సంపాదకీయం

విద్రోహానికి వెసులుబాటు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యతిరేక విచ్ఛిన్న వాదులపై మన ప్రభుత్వం జరుపుతున్న పోరాటం కథ మళ్లీ మొదటికి వచ్చింది. జమ్మూ కశ్మీర్‌లో దేశ విద్రోహ కలాపాలకు నాయకత్వం వహిస్తున్న హురియత్ ముఠాలవారు ఏ దేశపు ప్రతినిధులతోనైనా చర్చలు జరపడంపై ఎలాంటి నిషేధం లేదని కేంద్ర ప్రభుత్వం, స్పష్టం చేయడం కథ మొదటికి వచ్చిందనడానికి సాక్ష్యం. ఏది ఏమైనా సరే పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రక్రియను కొనసాగించాలన్న మన ప్రభుత్వ విధానం మళ్లీ మొదలైపోయిదనడానకి ఈ స్పష్టీరణ నిదర్శనం. విదేశీయ వ్యవహారాల సహాయమంత్రి విజయకుమార్ సింగ్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా అందజేసిన సమాచారం వల్ల హురియత్ ముఠాలు ఇకపై పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరపవచ్చునని స్పష్టమైపోయింది. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులతోను, కశ్మీర్‌లోని ఇతర దేశద్రోహుల ముఠాల వారితోను చర్చలు జరిపి వెళ్లడం 2014 ఆగస్టు వరకు నడచిన చరిత్ర. 2004వ 2014వ సంవత్సరాల మధ్య ప్రధాని మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇలా పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులు జమ్మూ కశ్మీర్‌లోని జిహాదీ ముఠాలతోను, జిహాద్‌ను సమర్థించే వారితోను చర్చలు జరిపినప్పుడల్లా పాలకులు నిరోధించలేదు. నిరోధించినట్టయితే పాకిస్తాన్‌తో చర్చలు జరిపే ప్రక్రియ ఆగిపోతుందన్నది మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని ఆవహించి ఉండిన భయం. అందువల్ల పాకిస్తాన్ ప్రభుత్వం కాని, జమ్మూకశ్మీర్‌లోని పాకిస్తాన్ అనుకూల జిహాదీ ముఠాలు కాని మన్‌మోహన్ ప్రభుత్వం వారి నిరసనలను లెక్కచేయలేదు. 2012 జూలైలో మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శితో చర్చలు జరపడానికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జలీల్ అబ్బాస్ జిలాని అనేవాడు, న్యూఢిల్లీకి విచ్చేశాడు. ఈ అబ్సాస్‌కు జిలానీ జమ్మూకశ్మీర్‌లోని హరియత్ ముదురు ముఠా నాయకుడు సయ్యద్ అలీషా జిలానీతో చర్చలు జరిపి వెళ్లాడు. పాకిస్తానీ జిలానీని హరియత్ జిలానీ బుగ్గలు పుణికి ముద్దు చేసి బహిరంగంగా వాత్సల్యాన్ని ప్రకటించిన దృశ్యాలు 2014 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇలా కళ్లప్పగించి తిలకించే వైపరీత్యానికి తెర దించింది. రెండేళ్లు గడవక ముందే మళ్లీ తెరను లేపడం వల్ల మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం వారి బాటలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం నడవాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమైంది.
పాకిస్తాన్‌తో చర్చలను రద్దు చేయడానకి 2014, ఆగస్టు 18వ తేదీన రూపొందించిన తార్కిక ప్రాతిపదికను ప్రనుత్వం ఇప్పుడు భగ్నం చేసినట్లయింది. ఉది స్వవచోభంగం మాత్రమే కాదు, స్వీయాభిశంసన కూడ. ఇలాంటి వైపరీత్యానికి నరేంద్ర మోదీ నాయక్వంలోని ప్రభుత్వం పాలుపడడమే విస్మయకర పరిణామం. 2014 ఆగస్టు 25న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగవలసిన ఉండిన ఉభయ దేశాల కార్యదర్శుల స్థాయి చర్చలను రద్దు చేసింది. ఇందుకు ఏకైక కారణం ఈ చర్చలకంటే ముందుగా 18వ తేదీన న్యూఢిల్లీలోని పాకిస్తాన్ రాయబారి అబ్దుల్ బాసిత్ జమ్మూకశ్మీర్‌లోని విద్రోహపు ముఠా నాయకుడు షబీర్ షాతో చర్చలు జరపడం. డెమోక్రటిక్ జమ్మూ కశ్మీర్ ఫ్రీడమ్ పార్టీ నాయకుడిగా చెలామణి అవుతుండిన ఈ షబ్బీర్ షా హురియత్ ముఠాకు చెందినవాడు. హురియత్‌తో చర్చలు జరుపడం ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వం వ్యతిరేక ధోరణిని ప్రదర్శించింది. ఇరుగుపొరుగు సంబంధాలను మెరుగు పరచుకోవాలన్న చిత్తశుద్ధి పాకిస్తాన్ ప్రభుత్వానికి లేదని స్పష్టమైంది...’’ అని మన ప్రభుత్వం అప్పుడు చెప్పింది. మరి ఇప్పుడు హురియత్‌తో సంప్రదింపులు జరుపడానికి పాకిస్తాన్‌కు ఎందుకని మన ప్రభుత్వం అవకాశం ఇస్తోంది? అప్పటికీ ఇప్పటికీ హురియత్ వైఖరిలో మార్పులేదు. హురియత్ జమ్మూకశ్మీర్‌లో ఉంది కాబట్టి జమ్మూకశ్మీర్ దేశంలో అంతర్భాగం కాబట్టి, ఈ తథాకథిత కశ్మీరీ నాయకులు మనదేశంలో ఏ ఇతర దేశపు ప్రతినిధులతోనైనా చర్చలు జరుపవచ్చునని ప్రభుత్వం ఇప్పుడు అంటోంది. ఈ సిద్ధాంతం 2014, ఆగస్టు 18న మాత్రం ఎందుకని వర్తించడం లేదు..?
