సంపాదకీయం

డొనాల్డ్ దురాగ్రహం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచీకరణ వైఫల్యానికి ఇది మరో సాక్ష్యం. ‘సరిహద్దులు’ చెఱగిపోయి ప్రపంచమంతా ఒకే ఆర్థిక సమాజంగా, వాణిజ్య కూటమిగా ఏర్పడడం ప్రపంచీకరణ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశపు ‘సరిహద్దు’ను చరిత్రలో మొదటిసారిగా మూసివేస్తుండడం ఈ వాణిజ్య ప్రపంచీకరణ స్ఫూర్తికి విఘాతకరమైన విపరిణామం. తమ దేశానికీ మెక్సికో దేశానికీ మధ్య ఉన్న సరిహద్దులో ఉక్కు గోడను నిర్మించాలన్నది అమెరికా అధ్యక్షుని ప్రతిపాదన. ఈ ఉక్కు గోడ- స్టీల్‌వాల్- ను నిర్మించడానికి వీలుగా దాదాపు నలబయి వేల కోట్ల రూపాయల-ఐదువందల డెబ్బయి కోట్ల అమెరికా డాలర్లు- నిధి మంజూరు చేయాలని డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్- అమెరికా పార్లమెంట్-ను కోరుతున్నాడు. ఈ ‘నిధి’ అమెరికా కాంగ్రెస్ ఆమోదించడం లేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు ప్రభుత్వ ఆర్థిక కలాపాలను స్తంభింప- షట్‌డౌన్- చేశాడు. డిసెంబర్ 22వ తేదీన డొనాల్డ్ ట్రంప్ ఈ ‘షట్‌డౌన్’ను ప్రకటించాడు. ఫలితంగా అమెరికా కేంద్ర- సమాఖ్య - ఫెడరల్- ప్రభుత్వానికి చెందిన ఎనిమిది లక్షల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ఆగిపోయింది. డొనాల్డ్ ట్రంప్ ‘రిపబ్లికన్ పార్టీ’ అధినేత. ప్రతిపక్షమైన డెమొక్రాటిక్ పార్టీవారు మాత్రమేకాక, ట్రంప్ స్వీయపక్షానికి చెందిన కాంగ్రెస్ ప్రతినిధులలో సైతం ఎక్కువమంది డొనాల్డ్ దొరగారి ఈ గోడ కట్టే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. నవంబర్‌లో జరిగిన ‘కాంగ్రెస్’ ఎన్నికలలో దిగువ సభ- ప్రతినిధుల సభ-లో రిపబ్లికన్ పార్టీ సంఖ్యా బాహుళ్యాన్ని- మెజారిటీ- కోల్పోవడం ట్రంప్ విధానాలకు వోటర్లలో పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనం. డెమొక్రాటిక్ పార్టీ నాలుగువందల ముప్పయి ఐదు మంది సభ్యుల ప్రతినిధుల సభ- హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్-లో రెండువందల ముప్పయి మూడింటిని గెలిచి ‘మెజారిటీ పార్టీ’గా అవతరించింది. గత రెండు ఏళ్లుగా ట్రంప్ అనుసరిస్తున్న విధానాలను అమెరికా ప్రజలే అసహ్యించుకొంటున్నారు. 2016 నవంబర్‌లో జరిగిన ఎన్నికలలో ‘వరణ సమితి’- ఎలక్టరల్ కాలేజ్-లో ట్రంప్‌కు సంఖ్యాబాహుళ్యం లభించినప్పటికీ ‘‘పోలయిన’’వోట్లలో ఇతగాని ప్రత్యర్థి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు సంఖ్యా బాహుళ్యం లభించింది. ఇలా జనంలో బలం లేకపోయినప్పటికీ అధ్యక్షుడుగా ఎన్నికైన ట్రంప్ నానాటికీ ప్రజాదరణను కోల్పోతున్నాడు. మెక్సికో, అమెరికాల మధ్య దాదాపు రెండువేల మైళ్ల- దాదాపు మూడు వేల రెండువందల కిలోమీటర్ల- సరిహద్దు ఏర్పడి ఉంది. ఈ సరిహద్దుగుండా వివిధ దేశాలకు చెందిన అక్రమ ప్రవేశకులు తమ దేశంలోకి చొరబడుతున్నారన్నది ట్రంప్ చేస్తున్న ఆరోపణ. అమెరికాలోకి దొంగ రవాణా అవుతున్న మాదకద్రవ్యాలలో తొంబయి శాతం మెక్సికో సరిహద్దు గుండానే వస్తున్నాయన్నది ట్రంప్ చేస్తున్న మరో ఆరోపణ. అందువల్ల వందల సంవత్సరాలుగా ‘నిర్నిరోధ ప్రయాణ ప్రాంగణమైన సరిహద్దు’- ఓపెన్ బార్డర్-ను శాశ్వతంగా మూసివేయాలన్నది ట్రంప్ ప్రతిపాదన..
