సంపాదకీయం

మతానికి కులం ‘హోధా’??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుసూచిత కులాల వారికి లభిస్తున్న ‘ఆరక్షణల’ను క్రైస్తవ మతంలోకి మారిన వారికి కూడ కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ బుధవారం తీర్మానాన్ని ఆమోదించడం ‘అక్రమ సంతుష్టీకరణ’ రాజకీయం! ఈ రాజకీయాలలో అనేక వైపరీత్యాలు, వైరుధ్యాలు నిహితమై ఉన్నాయి. ఈ తీర్మానం భారత రాజ్యాంగం నిర్వచిస్తున్న ‘అనుసూచిత కులాల’ - షెడ్యూల్డ్ కాస్ట్స్- ప్రయోజనాలకు విఘాతకరం. విద్యాసంస్థలలోను ప్రభుత్వ ఉద్యోగాలలోను అనుసూచిత కులాల-దళితుల-కు లభిస్తున్న ఆరక్షణల- రిజర్వేషన్‌ల-లో క్రైస్తవులకు వాటా కల్పించడం వల్ల అనుసూచిత కులాలకు లభించే ఉద్యోగాల సంఖ్య, విద్యాసంస్థల్లో సీట్ల సంఖ్య తగ్గిపోతుంది. కేంద్ర, రాష్ట్ర ‘చట్ట సభల’లోను, పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికలలోను ‘అనుసూచిత కులాల’కు లభించవలసిన ‘ఆరక్షణల’ను క్రైస్తవులు కూడ పొందడం వల్ల ‘అనుసూచిత కులాల’ ప్రయోజన పరిధి కుంచించుకొని పోతుంది. ఇలా తమ ఆరక్షణలలో కొన్నిటిని కాని, అన్నిటినీ కానీ తమకు దక్కకుండా క్రైస్తవులు కాజేయడాన్ని అనుసూచిత కులాల వారు తప్పక వ్యతిరేకిస్తారు. అందువల్ల ఆంధ్ర ప్రభుత్వం ఒడిగట్టిన ఈ చర్య అనుసూచిత కులాల ప్రయోజనానికి వ్యతిరేకమైనది! అనుసూచిత కులాల వారు తరతరాలుగా అస్పృశ్యత వంటి సామాజిక వికృతులకు, ఇతరేతర సామాజిక రుగ్మతలకు బలైపోయి అణగారిన దళితులు. ఈ రుగ్మతలు వికృతులు వ్యవస్థీకృతం కావడం ఘోరమైన సామాజిక సమష్టి అన్యాయం. అందువల్లనే బ్రిటన్ దురాక్రమణ విముక్త దేశానికి ఏర్పడిన కొత్త రాజ్యాంగ వ్యవస్థలో అనుసూచిత కులాలకు ఆరక్షణలు కల్పించడం తరతరాలుగా జరిగిన అన్యాయానికి విరుగుడు. సామాజిక న్యాయసాధనలో ఈ అభాగ్యులకు, దళితులకు, అనుసూచిత కులా ల వారికి ఆరక్షణలు కల్పించడం అనివార్యమైన చారిత్రక శుభ పరిణామం! సామాజికంగా వెనుకబడిన అనుసూచిత కులాల వారు మిగిలిన సామాజిక వర్గాలతో సమానంగా అభ్యుదయం సాధించే వరకు సమాజ సమష్టి వికాస క్రమంలో సమాన భాగస్వాములు అయ్యేవరకు వారికి రాజ్యాంగపరమైన ఆరక్షణలు కొనసాగాలన్నది సహజ న్యాయసూత్రం, రాజ్యాంగ నిర్మాతల అభీష్టం. ఈ లక్ష్యసాధన ఇప్పటికీ జరగలేదన్నది కఠోర వాస్తవం. మధ్యలో ఇలా ఈ ‘ఆరక్షణల’లో క్రైస్తవులకు వాటా కల్పించాలన్న తీర్మానం అనుసూచిత కులాల వారికి అన్యాయం చేయాలన్న రాజకీయ వికృత చిత్తవృత్తికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన ఈ విచిత్ర తీర్మానానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణను రూపొందించినట్టయితే, ఆ సవరణను పార్లమెంటు ఆమోదించినట్టయితే అనుసూచిత కులాల వారికి ఘోరమైన అన్యాయం జరుగుతుంది.. అనుసూచిత కులాల వారికి లభిస్తున్న ఆరక్షణలను సదుపాయాలను క్రైస్తవులు పొందినంతమేర అనుసూచిత కులాల వారు వాటిని నష్టపోతారు. శాసనసభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపచేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులను, తీర్మానాన్ని బలపరచిన రాజకీయ పక్షాల వారిని ‘అనుసూచిత కులాల’ వారు నిరసించాలి, సంజాయిషీ కోరాలి, నిలదీయాలి. ప్రజాస్వామ్యంలో ఇలా నిలదీయడానికి నిరసించడానికి మాధ్యమం వోటు హక్కు..
