సంపాదకీయం

అతిశయానికి అవరోధం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ జనతాపార్టీకి అతిశయించిన విజయ విశ్వాసపు ‘మత్తు’ దిగింది. అందువల్ల లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ‘ఓడిపోయిందన్నంత’ స్థాయిలో కోలాహలం చెలరేగడం సహజం. ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలు చేస్తున్న కోలాహలం కంటె ప్రచార మాధ్యమాల్లో ప్రస్ఫుటిస్తున్న ఆర్భాటం మరింత ఎక్కువగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఫూల్‌పూర్, గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానాలకు, బిహార్‌లోని అరారియా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలలో భాజపా ఓడిపోవడం ఈ ఆర్భాటానికి కారణం! ఇలా ఆర్భాటం, కోలాహలం ఈ రెండు రాష్ట్రాలలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టించడం సహజం! ఉత్తరప్రదేశ్‌లో గెలిచిన సమాజ్‌వాదీ పార్టీ- ‘సపా’-కి బెంగాల్‌లో కాని కాశ్మీర్‌లో కాని వోట్లు లేవు, బిహార్ ఉపఎన్నికలో విజయాన్ని దక్కించుకున్న లాలూప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ‘రాష్ట్రీయ జనతాదళ్’- ‘రాజద’-కు బెంగాల్‌లో కాని జమ్ము కాశ్మీర్‌లో కాని ‘ఉనికి’ లేదు. అయినప్పటికీ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతాబెనర్జీ వోట్ల లెక్కింపు మొదలుకాగానే అఖిలేశ్ యాదవ్‌కు ‘్ఫన్’చేసి అభినందించింది, బెంగాల్ ‘దీదీ’తో కలిసికట్టుగా ఇకపై ఎన్నికల పోరాటం జరపాలన్నది అఖిలేశ్ సంకల్పం. జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ‘నేషనల్ కాన్ఫరెన్స్’ నాయకుడు ఉమర్ అబ్దుల్లా ఆనంద తాండవం చేయడం మరో విచిత్ర విన్యాసం! మమతా బెనర్జీ పార్టీకి కాని, ఉమర్ అబ్దుల్లా పార్టీకి కాని ఉత్తరప్రదేశ్‌లో కాని, బిహార్‌లోకాని అస్తిత్వం లేదు. అయినప్పటికీ ఈ ప్రాంతీయ పార్టీలు- భాజపాయేతర, కాంగ్రెసేతర పార్టీల కూటమి ఏర్పడిపోయినట్టు, ఈ కూటమి 2019 లోక్‌సభ ఎన్నికలలో ఘన విజయం సాధించనున్నట్టు అబ్దుల్లా, బెనర్జీ వంటివారు అనుభూతికి లోనవుతున్నారు. ఈ అనుభూతికి ఏకైక కారణం వారి ‘్భజపా’ వ్యతిరేకత! ‘్భజపా’ ప్రజలకు దూరమైపోయిందని, ఆ పార్టీ ఘోర వైఫల్యానికి ఉపఎన్నికల ఫలితాలు చిహ్నమని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ‘కదన కాహళి’ని, ‘విజయభేరి’ని మోగించడం మరో విచిత్ర విన్యాసం! కానీ ఈ ఉపఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో నామరూపాలు లేకుండా నశించిపోతోందన్న వాస్తవాన్ని మరోసారి ధ్రువపరిచాయి. యూపీలోని రెండు లోక్‌సభ ఉపఎన్నికలలోను కాంగ్రెస్ ధరావత్తులను కోల్పోవడమే కాదు, అతి తక్కువ శాతం వోట్లను మాత్రమే పొందగలిగింది. ఉత్తరప్రదేశ్, బిహార్ ఫలితాలు భాజపా ‘అతిశయ’ విన్యాసాలలో గొప్ప అపశ్రుతులు. కాని కాంగ్రెస్ నాయకులు మురిసిపోయి ముక్కులు ఎందుకు ఎగురవేస్తున్నారన్నది జనానికి అంతుపట్టని వ్యవహారం.
