సంపాదకీయం

వాణిజ్య వైరుధ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాణిజ్య ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- కృత్రిమ సౌధపుకుడ్యాలు బీటలు వారుతుండడం ఆదివారం ముగిసిన ఇరవై ప్రముఖ దేశాల -గ్రూప్ ట్వంటీ -జీ 20- ప్రభుత్వాధినేతల సమావేశానికి విచిత్ర నేపథ్యం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ‘గునపాలు, గడ్డపారలు’ చేతబూని ఈ ప్రపంచీకరణ భవన్తి గోడలకు ‘కన్నాలు పొడుస్తున్న దృశ్యాలు’ అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన రెండు రోజుల ‘జీ-20’ సమావేశంలో మరోసారి ఆవిష్కృతం అయ్యాయి. ‘వాణిజ్య ప్రపంచీకరణ’ కుప్పకూలిపోతోంది. భారతీయుల సహజ సాంస్కృతిక ప్రపంచీకరణ సుమవన సౌరభాలు మరోసారి ప్రపంచాన్ని ముంచెత్తడానికి రంగం సిద్ధం కావడం ‘జీ-20’ శిఖరాగ్ర సభకు శుభంకరమైన నేపథ్యం. రాజకీయ, ఆర్థిక రంగాలలో మన మాటను సంపన్న దేశాలు పట్టించుకోవడం లేదు, అందువల్ల ‘జీ-20’ దేశాలు భారత్‌ను ఆర్థికశక్తిగా రాజకీయశక్తిగా గుర్తించడానికి సిద్ధంగా లేవు. కానీ మన ప్రధాని నరేంద్ర మోదీ బ్యూనస్ ఎయిర్స్‌లో చేసిన ప్రసంగాలలో ధ్వనించిన భారతీయ సంస్కారాల ప్రభావం మాత్రం ఈ అంతర్జాతీయ వేదికను ఆవహించింది. భారతీయ ‘యోగం’ మరింత ప్రాధాన్యం సంతరించుకొంది, ‘సౌరశక్తి కూటమి’- సోలార్ అలియన్స్- ప్రాధాన్యం పెరిగింది. సూర్యుడు నిరంతరం ప్రకాశించే మన దేశం వంటి భౌగోళిక సమశీతోష్ణ మండల దేశాల ప్రాధాన్యం ప్రస్ఫుటించింది. సూర్యుడి ప్రాధాన్యం పెరిగింది. ఈ సమశీతోష్ణ- ఋతుపవన, అత్యుష్ణ- మండల భూమధ్య రేఖకు అటూ ఇటూ ఇరవై మూడున్నర డిగ్రీల మేర- దక్షిణాన ‘మకర రేఖ’నుంచి ఉత్తరాన ‘కర్కటక రేఖ’ వరకు నెలకొని ఉంది. కర్కాటక రేఖ - ట్రాపిక్ ఆఫ్ కాన్సర్- మన దేశం గుండా వెడుతోంది. అర్జెంటీనా వంటి దక్షిణ అమెరికా దేశాలు ‘మకర రేఖ’కు దక్షిణంగా అత్యంత సమీపంలో నెలకొని ఉన్నాయి. దక్షిణపు ఇరవై మూడున్నర డిగ్రీల- మకర రేఖ నుంచి ఉత్తరపు ఇరవై మూడున్నర డిగ్రీల కర్కటక రేఖవరకూ ‘భూమధ్యరేఖ’కు ఇరువైపులా నలబయి ఆరు ‘డిగ్రీ’ల ప్రాంతంలో నెలకొన్న ప్రాంతం సహజంగానే ‘సౌర మండలం’. ఈ సౌర మండల ప్రాంతంలో సూర్యుడు ఏడాది పొడవునా వెలుగులు వెదజల్లుతున్నాడు. ఇంధన తైలం, ఇంధన వాయువు, అణువిద్యుత్తు, కర్బన విద్యుత్తు, జల విద్యుత్తు తీర్చలేని ప్రపంచ ఇంధనం కొరతను సౌరశక్తి తీర్చనుంది. భారత్ సహా సౌరశక్తి మండలంలోని దేశాల ఆర్థిక ప్రభావం రానున్న దశాబ్దులలో పెరగనుంది. మూడేళ్ల క్రితం మన దేశం నాయకత్వంలో ఏర్పడిన అంతర్జాతీయ సౌరశక్తి కూటమి ‘ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్’- ఐఎన్‌ఏ-లో అమెరికా,బ్రిటన్, రష్యా, చైనా, జపాన్ వంటి ప్రముఖ దేశాలు లేవు. ఎందుకంటె ఈ దేశాలు భూగోళంలోని సౌర మండలంలో లేవు, వెలుపల ఉన్న అతి శీతల దేశాలు ఇవి. ఈ దేశాలలో ‘సౌరశక్తి’ ఏడాది పొడవునా ఉత్పత్తికావడానికి వీలులేకపోవడం ప్రాకృతిక సత్యం.
