సంపాదకీయం

బొగ్గు ‘పులుసు’...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పడమర నుంచి తూర్పు వెడుతున్న విద్యుచ్ఛక్తి చోదిత ‘రైలు’బండి పొగ ఏవైపునకు వెడుతుంది?- అన్నది దశాబ్దుల క్రితం నాటి ప్రశ్న. విద్యార్థుల విద్యావంతుల సాధారణ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికై మేధావులు ఈ ప్రశ్నను సంధించి ఉండవచ్చు. బొగ్గులతో నడచిన బస్సులు కూడ ఉండేవట. ఆవిరి యంత్రంతో నడచిన రైళ్లు ‘బొగ్గుల’బండ్లుగానే ప్రసిద్ధి. మామూలు బొగ్గు కట్టెలను కాల్చడం వల్ల లభించడం అందరికీ తెలిసిన వాస్తవం. రైలు ఇంజన్లకు వాడిన, వాడుతున్న బొగ్గు గనుల నుంచి తవ్వితీసిన నల్లని శకలాలు, ఇనుమువలె రాళ్లవలె ఉండే ఈ గని బొగ్గుతో నీరు మర్లించి ‘ఆవిరి’తో రైళ్ళను నడపడం చరిత్ర. అందువల్ల రైళ్ల ‘ఇంజన్’ల నుంచి బొగ్గు కాలిన నల్లని పొగలు వెలువడేవి. ‘పొగబండి’- ధూమ శకటం- పయనించిన ‘ఇనుపదారి’- పట్టాల- వెంట పొగ కూడ పరుగులు తీసేది. పొగ వల్ల ‘బొగ్గుపులుసు వాయువు’ వ్యాపించి పరిసరాలను, ప్రకృతిని నల్లబరిచింది. కానీ ఈ ‘నలుపు’వెంటవెంటనే ప్రకృతిలో విలీనం అయిపోయేది. బొగ్గుపులుసు వాయువును ప్రకృతి జీర్ణం చేసుకొని మళ్లీ స్వచ్ఛంగా భాసించడం ఆకుపచ్చని పరిమళాలను వెదజల్లడం అప్పటి కథ. ఇటీవలి దశాబ్దులలో ఈ కథ మారింది. ‘రైలు’ పెట్రోలియం ఉత్పత్తులతో నడవడం మొదలైంది. బొగ్గు కాలడం వల్ల వెలువడిన కాలుష్యం కంటె ‘పెట్రోలియం’ ఇంధనం కాలడం వల్ల వెలువడుతున్న కాలుష్యం పదింతలుగా వంద రెట్లుగా వేల రెట్లుగా విస్తరించిపోయింది. ఈ కాలుష్యాన్ని ప్రకృతి జీర్ణించుకోలేక పోతోంది. అందువల్ల విషపు గాలులను వెళ్లగక్కుతోంది, ఈ ‘వమన’ క్రియ కారణంగా ప్రకృతి పరిసరాలు జంతుజాలం వృక్షజాలం జీవజాలం అస్వస్థతకు గురి అయిపోయింది. రైళ్ల పొగ తగ్గిపోయింది. బొగ్గు, పెట్రోలియం వాడకం తగ్గి, విద్యుచ్ఛక్తి ద్వారా రైలు ‘ఇంజన్’లు పరుగు తీస్తున్నాయి. ‘బొగ్గు’బండ్లు మన దేశంలో ఇప్పుడు లేవన్నది ప్రచారం.. ఇతర దేశాలలో ఇంకా ‘ఆవిరి’రైళ్లు నడుస్తున్నాయట! కానీ రైళ్లు విద్యుత్‌తో నడుస్తున్న సమయంలోనే పరిశ్రమల నుండి వేల రెట్లుగా కర్బన- బొగ్గుపులుసు వాయువు- కాలుష్యం వెలువడుతుండడం దశాబ్దుల వ్యథ. ఈ వాయు కాలుష్యం వల్ల ప్రకృతి వేడెక్కింది, మంచు కరిగిపోయింది, సముద్రాలు పొంగి చిన్న చిన్న ద్వీపాలను ముంచెత్తుతున్నాయి. సముద్ర స్థిత జల చరాలు మాత్రమేకాదు, భూమి ఉపరితల జలచరాలు, వాయుచరాలు కోట్ల సంఖ్యలో ‘కాటు’కు బలైపోతున్నాయి. వాయు కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం డెబ్బయి లక్షల మంది ప్రాణాలను కోల్పోతున్నట్టు ‘ఐక్యరాజ్య సమితి’ అనుబంధ ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ - వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్- డబ్ల్యూహెచ్‌ఓ- వారు చేసిన నిర్ధారణకు ఇదీ నేపథ్యం. ‘ఆరోగ్య సంస్థ’వారి అధ్యయన నివేదికను పోలెండు దేశంలోని ‘కటోవైస్’ పట్టణంలో జరుగుతున్న ‘పర్యావరణ’ పరిరక్షణ సదస్సులో ఐదవ తేదీన ఆవిష్కరించారు.