రాజకీయ పక్షాల వారు వివిధ మతాల వారికి, సామాజిక వర్గాల వారికి ‘హామీ’లనిచ్చి వారిపై ‘సంక్షేమ’ ‘అభ్యుదయ’ వరాల జల్లులను కురిపించి ఆయా మతాల వారి, వర్గాల వారి వోట్ల మద్దతును పొందడం అధికార గ్రహణ ప్రస్థానక్రమంలో సహజ పరిణామాలు. కానీ రాజ్యాంగ విరుద్ధమైన హామీలను ఇచ్చి ఆయా మతాలవారిని వర్గాల వారిని మభ్యపెట్టడం అనైతిక రాజకీయాలకు నిదర్శనం. క్రైస్తవ మతం వారికి మంచి చేయదలచినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రాజ్యాంగ పరిధికి లోబడి, తమ అధికార పరిధికి లోబడి ఆ మేలును చేయవచ్చు. రాజ్యాంగ వ్యతిరేకమైన హామీలను ఇవ్వడం క్రైస్తవులను వంచించడం మాత్రమే. రాజ్యాంగాన్ని సవరించి ‘అనుసూచిత కులాల’ నోళ్లుకొట్టి వారి ప్రయోజనాలలో కొన్నింటిని క్రైస్తవులకు కట్టబెట్టాలన్నది విచిత్ర ఆకాంక్ష! ఈ విచిత్ర ఆకాంక్ష పట్లనైనా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండినట్టయితే ఈ తీర్మానాన్ని నాలుగేళ్ల క్రితం ఆమోదించి ఉండాలి! అలా జరిగి ఉండినట్టయితే ఈ తీర్మానాన్ని కేంద్రం పరిశీలించడానికి వ్యవధి ఉండేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న ‘తెలుగుదేశం పార్టీ’, కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న ‘్భరతీయ జనతాపార్టీ’ అప్పుడు మిత్రపక్షాలు! అందువల్ల ఇలాంటి తీర్మానానికి రాజ్యాంగపరమైన ఔచిత్యం లేకపోయినప్పటికీ రాజకీయ ఔచిత్యం ఉండేది. ఇప్పుడు ‘మైత్రి’ భగ్నమైన తరువాత, లోక్‌సభ చివరి సమావేశాలు ముగింపునకు వస్తున్న సమయంలో ఈ తీర్మానాన్ని ఎందుకని రూపొందించినట్టు? భాజపా నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ తీర్మానాన్ని పరిగణించబోదన్నది స్పష్టం- ఇది మొదటి వాస్తవం. రెండవది, ఈ ‘తీర్మానాని’కి అనుగుణంగా రాజ్యాంగ సవరణను రూపొందించి పార్లమెంటులో ఆమోదింపచేయడానికి తగిన వ్యవధి లేదు. లోక్‌సభ ఎన్నికల తరువాత ఏర్పడే ప్రభుత్వం ఈ తీర్మానాన్ని పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందా?
