సంపాదకీయం

ప్రచార కాలుష్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలుష్యం విస్తరిస్తూ ఉండడం ప్రధాన ఇతివృత్తం. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరమ్ శాసనసభలకు జరుగుతున్న ఎన్నికలకు ఈ ఇతివృత్తం నేపథ్యం. ఎన్నికల ప్రచారంలో కూడ కాలుష్యం జ్వాలలు రాజుకున్నాయి, చిటపటలతో మొదలయి పటపటలుగా మారి ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కర్మాగారాల గొట్టాల నుంచి, పరిశ్రమల ప్రాంగణాల నుంచి కాలుష్యపు పొగలు బుసకొడుతుండడం నగరాల ముఖ చిత్రం. శివారులలోనే కాదు నగరాల, పట్టణాల ప్రధాన జనావాసాలతో కూడ కాలుష్యపు మురుగు కదం తొక్కుతుండడం ఎన్నికలలో పోటీచేస్తున్న అభ్యర్థులకు ఆయుధంగా మారింది. అందువల్ల కాలుష్యం ‘కంపు’ను ప్రక్షాళనం చేయడానికి తాము చేపట్టిన చర్యల గురించి ప్రభుత్వ పక్షాల వారు, చేపట్టనున్న చర్యల గురించి ప్రతిపక్షాల వారు హోరెత్తుస్తున్నారు. ‘స్వచ్ఛ భారతం’ సభలు తీరుతున్న సుందర స్వప్నం ఆకృతి దాల్చి జనావాసాలలో ప్రస్ఫుటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ‘హరిత హారం’ సుగంధ సుమహారంగా గుబాళిస్తున్నట్టుకూడ ప్రచారం జరుగుతోంది. ‘హైటెక్ సిటీ’ నిర్మాణం గురించి ఘనతల ఆవిష్కరణలు జరిగిపోయాయి. ఇంత జరిగిపోయిన తరువాత హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున ‘నరకం శివారులోని ‘వైతరణి’వలె’’ మూసీనదీ దుర్గంధ దూషిత పంకిల ప్రవాహం పరుగులు తీస్తూనే ఉంది. హుస్సేన్ సాగరం కంపు నీరు నగరానికి మధ్యలో కాలుష్యపు కంచుకం వలె భాగ్యనగరాన్ని అలముకొని ఉంది, ముక్కుపుటాలను అలరిస్తూ ఉంది. ‘హుస్సేన్ సాగరం’ మాత్రమే కాదు ‘సరూర్‌నగర్’ చెఱువు, దుర్గం చెఱువు, ఉప్పల్ చెఱువు వంటి జల సముదాయ ప్రాంగణాలు దశాబ్దులుగా కాలుష్య కేంద్రాలుగా జనాన్ని హడలెత్తిస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ పేరును ‘్భగ్యనగరం’గా మార్చడం తేలిక, ‘మూసీ’ని ‘ముచికుంద’గా పిలవడం సులభం. కానీ అనంతగిరి అడవులలోని ఓషధీ జలాలను మోసుకొని ‘ముచికుంద’ మళ్లీ మధుర పరిమళ వాహినిగా ప్రవహించేది ఎప్పుడు? అనంతగిరి ఆకుపచ్చని పరిమళాలను మళ్లీ వెదజల్లేదెప్పుడు. హైదరాబాద్ నగరంలోని చెఱువుల నీరు- పానయోగ్యం మాట అటుంచి- స్పర్శయోగ్యంగా మారేదెప్పుడు? కాలుష్యం కోరల నుంచి హైదరాబాద్‌ను, తెలంగాణను విముక్తం చేయడానికి అన్ని రాజకీయ పక్షాల అభ్యర్థులూ నియోజకవర్గాల వారీగా హామీలను గుప్పిస్తున్నారు. స్వరూప కాలుష్యం కథే ఇది... స్వచ్ఛ ఇంధనం తెలంగాణలోను ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాలలోను వంట ఇంటి ‘పొగల సెగల’ను దూరం చేసిందట. వీథులలో కట్టెల పొగపొయ్యిల మీద కూరలను, రొట్టెలను చేసి అమ్ముతున్న అమ్మలు మాత్రం కాలుష్యపు బంధం నుంచి విముక్తలు కావడం లేదు..
