సంపాదకీయం

సాంస్కృతిక దౌత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్ర, శనివారాలలో జరిపిన నేపాల్ యాత్ర ఉభయ దేశాల సమాన సంస్కృతి పట్ల ధ్యాసను మరింతగా పెంపొందించడానికి దోహదం చేసింది. గత ఇరవై ఏళ్లకు పైగా నేపాల్ రాజకీయ రంగాన్ని చైనా ప్రభావితం చేస్తుండడం మోదీ పర్యటనకు విచిత్రమైన పూర్వరంగం. మనకు శత్రుదేశమైన చైనాకు అనుకూలంగా ప్రవర్తిస్తున్న రాజకీయవేత్తలు నేపాల్ ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తుండడం ఈ ‘పూర్వరంగం’. ‘చైనాపట్ల, భారత్ పట్ల సమాన మైత్రిని పాటిస్తామని’ నేపాలీ రాజకీయవేత్తలు ప్రత్యేకించి ‘ఉభయ కమ్యూనిస్టు పార్టీల కూటమి’ తరచూ ప్రకటనలను గుప్పించడం ఈ పూర్వరంగం! కానీ నేపాల్ ప్రజలు మాత్రం యుగయుగాలుగా భారత్‌తోను భారతీయులతోను కొనసాగుతున్న సాంస్కృతిక సంబంధాలను మరింతగా పెంపొందించుకోవాలని భావిస్తున్నట్టు మోదీ పర్యటనతో మరోసారి ధ్రువపడింది. ప్రభుత్వాల మధ్యగల సంబంధాలు ప్రజల మధ్యగల సంబంధాలకు అనుగుణంగా ఉండాలన్నది ఇటీవలి కాలంలో నేపాల్ ప్రభుత్వం గ్రహించిన పాఠం. అందువల్లనే చైనాతో కుదుర్చుకున్న ఒక బృహత్ వాణిజ్య పథకాన్ని నేపాల్ ప్రభుత్వం గత మంగళవారం రద్దు చేసుకుంది. మోదీ పర్యటనకు మూడురోజుల ముందుగా నేపాల్ ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకున్న పరిణామం. మన దేశంతో సాంస్కృతిక సమానత్వం గల నేపాల్ ప్రజల మనోభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాలన్నది ప్రస్తుతం నేపాల్ ప్రభుత్వాన్ని కలసికట్టుగా నిర్వహిస్తున్న ఉభయ కమ్యూనిస్టులు గ్రహించిన పాఠం! చైనా చంక బిడ్డ ‘నేపాల్ మావోయిస్ట్ కమ్యూనిస్టు పార్టీ’ అధినేత పుష్పకమాల్ దహల్ ప్రచండ ప్రధానిగా ఉండిన సమయంలో గత ఏడాది జూన్ ఐదున గండకీ నదిపై ఒక బృహత్ జలాశయం నిర్మించడానికి నేపాల్ ప్రభుత్వం చైనాతో ఒప్పందం చేసుకుంది. ఈ జలవిద్యుత్ ఉత్పాదక కేంద్రానికి బుద్ధుని పేరుపెట్టారు. కానీ ఆ తరువాత ప్రధానమంత్రి అయిన నేపాలీ కాంగ్రెస్ అధినేత షేర్‌బహదూర్ దువా ఈ పథకాన్ని రద్దుచేశాడు. ‘నేపాలీ కాంగ్రెస్’ తరతరాల ‘్భరత నేపాల్’ సాంస్కృతిక సంబంధాలను కొనసాగించడానికి కట్టుబడి ఉంది. కానీ ప్రస్తుతం నేపాల్ ప్రధానిగా ఉన్న ఖడ్గప్రసాద్ ఓలీ శర్మ ‘నేపాల్ మార్క్సిస్టు లెనినిస్ట్ కమ్యూనిస్టుపార్టీ’ అధినేత, ‘నేపాల్ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ’తో కలసి ప్రభుత్వం నడుపుతున్నవాడు, గొప్ప ‘చైనా ప్రేమికుడు’గా పేరుమోసినవాడు. అయినప్పటికీ మోదీ పర్యటనకు ముందుగా ఇలా చైనాతో కుదిరిన ఒక ఒప్పందాన్ని నేపాల్ ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇది భారత, నేపాల్ ప్రజల సంబంధాలకు లభించిన విజయం. ఈ సంబంధాలకు భూమిక యుగాల నాటి సమాన సంస్కృతి!
