సబ్ ఫీచర్

ధాన్యం కొనుగోళ్లలో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరుగాలం కష్టించి పండించిన రైతుల పంటకు డబ్బులు చెల్లించడంలో తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) పాలకుల వైఫల్యం చెందారు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి వలె తయారైంది అన్నదాతల పరిస్థితి. తెలంగాణలో ఈసారి తీవ్రమైన కరవు వుంది. నీరులేక పొలాలు, ఇతర చేనులు ఎండిపోయాయి. పెట్టిన పెట్టుబడి తిరిగి రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు అన్ని పార్టీలు రైతుల ఓట్లతో గెలిచి రైతులను మోసం చేస్తున్నాయి. బతికి ఉండగా సహాయం చేయని పాలకులు, ప్రభుత్వాలు రైతులు చచ్చినాక ఇన్ని లక్షలు ఎక్సగ్రేషియా ఇస్తాం అంటారు. రెండురోజుల్లోనే రైతుల చేతికి డబ్బులు ఇస్తాం అని ప్రచారం చేస్తారు. తెలంగాణలో ప్రతిచోట ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్‌విండో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు. ఆరుగాలం చేసిన శ్రమ చేతికి వచ్చాక కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే తమ అవసరాలు తీరుతాయని ఆశపడ్డ అన్నదాతలకు నిరాశే ఎదురైంది. తెలంగాణలోని పది జిల్లాల్లో ఐకెపి, ప్రాథమిక సహకార పరపతి సంఘాలు(సింగిల్‌విండో) గిరిజన సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెండు లేదా మూడు గ్రామాలకు ఒకటి చొప్పున డిసెంబర్‌లో ఏర్పాటు చేసారు.
రైతులనుంచి ధాన్యం కొనుగోలు చేసిన రెండురోజుల్లోనే డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మ్యాన్యువల్‌గా చేస్తే డబ్బులు త్వరగా అందవని భావించి ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ వ్యవస్త పూర్తిగా ఫెయిలైంది. ధాన్యం సేకరణను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు ట్యాబ్‌లు ఇచ్చారు. ఐతే ట్యాబ్‌లు ఎలా వినియోగించాలో సాంకేతిక సమస్యను ఎలా అధిగమించాలో ప్రభుత్వం తెలియజేయలేదు. ట్యాబ్‌లు ఇచ్చారు కానీ అవి వివరాలు నమోదుచేసే సమయంలో మొరాయించడంతో శిక్షణ లేని నిర్వాహకులు తలలు పట్టుకున్నారు. తెలంగాణలో చాలా జిల్లాల్లో ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లు సక్రమంగా పనిచేయలేదు. ట్యాబ్‌లు ఇవ్వని సహకార కేంద్రాల్లో రోజువారి వివరాలు జిల్లా కేంద్రానికి ఆఫ్‌లైన్ ద్వారా పంపిస్తున్నారు. దీనివల్ల రైతులకు డబ్బుల చెల్లింపులో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ధాన్యం విక్రయించిన రైతులకు బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో జాప్యం మరింత ఎక్కువగా ఉంటోంది. కర్ణుని చావుకు కారణం అనేకం అన్నట్టు రైతులకు డబ్బులు రెండురోజుల్లోనే అందకపోవడానికి కారణాలు అనేకం. జిల్లా సహకార జిల్లా పౌరసరఫరాల శాఖల అధికారులు జిల్లా కలెక్టర్లు ప్రతిరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలతో ఫోన్ల ద్వారా సమీక్ష జరిపితే కొనుగోలు కేంద్రాల సమస్యలు పరిష్కారం అయ్యేవి. ప్రతిరోజు ఏ కొనుగోలు కేంద్రం వివరాలు ఆన్‌లైన్‌లో వచ్చాయి, ఏవి రాలేదు? ఎందుకు రాలేదు? అనే విషయాలు అధికారులు మానిటరింగ్ చేయడం మానేశారు. రైతులు ఖాతా నెంబర్లను సక్రమంగా ఇవ్వకపోవడం, సకాలంలో ఇవ్వకపోవడం, రన్నింగ్ ఖాతా నెంబర్లు ఇవ్వకడపోవడం వల్ల ఆలస్యంగా డబ్బులు చెల్లిస్తున్నామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఎంతో కష్టపడి కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువస్తే తేమ ఎక్కువగా ఉందని ఆరబోస్తున్నారు. కొన్నిసార్లు రైతులే పదిరోజుల దాకా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమవల్ల ధాన్యాన్ని ఎండబెట్టాల్సి వస్తోంది. రైతులు ధాన్యం అమ్మిన వెంటనే పంటకు అప్పు ఇచ్చిన వాళ్లు వెంట పడుతున్నారు. 48 గంటల్లో ఆన్‌లైన్ సిస్టం ద్వారా ఖాతాలోనే జమ చేస్తామనే ప్రకటనకు స్పందించి ప్రతిరోజు బ్యాంకు చుట్టు రైతులు తిరుగుతున్నారు. 15-25 రోజులు గడిస్తేగానీ ఆన్‌లైన్ డబ్బులు పడడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మడంవల్ల అనేక నష్టాలు కష్టాలు ఉన్నాయి. ధాన్యం ఎండబెట్టడానికి కిరాయికి పరదాలు తేవడం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతోంది. కొంచెం తక్కువ ఇచ్చినప్పటికీ దళారులు స్పాట్ పేమెంట్ చేస్తున్నారు. మందీ మార్బలం-ట్యాబ్‌లు కలిగిన ప్రభుత్వాలు మాత్రమే ధాన్యం అమ్మిన 48 గంటల్లో డబ్బులు చెల్లించడంలేదు. రైతులకోసం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ పథకం కాస్తా ఆఫ్‌లైన్‌గా మారింది. పథకం మీద పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడంవల్ల సర్కారు కొనుగోలు కేంద్రం కన్నా దళారులకు అమ్మడం మేలు అని రైతులు భావిస్తున్నారు.

- రావుల రాజేశం