సంపాదకీయం

చదువుల ‘సారం’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో యాబయి కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం గురువారం నాటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం ప్రామాణిక విద్యావిస్తృతికి దోహదం చేయగల పరిణామం. దేశంలో ప్రస్తుతం పదకొండు వందల ఇరవై ఐదు కేంద్రీయ విద్యాలయాలు నడుస్తున్నాయట. విదేశాలలో సైతం ఈ కేంద్ర ప్రభుత్వ విద్యాలయాలు నడుస్తున్నాయి. తెలంగాణలోని ముప్పయి ఒక్క కేంద్రీయ విద్యాలయాలలో పదిహేడు జంటనగరాలలోనే ఉండడం ‘విస్తృతి’కి సంబంధించిన వైపరీత్యం. ఇందుకు కారణం ఈ విద్యాలయాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంతానానికి చదువు చెప్పడం కోసం ఏర్పడి ఉన్నాయి. ఈ ఉద్యోగులు కాని వారి పిల్లలకు సైతం ఈ విద్యాలయాలలో కొన్ని స్థానాలు కేటాయిస్తున్నప్పటికీ ఈ సంఖ్య చాలా తక్కువ. అందువల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రీకృతమయి ఉన్న ప్రాంతాలలో మాత్రమే ఈ కేంద్రీయ విద్యాలయాలు అధిక సంఖ్యలో నెలకొని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ముప్పయి ఒక్క పాఠశాలల్లో తొమ్మిది విశాఖపట్టణంలోనే ఉన్నాయట! సామాన్య ప్రజల పిల్లల కోసం కూడ కేంద్ర ప్రభుత్వం దేశమంతటా ఈ విద్యాలయాలను ఏర్పాటు చేయవచ్చు. దేశమంతటా ఒకే విధమైన పాఠ్యాంశాలను బోధించాలన్న వాదంతో అనేక రాష్ట్రప్రభుత్వాలు సైతం ఏకీభవిస్తున్నాయి. ‘కేంద్రీయ పాఠశాల విద్యామండలి’- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్- సిబిఎస్‌ఇ-, భారతీయ పాఠశాల విద్యామండలి- ఇండియన్ కౌన్సిల్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్- ఐసిఎస్‌ఇ- వంటి సంస్థలు రూపొందించిన పాఠ్యప్రణాళిక దేశమంతటా ఒకే విధంగా ఉంది. కేంద్రీయ విద్యాలయాలు ‘సిబిఎస్‌ఇ’ పాఠ్య ప్రణాళికను బోధిస్తున్నాయి కనుక ఈ పాఠశాలలను ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో కనీసం పదిహేను చోట్ల నెలకొల్పినట్టయితే ‘వాణిజ్య పాఠశాలల’- కార్పొరేట్ స్కూల్స్- దోపిడీ నుంచి కొంతైనా ఊరట..! విద్యారంగంలో వివిధ విప్లవాత్మక పరిణామాలు, సంచలనాత్మక సంస్కరణలు జరిగిపోతున్నట్టు ప్రచారం సాగుతోంది. నిజమైన సంస్కరణలు జరగడం హర్షణీయం. సంస్కార వికాస భూమిక విద్యా క్షేత్రం. అందువల్ల ఈ వౌలిక రంగం నిరంతరం పరిపుష్టమై జాగృతమై ఉండాలన్నది జాతీయ జన జీవన ఆకాంక్ష. మార్పులు స్వరూపానికి మాత్రమే పరిమితం కారాదు, స్వభావ చైతన్యం మరింత ప్రధానమైనది!
