మెయన్ ఫీచర్

సంఘ్ ముక్త్ భారత్ సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్ది రోజుల క్రితం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘సంఘ్ ముక్త్ భారత్’ అంటూ సరికొత్త నినాదాన్ని మొదలుపెట్టారు. నిజానికి 2014లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. దీనే్న కొద్దిగా మార్చి ‘సంఘ్ ముక్త్ భారత్’ అంటూ ముందుకెళ్లాలని నితీశ్ అభిలాష! మరి అప్పట్లో కాంగ్రెస్‌ను ఓడించడానికి మోదీ మరే ఇతర పార్టీల సహకారం లేకుండానే, ముందుకు దూసుకెళ్లారు. కానీ నేడు నితీశ్‌కు ఆ పరిస్థితి లేదు. కమలనాథులను నిలువరించేందుకు సొంతబలం చాలని బిహార్ ముఖ్యమంత్రి ఇతర పార్టీలు ఒకే వేదిక మీదకు రావాలని కోరుతున్నారు. అట్లా కోరక తప్పదు కూడా! ఇక్కడ గమనించాల్సిన అంశమేమంటే, ఒకప్పుడు బహుళ ప్రచారం పొందిన ‘నినాదాల’కే కొత్తరూపం కల్పించో లేక రూపు మార్చో రాజకీయ నేతలు ఎన్నికల గోదాలోకి దిగినా వాటి ప్రభావం అంతగా ఉండబోదన్నది గత చరిత్ర చెప్పిన పాఠం.
కూటమిగా ఏర్పడాలంటూ భాజపాయేతర పార్టీలకు నితీశ్ ఇచ్చిన పిలుపునకు స్పందన అంతంతమాత్రమే! సంఘ్ పరివార్ లేదా భాజపాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వివిధ రాజకీయ పార్టీ నేతల్లో నితీశ్ పిలుపు ఉత్సాహం నింపకపోవడానికి కారణం, ప్రధానంగా ఆయా పార్టీల నేతలు తమ ప్రస్తుత స్థానాన్ని కోల్పోవడానికి ఇష్టపడకపోవడం. కూటమిలో చేరాలంటే ఇచ్చిపుచ్చుకోవడంలో భాగంగా కొన్ని సమయాల్లో తమ స్థానాన్ని కోల్పోవలసి రావచ్చు.. అదీ వారి భయం! అయితే 2019 నాటికి భాజపాను అధికారంనుంచి దూరం చేయాలంటే విస్తృత ప్రాతిపదికన కూటమి ఏర్పడాల్సిన అవసరం ఉందన్న నితీశ్ పిలుపును ఇతర పార్టీలు తమకోణంలో అర్థం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నితీశ్ తనను తానే ఫ్రంట్‌కు అధినేతగా ఊహించుకుంటున్నాడన్న అభిప్రాయం వాటిల్లో బలంగా ఉంది. అయితే నితీశ్ ఆశలు కేవలం బిహార్ ముఖ్యమంత్రి పదవికి మాత్రమే పరిమితం కాలేదు. అంతకుమించిన స్థాయిలో ఆయన ఆలోచనలున్నాయన్నది బహిరంగ రహస్యమే. గత దశాబ్దపు తొలినాళ్లలో భాజపాతో, జనతాదళ్ (యు) తెగదెంపులు చేసుకున్నదంటే అందుకు కారణం, నితీశ్‌కు నరేంద్ర మోదీతో వ్యక్తిగత విభేదాలు తీవ్రస్థాయికి చేరుకోవడమే! మరి మోదీతో ఆయన పోటీ పడటానికి కారణం.. అప్పట్లో సంఘ్ పరివార్ నరేంద్ర మోదీని ప్రముఖ నాయకుడిగా క్రమంగా గుర్తిసూ రావడమే! ఇక నితీశ్ విషయానికి వస్తే ఆయన కలగూరగంప లాంటి పార్టీలకు నేతృత్వం వహించారు. మరి ఆయన ప్రధాన మంత్రి కావడమనేది, ముక్కలు చెక్కలుగా ఉన్న భారత రాజకీయాలపై పూర్తిగా ఆధారపడివుంది. కప్పల తక్కెడలాంటి పార్టీలతో ఎప్పుడు కూలుతుంతో తెలియని దినదిన గండంగామనుగడ సాగించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. నిజానికి 2014 ఎన్నికలు ఎంతో పరిణామాత్మకమైనవనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో భాజపా పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిందంటే అందుకు ప్రధాన కారణం నరేంద్ర మోదీ చరిష్మా మాత్రమే కారణం. అంతేకాని, భాజపా సామాజిక వేదిక మరింత విస్తృతం కావడం వల్ల కాదు. ఇన్ని సీట్లు సాధించినా భాజపాకు వచ్చినవి 31 శాతం ఓట్లు మాత్రమే. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేయడం వల్ల భాజపా వ్యతిరేక ఓట్లలో చీలిక తీసుకొని రావడం సాధ్యమైంది. ఇక భాజపా వ్యతిరేక ఓట్లు జెడి(యు), రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్‌ల మధ్య చీలిపోయాయి. విపక్షాల ఐక్యత ఎంత తక్కువగా ఉంటే, అతిపెద్ద పార్టీ అన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నది 2014 ఎన్నికలు చేసిన నిర్ధారణ.
