సంపాదకీయం

అరక్షిత శిశువులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తల్లిదండ్రుల’ క్రౌర్యానికి పసిపాపలు బలి అవుతుండడం ఆధునిక నాగరిక జీవన విలాసం.. ఈ ‘క్రౌర్యం’ నిర్లక్ష్యం, ఈ ‘క్రౌర్యం’ వ్యభిచారం, ఈ ‘క్రౌర్యం’ అక్రమ లైంగిక సహజీవనం.. అంతేకాదు- ఆధునికత పేరుతో పాశ్చాత్య భావ దాస్యగ్రస్తులైన తల్లిదండ్రులు ‘ప్రేమ’ పేరుతో శిశువులను క్రౌర్యానికి గురిచేస్తున్నారు. ఈ ‘ప్రేమ’ నిజానికి ప్రచ్ఛన్న క్రౌర్యం.. ‘ప్రేమ’ పేరుతో చిట్టిపొట్టి బుడుతలను తల్లిదండ్రులు ‘బందిఖానా’ల పాలు చేస్తున్నారు. పాపం ఆ రెండు మూడేళ్ల శిశువులు ఈ బందిఖానాలలో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.. ఈ ‘ఉక్కిరి బిక్కిరి’కి కారణం తల్లిదండ్రుల ప్రేమ.. ‘దృశ్య మాధ్యమ వీక్షణం’ మద్యం కంటె మరింతగా మత్తెక్కించి వేసింది. అందువల్ల దృశ్యవీక్షణలో తన్మయత్వం చెందుతున్న తల్లులు, తండ్రులు దోగాడే శిశువులను పట్టించుకోవడం లేదు.. అందరూ కాకపోవచ్చు! నగరాలలో ఎక్కువమందిది మాత్రం ఇలా తమ శిశువులను పట్టించుకోని స్వభావం! యాంత్రికంగా పాలుపట్టడం మాత్రమే ‘బాధ్యత!’. మిగిలిన బాధ్యతను ‘టెలివిజన్’ మింగేస్తోంది. అందువల్ల తమపాటికి తాము దోగాడుతున్న శిశువులను దోమలు, చిన్నచిన్న కీటకాలు కుట్టిపోతున్నాయి. పసిపాప చేతిపై బొబ్బ ఏర్పడి ఉంటుంది. పాప కొంచెం సేపు ఏడ్చి ఊరికే అయిపోతుంది. ‘బాబు’చేతిపై ‘బుడిపె’కట్టి ఉంటుంది, ఈ ‘కణితె’ కందిగింజంత ఉండవచ్చు. వేరుసెనగ- పల్లీ- గింజంత ప్రమాణంలో కూడ ఉండవచ్చు! ఆధునిక నాగరికత ‘ఆవహించిన’ తల్లిదండ్రులు వీటిని గమనించరు. అకస్మాత్తుగా ‘పాప’కన్ను వాచి ఉంటుంది, ఏ పురుగో తల్లిదండ్రులు చూడడం లేదన్న ధీమాతో ఆ ‘పాప’ కంటిని కొరికి వెళ్లి ఉంటుంది! ‘నిర్లక్ష్యానికి’ ఇది ఒక ఉదాహరణ మాత్రమే! ఉదాహరణలు వందలు! వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థకు ప్రాతిపదిక. కుటుంబం యుగయుగాల భారత జాతీయతా వికసనానికి సనాతన భూమిక! పెళ్లికాకుండానే తల్లులైనవారు తమ శిశువులను కుప్పతొట్టెలలోను, చెత్తకుండీలలోను వదలిపోతున్నారు. ఇది ‘తల్లుల’ క్రౌర్యం, ఇలాంటి ‘తల్లుల’లో అత్యధికులు పురుషుల వంచనకు బలైపోయినవారు. ఇది పురుషుల క్రౌర్యం! తల్లి తనానికి, తండ్రి తనానికి వివాహం ప్రాతిపదిక అన్న జీవన సూత్రాన్ని తెంపిన