విశ్వవిద్యాలయాలలోను కళాశాలలలోను బోధించే అధ్యాపకులకు సంబంధించిన ‘ఆరక్షణల’-రిజర్వేషన్‌ల-ను సంస్కరించడం కేంద్ర ప్రభుత్వం గురువారం తీసుకున్న మరో ప్రధాన నిర్ణయం. విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని లేదా ఒక కళాశాలను ఒకే విభాగంగా గుర్తించి అధ్యాపకుల నియామకంలో అనుసూచిత కులాల- ఎస్‌సి-వారికి, అనుసూచిత సముదాయాల- ఎస్‌టి- వారికి, వెనుకబడిన తరగతుల వారికి ఆరక్షణలు కల్పించడం 2017 వరకు అమలు జరిగిన విధానం. ఈ విధానాన్ని అలహాబాదు ఉన్నత న్యాయస్థానం రద్దుచేసిందట! కళాశాల ప్రాతిపదికగాకాక కళాశాలలోని ప్రతి బోధనా విభాగం- డిపార్ట్‌మెంట్- ప్రాతిపదికగా ఆరక్షణలు కల్పించాలని న్యాయస్థానం నిర్దేశించిందట! ఈ నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం కూడ ఆమోదించిందట! ఈ కొత్త విధానం ఫలితంగా చిన్నచిన్న బోధనా విభాగాలలో ‘ఆరక్షణలు’ అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. అందువల్ల పాత విధానాన్ని- కళాశాల మొత్తాన్ని ఒకే విభాగంగా పరిగణించి ‘రిజర్వేషన్‌లు’ కల్పించే విధానాన్ని- కేంద్ర ప్రభుత్వం ‘అధ్యాదేశం’ ద్వారా పునరుద్ధరిస్తోందట. దీనివల్ల అనుసూచిత కులాలకు, అనుసూచిత సముదాయాలకు, వెనుకబడిన తరగతుల వారికి మేలు జరుగుతుందన్నది ప్రభుత్వం వారి అభిప్రాయం. 1972నాటి ‘సేవా పారితోషికం’- గ్రాట్యుటీ- చట్టం ప్రకారం ‘సేవా పారితోషికం’- పొందే హక్కు అధ్యాపకులకు ఉందని సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించడం సమాంతర శుభ పరిణామం. ఇలా ‘గ్రాట్యుటీ’ని పొందే హక్కు అధ్యాపకులకు లేదని గత జనవరి ఏడవ తేదీన సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించి ఉంది. అయితే జనవరి ఏడవ తేదీనాటి తీర్పును రద్దుచేస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం మార్చి ఏడవ తేదీన నిర్ధారించింది. తాము జనవరిలో చేసిన పొరపాటును తమంతతాముగా- సూమోటోగా- దిద్దుకుంటున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం వారు ప్రకటించడం విద్యారంగానికి సంబంధించిన మరో సంచలనం. తెలంగాణ ఉన్నత విద్యామండలి వారు గురువారం నిర్వహించిన ఉప కులపతుల సమావేశంలో విశ్వవిద్యాలయాల వ్యవస్థలో సంస్కరణలను చేయాలని నిర్ణయించడం మరో సమాంతర పరిణామం..
ఇలా విద్యావ్యవస్థ స్వరూపాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి జరుగుతున్న కృషి అభినందనీయం. పాఠశాలలలో వౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, ప్రధానంగా శౌచాలయాలను నిర్మించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తుండడం ఈ వౌలిక స్వరూప పరివర్తనలో భాగం. కానీ దశాబ్దుల తరబడి బ్రిటన్ విముక్త భారత్‌లో ఇలా