యూపీ శాసనసభకు గత ఏడాది జరిగిన ఎన్నికలలో ‘సపా’తో కాంగ్రెస్ జట్టుకట్టింది. ‘కాంగ్రెస్-సపా’ కూటమి ఘోర పరాజయం పాలైంది. ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్ రెండు లోక్‌సభ స్థానాలకు పోటీచేసి తుడిచిపెట్టుకొని పోయింది. ఉపఎన్నికలలో ‘్భజపా’ పరాజయానికి ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి మాయావతి నాయకత్వంలోని ‘బహుజన సమాజ్ పార్టీ’ -బసపా- ఎన్నికల ప్రచారం మధ్యలో ‘సపా’కు మద్దతును ప్రకటించడం. తుడిచిపెట్టుకొని పోయిన కాంగ్రెస్ ఓడిన భాజపాను వెక్కిరించడం ‘ఊరిలో పెళ్లయితే పక్క ఊరిలో హడావుడి జరిగినట్టు’ మాత్రమే! ఈ ఉపఎన్నికల ఫలితాల వల్ల జాతీయ స్థాయిలో భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఏర్పడే అవకాశాలు మెరుగయ్యాయన్నది జరుగుతున్న ప్రచారం. అలాంటి కూటమిలో కాంగ్రెస్‌కు స్థానం ఉండబోదన్నది యూపీ ఎన్నికల ఫలితాలు నిర్ధారించిన నిజం. రెండు దశాబ్దులకు పూర్వం వలె ‘సపా’, ‘బసపా’ ఉత్తరాది రాష్ట్రాలలో జట్టుకట్టడానికి ఈ ఫలితాలు దోహదం చేయవచ్చు! ‘బూవా- మేనత్త- మాయావతి, భతీజా- మేనల్లుడు అఖిలేశ్ యాదవ్-’లకు యూపీలో వినిపించిన జయ నాదాలు ఇందుకు సంకేతం! ఈ కూటమి భాజపాకు పెద్ద ప్రత్యర్థికావడమేకాక ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆనవాళ్లను సైతం తుడిచివేయడానికి దోహదం చేస్తుంది. ‘సపా’ ‘బసపా’లు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమిలో చేరబోవు. మంగళవారం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన విందుకు ఈ పార్టీల అధినేతలు హాజరుకాకపోవడం ఇందుకు సంకేతం! ఈ ఉపఎన్నికలలో ‘్భజపా’కు బిహార్‌లోని బబువా శాసనసభ స్థానంలో మాత్రమే విజయం లభించింది. అక్కడ ఓడిపోయిన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ అరాలియా లోక్‌సభ స్థానాన్ని, జెహానాబాద్ అసెంబ్లీ స్థానాన్ని గెలిచినప్పటికీ ఆ పార్టీ మిత్రపక్షమైన కాంగ్రెస్ ఓడింది.
యూపీ ఉపఎన్నికలలో అతి తక్కువ స్థాయిలో వోట్లు పడడం ‘్భజపా’కు దిగ్భ్రాంతిని సమకూర్చిన ఓటమికి ప్రధాన కారణం! 2014 లోక్‌సభ ఎన్నికల్లో గోరఖ్‌పూర్‌లో దాదాపు అరవై రెండు శాతం వోటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు, ఫూల్‌పూర్‌లో దాదాపు యాబయి ఏడు శాతం వోట్లు వేశారు. అందువల్లనే అప్పుడు ఫూల్‌పూర్ నుంచి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ వౌర్య మూడు లక్షల వోట్ల ఆధిక్యంతోను, గోరఖ్‌పూర్ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి మూడున్నర లక్షల వోట్ల ఆధిక్యంతోను ఘన విజయం సాధించారు. ఈ ఉపఎన్నికలలో గోరఖ్‌పూర్‌లో నలబయి మూడు శాతం వోట్లు మాత్రమే పోలయ్యాయి. ఫూల్‌పూర్ ముప్పయి ఏడు శాతం వోటర్లు మాత్రమే పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం ఘోరమైన వైపరీత్యం! సాధారణంగా సార్వత్రిక ఎన్నికల్లో కంటె ఉపఎన్నికలలో పోలింగ్ శాతం పెరుగుతుంది. ఎందుకంటె ‘పరిధి’ చాలా తక్కువ కనుక ప్రాధాన్యం పెరుగుతుంది. అన్ని పార్టీల అభ్యర్థులు పట్టుదలతో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తారు. కానీ విజయ విశ్వాసం విజయోన్మాదంగా మారిన భాజపా కార్యకర్తలు ప్రచారం పట్ల శ్రద్ధ వహించలేదు. త్రిపుర ఎన్నికల్లో లభించిన ఘన విజయం పారవశ్యంతో పులకించిపోయిన ‘్భజపా’ వారు ప్రస్తుత ఉపఎన్నికలను పట్టించుకోలేదు. విజయోత్సవాల విందులు మితిమీరి వీధులలో ఉండిపోయారు. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయలేదు. 2014 నాటి ఎన్నికలలో ‘్భజపా’కు ఫూల్‌పూర్‌లో యాబయి ఒక్క శాతం, గోరఖ్‌పూర్‌లో యాబయి రెండు శాతం వోట్లు వచ్చాయి. ఆ జనాదరణ అలాగే కొనసాగి ఉంటే మాయావతి ‘సపా’కు మద్దతు పలికినప్పటికీ ‘్భజపా’ ఇప్పుడు కూడ గెలిచి ఉండేది. ‘్భజపా’ ఓటమికి అసలు కారణం మాయావతి కాదు!
బిహార్ సీఎం నితీశ్‌కుమార్ నాయకత్వంలోని ‘ఐక్య జనతాదళ్’తో భాజపా గత ఏడాది పొత్తును పునరుద్ధరించుకోవడం సైద్ధాంతిక అనైతికతకు నిదర్శనం. 2014 ఎన్నికలకు ముందు భాజపాను మతతత్త్వశక్తిగా చిత్రీకరించిన నితీశ్‌కుమార్ ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నాడు, 2015 నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ‘రాజద’తోను, కాంగ్రెస్‌తోను జట్టుకట్టాడు. ఆ తర్వాత భాజపాతో మళ్లీ జట్టుకట్టిన నితీశ్ అవకాశవాది. ఇప్పుడు ‘అవకాశ వాదం’పై ‘లాలూప్రసాద్ బృందం వారి అవినీతి’ ఆధిక్యాన్ని సాధించింది.