సంపాదకీయం

‘సమాంతరం’ ఇలా సాధ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించడం రాజకీ య సౌలభ్యం మాత్రమే, ప్రజాస్వామ్య స్వభావం కాదు. పదే పదే ఎన్నికలు జరగడం వల్ల పాలకుల దృష్టి ‘పాలన’ పైనుంచి ‘ప్రచారం’ వైపు మరలడం అనివార్యం. ‘పాలన కుంటుపడుతోంది. ప్రగతి వేగం మందకొడి తనానికి గురవుతోంది’ అన్నది తరచూ వినబడుతున్న వాదం. ఇందులో యథార్థం లేకపోలేదు. కానీ ‘ఏకకాలం ఎన్నికల’ కోరిక వెనుక దీనికి మించిన మరో అంశం దాగి ఉంది. అదీ రాజకీయ సౌలభ్యం. రాజకీయ పక్షాలకు ప్రతి ఎన్నిక ఒక పరీక్షే! అందువల్ల తరచుగాకాక కేవలం నిర్దిష్ట కాలవ్యవధిలో ఐదేళ్లకోసారి మాత్రమే తాము ‘పరీక్షల’- ఎన్నికల-కు గురికావాలన్నది రాజకీయవేత్తల అంతరంగం. ‘్భరత న్యాయ వ్యవహారాల మండలి’- లా కమిషన్ ఆఫ్ ఇండియా- వారు మంగళవారం విడుదల చేసిన ‘శే్వతపత్రం’- వైట్ పేపర్- ముసాయిదా ఈ రాజకీయ సౌలభ్యానికి అనుగుణంగా ఉంది. జనబాహుళ్య నిర్ణయం పరిపాలనలో ప్రస్ఫుటించడమే ప్రజాస్వామ్యం. దీనే్న ‘మెజారిటీ సూత్రం’ అంటున్నారు. ఈ ‘మెజారిటీ’- ప్రజల్లో యాబయి శాతం కంటె ఎక్కువ- సూత్రం (‘జనాదేశ’ సిద్ధాంత- డాక్టరిన్ ఆఫ్ మాండేట్) వౌలిక తత్త్వం. వందశాతం ప్రజలు ఏ అంశం గురించి కాని, సమస్య గురించి కాని, పరిష్కారం గురించి కాని, నాయకత్వం గురించి కాని ఏకాభిప్రాయం కలిగి ఉండడం అసంభవం. దీంతో ‘మెజారిటీ’ సూత్రం జనాదేశానికి ప్రాతిపదిక అయింది. ‘పదుగురాడు మాట పాటియై ధర చెల్ల’, ‘జనవాక్యంతు కర్తవ్యం’, ‘రాజునకు ప్రజ శరీరము’, ‘యథాప్రజాః తథా రాజా’ అన్న లోకోక్తులు ప్రజాస్వామ్య వౌలిక స్వభావాన్ని తరతరాలుగా ఆవిష్కరించాయి. చట్టసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగినా, జరగకపోయినా కూడ ప్రజాస్వామ్య వౌలిక స్వభావానికి, జనబాహుళ్య నిర్ణయ ప్రక్రియకు సంభవించగల విఘాతం లేదు. ఎన్నికైన, ఎన్నికవుతున్న ప్రభుత్వాలకు ‘మెజారిటీ’ ప్రజల లేదా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములవుతున్న వారిలో ‘మెజారిటీ’ సంఖ్యాకుల మద్దతు ఉన్నదా? అన్నది వౌలిక ప్రశ్న. 1952 నుంచి జరిగిన ఏ ఎన్నికలో కాని లోక్‌సభలో మెజారిటీ స్థానాలు సాధించిన ఏ పార్టీకి కూడ మెజారిటీ వోట్లు లభించలేదు. 1952, 1957, 1971, 1980, 1984 సంవత్సరాల్లో అధికారం పొందగలిగిన రాజకీయ పక్షానికి లోక్‌సభలో మూడింట రెండువంతుల స్థానాలు దక్కాయి. కానీ పోలయిన వోట్లలో మాత్రం మెజారిటీ లభించలేదు. ఏకకాలంలో ఎన్నికలు జరగడం అభిలషణీయం. కానీ మెజారిటీ వోటర్ల పాలనను వ్యవస్థీకరించడం మరింత అభిలషణీయం. రాజ్యాంగాన్ని, ప్రజాప్రాతినిధ్యపు చట్టాన్ని సవరించడం ద్వారా ఈ రెండింటినీ సాధించవచ్చు..