నరేంద్ర మోదీ బ్యూనస్ ఎయిర్స్‌లో ‘జీ-20’ దేశాల ప్రభుత్వ అధినేతలతో చర్చించిన సమయంలో ఈ ‘సౌరశక్తి అనుసంధాన ప్రాధాన్యం’ మరోసారి ధ్వనించింది. 2022లో జరుగనున్న ‘జీ-20’ ప్రభుత్వ అధినేతల సమావేశాన్ని మన దేశంలో జరుపడానికి ఇతర నాయకులు అంగీకరించడం ఈ ప్రాధాన్యానికి చిహ్నం. భారత స్వాతంత్య్రపు డెబ్బయి ఐదవ వార్షికోత్సవం 2022లో జరుగుతోంది. ఈ సందర్భంగా ‘జి-20’ నేతలు మన దేశానికి రావడం పెరుగుతున్న మన అంతర్జాతీయ ప్రాధాన్యానికి చిహ్నం. పరస్పరం ‘కాట్లాడుకుంటున్న’ ప్రపంచీకరణ శక్తుల మధ్య భారతదేశం ‘మధ్యవర్తి’గా వ్యవహరించడానికి రంగం సిద్ధం కావడం ‘బ్యూనస్ ఎయిర్స్’ సదస్సుకు నేపథ్యం. రాజకీయ ప్రాబల్య విస్తరణ కోసం అమెరికా, రష్యా ప్రభుత్వాలు పరస్పరం విద్వేష ఆరోపణలు చేసుకుంటున్నాయి. వాణిజ్య సామ్రాజ్య ఆధిపత్యం కోసం అమెరికా, చైనాల మధ్య, ఐరోపా చైనాల మధ్య పోరు తీవ్రతరం అవుతోంది. పరస్పరం ఢీ కొంటున్న తోడేళ్లు- ‘కోరలకు కొంతసేపు విశ్రాంతిని ఇచ్చినట్టుగా’, అమెరికా, చైనాలు పరస్పర వాణిజ్య ఆంక్షలకు ‘బ్యూనస్ ఎయిర్స్’ సదస్సు తరువాత తాత్కాలికంగా విరామం ప్రకటించాయి. కానీ చైనా వాణిజ్య దురాక్రమణను చూసి అమెరికా, ఐరోపాలు బెంబేలెత్తిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు చైనా వస్తువులపై దిగుమతి సుంకాలను విపరీతంగా పెంచడానికి ఇదీ కారణం. ప్రతిక్రియకు పూనుకున్న చైనా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై భారీగా సుంకాలను విధించింది.
