సంపాదకీయం

‘సౌదీ’ బీభత్సం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ ప్రభుత్వం అప్పుడప్పుడు నిరసనలకు గురి అవుతోంది. సౌదీ అరేబియా ప్రభుత్వం నిరసనలకు గురి కావడం లేదు. ఇదీ అంతరం.. ఈ తేడాకు ప్రధాన కారణం సౌదీ అరేబియా నిండా నిండి ఉన్న భూగర్భ ఇంధన నిక్షేపాలు! అంతర్జాతీయ జిహాదీ బీభత్సకాండకు పాకిస్తాన్ ప్రధాన కేంద్రంగా అవతరించి ఉంది! కానీ, ఈ జిహాదీలకు సౌదీ అరేబియా ‘స్ఫూర్తి’ కేంద్రం. ఈ స్ఫూర్తి అన్యమత విధ్వంసక ప్రవృత్తి! పాకిస్తాన్‌లో అప్పుడప్పుడు సైనిక దళాలవారు ‘ప్రజాస్వామ్య’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల ‘ప్రహసనం’ ద్వారా పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయిస్తున్నారు! సౌదీ అరేబియాలో ఇలాంటి ‘అభినయం’ కూడ లేదు. నిరంకుశ ‘రాజరిక’ వ్యవస్థ సౌదీ అరేబియాను పాలిస్తోంది! నిరంకుశత్వం, మతోన్మాదం ఒక్కొక్కటీ విడివిడిగా భయంకరమైనవి. సౌదీ అరేబియాలో ఈ రెండూ ఉమ్మడిగా వ్యవస్థీకృతమై ఉన్నాయి. ఈ ఉమ్మడి భయంకరత్వానికి జమాల్ ఖషోగ్గీ అన్న పత్రికా రచయిత- జర్నలిస్టు- ఇటీవల బలి అయిపోయాడు. ఈ పత్రికా రచయితను సౌదీ అరేబియా ప్రభుత్వమే హత్య చేయించడం ధ్రువపడిన వాస్తవం! సౌదీ అరేబియా ‘క్రౌన్ ప్రిన్స్’- యువరాజు - మహమ్మద్ బిన్ సల్మాన్ దుశ్చర్యలను దుయ్యబడుతూ మాధ్యమాలలో ప్రచారం చేయడం జమాల్ ఖషోగ్గీ చేసిన ‘నేరం’. టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలోని సౌదీ దౌత్య కార్యాలయంలోకి వెళ్లిన ఖషోగ్గీని ‘రాయబార’ కార్యాలయంలోనే బంధించారు. ఆ తరువాత సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నుంచి పనికట్టుకొని వెళ్లిన ప్రభుత్వాధికారులు ‘రాయబారి’ కార్యాలయంలోనే ఖషోగ్గీని ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. ఇది ప్రభుత్వ బీభత్సానికి భయంకరమైన నిదర్శనం! సైనికులు సైనికులతో పోరాడడం యుద్ధం.. సాయుధులు నిరాయుధులైన ప్రజలను హత్యచేయడం బీభత్సం. ప్రభుత్వ దళాలవారు- పోలీసులు కాని, సైనికులు కాని- సామాన్య ప్రజలను, నిరాయుధులను హత్యచేయడం ప్రభుత్వ బీభత్సం. ఇలాంటి బీభత్స ప్రభుత్వాలు స్వదేశంలోని సామాన్య ప్రజలను, నిరాయుధులను చంపిస్తున్నాయి, విదేశాలలోని పౌరులను హత్యచేయిస్తున్నాయి. ఇలాంటి బీభత్స రాజ్యాంగ వ్యవస్థలను దశాబ్దుల తరబడి నాగరిక దేశాల ప్రభుత్వాలు నిరసిస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశాల ప్రభుత్వాల వారు మరింతగా అభిశంసిస్తుండడం దశాబ్దుల చరిత్ర. అంతర్జాతీయ మానవాధికార పరిరక్షణ సంఘాలు, ఐక్యరాజ్యసమితి ఇలాంటి నిరంకుశ దేశాల ప్రభుత్వాల బీభత్సకాండను ప్రచారం చేస్తున్నాయి. బీభత్స ప్రభుత్వాలను నియంత్రించడానికి వీలుగా ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆంక్షలను విధింపచేస్తున్నాయి. ఇలా ఆంక్షలను విధించడంలో అమెరికా అగ్రగామి. ‘అత్యుత్సాహం’ కొద్దీ అమెరికా కొన్ని సందర్భాలలో వివిధ దేశాల నిరపరాధ ప్రభుత్వాలను సైతం నిరసించిన సందర్భాలున్నాయి... కానీ ప్రస్తుతం ఖషోగ్గీని హత్యచేయించిన సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని ‘నిర్దోషి’గా ధ్రువీకరించడానికి అమెరికా ప్రభుత్వం ఆరాటపడుతోంది! ప్రజాస్వామ్య అమెరికా ప్రభుత్వం వారి ద్వంద్వనీతికి ఇది సరికొత్త ప్రమాణం...