వారు, పెళ్లికాకముందే తల్లిదండ్రులవుతున్నారు. కానీ వీరిలో అత్యధికులు పరమ నికృష్ట మానసిక ప్రవృత్తి కలవారు! అందువల్లనే ఈ ‘తల్లిదండ్రులు’ పుట్టిన శిశువులను పారవేసి పాపాన్ని మూట కట్టుకుంటున్నారు! పెళ్లికాకుండానే ‘్ధర్యం’గా లైంగిక సహజీవనం చేసినవారు, పుట్టిన పిల్లలు తమ పిల్లలేనని అంగీకరించే ధైర్యాన్ని మాత్రం ప్రదర్శించడం లేదు. అందువల్ల ‘ఆధునిక నాగరికత’- అంతరిక్షంలో విహరిస్తున్న తరుణంలోనే పెళ్లికాని ‘అమ్మానాన్నల’ నైతిక నిష్ఠ చెత్తకుండీలలో కుప్పతొట్టెలలో నక్కి మానవత్వాన్ని వెక్కిరిస్తోంది. ఇలాంటి వివాహేతర లైంగిక బీభత్సానికి బలైపోతున్న శిశువులకు ‘మానవ అధికారాలు’ లేవు! కల్పించే రాజ్యంగ ప్రక్రియ లేదు, ఈ బీభత్సపు బలిని నిరోధించగల న్యాయ ప్రక్రియ లేదు. లైంగిక సహజీవనం- పెళ్లికాకుండానే- తప్పుకాదని సర్వోన్నత న్యాయస్థానం ఎప్పుడో తీర్పు చెప్పింది. ఇప్పుడు వ్యభిచారం కూడ నేరం కాదు! ‘ప్రపంచీకరణ’ వికృతి భారతీయతను కబళిస్తోంది.. ‘ప్రపంచీకరణ’ పాశ్చాత్య నికృష్ట జీవనశైలికి విస్తృతి!!
అందువల్లనే శిశువులను వదిలించుకుంటున్న వివాహబద్ధ జననీ జనకులు కూడ విస్తరించిపోతున్నారు. గర్భస్థ ఆడశిశువును హత్యచేసిన కిరాతకులు, రాక్షసులు ‘మహిళలను మాతృదేవతలుగా పూజించే’ చోట పుట్టలు పగలడం కాల వైపరీత్యం, సమాజ సమష్టి పాపం! అలా పుట్టకముందే హత్యకాకుండా తప్పించుకున్న ఆడపిల్లలను వివాహబద్ధులైన తల్లిదండ్రులు కొందరు చెత్తకుండీలపాలు చేసి పోతున్నారట! ఇలా పెళ్లికాని తల్లిదండ్రులు, పెళ్లయిన తల్లిదండ్రులు నవజాత శిశువులను ‘కుండీ’లపాలు చేయడం నడుస్తున్న పాశవికత్వం, పైశాచికత్వం! హైదరాబాద్‌లోని ప్రభుత్వ ‘అరక్షిత’ శిశు కేంద్రాలలో ప్రస్తుతం నూట డెబ్బయి తొమ్మిది మంది శిశువులకు ఆశ్రయం లభిస్తోందట. వీరిలో పంతొమ్మిది మంది నవజాత శిశువులను ఈ సంవత్సరం ‘తల్లిదండ్రులు’ వదిలించుకున్నారు. ఈ నూట డెబ్బయితొమ్మిది మందిని దత్తత తీసుకొని పెంచుకొనడానికి ఉదార హృదయులైనవారు సిద్ధంగా ఉండడం ఊరట కలిగిస్తున్న పరిణామం. హైదరాబాద్‌లోని దాదాపు ఏడువందల మంది ఇలాంటి ఉదార గృహస్థులు ‘అరక్షిత’ శిశువులను దత్తత చేసుకొని పెంచుకొనడం ముదావహం, మానవీయ చిత్తవృత్తికి దర్పణం. చీకటి విరుచుకొని పడుతున్న సమయంలో వెలుగు విజృంభించడం ‘అరక్షిత’ శిశువులకు లభిస్తున్న ఊరట!