లోక్‌సభకు, రాజ్యసభకు సమాన సంఖ్యలో స్థానాలను ఏర్పాటు చేయడం మొదటి సంస్కరణ. రాజ్యసభకు కూడ 543 స్థానాలను- నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలి. ఇప్పుడు లోక్‌సభకు జరుపుతున్న పద్ధతి- ఏకసభ్య నియోజకవర్గం- సింగిల్ మాన్ కాన్‌స్టిట్యూయెన్సీ-లో రాజ్యసభకు ఎన్నికలు జరగాలి. ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల వయః పరిమితి, మిగిలిన అర్హతలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు వలె నిర్ధారించాలి. ఇలా మొత్తం 543 స్థానాలకూ జరిగే ప్రత్యక్ష ఎన్నికల్లో వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తారు. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ప్రస్తుత లోక్‌సభ సభ్యుల వలె నిర్దిష్ట కాలపరిమితి వరకు అంటే ఐదేళ్లపాటు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతారు. అంటే రాజ్యసభ కాలపరిమితి లోక్‌సభ కాల వ్యవధి వలె ఐదేళ్లు! ఇలా జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆయా రాజకీయ పక్షాలు లేదా స్వతంత్ర అభ్యర్థుల కూటములు గెలిచే సీట్ల సంఖ్యను బట్టికాక వాటికి దేశవ్యాప్తంగా లభించే వోట్లను బట్టి రెండు పెద్ద రాజకీయ పక్షాలను నిర్ణయించాలి. ఈ రెండు రాజకీయ పక్షాలకు మాత్రమే మరుసటి సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లభించాలి. ఉదాహరణకు 2019లో రాజ్యసభకు ఎన్నికలు జరుగుతాయి. రాజ్యసభకు మళ్లీ 2024లో ఎన్నికలు జరుగుతాయి. రాజ్యసభ ఎన్నికల ద్వారా వోట్ల ప్రాతిపదికగా రెండు పెద్ద పార్టీలు నిర్ణయమవుతాయి. ఈ రెండు పార్టీలు సంవత్సరం తర్వాత 2020లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాయి. లోక్‌సభకు నైష్పత్తిక ప్రాతినిధ్యం- ప్రపోర్షనల్ రెప్రజెంటేషన్- ప్రాతిపదికగా ఎన్నికలు జరపాలి. రెండు పార్టీలు మాత్రమే పోటీ చేస్తాయి గనుక ఏదో ఒక పార్టీకి మెజారిటీ వోట్లు లభిస్తాయి. ‘నైష్పత్తిక’ సూత్రం ప్రకారం ఈ రెండు పార్టీలకు వాటికి లభించిన వోట్ల ప్రాతిపదికగా లోక్‌సభలో సీట్లను కేటాయిస్తారు. మెజారిటీ వోట్లు, సీట్లు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
ఐదేళ్ల తర్వాత అంటే 2025లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఏ రెండు పార్టీలు పోటీచేయాలన్నది 2024లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆయా పార్టీలకు లభించే వోట్ల ప్రాతిపదికగా నిర్ధారితవౌతుంది. ఈ ఎన్నికలు ఇలా ఒకసారి వ్యవస్థీకృతమైన తర్వాత రాజ్యసభకు, లోక్‌సభకు నియతంగా ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఇదే పద్ధతిని రాష్ట్రాలకు, శాసనసభలున్న కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడ వర్తింపచేయాలి. అంటే ప్రతి రాష్ట్రానికీ సమాన సభ్యులున్న రెండు సభలు ఏర్పడతాయి. మొదటి సభ-శాసనమండలి-కు జరిగే ఎన్నికల్లో వివిధ పక్షాలకు, కూటములకు లభించే వోట్ల ప్రాతిపదికగా రెండు పెద్ద పక్షాల లేదా రెండు కూటముల నిర్ధారణ జరుగుతుంది. ఆ రెండు మాత్రమే నైష్పత్తిక ప్రాతినిధ్య సూత్రం- ప్రపోర్షనల్ రెప్రజెంటేషన్- ప్రాతిపదికగా జరిగే శాసనసభ ఎన్నికల్లో పోటీచేస్తాయి. ఇలా శాసనసభ ఎన్నికల్లో మెజారిటీ వోట్లు, సీట్లు ఏదో ఒక పార్టీ లేదా కూటమికి లభించడం ఖాయం. అందువల్ల శాసనసభలు కూడ ఐదేళ్లు సుస్థిరంగా పనిచేస్తాయి. భారత రాజ్యాంగంలోని 79వ అధికరణం నుంచి 84వ అధికరణం వరకు గల నిబంధనలను, 170వ అధికరణం నుంచి 173వ అధికరణం వరకు గల నిబంధనలను సవరించడం ద్వారా ఈ సభలను, ఎన్నికలను వ్యవస్థీకరించవచ్చు. రాజ్యసభకు శాసనమండలులకు ఒకేసారి, లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపే వీలుంటుంది.
ఇలా మెజారిటీ వోట్ల ప్రాతిపదికగా లోక్‌సభలో, అసెంబ్లీల్లోను ఆధిక్యతను పొందే పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. బడ్జెట్ విషయంలో తప్ప మిగిలిన అన్ని అంశాల్లోను రాజ్యాంగ సవరణల విషయంలో కేంద్రంలోను, రాష్ట్రాల్లోను ఉభయ సభలకు సమాన అధికారాలు వర్తించాలి. లోక్‌సభలోను, శాసనసభలోను మెజారిటీని పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించకుండా రాజ్యసభ లేదా శాసనమండలి నిరంతరం నియంత్రించడానికి వీలు కలుగుతుంది. ఈ పద్ధతిని గురించి చర్చ జరగాలి, విజ్ఞులు విశే్లషించాలి.