అయితే తమ వనరులన్నింటినీ ఒక్కదగ్గరకు చేరిస్తే విజయం తమకే తథ్యమన్న సత్యాన్ని భాజపాయేతర పార్టీలు గుర్తించాయి. ఇదే వ్యూహాన్ని బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించి విజయం సాధించాయి. ఓడించడం సాధ్యం కాదనుకున్న మోదీని దెబ్బతీయగలిగాయి. ప్రారంభంలో ఇదే మాదిరి కూటమిని అస్సాంలో ఏర్పాటు చేద్దామనుకున్నారు. దాదాపు కూటమి ఖాయమనుకున్న దశలో, కాంగ్రెస్, ఆల్ అస్సాం యునైటెడ్ ఫ్రంట్‌లు తిరస్కరించడంతో ఆ యత్నాలకు పురిట్లోనే సంధికొట్టింది. దీనికి విరుద్ధంగా భాజపా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఏర్పాటు చేసుకున్న కూటమి ఫలితాలిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరి అస్సాంలో విస్తృత కూటమి ఏర్పాటు ఆలోచన నితీశ్ కుమార్‌ది. కాంగ్రెస్ వ్యతిరేకించడంతో నితీశ్ వెనుకడుగు వేశారు. ఇక దేశవ్యాప్తంగా భాజపాయేతర కూటమి ఏర్పాటు విషయంలో దూకుడు పనికిరాదని, ‘తాను మాత్రమే చుక్కాని’గా ఉంటూ నిదానంగా ముందుకు సాగాలన్న నిర్ణయానికి వచ్చారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతిని ఉండవచ్చు గాక. కానీ దేశవ్యాప్తంగా స్థిరమైన ఆధారం ఇప్పటికీ ఆ పార్టీ కలిగివుంది. అంతేకాదు జాతీయ స్థాయిలో ప్రతిపక్షం పాత్రను పోషిస్తున్నది కూడా కాంగ్రెస్ మాత్రమే! అందువల్ల మరో పార్టీ నేతృత్వంలో జాతీయ స్థాయిలో విస్తృత ప్రాతిపదికన కూటమి ఏర్పాటు కావడం కాంగ్రెస్‌కు సుతరామూ ఇష్టంకాదు. అందువల్ల భాజపాయేతర కూటమి ప్రయోగం రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేవలం రాష్ట్రాల స్థాయిలో మాత్రమే సాధ్యమన్న సత్యాన్ని నితీశ్ కుమార్ అంగీకరించాలి. అందువల్ల వివిధ రాష్ట్రాల స్థాయిల్లో కూటములను, ఒప్పందాలను కుదుర్చుకునే దిశగా నితీశ్ ముందుకు అడుగులు వేయాలి. ఇప్పటివరకు చూస్తే ఉత్తర ప్రదేశ్‌లో అజిత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌తో విలీనం కావడానికి నితీశ్ చేసిన యత్నాలు ఫలితాలిచ్చే దిశగా సాగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం తాత్కాలికంగా ఈ యత్నాలు ముందుకు సాగడం లేదు.
కూటమి ఏర్పాటు చేసుకోవాలంటే అందులో భాగస్వాములయ్యే అన్ని పార్టీలకు ప్రయోజనం ఉండాలి. నిజానికి ఇప్పటికి అజిత్ సింగ్‌కు ఏవిధమైన ఆఫర్ ఇవ్వడానకి జెడి(యు) వద్ద ఏమీలేదు. ఇక కాంగ్రెస్‌కు చెందిన సైద్ధాంతికంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించే ప్రచార మేనేజర్ ప్రశాంత్ కిశోర్, అజిత్‌సింగ్ ఇప్పటికిప్పుడు జెడి(యు)తో ఒక ఒప్పందానికి రావడానికి సిద్ధంగా లేరు. వేచిచూసే ధోరణినే అనుసరించాలన్న వ్యూహంతో వారు ముందుకు సాగుతున్నారు. అందువల్ల తర్వాతి కాలంలో మరింత లాభదాయక ఒప్పందం కుదుర్చుకోవచ్చునన్నదే వారి ఆలోచన. నిజం చెప్పాలంటే భాజపా వ్యతిరేక కూటమి ఏర్పాటు విషయంలో నితీశ్ తొందరపాటుగా వ్యవహరించారనే చెప్పాలి. ప్రస్తుతం నెలకొన్న ఈ ఇబ్బందికర పరిస్థితినుంచి ఆయన బయటపడే వరకు కొద్దిగా ఆగడం మంచిది.