తల్లిదండ్రుల ‘నీడ’కు ఇలా దూరమైన శిశువులను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థలు దేశమంతటా ఉన్నాయి. అరక్షిత శిశువుల అభ్యున్నతికి ఆజీవనం శ్రమించిన మహనీయులు కూడ ఉన్నారు. నెల్లూరు పట్టణంలోని ‘వాత్సల్య’వంటి సురక్షిత ఆశ్రమాలు వందల మంది అరక్షిత శిశువులకు ఆశ్రయం కల్పించడం చరిత్ర. ఈ ‘వాత్సల్య’ను విశాఖపట్టణంలోని ‘వాత్సల్యం’ శిశు కేంద్రాన్ని ఆరంభించిన ప్రముఖ సామాజిక ఉద్యమకర్త స్వర్గీయ వేదాంతం సంగమేశ్వరశాస్ర్తీ అరక్షిత శిశువులను సురక్షిత పౌరులుగా దిద్దడానికి ఆజీవనం కృషిచేశారు. సన్యాస ఆశ్రమం స్వీకరించి ‘వాత్సల్య భారతి’గా వినుతికెక్కిన శాస్ర్తీ భరతమాత పూజకు అరక్షిత శిశువులు సుగంధ సుమాలుగా కావడానికి దోహదం చేశాడు. ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం’ స్ఫూర్తితో వివిధ జాతీయతా సంస్థలు దేశమంతటా వందల సంఖ్యలో ‘అరక్షిత శిశు’ కేంద్రాలను నిర్వహిస్తుండడం పెద్దగా ప్రచారం కాని వాస్తవం. ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థలు అరక్షిత శిశువులను నిస్వార్థంగా పెంచిపోషిస్తున్నాయి. కానీ ‘ఎన్‌జిఓ’- నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ - ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ-ల పేరుతో దేశమంతటా పుట్టలు పగిలిన అనేక కేంద్రాలు ‘శిశువుల’ పేరుతో వ్యాపారం కూడ చేస్తున్నాయి. ఫౌండేషన్‌లు, ట్రస్టులు వంటి ఘనమైన పేర్లతో కొన్ని ‘ఎన్‌జిఓ’లు ‘శిశు సంరక్షణ’ పేరుతో దేశ విద్రోహ, సంఘ విద్రోహ కలాపాలు కూడ సాగిస్తున్నాయి. ‘హోమ్’లని, ‘షెల్టర్’లని వెలసిన ‘కేంద్రాల’లో చిన్నారులపై లైంగిక అత్యాచారాలను, లైంగిక వేధింపులను జరుపుతున్న దురంతాలు కూడ బయటపడుతున్నాయి. రాజకీయవేత్తల అండదండలతో నడుస్తున్న నకిలీ సేవాసంస్థలు మతం మార్పిడులు కూడ ప్రోత్సహిస్తుండడం నడుస్తున్న వైపరీత్యం! హైదరాబాద్‌లోని ఇలాంటి ‘మతం మార్పిడి’ సంస్థలు కొన్ని అనేక పాఠశాలలలో ‘డబ్బా’లు పెట్టి డబ్బులు దండుకున్నాయి. ప్రాథమిక విద్యార్థులను ఇంటింటికీ పంపి విరాళాలను పోగుచేయించాయి. ఇదంతా ‘శిశువుల సంరక్షణ’ పేరుతో జరుగుతున్న ప్రచ్ఛన్న వ్యాపారం...
పాశ్చాత్య భావదాస్యం మరింతగా విస్తరిస్తూ ఉండడం వల్ల దాదాపు ప్రతి కుటుంబంలోను తల్లిదండ్రులు ప్రేమ పేరుతో తమ పిల్లలను క్రౌర్యానికి బలిచేస్తున్నారు. ఐదవ ఏట జరగవలసిన అక్షరాభ్యాసం రెండేండ్లు నిండిన శిశువులకు మూడేండ్లు నిండని బుడుతలకు జరిగిపోతుండడం కొత్త సంప్రదాయమైంది. ‘నర్సరీ’, ‘ఎల్‌కెజి’, ‘యుకెజి’ల పేర్లతో నడుస్తున్న తరగతి గదులు ఐదేళ్లు నిండని శిశువుల పాలిట బందిఖానాలు. తాము విచిత్ర హింసకు గురి అవుతున్నామన్న అవగాహన లేని ఈ శిశువులకు ఈ ‘కానె్వంట్లు’ భారతదేశం గురించి చెప్పడం లేదు, ఐరోపా గురించి అమెరికా పద్ధతుల గురించి గొప్ప భావాలను మప్పుతున్నాయి. ఈ పిల్లలకు భారతీయ భాషల అక్షరాలను నేర్పరు, ఆంగ్లభాషను నెత్తికెక్కిస్తున్నారు. చిన్నారులు ఇలా భారతీయ భావాలకు, భాషలకు దూరం కావడానికి కారణం తల్లిదండ్రులు. రెండేండ్లు నిండిన పాపాయిలకు ‘సరస్వతీ పూజ’రోజున- సోమవారం- అనేక మంది తల్లిదండ్రులు అక్షరాభ్యాసాలు చేయిం చేశారు! ఇదీ ప్రేమ, మమకారం ముసుగులో తల్లిదండ్రుల క్రౌర్యం.