ఈ ప్రతిపాదన మెక్సికో పట్ల ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న అమిత్ర వైఖరికి నిదర్శనం. ఉభయ దేశాల మధ్య ‘గోడ కట్టడం’ ఉభయ దేశాలలోను అత్యధిక శాతం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ నెలకొల్పనున్న ‘గోడ’కు నిధులను కేటాయించడానికి అమెరికా కాంగ్రెస్ సభ నిరాకరించడానికి ఈ ప్రజాభిప్రాయం ప్రాతిపదిక. ఈ నిరాకరణ వల్ల దురాగ్రహానికి గురి అయి ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఆర్థిక కలాపాన్ని స్తంభింపచేశాడు. ‘గోడ’కు నిధులను కేటాయించేవరకూ ఈ ‘షట్‌డౌన్’ కొనసాగుతుందని, నెల అయినా సంవత్సరమైనా తాను వెనక్కి తగ్గబోనని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు.. అమెరికా క్రీస్తుశకం 1776లో బ్రిటన్‌కు వ్యతిరేకంగా స్వాతంత్య్ర సమరం ఆరంభించి స్వతంత్ర దేశంగా అవతరించింది. అమెరికాకు దక్షిణంగా ‘కరేబియన్’ సముద్రానికి, ప్రశాంత మహాసాగరానికి- పసిఫిక్ ఓషన్‌కూ- మధ్య విస్తరించి ఉన్న మెక్సికో 1843లో స్పెయిన్ దురాక్రమణ నుంచి విముక్తం అయింది. అమెరికాకు ఉత్తరంగా విస్తరించి ఉన్న కెనడా దాదాపు రెండు శతాబ్దుల బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల ఆధిపత్య సమరానికి ఆలవాలమైంది. ‘తోడేళ్లు గుంట నక్కలు తన్నుకున్న చందాన’ ఐరోపా జాతులవారు అమెరికాలో దోపిడీ చేయడానికి పోటీపడడం చరిత్ర. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు ప్రపంచ దేశాలను ఐరోపా జాతులవారు పంచుకున్నారు. ఈ ‘పంపిణీ’లో భాగంగానే మన దేశంలోని పుదుచ్చేరిని ఫ్రాన్స్‌కు అప్పగించిన బ్రిటన్ కెనడాలోని ‘క్యూబెక్’ను ఫ్రాన్స్ నుండి పొందగలిగింది. అదంతా వేఱుకథ.. బ్రిటన్ పరమోన్నత అధికార పరిధికి లోబడి కెనడా 1867లో స్వతంత్ర దేశమైంది. 1845లో ‘టెక్సాస్’ను మరికొన్ని ప్రాంతాలను అమెరికా బలవంతంగా మెక్సికో నుంచి లాక్కొంది.. కానీ ఆ తరువాత నూట యాబయి ఏళ్లపాటు అమెరికా, మెక్సికోతోను కెనడాతోను మైత్రిని కొనసాగిస్తోంది. దాదాపు ఐదువేల మైళ్ల పొడవైన- ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల- అమెరికా కెనడా సరిహద్దులో ఒక్క సైనికుడు కూడ కాపలా కాయకపోవడం ఈ మైత్రికి నిదర్శనం..
