సంపాదకీయం

కాలుష్యపు ‘కోరలు’..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్లాస్టిక్’ కాలుష్యం వీధుల నుంచి వంట ఇళ్లకు విస్తరించింది, వంట ఇళ్లనుంచి నోళ్లకు ‘బానల’ వంటి ‘బొజ్జ’లకు విస్తరించడం నడిచిపోతున్న వైపరీత్యం. ‘ప్లాస్టిక్’ వేడిమికి ‘హిమ శృంగాలు’ కరిగిపోయి ‘శిలా శిఖరాలు’ దర్శనమిస్తున్నాయి, సముద్రాలు ఉప్పొంగి చిన్న చిన్న ద్వీపాలను దేశాలను ముంచెత్తుతున్నాయి. అంతరిక్షానికి ఎగసిన ‘ప్లాస్టిక్’ పదార్థాలు లక్షల, కోట్ల శకలాలుగా విస్తరించి కాంతి కిరణాలను కొడిగట్టిస్తున్నాయి. ‘ప్లాస్టిక్ కాలుష్యం ఇందుగలదు అందు లేదు..’ అన్న మీమాంసకు తావులేదు. ‘ప్లాస్టిక్’ కాలుష్యం సర్వాంతర్యామి! ‘ప్లాస్టిక్’ ఉత్పత్తిని దిగుమతిని పంపిణీని అమ్మకాన్ని సర్వసమగ్రంగా ప్రభుత్వాలు ఎందుకు నిరోధించడం లేదు? దేశమంతటా సకల విధ ‘ప్లాస్టిక్’లను నిషేధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారు తమంత తాముగా ఉత్తరువులు జారీచేయవచ్చు! ‘పటాకుల’ను విచ్చలవిడిగా కాల్చవద్దని మాత్రం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించి ఉంది. సంప్రదాయబద్ధమైన జాతీయ ఉత్సవ స్ఫూర్తి దీపాలపై నీళ్లు చల్లినట్టయింది! పొగ తాగడం వల్ల తాగుతున్నవారు అనారోగ్యంపాలు అవుతున్నారు, ఈ పొగ దుష్ప్రభావం వల్ల పొగతాగని వారు కూడ బాధితులవుతున్నారు, పర్యావరణానికి కన్నాలు పడిపోతున్నాయి.. ప్రకృతిని క్షయవ్యాధికి గురిచేస్తున్న బీడీలను సిగరెట్లను గుట్కాలను ఇతర పొగాకు పదార్థాలను ప్రభుత్వాలు సర్వసమగ్రంగా ఎందుకని నిషేధించడం లేదు? నిషేధించమని న్యాయస్థానాలు ఆదేశించవచ్చు! పొగ తాగడంపై పరిమితులను మాత్రమే విధించారు! మద్యం కంటె మరింత ప్రమాదకరమైన శీతల పానీయాలు నెమ్మది నెమ్మదిగా మన పొట్టలలోకి రసాయన విషాలను ఎక్కిస్తున్నాయి! ‘శీతల పానీయాలు’, ‘సీసాల’ నీరు పెంచుతున్న కాలుష్యం నిరంతరం విస్తరిస్తోంది! బాణసంచాను పేల్చడం పరిమిత సమయానికి, పరిమిత ప్రాంతానికి సంబంధించిన కాలుష్యం! ఢిల్లీలో 2016లోనే సర్వోన్నత న్యాయస్థానం ‘బాణసంచా’ కాల్చడంపై పరిమితులను విధించింది, నిషేధం విధించింది! కానీ దేశంలోని అన్ని పట్టణాలు నగరాలు ఢిల్లీ వంటివి కావు. పల్లెలలో పట్టణాలలో వలె ‘ఉన్మాదం’తో పటాకులను, మందుగుండును కాల్చడం లేదు. న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఆంక్షలను పరిమితులను నిషేధాలను విధించకపోయినప్పటికీ మూడువందల అరవై ఐదు రోజులు, ఇరవై నాలుగు గంటలూ, దేశమంతటా ఉన్మాదబుద్ధితో ‘బాణసంచా’ను ఎవ్వరూ పేల్చరు, పేల్చడం లేదు. అందువల్ల రెండుగంటలుపాటు మాత్రమే ‘బాణసంచా’ పేల్చాలన్న నిబంధన అనవసరం.. ‘బాణసంచా’ కాలుష్యం గోరంత సమస్య.. కొండంత అని భావించడం జీవన వాస్తవాలకు విరుద్ధం! ‘ప్లాస్టిక్’, ధూమపానం, శీతల పానీయాలు, పారిశ్రామిక వ్యర్థాలు, విచ్చలవిడిగా కొండలను, అడవులను తవ్వివేయడాలు, బహుళ జాతీయ సంస్థల చొరబాట్లు- ఇవీ.. ఇలాంటివీ నిజానికి కొండంత సమస్యలు! వీటి పరిష్కారం మాత్రం జరగలేదు. సంవత్సరంలో గరిష్ఠంగా సగటున పదిహేను రోజులపాటు, రోజూ కొన్ని గంటలపాటు మాత్రమే, కొన్ని స్థలాలలో మాత్రమే జరుగుతున్న ‘బాణసంచా’ విస్ఫోటనాల వల్ల ప్రమాదం జరిగిపోతోందన్న ప్రచారం జరిగింది! ‘‘పిచ్చుక’’పై బ్రహ్మాస్త్రం..