బిహార్‌లో ‘మహాఘట్‌బంధన్’ ఏర్పాటుకోసం నితీశ్ కుమార్ పిలుపునిచ్చినప్పుడు, భాజపా దేశ రాజకీయాల్లో ఆధిపత్య స్థానంలో ఉన్నది. రజనీ కొఠారీ మాటల్లో చెప్పాలంటే, స్వాతంత్య్రం తర్వాత, కాంగ్రెస్సేతర పార్టీ, ఒంటరిగా మెజారిటీ సాధించింది ఇప్పుడు మాత్రమే. కాంగ్రెస్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇంతటి స్థాయిలో మరో పార్టీ ఆధిపత్యం సాధించడం నిజంగా అద్భుత పరిణామం. మనదేశంలో 1989 నుంచి ప్రారంభమైన సంకీర్ణ శకం 2014నాటికి ముగిసింది. అయితే సంకీర్ణ శకం ముగిసిందనడాన్ని విపక్షాలు అంగీకరించడం లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో భాజపా కేవలం అదృష్టం వల్ల మాత్రమే గెలిచిందనేది వాటి వాదన. మరిప్పుడు నితీశ్ కుమార్ ‘సంఘ్ ముక్త్ భారత్’ అంటూ పిలుపునిస్తున్నారంటే, దేశ రాజకీయాల్లో ఏక పార్టీ ఆధిపత్య యుగం నడుస్తున్నట్టు అంగీకరించినట్టే కదా! కాకపోతే గతంలో ఇది కాంగ్రెస్ వ్యవస్థగా ఉండేది, ప్రస్తుతం భాజపా వ్యవస్థగా మారిందంతే! ఇతర పార్టీలు ఎంత తొందరగా ఈ నిజాన్ని అంగీకరిస్తే అంత త్వరగా ప్రస్తుతం తామున్న బురద నుంచి బయటపడగలుగుతాయి. అంతేకాదు ఇక అడుగు ముందుకేసేందుకు అవసరమైన వ్యూహాన్ని కూడా రూపొందించుకోగలుగుతాయి. సంఘ్‌కు, భాజపాకు మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయనేది అందరూ అంగీకరించే సత్యమే. అయితే అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో సంఘ్ పరివార్‌కు, భాజపా ప్రభుత్వానికి తరచుగా సంఘర్షణా పూర్వక వాతావరణం నెలకొని ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఈ రెండింటి మధ్య అద్భుతమైన అనుసంధానత నెలకొని ఉంది. అందువల్ల రాజకీయంగా చెప్పాలంటే, ‘‘సంఘ్ ముక్త్ భారత్’’కు నితీశ్ పిలుపునివ్వడం సమంజసమైనా, ‘‘్భజపా ముక్త్ భారత్’’ అనడం మాత్రం అసమంజసం.
సాంకేతికంగా చెప్పాలంటే భారత్ ఇప్పటికీ బహుళ పార్టీ వ్యవస్థతో కొనసాగుతోంది. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎంతో బలీయంగా ఉన్నాయి. అయితే జాతీయ సమస్యలు వేరు, స్థానిక సమస్యలు వేరు. ఇందుకు తగ్గట్టుగానే జాతీయ పార్టీల లక్షణాలు, వాటి వ్యవహార శైలి కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో భాజపా తన పట్టును కోల్పోతున్నప్పటికీ, పార్టీల్లో మాత్రం ఇప్పటికీ నరేంద్ర మోదీ గట్టి నాయకుడిగానే కొనసాగుతున్నారు. రేపు ఒకవేళ కాంగ్రెస్ లేదా నితీశ్ కుమార్ లేదా మరో నాయకుడి నేతృత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడితే అప్పుడు వీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన నినాదం ‘సంఘ్ ముక్త్ భారత్’ మాత్రమే. ప్రస్తుతానికి మాత్రం తన లక్ష్యాన్ని సాధించడంలో నితీశ్ కుమార్ విజయం సాధించలేకపోయారు. కానీ భారత రాజకీయాల్లో సరికొత్త ‘నిఘంటువును’ ప్రవేశపెట్టడంలో మాత్రం నితీశ్ కుమార్ విజయం సాధించారనే చెప్పాలి.

- నిరంజన్ ముఖోపాధ్యాయ్