ఈ సంకుచిత జాతీయ ప్రయోజన పరిరక్షక- ప్రొటక్షనిస్ట్- విధానాలు వాణిజ్య ప్రపంచీకరణ వౌలిక సూత్రాలకు విరుద్ధం. 1993-1994లో ప్రపంచీకరణ వ్యవస్థీకృతమైన తరువాత పదిహేను ఏళ్లపాటు ఇతర దేశాల ‘సంకుచిత’ ఆర్థిక విధానాలను దుయ్యబట్టిన అమెరికా ఆ తరువాత తాను సంకుచిత విధానాలను పాటిస్తోంది. ఇందుకు కారణం 2008- 2009 సంవత్సరాలలో అమెరికా ఆర్థిక వాణిజ్య సంస్థలు దివాలా తీయడం. ప్రపంచీకరణ ఫలితంగా ఏర్పడిన అంతర్జాతీయ స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ- మార్కెట్ ఎకానమీ- ఫలితంగా అమెరికా సంస్థలు విదేశాల పోటీని తట్టుకొనలేకపోవడం ఈ ‘దివాలా’కు కారణం. ట్రంప్ దొరగారు మరింతగా ‘సంకుచిత’ ఉన్మాదంతో ఊగిపోతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో సంపన్న దేశాల సమావేశం కెనడాలో జరిగింది. ఆ సమావేశానికి వెళ్లిన ట్రంప్ అక్కడే కెనడా ప్రభుత్వాన్ని తిట్టివచ్చాడు. ఇప్పుడు ‘బ్యూనస్ ఎయిర్స్’లో జరిగిన సమావేశంలో ట్రంప్ అర్జెంటీనా ప్రభుత్వంపై రుసరుసలాడాడు. లాంఛన పూర్వకమైన వీడ్కోలు తీసుకోకుండానే వెళ్లిపోయాడు. ఇదంతా ‘ప్రపంకరణ’ పట్ల ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’- డబ్ల్యుటీవో- పట్ల నిరసన ప్రదర్శించడంలో భాగం. విదేశాల నుంచి వస్తున్న శరణార్థులను మెక్సికో సరిహద్దులలో అడ్డుకొని నిర్బంధించడం. ఇతర దేశాల వారి ‘వలస’నిరోధించడం వంటి డొనాల్డ్ దొర చర్యలు ‘ప్రపంచీకరణ’ వౌలిక అస్తిత్వానికి పెను సవాలుగా పరిణమించాయి. నిర్నిరోధంగా తమ వస్తువులను అమెరికాలోను, ఐరోపాలోను అమ్ముకొనడానికి వీలులేకపోవడంతో తమ వాణిజ్య సంస్థలు పారిశ్రామిక సంస్థలు దివాలా తీయగలవని చైనాకూడ భయపడుతోంది. ‘ఐరోపా సమాఖ్య’నుంచి బ్రిటన్ నిష్క్రమించడం కూడ ఈ ‘దివాలా భయం’తోనే.. అర్జెంటీనా సభలో ఎలాంటి ప్రధాన నిర్ణయాలు జరగకపోవడానికి కారణం ‘ప్రపంచీకరణ’, స్వేచ్చా వాణిజ్యంలోని ఈ అంతర్గత వైరుధ్యాలు. ఈ వైరుధ్యాల నుంచి మన ప్రభుత్వం కూడ పాఠం నేర్చుకొనవలసి ఉంది. చైనా వస్తువుల దిగుమతులను మనం గణనీయంగా తగ్గించుకోవాలి!
ఇలా సరిహద్దులు లేని ప్రపంచ వాణిజ్య సమాజం - పుడమి పల్లె- గ్లోబల్ విలేజ్-లో వైరుధ్యాలు పెరుగుతుండడం ‘జీ-20’ సదస్సు సందర్భంగా ఆవిష్కృతమైన దృశ్యం! ‘వాణిజ్యం’ ప్రపంచ ప్రజలను సమైక్యం చేయగలదన్నది ప్రస్ఫుటిస్తున్న దృశ్యం. ఈ వాణిజ్య రాజకీయ ఆధిపత్య విస్తరణ పోటీ గతంలో రెండు ప్రపంచ యుద్ధాలకు దారితీసింది. వాణిజ్య, రాజకీయాలకు అతీమైన మానవీయ సంస్కారాల ద్వారా ‘వసుధైక కుటుంబం’- ప్రపంచమే ఒక కుటుంబం- నిర్మించాలన్నది భారతీయుల తరతరాల సాంస్కృతిక ప్రపంచీకరణ. ‘యోగం’ ఇలాంటి మానవీయ సంస్కారం. మోదీ ఈ సంస్కారాన్ని అర్జెంటీనాలో మరోసారి ప్రపంచ ప్రజలకు గుర్తుచేయగలగాడు...