బొగ్గుపులుసు వాయువు పరిమాణం విపరీతంగా పెరిగిపోవడం పట్ల ఈ ‘ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరివర్తన కార్యాచరణ సదస్సు’- యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కనె్వన్షన్ ఆన్ క్లయిమేట్ ఛేంజ్- సిఒపి 24-లో ఆవిష్కృతమైన అధ్యయన నివేదికలో తీవ్రమైన ఆందోళనను వ్యక్తం చేశారు. మూడువేల వంద కోట్ల టన్నుల ‘కర్బన కాలుష్యం’ 2017లో అంతర్జాతీయ గగనంలోకి చొరబడిపోయిందట! బొగ్గు వాడకం పెరగడం వల్ల, పెట్రోలియం ఉత్పత్తుల వాడకం తగ్గకపోవడం వల్ల 2016లో కంటె 2017లో దాదాపు మూడు శాతం ‘బొగ్గుపులుసు’ వాయువు అధికంగా పర్యావరణంలోకి ‘జమ’ అయిందన్నది సదస్సులో వెల్లడైన వాస్తవం. ‘తూర్పు ఆంగ్లియా’అన్న విశ్వవిద్యాలయం వారు, ‘అంతర్జాతీయ బొగ్గుపులుసు వ్యవహారం పథకం’ అన్న సంస్థవారు ఈ కాలుష్యం పెరుగుదలను కనిపెట్టారట! చైనానుండి అత్యధికంగా కర్బన కాలుష్యం వెలువడుతోందన్న వాస్తవం ఈ సదస్సు సందర్భంగా మరోసారి ధ్రువపడింది. ఈ కాలుష్యం వెదజల్లుతున్న దేశాలలో అమెరికా రెండవ స్థానంలోను మన దేశం మూడవ స్థానంలోను రష్యా నాలుగవ స్థానంలోను జపాన్ ఐదవ స్థానంలోను ఉన్నట్టు వెల్లడి అయింది. మొత్తం కర్బన కాలుష్యంలో చైనానుంచి మాత్రమే ఇరవై ఏడు శాతం వినిర్గతమవుతుండడం ఆశ్చర్యకరం కాదు. చైనా అంతర్జాతీయ అభిప్రాయాన్ని లెక్కచేయడం లేదు. అంతర్జాతీయ కాలుష్యం గత ఏడాది కాలంలో మూడు శాతం పెరుగగా చైనా కాలుష్యం ఐదుశాతం పెరగడం ‘వాణిజ్య ప్రపంచీకరణ’ ప్రభావం. 2015లో ‘పారిస్’లో కుదిరిన ‘అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ అంగీకారం’ వ్యవస్థ నుంచి తప్పుకొనడం ద్వారా అమెరికా అంతర్జాతీయ సమాజాన్ని బాహాటంగా వెక్కిరిస్తోంది. ‘వ్యవస్థ’లో కొనసాగుతున్న చైనా పరోక్షంగా అంతర్జాతీయ వ్యవహారాల ఒప్పందాలను ధిక్కరిస్తోంది! ఇదంతా అమెరికా చైనా ప్రభుత్వ నిర్వాహకుల మానసిక కాలుష్యం..