జమాల్ ఖషోగ్గీ సౌదీ అరేబియాలో పుట్టిపెరిగినవాడు. సౌదీ అరేబియా పౌరుడు, అమెరికాలో అనేక ఏళ్లపాటు జీవించాడు! అమెరికాకు చెందిన ‘వాషింగ్టన్ పోస్ట్’ ఆంగ్లపత్రికలోను ఇతర పత్రికలలోను పనిచేశాడు. అక్టోబర్ రెండవ తేదీన విధి నిర్వహణలో భాగంగా, ఖషోగ్గీ టర్కీలోని ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్య కార్యాలయంలోకి వెళ్లాడు. కానీ ఆయన మళ్లీ కార్యాలయం నుంచి బయటికి రాలేదు. ఆయన సౌదీ ‘కాన్స్యులేట్’ కార్యాలయంలోకి ఆరోజున వెడుతుండినట్టు సౌదీ అరేబియా ప్రభుత్వానికి ముందే తెలుసు. అందువల్ల ఆయనను మట్టుపెట్టడానికి సౌదీ ప్రభుత్వం కుట్ర చేసింది. ఈ కుట్రలో భాగంగానే ‘రియాద్’ నుంచి ‘అంకారా’కు పదిహేను మంది పోలీసులు, సైనికులు వచ్చారు. ఈ హంతక బృందంలోని నలుగురు అత్యున్నత సౌదీ పోలీసు, సైనిక అధికారులు... వీరందరూ ఆధికారికంగానే సౌదీ అరేబియా నుంచి టర్కీకి వచ్చారు. అంకారా నుండి ఇస్తాంబుల్ కార్యాలయానికి వెళ్లారు. కాల్చి చంపి ఉండవచ్చు, కానీ ఖషోగ్గీని ముక్కలు ముక్కలుగా నరికి చంపడం ఈ దుర్మార్గపు అధికారుల బీభత్స ప్రవృత్తికి నిదర్శనం, పాశవిక చిత్తవృత్తికి తార్కాణం! కానీ ఖషోగ్గీ తమ ‘కాన్స్యులేట్’ కార్యాలయంలోని అధికారులతో మాట్లాడిన తరువాత బయటికి వెళ్లిపోయినట్టు సౌదీ అరేబియా బుకాయిస్తోంది. సౌదీ ప్రభుత్వ వాదం అబద్ధమని టర్కీ ప్రభుత్వం ధ్రువపరిచింది.