కాయలను పక్వమయ్యే సమయం కంటె ముందుగానే మాగబెట్టడానికి, కృత్రిమంగా రుచిని పెంచడానికి, బంగారపు వనె్నలతో నిగనిగలాడించడానికి, కూరగాయలను ‘తాజా’ఉన్నట్టు భ్రమింపచేయడానికి వాడుతున్న రసాయన విషాలు నిరంతరం కాలుష్యం పెంచుతున్నాయి. ఈ కాలుష్యం ఏదో ఒక ప్రాంతానికికాక దేశమంతటా పంచుతున్నారు. ఈ విష రసాయనాలు విదేశాల నుంచి, ప్రధానంగా చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. దేశంలో కూడ ఇవన్నీ తయారవుతున్నాయి. ఈ కాలుష్య రసాయనాల ఉత్పత్తిని, దిగుమతిని ప్రభుత్వాలు ఎందుకని నిరోధించడం లేదు? ‘బాణసంచా’ పేల్చడం పరిమిత కాలానికి పరిమిత ప్రదేశాలకు పరిమితమైన కాలుష్యం! ‘చైనా పౌడర్ల’ వంటి రసాయన కాలుష్యాలు ప్రతి రోజు దేశంలోని అన్నిచోట్ల- పట్టణాలలో, పల్లెలలో, వనవాసీ ప్రదేశాలలో- కూరగాయలను, పండ్లను, మానవుల ఆరోగ్యాన్ని, ప్రకృతిని గాయపరుస్తున్నాయి. ఈ ‘కాలుష్య నరకాసుర వధ’ ఇప్పటికీ జరగలేదు, ఎప్పటికి జరుగుతుంది? ‘ఎండో సల్ఫాన్’ రసాయనాన్ని వాడిన పంటలను, పండ్లను తినడం వల్ల తిన్నవారు చిత్రవిచిత్ర వ్యాధులకు గురి అవుతున్నట్టు ధ్రువపడింది, ఏళ్లు గడిచాయి. కానీ ‘క్రిమి నాశక రసాయనాల’ వాడకం, ఉత్పత్తి, దిగుమతి పెరుగుతూనే ఉంది!! కూరగాయలు, పండ్లతోపాటు క్రిమినాశక రసాయన విషాలను సైతం మనం నిరంతరం మెక్కుతూనే ఉన్నాము! ఈ కాలుష్యంతో పోలిస్తే ‘టపాకాయల’ కాలుష్యం ‘‘మహా పర్వతం ముందు మరుగుజ్జు..’’ సర్వోన్నత న్యాయస్థానం తనకు తాను, -సుమోటో-గా ఈ రకరకాల విష రసాయనాలను ఎందుకని సంపూర్ణంగా నిషేధించరాదు??
