన కాలంలో ‘ప్రపంచీకరణ’ను వ్యవస్థీకరించింది. 2014 మే 26వ తేదీకి పూర్వం ‘్భజపా’ చిల్లర వ్యాపారంలో విదేశీయుల పెట్టుబడులను వ్యతిరేకించింది. గత మూడున్నరేళ్ల పాలనలో ‘చిల్లర వ్యాపారం’ నుంచి విదేశీయ సంస్థలను వెళ్లగొట్టడానికి ‘్భజపా’ ప్రభుత్వం చేసింది సున్న! ‘ఏకవస్తు ముద్రల’ సింగిల్ బ్రాండ్- చిల్లర వ్యాపారంలో విదేశీయులు వందశాతం పెట్టుబడులను పెట్టడానికి 2011లోనే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వీలు కల్పించింది. కానీ, ఇలా విదేశీయ సంస్థలు మన దేశంలో చిల్లర వ్యాపారంలో పెట్టుబడులను పెట్టడానికి ముందుగా మన ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవలసి ఉండేది. ఈ అనుమతి అవసరం లేదని యథేచ్ఛగా- ఆటోమేటిక్ రూట్- విదేశీయ సంస్థలు మన ‘ఏకవస్తు ముద్రల’ చిల్లర వ్యాపారంలోకి చొరబడి పోవచ్చునని గత జనవరిలో మోదీ ప్రభుత్వం నిర్థారించింది. ‘సంస్కరణ’లకు ఇది ‘మచ్చుతునక’ మాత్రమే..
విదేశాల నుంచి వివిధ రంగాలకు పెట్టుబడులు తరలివస్తుండడం వల్ల మన దేశంలోని జనానికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి. ఉత్పత్తులు పెరిగి ఎగుమతులు పెరిగి ‘విదేశీయ వినిమయ ద్రవ్య’ పరిమాణం పెరుగుతుందట, విదేశీయ వాణిజ్యంలో మనకు ఏర్పడిన లోటు క్రమంగా తగ్గి మిగులు ఏర్పడుతుందట! ఈ ‘సిద్ధాంతం’ ప్రపంచీకరణ మొదలైన తరువాత గత పాతికేళ్లలో ఆచరణలోకి రాకపోవడం వికృత వాస్తవం. గత పదిహేనేళ్లలో విదేశీయ వస్తువులు ప్రధానంగా చైనీయ ఉత్పత్తులు మన దేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా తరలి వస్తుండడం ఈ కఠోర వాస్తవం. దీపాలు- లాంటెరన్స్- దీపం బుగ్గలు- బల్బులు- పొయ్యి వెలిగించుకొనే పరికరాలు- లైటర్స్- గాలిపటాల దారం, వినాయకుని ప్రతిమలు, లడ్డూలు.. ఇవన్నీ కూడ చైనా నుంచి మన ఇళ్లలోకి చేరిపోవడం ప్రపంచీకరణ. కొత్తగా ఎంతమంది ‘బహుళ సంస్థల’ ఉద్యోగాల్లో చేరుతున్నారు? ‘బహుళ సంస్థల’ చిల్లర వ్యాపారం వల్ల ఎంతమంది చిట్టి వ్యాపారులు తమ దుకాణాలను మూసుకుంటున్నారు? ప్రభుత్వాల వద్ద లెక్కలున్నాయా? విదేశీయ నిధులతో కాక స్వదేశీయ నిధులతో ప్రగతిని సాధిస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ‘్భజపా’ వారు హోరెత్తించారు. ప్రభుత్వరంగ విమానయాన సంస్థ- ఎయిర్ ఇండియా-లో సగం వాటాలను విదేశీయ విమానయాన సంస్థలకు అమ్మిపారేస్తారట! సంస్కరణలకు ఇదో మచ్చుతునక!
