సంపాదకీయం

మళ్లీ దూకిన ‘తోడేలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మంగళవారం పేలిన ‘మందు పా తర’కు తొమ్మిది మంది అనుబంధ సైనికులు బలైపోవడం విస్తరిస్తున్న ‘మావోయిస్టు’ బీభత్సకాండకు మరో నిదర్శనం. చైనాలో ఏకపక్ష నియంతృత్వం ‘ఏక వ్యక్తి నియంతృత్వం’గా రూపాంతరం చెందడం మన దేశంలోని మావోయిస్టుల ఈ విస్తృతికి వికృతమైన నేపథ్యం. దశాబ్దుల తరబడి చైనా ప్రభుత్వం ఇరుగు పొరుగు దేశాలలో మావోయిస్టులను ఉసిగొల్పుతుండడం అంతర్జాతీయ సమాజం ఎఱిగిన రహస్యం! చైనా జరుపుతున్న వ్యూహాత్మక దురాక్రమణలో మావోయిస్టులు భాగం. సరిహద్దులలో చైనా ప్రభుత్వ ప్రత్యక్ష సైనికులు భౌతిక దురాక్రమణ వ్యూహాన్ని దశాబ్దులుగా అమలు జరుపుతున్నారు. మన దేశంలోని అనేక ప్రాంతాలలో తోడేళ్లవలె నక్కి ఉన్న మావోయిస్టులు చైనా ప్రభుత్వపు ప్రచ్ఛన్న సైనికులు! ఇలా నక్కి ఉన్న తోడేళ్లు నిరంతరం దూకుతూనే ఉన్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని గొల్లపల్లి, కిష్టారం గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో మరోసారి దూరాయి, తొమ్మిది మందిని పొట్టన పెట్టుకున్నాయి. ‘కేంద్ర రిజర్వ్ పోలీసు దళం’- సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్- సీఆర్‌పీఎఫ్- సభ్యులైన ఈ అనుబంధ సైనికులు పయనిస్తూండిన వాహనం మందుపాతర విస్ఫోటనం ఫలితంగా ముక్కలు చెక్కలైపోయింది. మరో ఆరుగురు ‘సీఆర్‌పీఎఫ్’ జవానులు గాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల సరిహద్దులలో మావోలు మళ్లీ చెలరేగుతున్నారనడానికి ఈ దుర్ఘటన మరో నిదర్శనం. సమాజ రక్షకులైన, ప్రజారక్షకులైన, ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షకులైన అనుబంధ సైనికులకు, ప్రజాస్వామ్య విధ్వంసుకులైన మావోయిస్టులకు దశాబ్దులుగా జరుగుతున్న సంఘర్షణ మరోసారి తీవ్రతరం అవుతున్నట్టు మంగళవారం నాటి దుర్ఘటన ద్వారా ధ్రువపడింది. దేశవ్యాప్తంగా 2017లో అంతకుముందు సంవత్సరంలో కంటె మావోయిస్టుల బీభత్స ఘటనలు తగ్గినట్టు గత ఏడాది డిసెంబర్ 31న కేంద్ర ప్రభుత్వం ఆధికారికంగా నిర్ధారించింది. కానీ 2018 ఆరంభం నుంచీ మావోయిస్టులు మళ్లీ చెలరేగుతుండడం వనవాసీ ప్రజలకు ఆందోళన కలిగిస్తున్న విపరిణామం. ఈనెల రెండవ తేదీన మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ‘యుద్ధం’లో పదిమంది మావోయిస్టులు, ఒక జవాను మరణించారు. పది రోజులు తరువాత మావోయిస్టులు ఇలా మంగళవారం నాడు దొంగ దెబ్బతీశారు..
ప్రస్తుత భారత రాజ్యాంగ వ్యవస్థను 2050వ సంవత్సరం లోగా కూల్చివేస్తామని మావోయిస్టులు పదే పదే పునరుద్ఘాటించి ఉన్నారు. ఈ ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేసి వినూతన రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో భాగంగానే వీరు ఈ భయంకర బీభత్సకాండను కొనసాగిస్తున్నారు. వీరు ఏర్పాటు చేయదలచిన వినూతన వ్యవస్థ కమ్యూనిస్టు పార్టీవారి లేదా మావోయిస్టు పార్టీవారి ‘ఏకపక్ష నియంతృత్వం’. ఈ ఏకపక్ష నియంతృత్వ వ్యవస్థకు ‘ప్రొలిటేరియన్’- ప్రజలు- నిర్వహించే వ్యవస్థ అన్నది దశాబ్దులుగా మావోయిస్టులు, ఇతరేతర ‘వర్గ సమర’ వాదులు చెలామణి చేయిస్తున్న పేరు. ఈ లక్ష్యంతోనే చైనా చంకబిడ్డలైన ‘మావోయిస్టులు’ 1996 నుంచి తొమ్మిదేళ్లపాటు నేపాల్‌లో భయంకర బీభత్సకాండను సృష్టించారు. ఈ బీభత్సకాండకు పదమూడు వేల మంది బలైపోయిన తరువాత చైనా ‘నిర్దేశం’తో మావోయిస్టులు ‘సాయుధ సమర’’ సిద్ధాంతాన్ని వదిలిపెట్టేశారు. బహుళ పక్ష ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని అంగీకరించినట్టు అభినయిస్తున్నారు. థాయ్‌లాండ్ వంటి ప్రాచ్య దేశాలలో సైతం చైనావారి ప్రచ్ఛన్న దళాలు ‘ఏకపక్ష నియంతృత్వ’ వ్యవస్థను ఏర్పాటు చేసేలా హింసాకాండను కొనసాగిస్తున్నారు! మన దేశంలోని మావోయిస్టులు చైనాకు ఇరుగు పొరుగు దేశాలలో ఉన్న అతి పెద్ద సైనిక పటాలం..