జన్యు జీవకణాలను సంకరం చేయడం- జెనటిక్ మోడిఫికేషన్- ‘జిఎమ్’- ద్వారా రూపొందుతున్న విత్తనాల వల్ల, పంటల వల్ల భూసారం కాలుష్యం అవుతోంది, పరిసరాలు ప్రాకృతిక సమతుల్యాన్ని కోల్పోతున్నాయి. ‘జిఎమ్’ ప్రక్రియ ద్వారా రూపొందుతున్న విత్తనాలలోను పంటలలోను ‘బాసిలస్ తురింజెనిసిస్’- బిటి- అన్న జీవ రసాయనం ఉత్పత్తి అవుతోంది. ఈ జీవ రసాయనం భూమిలోను, పంటలోను, ప్రకృతిలోను కాలుష్యాన్ని పెంచుతోంది. అనేక దేశాలలోని నిషేధించిన ఈ ‘బిటి’ పంటలను మన దేశంలో మాత్రం విస్తరింపచేయడానికి ‘విదేశీయ’, ‘బహుళ జాతీయ’ వాణిజ్య సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ‘బిటి’ పత్తిని పండించడంలో మన దేశం అగ్రగామి. పదిహేను ఏళ్లక్రితం వరంగల్లు జిల్లాలో ‘బిటి’ పత్తి ఆకులను మేసిన అనేక పశువులు మరణించాయి. ఈ పశువుల మృతికి ‘బిటి’ పత్తి ఆకులు కారణం కాదని నిరూపించడానికి ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ వాటి దళారీలు విఫలయత్నం చేశారు. ‘బిటి’ పంటలో చిత్ర విచిత్రమైన ‘ఎర్రని’, ‘గులాబీ’రంగులోని, తెల్లని, పసుపుపచ్చని పురుగులు, ఈగలు పుట్టుకొచ్చాయి. వాటిని చంపడానికి కొత్త కొత్త విష రసాయనాలను ‘బహుళ జాతీయ సంస్థలు’ కనిపెట్టాయి, రైతులకు అమ్మి దోచుకున్నాయి! వెరసి మరింత కాలుష్యం విస్తరించిపోతోంది. పొగాకును ఐరోపా వారు మోసుకొని వచ్చి మన జీవితాలను కాలుష్యం చేశారు. పొగాకు పండుతున్న భూములలో పొగాకు బదులు ‘పత్తి’ పంట పెరగాలన్నది మహాత్మాగాంధీ ఆకాంక్ష! కానీ ఇప్పుడు సేంద్రియ పద్ధతిలోని దేశవాళీ పత్తి పెరగడం లేదు.. కాలుష్యాన్ని పెంచుతున్న ‘బిటి’ పత్తి పెరుగుతోంది! సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరింపచేయడానికి నడుం బిగించి ఉన్న ప్రభుత్వాలు ‘జిఎమ్’ పంటలను ఎందుకని నిషేధించడం లేదు? ‘జిఎమ్’ పంటలు పండించినంత కాలం కాలుష్య రహితమైన స్వచ్ఛమైన భారత్ మళ్లీ అవతరించడం ‘‘మరు మరీచికా జలం’’ - ఎండమావిలోని నీరు! యాంత్రిక వధశాలల్లో జరుగుతున్న సామూహిక జంతుహననం కాలుష్యాన్ని కేంద్రీకరిస్తోంది, ప్రకృతిని పాడుచేస్తోంది! చర్మం లేని- చర్మం ఒలిచిన- జంతు కళేబరాలను నగరాల పట్టణాల వీధులలో వికృతంగా వేలాడదీస్తుండడం కాలుష్య విస్తరణకు చిహ్నం! ఈ బహిరంగ జంతు కళేబర ప్రదర్శనను ప్రభుత్వాలు నిషేధించనంతవరకు ‘స్వచ్ఛ భారత స్వప్నం’ వాస్తవ రూపాన్ని ధరించడం కల్ల.. పాలకులు ఆలోచించాలి. న్యాయస్థానాలలో మథనం జరగాలి!!
కాలుష్యానికి మూలకారణం కేంద్రీకరణ. వికేంద్రీకృత ప్రగతి నిజమైన భారతీయత, కేంద్రీకృత కాలుష్య ప్రగతి ఆధునిక నాగరికత పేరుతో అలరారుచున్న అమానవీయ అసభ్యత! ఒక ఇల్లు ఉన్నచోట నిలువున పది ఇళ్లు నిర్మించారు. ఢిల్లీలోను నగరాలలోను ఊపిరి ఆడకపోవడానికి ఈ అంతస్థుల భవనాలు, ఆకాశహర్మ్యాలు వౌలిక కారణం.. దీపావళి సందర్భంగా పేలుతున్న టపాకాయలూ కాదు, తారాజువ్వలూ కాదు!!