ఈ సాంస్కృతిక పరంపరకు అనుగుణంగానే మోదీ పర్యటనలో నేపాల్‌లోని చారిత్రక స్థలాలకు ప్రాధాన్యం లభించింది. కమ్యూనిస్టు ఓలీ శర్మ జనకపురిలోని జానకీమాత మందిరం వద్ద నరేంద్ర మోదీకి ఆధికారిక స్వాగతం చెప్పాడు! ఈ అధికార లాంఛన కార్యక్రమం రాజధాని ఖాట్మండులోకాక చారిత్రక సాంస్కృతిక క్షేత్రమైన జానకీదేవి మందిరం వద్ద జరగడం, రాజకీయ దౌత్యం కంటె మిన్నగా భారతీయ సంస్కృతికి లభించిన ప్రాధాన్యం. నేపాల్ ప్రత్యేక సార్వభౌమ దేశం, నేపాల్ ప్రజలది అనాదిగా భారతీయ సంస్కృతి! మోదీ పర్యటనతో ఈ వాస్తవం మరింతగా ప్రస్ఫుటించింది. భారతదేశంలో అనాది అనేక మతాలు, భాషలు, సంప్రదాయాలు, అసంఖ్యాక వైవిధ్యాలున్నాయి. కానీ ఈ మతాల, భాషల, సంప్రదాయాల, వైవిధ్యాల సమాహారమైన ‘జాతి’-నేషన్- మాత్రం ఒక్కటే, ‘సంస్కృతి’-కల్చర్- మాత్రం ఒక్కటే.. ఈ అద్వితీయ ‘సాంస్కృతిక జాతీయత’ కారణంగానే ‘ఉత్తరం యత్ సముద్రశ్చ హిమాద్రిశె్జ్తవ దక్షిణం, వర్షం తత్ భారతం నామ భారతీ యత్ర సంతతీ...’ అన్నది యుగయుగాల చారిత్రక వాస్తవమైంది. ‘సముద్రానికి ఉత్తరంగా హిమాలయ పర్వతశ్రేణికి దక్షిణంగా ఉన్న ప్రాంతం పేరు భరతవర్షం, ఇక్కడ జన్మించినవారు భారతీయులు.’. నేపాల్ హిమాలయాలలో ఉంది, హిమాలయాల ఉత్తర భాగం ‘టిబెట్’, దక్షిణ భాగం నేపాల్, మన దేశంలోని అనేక ప్రాంతాలు.. ఇదీ భారత, నేపాల్ స్వతంత్ర దేశాల మధ్యగల సాంస్కృతిక జాతీయతా సమానత్వం! ‘అద్వితీయ సాంస్కృతిక జాతి’- అవశేష భారత్ సహా తొమ్మిది స్వతంత్ర దేశాలలో విస్తరించి ఉండడం బ్రిటన్ దురాక్రమణ ఫలితం!