ఈ స్వరూప ‘కాలుష్యం’ పరిధి నిరంతరం విస్తరిస్తూ ఉండడం గురించి ఎన్నికల ప్రచారకర్తలు ప్రచారవేత్తలు చర్చిస్తూనే ఉన్నారు. ‘హైటెక్ సిటీ’ల ‘ఆవరణ’లోనే మురికి కాలువలు పొంగి పొరలుతున్నాయట, భూగర్భంలో పారిశుద్ధ్య వ్యవస్థ ఏర్పడలేదన్నది అభ్యర్థులు చేస్తున్న ఆరోపణ. ‘‘ఆధునిక హైదరాబాద్‌ను నిర్మించినది నేనే...’’అని, ‘‘కాదు కాదు భాగ్యనగర్ భద్రతను నిలబెట్టింది నేనే’’ అని స్వీయ ఘనతలను చాటుకుంటున్న మహానేతలు ఈ మురుగుకాలువల గురించి, మురికివాసనల గురించి మాట్లాడడం లేదు. తెలంగాణలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాలలోను స్థానిక ‘వాగ్దాన పత్రాల’ను విడుదల చేస్తున్న అభ్యర్థులలో అత్యధికులు ఈ కాలుష్యం గురించి ప్రచారం చేస్తున్నారు. ‘‘కారణం మీ పార్టీ పాలన’’, ‘‘కాదు అంతకుముందు ఏళ్లతరబడి సాగిన మీ పార్టీ నిర్వాకం ఈ కాలుష్యం’’ అంటూ పరస్పరం దూషణ, తిరస్కార, నిరసనలకు అభిశంసనలకు పాలుపడుతుండడం ప్రచార ఘట్టంలో ప్రస్ఫుటిస్తున్న కాలుష్యం. ఇది ‘స్వభావ’ కాలుష్యం! దూషణ కళాకోవిదుల, దుర్భాషా కళాప్రపూర్ణుల ముఖప్రాంగణ గహ్వరాలలో నుంచి ఈ రాజకీయ కాలుష్యపు కంపుతన్నుకొని వస్తోంది, జన జీవన క్షేత్రాన్ని ముంచెత్తుతోంది. బహిరంగ పశువధ, బహిరంగ పశుమాంస ఖండాల కళేబరాల వికృత ప్రదర్శన, కూరగాయల విక్రయ ప్రాంగణలలో కుళ్లిన అవశేషాల రాసులు, మత్స్య శకలాల గుట్టలు దుర్వాసనలకు కాలుష్యానికి పరాకాష్ఠ. మద్యంతో మత్తెక్కినవారు నోటి ద్వారా మాట ద్వారా కాలుష్యం పంచుతున్నారు, ఇప్పుడు ‘వోటు’ద్వారా మరింతగా కాలుష్యాన్ని పెంచుతున్నారు! దీనికి ఎవరు కారకులు?? మద్యపానం సక్రమం అయినప్పుడు ‘‘అక్రమ మద్యం’’ సీసాలను, డబ్బులను, ట్రక్కులను, లారీలను పట్టుకొనడం ఏమిటి?? మద్యం అంటేనే సామాజిక అక్రమం. మళ్లీ, కొత్తగా ‘‘అక్రమ మద్యం...’’ ఏమిటి?? ఈ సామాజిక అక్రమాన్ని ‘‘సక్రమం’’ చేసిన రాజకీయ ‘స్వభావ’ కాలుష్యం అప్రతిహతంగా విస్తరిస్తూనే ఉంది!