విద్యావ్యవస్థ స్వరూప సంస్కరణలు జరుగుతున్నప్పటికీ విద్యావ్యవస్థ స్వభావం మాత్రం పెద్దగా మారలేదు. దురాక్రమించి మన నెత్తికెక్కి తొక్కిన బ్రిటన్ బౌద్ధిక బీభత్సకారులు మన విద్యావ్యవస్థలో నిహితం చేసి వెళ్లిన భావదాస్యం నుంచి ఇప్పటికీ మనం విముక్తులం కావడం లేదు. విద్యాస్వభావ పరివర్తన జరగలేదు, బ్రిటన్ దురాక్రమణ నాటి స్వభావం వదలడం లేదు. బ్రిటన్‌వారు దురాక్రమించక పూర్వం మన కాలగణన ‘చైత్రం’తో మొదలై ఫాల్గున మాసం వరకు నడిచేది. వసంత నవరాత్రులు, శరద్ నవరాత్రులు జరుపుకోవడం ప్రకృతిని మరువని భారతీయులు ప్రకృతికి కృతజ్ఞతను తెలుపడం.. మన విద్యార్థులకు, విద్యావంతులకు ఇప్పుడు భారతీయమైన ఈ నెలల సంగతి తెలీదు. జనవరి నుంచి డిసెంబర్ వరకు నడుస్తున్న నెలలు మాత్రమే మన జీవన వ్యవహారాన్ని నడిపిస్తుండడం నడుస్తున్న భావదాస్య స్వభావ విద్యావిధాన ఫలితం! భారతీయమైన ‘చైత్రం’వంటి నెలలు, ‘వసంత’, ‘గ్రీష్మ’, ‘వర్ష’, ‘శరత్’, ‘హేమంత’, ‘శిశిర’ ఋతువులు ఖగోళ పరిణామక్రమంతో ముడిపడిన సహజ కాలగణన పద్ధతులు. ‘జనవరి’ వంటి నెలలు ఐరోపా వారి కృత్రిమ మేధ కల్పించిన కృతకమైన ప్రతీకలు. బ్రిటన్ విముక్త భారత్‌లో కేంద్ర ప్రభుత్వం, దురాక్రమణ పూర్వం నాటి జాతీయ కాలగణన- శాలివాహన శకం-ను పునరుద్ధరించింది. ఈ జాతీయ శకానికి ‘చైత్రం’తో మొదలై ‘్ఫల్గునం’తో పరిసమాప్తవౌతున్న సంవత్సరం ప్రాతిపదిక! ఎవరికి తెలుసు? ఎంతమంది విద్యార్థులకు తెలుసు? విద్యావంతులకు ఈ ధ్యాస ఉందా?? మన దినం, నెల, సంవత్సరం సూర్యోదయంతో మొదలై మళ్లీ సూర్యోదయం వరకూ కొనసాగడం అనాది పద్ధతి.. ‘‘వెలుగు నుంచి వెలుగునకు’’ భారతీయులు నడవడం జాతీయ స్వభావం, జాతీయ విద్యా స్వభావం! బ్రిటన్ ‘దొరలు’ దీన్ని తొలగించిపోయారు. అర్ధరాత్రి చీకటిలో దినం, నెల, సంవత్సరం మొదలయ్యే కాలగణనను మన నెత్తికెత్తిపోయారు. ‘‘చీకటి నుంచి చీకటికి నడుస్తుండడం’’ ఈ విచిత్ర కాలగణన స్వభావం! మన సమాజ స్వభావం నుంచి ఇలాంటి అనేక ‘చీకటు’లను తొలగించుకోవాలంటే విద్యావ్యవస్థ మొదట ఈ చీకటుల నుంచి విముక్తం కావాలి. ఎందుకంటె విద్యాక్షేత్రం సమాజ వికాస క్రమానికి భూమిక, సంస్కారాలు పురుడు పోసుకునే జీవజన్యు ప్రాంగణం!
భారతదేశంలో తొలి మానవుడు, తొలి మానవీయ సంస్కారం జన్మించిన వాస్తవ చరిత్రను మన విద్యార్థులకు మన విద్యాలయాలలో మప్పడం లేదు. ‘‘ఆర్యులు విదేశాల నుంచి ఇక్కడ స్థిరపడ్డారన్న’’ అబద్ధాలను చరిత్రగా నూ రిపోస్తున్నారు! మాతృభూమి పట్ల మమకారం లేని కృత్రిమ బుద్ధిజీవులుగా భారతీయులను రూపొందించడానికి వీలుగా బ్రిటన్ మేధావులు ఈ అబద్ధాల చరిత్రను వ్రాసిపోయారు. ఈ అబద్ధాల స్వభావ బంధం నుంచి విద్యావ్యవస్థకు విముక్తి ఎప్పుడు?? చర్చ జరగాలి, మధనం జరగాలి...