ఏకపక్ష నియంతృత్వ రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా అసమానతలు లేని వర్గరహిత సమాజాన్ని- సోషలిస్ట్ సొసైటీ-ని, సామ్యవాద- కమ్యూనిస్ట్-సమాజాన్ని ఏర్పాటు చేయగలమని ప్రపంచవ్యాప్తంగా మార్క్సిస్టులు, మావోయిస్టులు, లెనినిస్టులు, కమ్యూనిస్టులు దశాబ్దులపాటు డప్పులు వాయించారు. కానీ రష్యాలోను మిగిలిన పదునాలుగు ‘సోవియట్’ దేశాలలోను, తూర్పు ఐరోపా దేశాలలోను ఈ ‘ఏకపక్ష రాజకీయ నియంతృత్వం’ ఆర్థిక అసమానతలను తొలగించలేకపోయింది, ప్రభుత్వపు పెట్టుబడిదారీ వ్యవస్థ- స్టేట్ కాపిటలిజమ్-గా అవతరించింది! గుప్పెడు మంది పాలకులు ‘పాలితుల’ను బందీలుగా చేయడం పైదేశాలలో 1917 నుంచి 1991 వరకు నడిచిన చరిత్ర. 1989లో తూర్పు ఐరోపాలోను, 1991లో ‘రష్యా, సోవియట్ కూటమి’ దేశాలలోను ప్రజలు తిరగబడి కమ్యూనిస్ట్ ఏకపక్ష నియంతృత్వ వ్యవస్థలను నిర్మూలించారు, బహుళ పక్ష ప్రజాస్వామ్య వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. కానీ చైనా కమ్యూనిస్టు పార్టీవారు కార్ల్‌మార్క్స్ ప్రవచించిన ఆర్థిక సిద్ధాంతాన్ని అతి తెలివిగా వదిలించుకున్నారు. రాజకీయ నియంతృత్వాన్ని మరింత పటిష్ఠం చేశారు. వాణిజ్య ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- నడికొన్న తరువాత చైనా అతి పెద్ద పెట్టుబడిదారుల దేశం- కాపిటలిస్ట్ సొసైటీ- గా, బృహత్ స్వేచ్ఛా విపణి వ్యవస్థ- మెగా మార్కెట్ ఎకానమీ- గా అవతరించింది. ఇలా చైనాలో కమ్యూనిస్ట్ ఏకపక్ష నియంతృత్వం, కమ్యూనిస్ట్ పార్టీవారి ‘కాపిటలిస్ట్’ ఏకపక్ష నియంతృత్వంగా రూపాంతరం చెందడం తొండ ముదిరి ఊసరవెల్లిగా మారిన తీరుకు నిదర్శనం! ‘కమ్యూనిజమ్’, ‘కాపటలిజమ్’- ఈ రెండూ ఒకే స్వభావం కలిగిన నియంతృత్వ భూతానికున్న రెండు వికృత ముఖాలు.. ఈ సత్యం చైనా ‘పరివర్తన’ ద్వారా మరోసారి పుష్టీకృతమైంది! చైనా అధ్యక్షుడు ఝీ జింగ్‌పింగ్ ఆజీవన అధినేతగా కొనసాగడానికి ‘చైనా పీపుల్స్ కాంగ్రెస్’ ఇటీవల ఆమోదముద్రను వేయడంతో ఏకపక్ష రాజకీయ నియంతృత్వ వ్యవస్థ స్థానంలో ఏక వ్యక్తి రాజకీయ నియంతృత్వం వ్యవస్థీకృతమైపోయింది!
ఇలా పెట్టుబడిదారీ- కాపిటలిస్ట్- నియంతగా అవతరించిన ఝీ జింగ్‌పింగ్ 2050 నాటికి చైనా ఆదర్శవంతమైన ‘సోషలిస్టు’ దేశంగా ఏర్పడనున్నట్టు ప్రకటించడం విచిత్రం కాదు. ఆయన దృష్టిలో, చైనా కమ్యూనిస్టు పార్టీ దృష్టిలో ‘కమ్యూనిజమంటే కాపిటలిజమ్’ అని అర్ధం! ఈ నడమంత్రపు కమ్యూనిజానికీ, కాపిటలిజానికీ భిన్నంగా మన దేశంలో అనాదిగా కొనసాగిన వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ ఆకలి లేని, దోపిడీకి అవకాశం లేని వ్యవస్థ. దీన్ని విదేశీయ దురాక్రమణదారులు ధ్వంసం చేసిపోయారు! మావోయిస్టులకు నిజంగా దోపిడీకి అవకాశం లేని వ్యవస్థను ఏర్పాటుచేయాలన్న చిత్తశుద్ధి ఉన్నట్టయితే భయంకర దమనకాండ సాగించిన మావో ఘేడుంగా మార్గాన్ని వదిలి భారతీయమైన ‘మానవ వాదాన్ని’ స్వీకరించాలి! పోలీసులను, భద్రతా దళాలను, ప్రజలను హత్యచేసే పద్ధతిని, సాయుధ బీభత్సాన్ని వదిలిపెట్టాలి.