మద్యపానాన్ని నిషేధిస్తామని ఎవ్వరూ చెప్పడం లేదు, వాగ్దానం చేయడం లేదు. సహాయాలను రాయితీలను మినహాయింపులను ఆసరాలను ఓవైపున ప్రకటిస్తున్న ప్రభుత్వాలు మరోవైపున మద్యాన్ని- ప్రాణాలను తీయగల విషాన్ని- విక్రయించి ఖజానాలను నింపేసుకోవడం దశాబ్దులుగా నడుస్తున్న చరిత్ర. ఇదీ ప్రభుత్వ నిర్వాహకుల, ప్రభుత్వాలను మాటల తూటాలతో చీల్చిచెండాడుతున్న ప్రతిపక్షాల రాజకీయ స్వభావ కాలుష్యం. ఎన్నికలలో పోటీచేస్తున్న అన్ని ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులలో సగటున సగం మంది నేరచరితులన్నది వివిధ అధ్యయనాలలో నిగ్గుతేలిన నిజం. తెలంగాణలో మాత్రమేకాదు మిగిలిన నాలుగు రాష్ట్రాలలో కూడ ఇదే తీరు. తెలంగాణలో ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థుల సంఖ్య దాదాపు మూడువందల యాబయి కాగా వీరిలో దాదాపు నూట డెబ్బయి ఐదు మందికి వ్యతిరేకంగా గతంలో వివిధ నేరాలకు సంబంధించిన ఆరోపణలు, అభియోగాలు పోలీసుల వద్ద, న్యాయస్థానాలలోను దాఖలై ఉన్నాయట! ప్రధాన పక్షాలకు చెందని, స్వతంత్ర, ‘ఆషామాషీ’ అభ్యర్థులలో ఎందరెందరు ఎనె్నన్ని ఘోరాలకు నేరాలకు పాల్పడినారన్నది ఎప్పటికీ తేలదు. ఇలా స్వభాష కాలుష్యవంతులైన అభ్యర్థులు స్వరూప కాలుష్యాన్ని తొలగిస్తామని వాగ్దానాలు గుప్పిస్తున్నారు! స్వరూప స్వచ్ఛత విస్తరించడం వల్ల భౌతిక స్వచ్ఛ్భారత్ ఏర్పడవచ్చు. కానీ ఇది సగం మాత్రమే! స్వభావ స్వచ్ఛత వికసించనిదే మానసిక స్వచ్ఛ్భారత్, సాంస్కృతిక స్వచ్ఛ్భారత్ ఏర్పడబోదు. అభ్యర్థుల మానసిక స్వచ్ఛత అందువల్ల ‘స్వచ్ఛ తెలంగాణ’ అవతరణకు గీటురాయి. ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాలకు ఈ ‘‘నికషంపై నిగ్గుతేలాలన్న’’ సూత్రం వర్తిస్తుంది. ఈ ‘గీటురాయి’పై ‘వోటర్లు’ నిగ్గుతేల్చగలిగితే అధికాధిక నియోజకవర్గాలలో ‘‘ఎవరూ వద్దు’’ అన్న తీర్పు వెలువడాలి. కానీ ఈ ‘నోటా’వోటు గురించి అధికాధిక జనానికి ఇప్పటికీ ధ్యాస లేదు. ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిణతకు ఇదీ కొలమానం....
ఎన్నికల ప్రచార, ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణపై తెలంగాణలోనే అభ్యర్థులకు వ్యతిరేకంగా ఐదువేల ఫిర్యాదులు దాఖలయ్యాయట! అనేకమంది ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తున్నారు, తమకు నచ్చిన పక్షాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ఉద్యోగులను ‘ఎన్నికల సంఘం’ వారు హెచ్చరించడం, ‘సస్పెండ్’ చేయడం నడుస్తున్న చరిత్ర! ఈ స్వభావ కాలుష్యం ప్రచార మాధ్యమాలను సైతం ముంచెత్తుతోంది. డబ్బు తీసుకొని వివిధ పక్షాలకు అనుకూలంగా వార్తలు, వ్యాఖ్యల ప్రచురణకు ప్రసారానికి పాల్పడిన ఆరోపణపై మాధ్యమాలకు వ్యతిరేకంగా పదమూడు వందల అభియోగాలు దాఖలయ్యాయట- తెలంగాణలో!