ఉక్కు, సిమెంటు, ఇంధనం చమురు, ఇంధన వాయువు, విద్యుత్, బొగ్గు వంటి వౌలిక పారిశ్రామిక ఉత్పత్తులను పెంచడానికి వీలుగా ఈ వౌలిక రంగాల్లో మాత్రమే విదేశీయ పెట్టుబడులను అనుమతిస్తామని 1994-1996 సంవత్సరాల మధ్య అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ వాగ్దానం చేయడం చరిత్ర. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ వౌలిక రంగాలకు విదేశాల నుంచి లభించిన నిధుల విలువ ఎంత? ఇతరమైన అనవసర రంగాలకు లభించిన విదేశీయ సంస్థల పెట్టుబడుల విలువ ఎంత? వౌలిక రంగాలకు లభిస్తున్న పెట్టుబడుల కంటే ఇతర రంగాలకు లభిస్తున్న పెట్టుబడుల విలువ యాభయి రెట్లు అధికంగా ఉందన్నది ధ్రువపడని ప్రచారం! విదేశీయ సంస్థలు మన దేశంలోని బొగ్గు ఉత్పత్తులను పథకం ప్రకారం తగ్గించాయన్నది 2014లో జరిగిన ప్రచారం! 2008లో అమెరికాతో ఆర్భాటంగా కుదుర్చుకున్న ‘అణు విద్యుత్’ ప్రయోజనాల ఒ ప్పందం వల్ల ఒక్క యూనిట్ వి ద్యుత్ కూడ ఉత్పత్తి కాలేదు. ఈ ఒప్పందం అమలు జరిగితే రెండు పైసలకు యూనిట్ చొప్పున మన దేశంలో విద్యుచ్ఛక్తి సరఫరా జరిగిపోతుందని 2009 నాటి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చేసిన ప్రచారం. పదేళ్లు గడిచిపోయినప్పటికీ ఈ విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నిర్మాణానికి పునాది రాయి కూడ సిద్ధం కాలేదు. ఆవకాయలను, అప్పడాలను, సేమ్యాలను, ఉప్పును, పప్పులను, కూరగాయలను, కరివేపాకును అమ్మడానికి ‘వాల్‌మార్ట్’ సంస్థ సిద్ధమైపోయింది! ‘బహుళ వస్తు ముద్ర’ల చిల్లర వ్యాపారంలోకి విదేశీయ పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటన్నది గత మూడున్నరేళ్లుగా స్పష్టం కాని కీలకమైన రహస్యం..
శుద్ధి ప్రక్రియ ద్వారా ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడం యుగాలుగా, తరాలుగా భారతీయ జీవన విధానం. ఈ ఆహార శుద్ధి ప్రక్రియ- ఫుడ్ ప్రాసెసింగ్- గృహ పరిశ్రమ. నాయనమ్మలు, అమ్మమ్మలు పచ్చళ్లు మొదలుకొని ఒరుగులు, బొరుగులు, అటుకులు, మరమరాలు, పుట్నాలు, జంతికలు, కోవాలు, తాండ్రలు తయారు చేసేవారు. ఈ కుటీర పరిశ్రమల యజమానులు వినియోగదారులను దోపిడీ చేయలేదు, ఈ వృత్తిద్వారా తాము జీవించారు. వీటిని బుట్టల్లో, తట్టల్లో పెట్టుకొని సంచార వ్యాపారులు గ్రామాల్లో, పట్టణాల్లో అమ్మి జీవించారు. స్వయం సహాయ బృందాలను, ఇతర గ్రామీణ బృందాలను ప్రోత్సహించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ‘ఆహారశుద్ధి’ని వికేంద్రీకృతం చేసి విస్తరించవచ్చు. కానీ ప్రభుత్వాలు ఈ వృత్తిని ‘కేంద్రీకృతం’ చేశాయి, చేస్తున్నాయి. బృహత్ ఆహారశుద్ధి ప్రాంగణాల- మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు-లను ఏర్పాటు చేస్తున్నాయి. పాలకోవా ఇంట్లో తయారుచేసి వీధుల్లో తిరిగి అమ్మే వ్యాపారులు నిరుద్యోగులై రోడ్డున పడుతున్నారు. రసాయనాలు కలసిన శీతల పానీయాల- కోల్డ్ డ్రింక్స్- రుచి మరిగిన వారికి లేత కొబ్బరి నీరు రుచించడం లేదు మరి. ‘వాల్‌మార్ట్’ దుకాణాలను తెరవనివ్వబోమని 2012లో చేసిన ‘్భషణ ప్రతిజ్ఞ’ గురించి భాజపా నాయకులకు ఇప్పుడు ధ్యాస ఉందా?