టర్కీ నేర పరిశోధక బృందం వారు మంగళవారం ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్యకార్యాలయంలోకి వెళ్లి గాలింపుచర్యలు కూడ జరిపారు. ఇలా తమ ‘రాయబార’ కార్యాలయంలో గాలింపు జరపడానికి మొదట సౌదీ అరేబియా ప్రభుత్వం అంగీకరించలేదు. చివరికి అమాయకత్వాన్ని అభినయిస్తూ అంగీకరించింది. రెండవ తేదీన ఖషోగ్గీ హత్య జరుగగా పదహారవ తేదీ వరకూ టర్కీ పోలీసు బృందం వారు ‘రాయబార’ కార్యాలయంలోకి వెళ్లలేకపోవడానికి ఈ ‘్ఠలాయింపు’ కారణం! ఈలోగా ‘కాన్స్యులేట్’ కార్యాలయం నుంచి మృతదేహం మాయమైపోయింది. ‘మృతదేహం’ అంటే ముక్కలు చెక్కలైపోయిన ఖషోగ్గీ శరీరం! ఇంతవరకు ‘ఆమ్నెస్టీ ఇంటర్ నేషనల్’ వంటి హక్కుల సంఘాల వారు కాని, ఐక్యరాజ్యసమితి వారు కాని, సంపన్న దేశాల వారు కాని సౌదీ ప్రభుత్వం చర్యను ఎందుకని అభిశంసించలేదు? సౌదీ ప్రభుత్వ నిర్వాహక నియంతలను ‘అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం’ ముందు నిలబెట్టాలని ఎందుకని కోరడం లేదు?? ఈ దేశాలన్నీ కూడ సౌదీ అరేబియా ప్రభుత్వం పట్ల ఇలా మెతక వైఖరిని ప్రదర్శించడానికి సౌదీ అరేబియాలో ఆయా దేశాల వాణిజ్య సంస్థలు ఇంధన తైలాన్ని, వాయువును ఉత్పత్తి చేస్తుండడం ప్రధాన కారణం! సౌదీ అరేబియాను వ్యతిరేకించి తమ వాణిజ్య ప్రయోజనాలను భంగపరచుకొనడానికి ఈ సంపన్న దేశాలు సిద్ధంగా లేవు. సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ ‘జర్నలిస్టు’ను హత్యచేసినట్టు ధ్రువపడినట్టయితే ఈ ప్రభుత్వాన్ని ‘కఠినంగా శిక్షించనున్నట్టు’ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్టోబర్ పదమూడున హెచ్చరించాడు! తమ దేశానికి వ్యతిరేకంగా ఆర్థిక వాణిజ్య ఆంక్షలను విధించే దేశాలపై ప్రతీకారం తీర్చుకోగలమని సౌదీ ప్రభుత్వం పదునాలుగవ తేదీన స్పష్టం చేసింది. అంతే... అమెరికా ప్రభుత్వం మాట మార్చింది! సౌదీ అరేబియాలో వ్యాపారం, పరిశ్రమలు నిర్వహిస్తూన్న ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ వారు మాట మార్చారు. వివిధ దేశాల ప్రభుత్వాల వారు వ్యూహాత్మక వౌనాన్ని ప్రదర్శిస్తున్నారు.
మాట మార్చిన అమెరికా ప్రభుత్వ అధినేత డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని నిర్దోషిగా నిర్ధారించడానికి సైతం యత్నిస్తున్నాడు. ఇస్తాంబుల్ కార్యాలయంలో ఖషోగ్గీ హత్య జరిగి ఉంటే అది సౌదీ అరేబియాకు చెందిన ప్రభుత్వేతర ‘హంతక ముఠా’ జరిపిన బీభత్సం అయి ఉంటున్నది ట్రంప్ పదహైదవ తేదీన చేసిన నిర్ధారణ! సౌదీ అరేబియా ప్రభుత్వం దశాబ్దుల తరబడి ‘ప్రజాస్వామ్య, సర్వమత సమభావ’ రాజ్యాంగ వ్యవస్థగా పరిఢవిల్లుతున్న ఇజ్రాయిల్ దేశానికి బద్ధ విరోధి. ‘ఇస్లాం’ తప్ప మరో మతం ప్రపంచంలో ఉండరాదన్నది ‘జిహాద్’ స్వభావం, ‘జిహాద్’ లక్ష్యం! ఈ జిహాద్ కార్యక్రమానికి జన్మస్థానం సౌదీ అరేబియా! అందువల్ల ఇస్లాం మత రాజ్యమైన సౌదీ అరేబియా ‘‘సర్వమత సమభావ’’ వ్యవస్థలున్న దేశాలను సహజంగానే ద్వేషిస్తుంది. అమెరికా ఇజ్రాయిల్‌కు అత్యంత సన్నిహిత మిత్ర దేశం! కానీ సౌదీ అరేబియాకు కూడ అమెరికా అత్యంత సన్నిహిత మిత్ర దేశం. ఇదీ అంతుపట్టని అంతర్జాతీయ రాజకీయ చదరంగ వ్యూహం! సౌదీ అరేబియా ప్రభుత్వం అంతర్జాతీయ జిహాదీ బీభత్సకారులకు శతాబ్దులుగా స్ఫూర్తి కేంద్రం!!