ప్రపంచపు సగటు ఉష్ణోగ్రత మరో రెండు డిగ్రీలు పెరిగినట్టయితే సముద్రాలు ఉప్పొంగి అనేక దేశాలకు చెందిన లక్షల చదరపు కిలోమీటర్ల సముద్ర తట ప్రాంతాలు నీటిలో మునిగిపోతాయి. సముద్ర జలాలలో నెలకొని ఉన్న చిన్న దేశాలు కనిపించకుండా పోనున్నాయి. హిమాలయ పర్వత శ్రేణిలోని పదమూడు శాతం మంచు యాబయి ఏళ్లలో ఆవిరి అయిపోవడం ధ్రువపడిన వాస్తవం. ఇందుకు ప్రధాన కారణం చైనా టిబెట్‌లో పెంచిన వాయుకాలుష్యం. చైనా కర్బన కాలుష్య విషాల దుష్ప్రభావం ఇరుగుపొరుగు దేశాలకు విస్తరించిపోతుండడం పారిస్ సదస్సునకు నేపథ్యం. అందువల్ల ప్రపంచ ఉష్ణోగ్రత 2015నాటి స్థాయికంటె ‘ఒకటిన్నర డిగ్రీల సెల్సియస్’కు మించి పెరగనివ్వరాదన్నది ‘పారిస్ సదస్సు’చేసిన నిర్ణయం. 2050 నాటికి పెరుగుదలను ఇలా అర్ధ డిగ్రీ మేర అరికట్టినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఏటా పది లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చునట! అయితే ఈ ఉష్ణోగ్రత పెరుగుదలను ఇలా నియంత్రించడానికి కర్బన కాలుష్యాన్ని- బొగ్గు పులుసు వాయువును- నియంత్రించవలసి ఉంది. 2015 నాటి స్థాయి కంటె 2030 నాటికి ‘కర్బన విష రసాయనాల’ పరిమాణం యాబయి శాతం తగ్గాలని 2050 నాటికి కర్బన కాలుష్యం సున్న శాతానికి చేరాలని పారిస్ సభలో నిర్ధారించారు. ‘నోరు’తెరిచినప్పుడల్లా ‘నోటి’లో కాలుపెట్టుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ గురువారం నాడు ‘పారిస్ ఒప్పందాన్ని’ తీవ్రంగా దుయ్యబట్టాడు. అంతర్జాతీయ దౌత్య నియమాలను డొనాల్డ్ ట్రంప్ ఇలా ఉల్లంఘిస్తుండడానికి కారణం ‘ప్రపంచీకరణ’ ఫలితంగా అమెరికా ఆర్థికంగా దివాలా తీస్తుండడం. కానీ ప్రపంచీకరణ ఫలితంగా అతిశక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా కూడా పారిస్ ఒప్పందం స్ఫూర్తికి భిన్నంగా కాలుష్యాన్ని మరింతగా పెంచుతోంది. వివిధ దేశాలకు వ్యతిరేకంగా చైనా సాగిస్తున్న వాణిజ్య దురాక్రమణ ఇందుకు ప్రాతిపదిక! కాలుష్యాన్ని పెంచుతున్న పరిశ్రమలు చైనాలో విస్తరించిపోతున్నాయి..!
బొగ్గును గనుల నుంచి తవ్వితీయడం వల్ల అటవీ పరిరక్షణ జరుగుతుంది. కానీ మన దేశంలో చెట్లను నరికివేసి బొగ్గుగా మార్చడానికి, కలపను విచ్చలవిడిగా ఎగుమతులు చేయడానికి బ్రిటన్ దురాక్రమణ సమయంలో ప్రాతిపదిక ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధం ఈ అటవీ హననానికి పరాకాష్ఠ. ‘గని’బొగ్గును కాక ‘వని’బొగ్గును విచ్చలవిడిగా వాడడం వల్ల మహావృక్షాలు మాయమయ్యాయి, అడవులు అదృశ్యమయ్యాయి. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల కర్బన కాలుష్యాన్ని జీర్ణం చేసుకోగల ఆకుపచ్చదనం అంతరించింది. ‘సౌరశక్తి’ కూటమిని ఏర్పాటుచేయడం ద్వారా మన ప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పాదనను వాడకాన్ని పెంచడానికి పూనుకొనడం వాయుకాలుష్య నిరోధక మాథ్యమం...