నేపాల్ లేకుండా భారత్ ప్రగతి, భద్రత సమగ్రం కావు. భారత్ లేకుండా నేపాల్ ప్రగతి, భద్రత సమగ్రం కావు- అన్న ప్రధాని మోదీ మాటలు ఈ చారిత్రక వాస్తవానికి అనుగుణం. పదవీ బాధ్యతలను స్వీకరించిన తరువాత నేపాల్ ప్రధానమంత్రి మొదట మన దేశాన్ని సందర్శించిన తరువాతనే ఇతర దేశాలకు వెళ్లి రావడమన్న సంప్రదాయం ఈ చరిత్రకు అనుగుణం. 2008లో ఎన్నికయిన నేపాల్ అధ్యక్షుడు రామ్‌భరణ్‌యాదవ్ కూడా ఈ సంప్రదాయాన్ని పాటించాడు. ‘రాజ’ పదవి రద్దయిన తరువాత ఎన్నికయిన మొదటి అధ్యక్షుడు రామ్‌భరణ్. అదే సమయంలో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన పుష్పకమల్ దహల్ ప్రచండ మాత్రం మొదట చైనాకు వెళ్లి వచ్చాడు. ఇలా సంప్రదాయాన్ని భంగం చేయడం ద్వారా ఆ తరువాత ఈ ‘మావోయిస్టు’ ప్రచండ నేపాలీ ప్రజల మనోభావాలను గాయపరిచాడు. 2013 నాటి ఎన్నికలలో మావోయిస్టు పార్టీ ఘోర పరాజయం పాలుకావడానికి ఇది కూడ ఒక ప్రధాన కారణం. అందువల్లనే 2017లో ‘కలసికట్టు’గా అధికారం కైవసం చేసుకున్న ‘ఉభయ కమ్యూనిస్టు పార్టీలు’ భారత వ్యతిరేకతను కొంత కప్పిపుచ్చుకుంటున్నాయి. ప్రస్తుతం పాలిస్తున్న కమ్యూనిస్టు ప్రధానమంత్రి ‘ప్రచండ’ బాటపట్టకపోవడం ఇందుకు ఉదాహరణ. ఓలే రెండవసారి గత ఫిబ్రవరిలో ప్రధాని అయిన తరువాత మొదట మన దేశానికి వచ్చివెళ్లాడు.
ప్రభుత్వ రాజనైతిక, దౌత్య, వాణిజ్య విధానాలతో సంబంధం లేకుండా నేపాల్ ప్రజలు మన దేశంతో అనాది సాంస్కృతిక బంధాన్ని కొనసాగించాలని కోరుతున్నట్టు మోదీ పర్యటన ద్వారా ఇలా మరోసారి స్పష్టం అయింది. నేపాల్ పాలకులకు ఇది పాఠం. ఖాట్మాండూలోని పశుపతినాథ ఆలయాన్ని, ముక్తినాథ లక్ష్మీనారాయణ మందిరాన్ని- ఇలా మూడు ఆలయాలను మోదీ దర్శించడం ప్రచారం పొందిన పరిణామం. జల విద్యుత్ కేంద్ర ‘శిలాన్యాసం’ ద్వారా మోదీ ‘్భరత నేపాల్ నదులు’ సాంస్కృతిక స్రోతస్వినులు వలె ప్రజలను అనుసంధానం చేస్తున్న సంగతిని స్ఫురింపచేశాడు. క్రీస్తునకు పూర్వం ఐదవ శతాబ్దిలో ఆదిశంకరాచార్యుడు నేపాల్‌ను సందర్శించడం చారిత్రక వాస్తవం. క్రీస్తునకు పూర్వం ముప్పయి రెండవ శతాబ్దినాటి నేపాల్‌రాజు జితేదాస్తి ‘మహాభారత యుద్ధం’లో పాండవుల పక్షాన్ని అవలంభించడం చారిత్రక వాస్తవం. క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దినాటి విక్రమ సమ్రాట్, క్రీస్తుశకం ఒకటవ శతాబ్దినాటి శాలివాహన చక్రవర్తి మొత్తం భారతదేశాన్ని పాలించారు. వారి సామ్రాజ్యంలో నేపాల్ ఒక రాజ్యం! విక్రముడు తన కొత్త కాలగణన- సంవత్-ను నేపాల్‌లో ప్రారంభించడం చరిత్ర! మొత్తం భారతం బ్రిటన్ దురాక్రమణ పాలయిన సమయంలో స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకున్న- ‘అఖండ భారతంలోని’ ఒక ప్రాంతం నేపాల్! భారత, నేపాల్ ఇప్పుడు విడివిడి స్వతంత్ర రాజ్యాంగ విభాగాలు, సాంస్కృతంగా మాత్రం ఉభయ దేశాలు ఒక్కటేనన్నది వాస్తవం.