పాకిస్తాన్ మన అంతర్గత వ్యవహారాలలో కల్పించుకొంటున్న అక్రమ ప్రమేయానికి ఇలా హురియత్ తోను ఇతర విచ్ఛిన్న కారులతోను చర్చలు జరపడం ప్రత్యక్ష ప్రమాణమని 2014, ఆగస్టు 18న మన ప్రభుత్వం చెప్పింది. మరి అదే నిబంధన ఇప్పుడు వర్తించదా? ఏది సరైన నిర్ణయం? 2014 ఆగస్టులో చర్చలను రద్దు చేయడమా లేక ఇప్పుడు హురియత్ పాకిస్తాన్ చర్చలకు అవరోధాన్ని తొలగించడమా? దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంజాయిషీ చెప్పవలసి ఉంది. ఇప్పటికే ఈ మన పాకిస్తాన్‌తో చర్చల విధానం పట్ల గొప్ప గందరగోళం ఏర్పడింది. హురియత్‌తో చర్చలు జరుపబోమని పాకిస్తాన్ మనకు హామీ ఇవ్వలేదు. హరియత్ ముఠాలు భారత రాజ్యాంగ వ్యవస్థ పట్ల, దేశ సార్వభౌమాధికారం పట్ల భౌగోళిక సమగ్రతల పట్ల జాతీయ సమైక్యం పట్ల అప్పటికీ ఇప్పటికీ నిబద్ధతను ప్రకటించలేదు. భారత రాజ్యాంగానికి తాము లోబడి లేమని, హురియత్ వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఇలా ప్రకటించిన వారిని కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయడానికి, దేశద్రోహ నేరానికి గాను న్యాయ సాథనాలలో విచారించి శిక్షింపచేయాలి. దశాబ్దుల తరబడి అది జరగకపోవడం వల్ల మ్మూ కశ్మీర్‌లోని విచ్ఛిన్న కారులకు కేంద్ర ప్రభుత్వం లోకువైపోయింది. రాజ్యసభలో చేసిన ప్రకటనతోమరింత లోకువైపోయింది. దేశద్రోహుల ముందు మోకరిల్లినట్టయింది. మనదేశాన్ని బద్దలు కొట్టడానికై జిహాదీ ఉగ్రవాదులను పురికొల్పుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం బీభత్స వ్యవస్థ! పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బీభత్స వ్యవస్థగా ప్రకటింపజేయడానికి 2002-03వ సంవత్సరాలలో మన ప్రభుత్వం చర్చలు ఆరంభించింది. కానీ 2003వ సంవత్సరం ముగిసే సరికి ఆ సంగతిని మరచిపోయి మళ్లీ పాకిస్తాన్‌తో మైత్రి మాటలు మొదలు పెట్టింది. ఇలా సంవత్సరాల తరబతి మాటిమాటికీ మన విధానం మాత్రమే మారుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం బీభత్స స్వభావం మారలేదు, హురియత్ ముఠాల విద్రోహ కార్యక్రమం మారడం లేదు. ఇదే వ్యథ పునరావృత్తం అవుతున్నతీరు...
గత సంవత్సరం జూన్ తొమ్మిదవ తేదీన మన సైనికులు బర్మాలోకి చొచ్చుకొని పోయారు. అక్కడ మన సరిహద్దులకు సమీపంలో స్థావరాలను ఏర్పాటు చేసుకొని ఉండిన బీభత్స కారులను పట్టి పరిమార్చారు. దశాబ్దుల తరబడి ఈ విద్రోహులు మన ఈశాన్యంలోకి జొరబడడం, హత్యలు చేయడం..మళ్లీ బర్మాలోకి పారిపోవడం..ఇదే కథనాల గతి సాగుతోంది. మన ప్రభుత్వాలు దశాబ్దుల తరబడి సరిహద్దులు దాటిపోయిన వారిని వెన్నంటి తరిమే విధానాన్ని అమలు జరుపలేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలిసారిగా అమలు జరిపింది. దేశ ప్రజలు మెచ్చుకున్నారు. అంతర్జాతీయ సమాజం మెచ్చుకుంది. పాకిస్తాన్ విషయంలో కూడ ఈ హాట్ పర్స్యూట్‌ను మన ప్రభుత్వం అమలు చేయనున్నదన్న ప్రచారం కూడ జరిగింది. కానీ క్రమంగా ఆ స్ఫూర్తి అంతరించి పోతోంది.