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తికాలేదు. కానీ, మెక్సికోతోను కెనడాతోను అమెరికా ‘సంబంధాలు’ దిగజారిపోయాయి. గత ఏడాది ‘సంపన్న దేశాల’ సమావేశం కోసం కెనడాకు వెళ్లిన ట్రంప్, అక్కడనే కెనడా ప్రభుత్వాన్ని పరుష పదజాలంతో నిందించి విస్మయానికి గురిచేశాడు. మెక్సికో నుంచి తమ దేశంలోకి ప్రవేశిస్తున్న ‘‘శరణార్థుల’’ను ‘‘చొరబాటుదారుల’’ను ట్రంప్ ప్రభుత్వం గత ఏడాదికి పైగా నిర్బంధ గృహాలలో ఉంచింది. ఇలా నిర్బంధానికి గురి అయిన వారిలో మన దేశానికి చెందిన దాదాపు రెండు వేల మంది ఉన్నట్టు ప్రచారమైంది. ఈ అక్రమ ప్రవేశకుల వల్ల తమ దేశ భద్రతకు పెద్ద ప్రమాదం ఏర్పడబోతోందన్న ట్రంప్ వాదం ‘‘గోరంతలను కొండంతలు చేయడం’’తో సమానమని అమెరికాలోని రెండు ప్రధాన రాజకీయ పక్షాల- డెమొక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ-ప్రముఖులు విమర్శిస్తున్నారు. శరణార్థులను నిరోధించడానికై మెక్సికో సరిహద్దు పొడవునా ‘గోడ కట్టడం’ ‘‘క్రూరమైన రాజకీయమని’’ ఇది బెడిసికొట్టడం ఖాయమని డెమొక్రాటిక్ పార్టీ నాయకురాలు, ప్రతినిధుల సభ అధ్యక్షురాలు నాన్సీ పెలోసీ బుధవారం నాడు వ్యాఖ్యానించింది.. డొనాల్డ్ ట్రంప్ ఇలా ‘‘నోటిలో కాలుపెట్టుకొనే విధానాన్ని’’ అనుసరించడానికి ప్రధాన కారణం ‘ప్రపంచీకరణ’వల్ల అమెరికా నష్టపోతుండడం. ఇతర దేశాలను దోచడానికి అమెరికా, ఐరోపా సమాఖ్య దేశాలు ‘ప్రపంచీకరణ’ను ఆరంభించాయి. ‘‘వాణిజ్య, సుంకాల సాధారణ అంగీకారం’’- జనరల్ అగ్రిమెంట్ ఫర్ ట్రేడ్ అండ్ టారీఫ్- గ్యాట్- ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’- వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్- డబ్ల్యుటీవో-గా రూపొందింది. కానీ ఆలస్యంగా ‘ప్రపంచీకరణ’ వ్యవస్థలో చేరిన చైనా అతి పెద్ద ‘దోపిడీ’శక్తిగా అవతరించింది. అమెరికా అధ్యక్షుని అసహనానికి, ఐరోపా దేశాల భయాందోళనలకు ఇదీ నేపథ్యం.. శరణార్థులను నిరోధించాలన్న ట్రంపు దొరగారి రంపు రాజకీయం- ‘కంపు రాజకీయం’- నిజానికి ఈ ‘వాణిజ్య యుద్ధం’లో భాగం.. సంకుచిత విధానం..
వివిధ దేశాల మధ్య సరిహద్దులు చెఱపివేసి ప్రపంచాన్ని ‘పుడమిపల్లె’- గ్లోబల్ విలేజ్-గా ఏర్పాటు చేయాలన్న ఆర్భాటంతో మొదలైన వాణిజ్య ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- ఇలా బెడిసికొడుతోంది. పెట్టుబడుల మోహంతో మన ఆర్థిక వ్యవస్థను ఇతర దేశాలకు, ప్రధానంగా చైనావంటి శత్రుదేశాలకు అప్పగిస్తున్న మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకులకు అమెరికా అధ్యక్షుని ‘‘అకాండ తాండవం’’ గుణపాఠం కావాలి! నిజానికి అమెరికా మెక్సికో కెనడా వంటి అమెరికా ఖండపు దేశాలను ఐరోపా చొరబాటుదారులు శతాబ్దులపాటు ముంచెత్తారు. అమెరికాలో స్థానిక-ఇండియన్- ప్రజలను మూక ఉమ్మడిగా హత్యచేసి నిర్మూలించిన ఐరోపావారు తాము ఆయా దేశాలలో ‘‘కొత్త జాతులు’’గా అవతరించారు. ఇప్పుడు మెక్సికోలోను అమెరికాలోను అనేక అమెరికా ఖండపు దేశాలలోను ఉంటున్న ‘‘స్థానికులు’’ నిజానికి ఈ ఐరోపా హంతకుల వారసులు.. ఐరోపా సంతతివారు!!