అనుసూచిత కులాలకు లభిస్తున్న ఆరక్షణల పరిధి పరిమాణం తగ్గిపోవడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణను చేయాలన్న ఈ ‘తీర్మానాన్ని’ జాతీయ స్థాయిలోని అత్యధిక రాజకీయ పక్షాలు అంగీకరించబోవన్నది కూడ స్పష్టం. ‘అనుసూచిత కులాల’ వారికి అన్యాయం జరగడానికి ఉద్దేశించిన ‘ఈ రా జ్యాంగ సవరణ’ జరగడం కల్ల. మతపరమైన ‘ఆరక్షణ’లను కల్పించడం రా జ్యాంగ విరుద్ధం. గతంలో బ్రిటన్ దురాక్రమణదారులు చట్టసభలలో కల్పించిన ‘మత ఆరక్షణలు’ అఖండ భారతదేశాన్ని మత ప్రాతిపదికపై ముక్కలు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి తక్షణ నేపథ్యం. మళ్లీమళ్లీ మతపరమైన ‘ఆరక్షణల’ను కల్పించడం వల్ల మళ్లీ మళ్లీ దేశం ముక్కలు చెక్కలు కాగలదు. మన దేశంలో అనాదిగా సర్వమత సమభావ వ్యవస్థ వికసించడం ఈ రాజ్యాంగ స్ఫూర్తికి శాశ్వత నేపథ్యం. ఈ అనాది జాతీయతకు ఏ ఒక్క మతం ప్రాతిపదిక కాలేదు, ‘సర్వమత సర్వ వైవిధ్య సమభావ’ సహజ స్వభావం ఈ దేశపు అనాది అద్వితీయ జాతీయతకు వికాస భూమిక అయింది. అందువల్ల ఏ ఒక్క ‘మత ప్రాతిపదిక’గా కాని ఆ మతం వారికి ఆరక్షణలు కల్పించడం రాజ్యాంగానికి మాత్రమే కాదు, ఈ దేశపు అనాది జాతీయ స్వభావానికి కూడ విరుద్ధం.. ఇది దశాబ్దుల తరబడి స్పష్టమైనప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మతపరమైన ఆరక్షణలను కల్పించడానికి అనేకసార్లు విఫలయత్నం చేసింది. ఇప్పుడు మత ప్రాతిపదికపై ‘రిజర్వేషన్’లను కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కూడ విఫలం కాక తప్పదన్నది చరిత్ర నేర్పుతున్న పాఠం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పాఠాన్ని గ్రహించకపోవడం బుధవారం నాటి శాసనసభ తీర్మానం ద్వారా ధ్రువపడింది.
అనుసూచిత కులాల వారికి రాజ్యాంగం ఆరక్షణలు కల్పించడానికి కారణం వారికి జరిగిన సామాజిక అన్యాయం. ఆ కులాలవారు సమష్టిగా శతాబ్దులపాటు ఈ అన్యాయానికి బలి అయ్యారు. క్రైస్తవ మతం వారు ఇలాంటి సామాజిక అన్యాయానికి ఎప్పుడూ గురి కాలేదు. పుట్టిన దేశం నుండి మన దేశానికీ, ప్రపంచంలోని ఇతర దేశాలకు వ్యాపించగలిగిన ‘సాహస స్వభావం’ ‘పరిజ్ఞాన వికాసం’ క్రైస్తవ మతంలో నిహితమై ఉంది. సామాజిక గరిమను గడించిన క్రైస్తవ మతం వారికి, సామాజికంగా వెనుకబడిన దళితులకు- అనుసూచిత కులాల వారికి లభిస్తున్న ‘ఆరక్షణల’లో భాగం పంచడం అతార్కికం, అన్యాయం, సామాజిక విద్రోహం! అనుసూచిత కులాల వారు క్రైస్తవ మతస్థులు కారు, క్రైస్తవ మతస్థులు అనుసూచిత కులాల వారు కాజాలరు. క్రైస్తవులు ఏ ఇతర కులం వారు కానీ కాజాలరు. ఎందుకంటె క్రైస్తవ మతంలో కులాలు లేవు..